Independent country
-
రాజరికం నుంచి జనతా సర్కార్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఐదు వందలకు పైగా స్వతంత్ర రాజ్యాలు ప్రిన్సిలీ స్టేట్స్ పేరుతో ఉన్నాయి. వీటిని దేశంలో విలీనం చేయడానికి అప్పటి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నించారు. ఈమేరకు నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి బస్తర్ మహారాజుగా ప్రవీర్‌చంద్ర భంజ్‌దేవ్ హాజరై విలీన ఒప్పందంపై సంతకం చేశారు. దీంతో దేశంలో 13వ పెద్దరాజ్యంగా ఉన్న బస్తర్ స్టేట్ భారత్‌లో 1948 జనవరి 1న విలీనమైంది.ప్రవీర్సేన పేరుతో పోటీఓ వైపు మహారాజుగా కొనసాగుతూనే మరోవైపు 1957లో కాంగ్రెస్ పార్టీ తరఫున జగదల్పూర్ స్థానం నుంచి ప్రవీర్‌చంద్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే మహారాజుగా తనకు దక్కాల్సిన హక్కుల విషయంలో భారత ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేక ఇరు పక్షాల మధ్య అనుమాన బీజాలు మొలకెత్తాయి. మరోవైపు బ్రిటీష్ కాలం నుంచి ఉన్న బైలడిల్లా గనులపై పట్టు కోసం కేంద్రం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో ఇటు కేంద్రం, అటు బస్తర్ మహారాజు మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలు పక్కాగా అమలు చేయాలని మహారాజు ప్రవీర్‌చంద్ర గళం విప్పడం మొదలెట్టారు. ఆ తర్వాత అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ప్రవీర్సేన పేరు మీద అభ్యర్థులను బరిలో నిలబెట్టి 11 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ విసిరారు. ఆ ఎన్నికల్లో బస్తర్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు.హత్యకు గురైన నాటి బస్తర్ మహారాజు ప్రవీర్‌చంద్ర భంజ్‌దేవ్ కేంద్రంపై పోరాటంరాజా ప్రవీర్‌చంద్ర లెవీ విధానాన్ని వ్యతిరేకిస్తూ చిత్రకూట్ జలపాతం దగ్గరున్న లోహండిగూడా దగ్గర వేలాది మందితో బహిరంగసభ నిర్వహించారు. ఆ తర్వాత రైళ్లలో న్యూఢిల్లీ వరకు పెద్ద సంఖ్యలో ఆదివాసీలను తీసుకెళ్లి పార్లమెంట్ ముందు భారీ నిరసన వ్యక్తం చేశారు. దీంతో బస్తర్‌లో అశాంతికి కారణం అవుతున్నాడనే నెపంతో ప్రవీర్చంద్రను అరెస్ట్ చేసి నర్సింగాపూర్ జైల్లో బంధించారు. మహారాజుపై దేశద్రోహి అనే ముద్రను వేసి జైలులో పెట్టడంతో బస్తర్ అట్టుడికిపోయింది. ప్రజాగ్రహం అంతకంతకూ పెరుగుతుండటంతో రాజును విడుదల చేసిన ప్రభుత్వం ఆయనకు ఉన్న హోదాలను రద్దు చేసింది. దీంతో వివాదం మరింత ముదిరింది.నక్సల్బరీబస్తర్ మహారాజు ప్రవీర్‌చంద్ర మహారాజ హత్య జరిగిన మరుసటి ఏడాదే బెంగాల్లో చారుమజుందార్ ఆధ్వర్యంలో 1967లో నక్సల్బరీ పోరాటం మొదలైంది. వర్గశత్రువు రక్తంలో చేతులు ముంచనిదే విప్లవం రాదంటూ ఆయుధాలు ఎక్కుపెట్టిన చారుమజుందార్ భావావేశం అనతికాలంలోనే ఆంధప్రదేశ్‌ను చుట్టుముట్టింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎర్రజెండాలు రెపరెపలాడాయి. ఇక్కడి పల్లెల్లో విప్లవాగ్నులు రగిలించిన నక్సలైట్లు, గతంలో అన్నమదేవుడు నడిచిన పాతదారిలోనే