India v England
-
T20 World Cup 2024: పేలవ ఫామ్‌లో విరాట్.. సెమీఫైనల్లో అయినా పుంజుకుంటాడా..?
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేలవమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 66 పరుగులు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచాడు. ఇందులో రెండు డకౌట్లు కూడా ఉన్నాయి.ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌కు ముందు భారత క్రికెట్ అభిమానులను విరాట్ ఫామ్ కలవరపెడుతుంది. సెమీస్‌లో అయినా విరాట్ బ్యాట్ ఝులిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ విరాట్ ఇదే పేలవ ఫామ్‌ను కొనసాగిస్తే టీమిండియా విజయావకాశాలు భారీగా దెబ్బ తింటాయి. విరాట్ ఎలాగైనా ఫామ్‌లోకి రావాలని టీమిండియా అభిమానులు దేవుళ్లకు ప్రార్ధిస్తున్నారు.ప్రస్తుత వరల్డ్‌కప్‌లో విరాట్ చేసిన స్కోర్లు..ఐర్లాండ్‌పై 1(5)పాక్‌పై 4 (3)యూఎస్ఏపై 0 (1)ఆఫ్ఘనిస్తాన్పై 24 (24)బంగ్లాదేశ్‌పై 37 (28)ఆస్ట్రేలియాపై 0 (5)కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్‌కు జతగా విరాట్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఓపెనర్‌గా ప్రమోషన్ లభించాక విరాట్ ఐపీఎల్ తరహాలో రెచ్చిపోతాడని అంతా అనుకున్నారు. అయితే విరాట్ పేలవ ఫామ్‌న ప్రదర్శిస్తూ అందరినీ నిరాశపరుస్తున్నారు. ఐపీఎల్ 2024లో భీకర ఫామ్‌లో ఉండిన విరాట్ దేశం తరఫున ఆడాల్సి వచ్చే సరికి తేలిపోతుండటంతో అతని వ్యతిరేకులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.ఏకంగా విరాట్‌ను జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నారు. విరాట్ స్థానంలో యశస్వి జైస్వాల్ లేదా సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. విమర్శకుల నోళ్లు మూయించాలంటే విరాట్ కీలకమైన సెమీస్‌లో ఎట్టి పరిస్థితుల్లో ఫామ్‌లోకి రావాలి.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024 తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ తలపడనున్నాయి. తొలి సెమీస్ ట్రినిడాడ్ వేదికగా రేపు (జూన్ 27) ఉదయం 6 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభంకానుండగా.. రెండో సెమీస్ గయానా వేదికగా రేపు రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. -
కోడలిపై రవీంద్ర జడేజా తండ్రి సంచలన ఆరోపణలు
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇంట్లో విబేధాలు రచ్చకెక్కాయి. కోడలి విషయంలో తండ్రి కోడుకుల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జడ్డూ తండ్రి అనిరుద్ద్‌సిన్హ్ జడేజా కోడలు రివాబాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రివాబా కారణంగా తమ కుటుంబంలో చీలికలు వచ్చాయని ఆరోపించాడు. పెళ్లైన మూడు నెలల నుంచే రివాబా తమ కుటుంబంలో అగాధాలు సృష్టించిందని అన్నాడు. రివాబా కారణంగానే తాను ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలిపాడు. కేవలం డబ్బు, హోదా కోసమే రివాబా జడేజాతో కాపురం చేస్తుందని ఆరోపించాడు. తన కొడుకుకు తనకు మాటాలు లేక చాలాకాలమైందని తెలిపాడు. తన మనవరాలిని (జడేజా కూతురు) చూసేందుకు కూడా రివాబా అంగీకరించడం లేదని అన్నాడు. కొడుకు, కోడలు తన పట్ల కఠినంగా ఉంటున్నందుకు అతను కూడా వారితో అలాగే ప్రవర్తిస్తున్నట్లు తెలిపాడు. పెళ్లి తర్వాత జడేజాలో కూడా చాలా మార్పులు వచ్చాయని అన్నాడు. జడేజా క్రికెటర్ కాకపోయుంటే రివాబా అతన్ని పెళ్లి చేసుకునేది కాదంటూ సంచలన ఆరోపణలు చేశాడు. Let's ignore what's said in scripted interviews 🙏 pic.twitter.com/y3LtW7ZbiC — Ravindrasinh jadeja (@imjadeja) February 9, 2024 లేటు వయసులో జడేజా తనను పట్టించుకుపోవడమే కాకుండా కనీస అవసరాలకు కూడా డబ్బులు ఇవ్వట్లేదని అన్నాడు. చనిపోయిన తన భార్య పెన్షన్ డబ్బులతో కాలం వెల్లదీస్తున్నట్లు తెలిపాడు. తండ్రి చేసిన వ్యాఖ్యలపై రవీంద్ర జడేజా సైతం స్పందించాడు. తన తండ్రి వ్యాఖ్యలన్ని అబద్దాలేనని కొట్టిపారేశాడు. తన భార్య పరువుకు భంగం కలిగేందుకు తన తండ్రి ద్వారా ఎవరో ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లు తెలిపాడు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలు పిచ్చి వ్యాఖ్యలని అన్నాడు. అతను చేసిన నిరాధారమైన వ్యాఖ్యలు నమ్మవద్దని ట్విటర్ వేదికగా వెల్లడించాడు. కాగా, జడేజా భార్య రివాబా గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉంది. ఆమె జామ్‌నగర్ నార్త్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుంది. జడేజా తన భార్య బిడ్డతో కలిసి సొంత బంగ్లాలో నివసిస్తుండగా.. జడ్డూ తండ్రి అనిరుద్ద్‌సిన్హ్ జామ్‌నగర్‌లో ఓ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఒంటిరిగా జీవిస్తున్నాడు. గాయం కారణంగా జడేజా ఇటీవల ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన రెండో టెస్ట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. -
India v England: ముగ్గురు కొత్తవారికి చోటు
లండన్: వచ్చే నెలలో భారత్‌లో ఐదు టెస్టుల సిరీస్ కోసం పర్యటించే ఇంగ్లండ్ జట్టును సోమవారం ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో ముగ్గురు కొత్త ప్లేయర్లు గుస్ అట్కిన్సన్, టామ్ హార్ట్లే, షోయబ్ బషీర్‌లకు తొలిసారి చోటు లభించింది. కౌంటీ క్రికెట్లో సర్రే క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించే 25 ఏళ్ల పేస్ బౌలర్ అట్కిన్సన్ ఇప్పటికే ఇంగ్లండ్ తరఫున తొమ్మిది వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఇంగ్లండ్ బృందంలో నలుగురు స్పెషలి‹Ù్ట స్పిన్నర్లు రేహన్ అహ్మద్, జాక్ లీచ్, హార్ట్లే, షోయబ్ బషీర్ ఉండటం విశేషం. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జనవరి 25 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది. రెండో టెస్ట్ (ఫిబ్రవరి 2–6) విశాఖపట్నంలో, మూడో టెస్ట్ (ఫిబ్రవరి 15–19) రాజ్‌కోట్‌లో, నాలుగో టెస్ట్ (ఫిబ్రవరి 23–27) రాంచీలో, ఐదో టెస్ట్ (మార్చి 7–11) ధర్మశాలలో జరుగుతాయి. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జో రూట్, బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ, ఒలీ పోప్, జేమ్స్ అండర్సన్, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, ఒలీ రాబిన్సన్, మార్క్ వుడ్, రేహన్ అహ్మద్, షోయబ్ బషీర్, టామ్ హార్ట్లే, జాక్ లీచ్, అట్కిన్సన్. -
బుమ్రాకు 'తొలి' టెస్టు.. ఐసీసీ ఆల్ ది బెస్ట్
చెన్నై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ఒక విషయం ఆసక్తి రేపుతుంది. అదేంటో తెలుసా.. ఇప్పటివరకు బుమ్రా టీమిండియా తరపున 17 టెస్టులకు ప్రాతినిధ్యం వహించగా.. అవన్నీ విదేశాల్లోనే ఆడడం విశేషం.2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన బుమ్రా ఇప్పటివరకు 21 సగటుతో 79 వికెట్లు తీశాడు. ఇందులో 5 సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అంతేగాక అరంగేట్రం చేసిన ఏడాదిలోనే 8 మ్యాచ్‌ల్లో 48 వికెట్లతో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న బుమ్రా.. ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. చదవండి: టీమిండియాకు జో రూట్ వార్నింగ్ కాగా రేపు ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు మ్యాచ్‌తో బుమ్రా స్వదేశంలో తొలి టెస్టు ఆడడం ప్రత్యేకతను సంతరించుకొంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇప్పటికే స్వదేశంలో తనదైన మార్క్ చూపిన బుమ్రా టెస్టులో తన ముద్రను ఎలా వేయనున్నాడనేది తేలిపోనుంది. ఈ నేపథ్యంలో బుమ్రా ఫోటోను షేర్ చేస్తూ ఐసీసీ ఒక ట్వీట్ చేసింది. 