వరంగల్ మీదుగా గోదావరి దాటి బస్తర్ అడవుల్లోకి 1980వ దశకంలో వెళ్లారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వ పాలనలో అధికారుల దాష్టీకాలతో విసిగిపోయిన ఆదివాసీలకు విప్లవ భావాలు కొత్త దారిని చూపాయి. ఫలితంగా పదిహేనేళ్లు గడిచే సరికి అక్కడ నక్సలైట్లకు కంచుకోటగా మారింది. జనతా సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి మావోయిస్టులు చేరుకున్నారు. దీనికి ప్రతిగా అప్పుడు ఆపరేషన్ గ్రీన్‌హంట్ ఇప్పుడు కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. ఇరువర్గాల మధ్య పోరులో బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారుతోంది. ఇప్పటి వరకు అన్ని వైపుల నుంచి ఏడువేల ఐదు వందల మంది చనిపోయారు.మహారాజు హత్యమహారాజునైన తన హక్కులకే దిక్కు లేనప్పుడు ఇక ఆదివాసీల çపరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే భావనతో ధిక్కార స్వరాన్ని రాజా ప్రవీర్‌చంద్ర మరింతగా పెంచారు. ఈ క్రమంలో ప్యాలెస్‌లో మద్దతుదారులతో ఆందోళన చేస్తున్న ప్రవీర్చంద్రను పోలీసు దళాలు చుట్టుముట్టాయి. ఆందోళనకారుల్లో కొందరిని విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆదివాసీలు బాణం, బల్లెం చేతబట్టి పోలీసులపైకి దాడికి సిద్ధమయ్యారు. ఆదివాసీ సైన్యంతో రాజు తమపై దాడికి దిగారని, ఫలితంగా ఆత్మరక్షణ కోసం తాము కాల్పులు జరిపామంటూ పోలీసులు చెప్పారు. 1966 మార్చి 25న జరిగిన ఈ కాల్పుల్లో మహారాజు ప్రవీర్ చంద్ర చనిపోయారు. ఈ ఘటనతో సుమారు 650 ఏళ్లుగా సాగుతున్న రాజరిక పాలన స్థానంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన బస్తర్‌లో మొదలైంది. -
Independence Day: ఒకరోజు ముందే ఎందుకంటే..!
బ్రిటిష్ పాలన నుంచి 1947లో ఇండియాకు విముక్తి లభించినా ఆంగ్లేయుల కుట్ర దేశాన్ని రెండు ముక్కలు చేసింది. ఫలితంగా భారత్, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. ఆగస్టు 15న ఒకే రోజు అధికారికంగా ఉనికిలోకి వచ్చాయి. కనుక రెండింటికీ అదే స్వాతంత్య్ర దినం. కానీ పాక్ మాత్రం ఆగస్టు 14నే తమ స్వాతంత్య్ర దినంగా జరుపుకుంటుంది. ఎందుకో తెలుసా? ఏటా భారత్ కంటే ముందే వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దలు చేసిన ఆలోచన వల్ల! లేదంటే చరిత్రను చూసినా, ఇంకే కోణంలో ఆలోచించినా అంతకుమించి దీని వెనక మరో కారణమేదీ ఏమీ కన్పించదు. స్వాతంత్య్ర ప్రకటన మొదలుకుని రెండు దేశాలకు అధికారాన్ని బ్రిటన్ బదలాయించడం దాకా ఏం జరిగిందన్నది నిజంగా ఆసక్తికరం... భారత స్వాతంత్య్ర చట్టాన్ని 1947 జూలై 18న ప్రకటించారు. ‘1947 ఆగస్టు 15న భారత్, పాకిస్తాన్ పేరిట బ్రిటిషిండియా రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడనుంది’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ జాతి పిత, తొలి గవర్నర్ జనరల్ మహ్మదాలీ జిన్నా కూడా జాతినుద్దేశించి ప్రసంగించింది కూడా ఆగస్టు 15వ తేదీనే. ఆగస్టు 15ను స్వతంత్ర, సార్వ¿ౌమ పాకిస్తాన్’ పుట్టినరోజుగా ఆ ప్రసంగంలో ఆయన అభివర్ణించారు. ఇలాంటి వాస్తవాలు, రికార్డులతో పాటు లాజిక్ ప్రకారం చూసినా పాక్‌కు కూడా ఆగస్టు 15 మాత్రమే స్వాతంత్య్ర దినమని ఆ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్టు షాహిదా కాజీ అభిప్రాయపడ్డారు. జిన్నా, పాక్ తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది కూడా 1947 ఆగస్టు 15వ తేదీనే అని ఆయన గుర్తు చేశారు. 1948 జూలైలో పాక్ విడుదల చేసిన తొలి స్మారక పోస్టల్ స్టాంపుపై కూడా ఆగస్టు 15ను దేశ స్వాతంత్య్ర దినంగా స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ మాజీ ప్రధాని చౌధురీ ముహమ్మద్ అలీ 1967లో రాసిన పుస్తకంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. ‘‘1947 ఆగస్టు 15 ఈదుల్ ఫిత్ర్ పర్వదినం. ముస్లింలకు అతి పవిత్రమైన ఆ రోజునే ఖౌద్–ఏ–ఆజం (జిన్నా) పాక్ తొలి గవర్నర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. నెలవంక, నక్షత్రంతో కూడిన పాక్ పతాకం ప్రపంచ యవనికపై తొలిసారి అధికారికంగా ఎగిరింది’’ అని రాసుకొచ్చారు.ఆగస్టు 14న ఏం జరిగిందంటే...1947 ఆగస్టు 14న నాటి బ్రిటిíÙండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ కరాచీలో పాక్ రాజ్యాంగ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర చట్టం ప్రకారం ఆయన ఆగస్టు 15న భారత్, పాక్ రెండింటికీ అధికారాన్ని లాంఛనంగా బదలాయించాలి. బ్రిటన్ సింహాసన ప్రతినిధిగా సంబంధిత ప్రక్రియను వ్యక్తిగతంగా దగ్గరుండి పూర్తి చేయాలి. కానీ, అందుకోసం ఒకే రోజు ఇటు ఢిల్లీలో, అటు కరాచీలో ఉండటం సాధ్యపడని పని. పోనీ ముందుగా భారత్‌కు అధికారాన్ని బదలాయించాక కరాచీ వెళ్లడమూ కుదరదు. ఎందుకంటే బ్రిటన్ రాణి నిర్ణయం మేరకు విభజన అనంతరం స్వతంత్ర భారత్‌కు ఆయన తొలి గవర్నర్ జనరల్ అవుతారు. భారత్‌కు అధికార బదలాయింపు జరిగిన క్షణమే ఆయనకు వైస్రాయ్ హోదా పోయి గవర్నర్ జనరల్ హోదా వస్తుంది. కనుక బ్రిటిíÙండియా వైస్రాయ్గా ఉండగానే పాక్‌కు అధికార మార్పిడి ప్రక్రియ పూర్తి చేయాలి. అందుకే మౌంట్‌బాటెన్ 14వ తేదీనే కరాచీ వెళ్లి ఆ లాంఛనం పూర్తి చేసి ఢిల్లీ తిరిగొచ్చారు. పాక్‌కు స్వాతంత్య్రం మాత్రం ఆగస్టు 15నే వచ్చింది.ముందుకు జరుపుకోవడం వెనక... విభజన చట్టం ప్రకారం, వాస్తవాల ప్రాతిపదికన... ఇలా ఏ లెక్కన చూసినా పాక్ కూడా భారత్‌తో పాటే ఏటా ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్య్ర దినం జరుపుకోవాలి. కానీ స్వాతంత్య్రం వచి్చన మరుసటి ఏడాది నుంచే, అంటే 1948 నుంచే ఆగస్టు 14న స్వాతంత్య్ర దినం జరుపుకుంటూ వస్తోంది. దీనికి రకరకాల కారణాలు చెబుతారు. ఎక్కువమంది చెప్పేదేమిటంటే, భారత్ కంటే ముందే స్వాతంత్య్ర వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దల మెదళ్లను ఓ పురుగు తొలిచిందట! దాంతో 1948 జూన్ చివర్లో నాటి ప్రధాని లియాకత్ అలీ ఖాన్ తన మంత్రివర్గాన్ని సమావేశపరిచి ఈ మేరకు అధికారికంగా తీర్మానించారు. ఈ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించొద్దంటే పాక్ జాతి పిత జిన్నా ఆమోదముద్ర ఉండాలని భావించారట. అందుకే, స్వాతంత్య్ర దినాన్ని ఒక రోజు ముందుకు జరిపేందుకు జిన్నా కూడా అనుమతించారని తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అది శుద్ధ అబద్ధమని, 1948 ఆగస్టు నాటికే జిన్నా మరణశయ్యపై ఉన్నారని ఆయన జీవిత చరిత్ర రాసిన యాసర్ లతీఫ్ హందానీ స్పష్టం చేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పాలస్తీనా స్వతంత్ర దేశం
టెల్ అవీవ్: పాలస్తీనా విషయంలో నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని తాము గుర్తిస్తున్నామని బుధవారం ప్రకటించాయి. ఈ నెల 28న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాయి. నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దేశాల తాజా ప్రకటనను పాలస్తీనియన్లు స్వాగతించారు. పాలస్తీనా దేశాన్ని ఇప్పటికే భారత్ సహా దాదాపు 140 దేశాలు అధికారికంగా గుర్తించాయి. అంటే ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన మొత్తం దేశాల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ దేశాలు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. తాజాగా మరో మూడు దేశాలు ఈ జాబితాలో చేరడం విశేషం. శాంతి, సామరస్యం కోసమే.. తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌ను కలిపి ప్రత్యేక పాలస్తీనాను దేశంగా గుర్తించాలని లక్షలాది మంది పాలస్తీనియన్లు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. 1967లో జరిగిన మిడిల్ఈస్ట్ యుద్ధంలో ఆ మూడు ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ప్రస్తుతం తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నియంత్రణ కొనసాగుతోంది. పాలస్తీనా దేశాన్ని గుర్తించకపోతే మధ్యప్రాచ్యంలో శాంతి, సామరస్యం నెలకొల్పడం సాధ్యం కాదని నార్వే ప్రధాని జోనస్ గహర్ పేర్కొన్నారు. ఐర్లాండ్‌కు, పాలస్తీనాకు ఇదొక చరిత్రాత్మకమైన, ముఖ్యమైన రోజు అని ఐర్లాండ్ ప్రధాని సైమన్ హ్యారిస్ వ్యాఖ్యానించారు. తమ నిర్ణయం ఇజ్రాయెల్‌సహా ఎవరికీ వ్యతిరేకం కాదని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ స్పష్టంచేశారు. హంతకులకు, రేపిస్టులకు బంగారు పతకాలా? పాలస్తీనాను ఒకదేశంగా గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చేసిన ప్రకటన పట్ల ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు దేశాల నుంచి తమ రాయబారులను వెనక్కి పిలిపించింది. తమ దేశంలో ఉన్న నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసింది. తద్వారా తమ నిరసనను తెలియజేసింది. హమాస్ హంతకులకు, రేపిస్టులకు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ బంగారు పతకాలు బహూరిస్తున్నాయని, ఈ పరిణామాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ పేర్కొన్నారు. -
తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటు ప్రాంతాలకు.. స్వతంత్ర హోదాకు రష్యా నిర్ణయం!
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగే ఆలోచన లేదంటూనే సంక్షోభాన్ని మరింత పెంచే చర్యలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ దిగుతున్నారు. తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాదుల అదీనంలోని రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని ఆయన నిర్ణయించారు. సోమవారం తన నేతృత్వంలోని ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను సమావేశపరిచి ఈ విషయమై లోతుగా చర్చించారు. తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దీనిపై మాట్లాడారు. దీనిపై ఉక్రెయిన్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఐరాస భద్రతా మండలిని తక్షణం సమావేశపరిచి రష్యా దూకుడుపై చర్చించాలని కోరింది. ఆ రెండు వేర్పాటువాద ప్రాంతాల్లో రష్యా అనుకూల రెబల్స్ ప్రభుత్వాలు నడుపుతున్నాయి. తమను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని, ఉక్రెయిన్ ఆక్రమణల బారినుంచి కాపాడి అన్నివిధాలా ఆదుకోవాలని రెబెల్స్ తాజాగా రష్యాను కోరారు. రష్యా పార్లమెంటు దిగువ సభ కూడా గత వారం పుతిన్‌కు ఆ మేరకు విజ్ఞప్తి చేసింది. -
మీరు వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: అమెరికాకు చైనా వార్నింగ్
బీజింగ్: చైనా - అమెరికాల తత్సంబంధాలు దెబ్బతినడంలో తైవాన్ కీలకం కానుంది. గత కొంతకాలంగా తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా జోక్యాన్ని సహించలేని చైనా.. తైవాన్‌కు మద్ధతు తెల్పడం ద్వారా అమెరికా వెలకట్టలేని మూల్యం చెల్లించాల్సి వస్తుందని చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి వాంగ్ యి గురువారం మీడియా వేదికగా హెచ్చరించారు. తైవాన్ను తమ స్వంత భూభాగంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నట్లు చైనా ఈ సందర్భంగా పేర్కొంది. అంతేకాకుండా గత రెండేళ్లలో తన సార్వభౌమాధికారాన్ని నొక్కిచెప్పేందుకు తైవాన్ రాజధాని తైపీలో సైనిక, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది కూడా. తైవాన్ స్వతంత్ర దళాలను ప్రోత్సహించడం ద్వారా దానిని అత్యంత ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టడమే కాకుండా, అందుకు యూఎస్ వెలకట్టలేని మూల్యం చెల్లించాల్సి వస్తుందని వాంగ్ తాజాగా హెచ్చరించాడు. కాగా ఎటువంటి అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ అటు చైనా, ఇటు అమెరికా దేశాల మధ్య తైవాన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఐతే తైవాన్ ద్వీపం తమది స్వతంత్ర దేశమని, దాని స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలను పరిరక్షించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. మరోవైపు చైనా మాత్రం తమ భూభాగంలో కలవడం తప్ప తైవాన్‌కు వేరే మార్గం లేదని వాంగ్ తాజాగా ధీమా వ్యక్తం చేశాడు. ఐతే తైవాన్‌కు అంతర్జాతీయ మద్ధతుదారు, ఆయుధాల సరఫరాదారైన అమెరికా, తైవన్పై చైనా దాడి చేస్తే, తైవాన్ను రక్షించేందకు సైనికంగా జోక్యం చేసుకుంటుందా లేదా అనే విషయంపై చాలా కాలంగా అమెరికా వ్యూహాత్మక ధోరణిని అనుసరిస్తోంది. చదవండి: రానున్న 2, 3 రోజుల్లో చలిగాలులతో కూడిన వానలు: వాతావరణ శాఖ -
రిపబ్లిక్ ఆఫ్ జకిస్థాన్..!
రిపబ్లిక్ ఆఫ్ జకిస్థాన్. ఎక్కడుంది అంటే... అమెరికాలో. జనాభా... ఒక్కరే. ఏమిటిది అమెరికాలో మరో స్వతంత్ర దేశం ఉండటమేమిటనే సందేహం వస్తోంది కదూ. న్యూయార్క్‌కు చెందిన జాక్ లాండ్స్‌బెర్గ్ అనే వ్యక్తికి పదేళ్ల కిందట వచ్చిన ఆలోచన ఫలితమే ఇది. బాక్స్ ఎల్డర్ కౌంటీలో ఓ నాలుగెకరాలు కొన్నాడు లాండ్స్‌బెర్గ్. దానికి రిపబ్లిక్ ఆఫ్ జకిస్థాన్ అని పేరుపెట్టేశాడు. దేశం కాని దేశానికి ఈయనే అధ్యక్షుడు. ఓ జెండాను కూడా రూపొందించాడు. పాస్‌పోర్ట్‌ను కూడా తయారుచేశాడు. నాలుగెకరాల చుట్టూ కంచె వేసి ఓ బోర్డర్ పెట్రోల్ గేట్‌ను కూడా అమర్చాడు. ఇక్కడో రోబో పహారా కాస్తుంది. మనకంటూ కొంత ప్రదేశం ఉండాలి, అక్కడే మనం స్వేచ్ఛగా ఉండగలగాలి... అనే ఉద్దేశంతోనే ఇదంతా చేశానని చెప్పుకుంటాడీ లాండ్స్‌బెర్గ్. ఈ దేశంకాని దేశానికి దగ్గరగా... 60 మైళ్ల దూరంలో ఓ పట్టణం ఉందట. అలాగే 15 కిలోమీటర్లు కచ్చా రోడ్లపై వెళితేగాని అక్కడికి చేరుకోలేం. ఇదంతా చూస్తుంటే ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకోకుండా ఉండలేం కదా! -
స్కాట్లాండ్లో నేడే ప్రజాభిప్రాయ సేకరణ
-
విడిగానా?.. కలివిడిగానా?
స్కాట్లాండ్లో నేడే ప్రజాభిప్రాయ సేకరణ యునెటైడ్ కింగ్డమ్లో కొనసాగడమా? స్వాతంత్య్రమా? ఇరు వాదనలకు దాదాపు సమాన మద్ధతు కలిసుండాలని బ్రిటన్ హామీల వర్షం స్వాతంత్య్రానికి మొగ్గు చూపుతున్న స్కాట్లాండ్ యువత ఎడిన్బర్గ్: బ్రిటన్‌తో 307 ఏళ్ల అనుబంధాన్ని కొనసాగించడమా? లేక స్వతంత్ర దేశంగా తొలి అడుగులు వేయడమా?.. అని స్కాట్లాండ్ ప్రజలు నిర్ణయించుకునేది నేడే. యూరోప్.. ముఖ్యంగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దశ, దిశ తేలేది నేడే. కలిసుందామనే బ్రిటన్ నేతల భావోద్వేగ అభ్యర్థన ఫలిస్తుందా? లేక కలి‘విడి’గా ఉందామనే స్కాట్లాండ్ వాసుల ఆలోచన గెలుస్తుందా?..అని యావత్ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్కాట్లాండ్ రెఫరెండానికి ముహూర్తం ఈ రోజే. స్కాట్లాండ్ స్వాతంత్య్రాన్ని నిర్ణయించే ప్రజాభిప్రాయ సేకరణ గురువారం జరగనుంది. ఈ రెఫరెండంలో ‘స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా ఉండాలా?’ అన్న ఏకైక ప్రశ్నకు ‘ఉండాలి(యెస్)’.. లేదా ‘వద్దు(నో)’ అంటూ దాదాపు 43 లక్షల మంది స్కాట్లాండ్ పౌరులు ఏకవాక్య సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ రెఫరెండం ప్రచారం కూడా ‘ఎస్’ గ్రూప్, ‘నో’ గ్రూప్‌లుగా విడిపోయింది. 16 ఏళ్లు పైబడిన స్కాట్లాండ్ పౌరులకు ఈ రెఫరెండంలో పాల్గొనే అర్హత ఉంటుంది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. శుక్రవారం ఉదయం వరకు తుది ఫలితం ప్రకటిస్తామని చీఫ్ కౌంటింగ్ ఆఫీసర్ మేరీ పిట్కైత్లీ స్పష్టం చేశారు. లండన్ కాలమానం కన్నా భారత్ కాలమానం నాలుగున్నర గంటలు ముందుంటుందన్న విషయం గమనార్హం. అటో.. ఇటో.. ఎటైనా.. స్వల్ప మెజారిటీనే! మొదట్లో స్కాట్లాండ్ స్వాతంత్య్రానికి స్థానికుల నుంచి అంతగా మద్దతు లభించలేదు. దాంతో ఈ రెఫరెండాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ క్రమంగా స్వాతంత్య్రం వైపు స్కాట్లాండ్ ప్రజలు మొగ్గు చూపుతుండటం, ఒపీనియన్ పోల్స్‌లోనూ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండటంతో ఉత్కంఠ, ఆసక్తి పెరిగింది. ప్రమాదం శంకించిన బ్రిటన్ నేతలు స్కాట్లాండ్కు క్యూ కట్టారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరాన్ కూడా స్వయంగా వెళ్లి.. ‘కష్టపడి నిర్మించుకున్న జాతిని విచ్ఛిన్నం చేయొద్ద’ంటూ స్కాట్ ప్రజలను కన్నీళ్లతో అభ్యర్థించారు. ఈ క్రమంలో ‘ఎస్’, ‘నో’ గ్రూపుల మధ్య ప్రచారం కూడా ఊపందుకుంది. స్కాట్లాండ్ వ్యాప్తంగా ర్యాలీలతో, కరపత్రాలతో హోరెత్తించారు. బుధవారం పత్రికల్లో ప్రచురితమైన ఒపీనియన్ పోల్స్‌లో.. బ్రిటన్‌తో కలిసుండాలనే వాదనకు అత్యంత స్వల్ప మెజారిటీ(52%) లభించింది. ఈ పరిస్థితుల్లో ఇంకా ఎటూ నిర్ణయించుకోని ఓటర్ల నిర్ణయం తుది ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్కాట్లాండ్ స్వాతంత్య్రాన్ని ఆ దేశ యువత ఎక్కువగా కోరుకుంటున్నారు. స్కాట్ స్వాతంత్య్ర కాంక్షను బలంగా ముందుకు తీసుకెళ్లిన నేత అలెక్స్ సాల్మండ్ బుధవారం ఉదయం దేశ ప్రజలను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో ‘బ్రిటన్‌తో 307 ఏళ్ల బంధం నుంచి విడిపోయే ఈ చరిత్రాత్మక అవకాశాన్ని వినియోగించుకోండి. శుక్రవారం కొత్తదేశంలో, కొత్త ఆకాంక్షలతో నిద్రలేవండి’ అని పిలుపునిచ్చారు. బ్రిటన్‌తో కలిసుంటేనే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని స్వాతంత్య్రాన్ని వద్దనే గ్రూప్ వాదిస్తోంది. ‘నో’కు ఓటేస్తే పన్నులు, సంక్షేమ రంగం సహా పలు రంగాల్లో మరిన్ని అధికారాలు అప్పగిస్తామంటూ బ్రిటన్‌కు చెందిన 3 ముఖ్యమైన పార్టీలు స్కాట్లాండ్కు హామీ ఇచ్చాయి. కేమరాన్‌కు కష్టకాలం విడిపోవడానికే స్కాట్లాండ్ నిర్ణయించుకుంటే తక్షణ నష్టం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరాన్కేనని విశ్లేషకులు భావిస్తున్నారు. స్కాట్లాండ్నుంచి ఎన్నికైన ఎంపీలు దూరమైతే ఆయన ప్రధాని పదవిని కూడా కోల్పోయే ప్రమాదముందంటున్నారు. అలాగే, ప్రతిపక్ష టోరీల డిమాండ్ ప్రకారం.. ఇంగ్లండ్ చట్టాలపై స్కాట్లాండ్ ఎంపీలకు ఓటింగ్ హక్కును నిరాకరిస్తే.. బడ్జెట్ ఆమోదం పొందడం కూడా కష్టమేనని వివరిస్తున్నారు. భారతీయుల ఓట్లు కీలకం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తేడా స్వల్పంగా ఉండే అవకాశాలుండటంతో స్కాట్లాండ్లో స్థిరపడిన ఆసియన్లు, ముఖ్యంగా అక్కడి భారతీయుల ఓట్లు ఈ రెఫరెండంలో కీలకం కానున్నాయి. స్కాట్లాండ్ జనాభాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండియాలకు చెందినవారు 3% పైగా ఉన్నారు. అయితే, వారు కూడా రెండు వర్గాలుగా విడిపోవడం విశేషం. యువత స్వాతంత్య్రానికి మద్దతిస్తుండగా.. పాతతరం వారు, ముఖ్యంగా అక్కడ పలు వ్యాపారాల్లో ఉన్నవారు బ్రిటన్‌తో కలిసుండాలనే కోరుకుంటున్నారు. వారు భారత్- పాకిస్థాన్ విభజన నాటి కష్టాలను ప్రస్తావిస్తున్నారు.