17 మ్యాచ్‌ల్లోనే 79 వికెట్లు తీసిన బుమ్రా ఇండియాలో తొలి టెస్టు ఆడనున్నాడా అంటూ ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ ఎమోజీని పెట్టింది. కాగా ఆసీసీతో జరిగిన మూడోటెస్టులో గాయపడిన బుమ్రా గబ్బాలో జరిగిన నాలుగో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. బుమ్రా,షమీ లాంటి సీనియర్ బౌలర్ల గైర్హాజరీలో టీమిండియా ఆఖరి టెస్టు మ్యాచ్‌ను గెలిచి 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకుంది. Since his Test debut in 2018: ❇️ 17 matches ❇️ 79 wickets ❇️ 21.59 average But Jasprit Bumrah will be playing a Test in India for the FIRST time 👀 How will he fare against England? #INDvENG pic.twitter.com/qpx8gzhB0D — ICC (@ICC) February 4, 2021 -
జోరులో భారత్, పట్టుదలగా ఇంగ్లండ్
-
జోరులో భారత్, పట్టుదలగా ఇంగ్లండ్
పుణె: భారత, ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పుణేలో ఈరోజు తొలి మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లి పూర్తి స్థాయి వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. టెస్టుల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.... వన్డేల్లోనూ అదే జోరును ప్రదర్శించాలని భావిస్తోంది. మరోవైపు పరిమితి ఓవర్ల స్పెషలిస్ట్ ఆటగాళ్లతో భారత్‌కు వచ్చిన ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఫలితం పునరావృతం కారాదని పట్టుదలగా ఉంది. దాదాపు పదేళ్ల తర్వాత మరో కెప్టెన్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న ధోనితో పాటు పునరాగమనం చేసిన యువరాజ్‌పై ప్రధానంగా అందరి దృష్టి నిలిచింది. జేసన్ రాయ్, హేల్స్, బట్లర్‌లాంటి హిట్టర్లతో ఇంగ్లండ్ కూడా మెరుగ్గా కనిపిస్తోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. -
కోహ్లి ఎఫెక్ట్: కెప్టెన్‌గా ధోనీకి ఉద్వాసన?
ముంబై: ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలో సీనియర్ సెలక్షన్ కమిటీ బాధ్యతలు చేపట్టి.. దాదాపు మూడు నెలలు అవుతోంది. ప్రస్తుతానికి సజావుగా సాగుతున్న సెలక్షన్ కమిటీకి ఎదురయ్యే అతిపెద్ద సవాల్ ఏమిటంటే.. మహేంద్రసింగ్ ధోనీని కెప్టెన్‌గా తప్పించడమే.. ప్రస్తుతం ధోనీ వన్డేలు, టీ-20లకు సారథిగా ఉన్నాడు. మరికొద్ది నెలల్లో ఈ పరిస్థితి మారిపోవచ్చు. ఇటు సారథిగానూ, అటు బ్యాట్స్‌మన్‌గానూ ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా విరాట్ రాణిస్తుండటమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో ధోనీని తప్పించి.. అన్ని ఫార్మెట్లలో కెప్టెన్సీ బాధ్యతలు విరాట్ కోహ్లికి అప్పగించక తప్పదని క్రికెట్ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గత రెండేళ్లుగా టెస్టుల్లో కెప్టెన్‌గా కోహ్లి అసాధారణమైన ప్రతిభను చాటుతున్నాడు. నిజానికి కెప్టెన్ అయిన తర్వాతే కోహ్లి మరింత రాటుదేలాడా? అన్న సందేహం కలుగకపోదు అతని ఇటీవలి ఇన్నింగ్స్‌ను చూస్తే.. టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ సమయం వచ్చిన ప్రతిసారి తనకు తానే సాటి అని కోహ్లి నిరూపించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మరో రెండున్నరేళ్లలో ఇంగ్లండ్‌లో జరగనున్న వన్డే క్రికెట్ వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు ఎవరు నాయకత్వం వహించాలన్నది కీలక ప్రశ్నగా మారింది. ‘ధోనీ కెప్టెన్‌గా కొనసాగించాలా? లేదా మార్పులు చేయాలా? అన్నది త్వరలోనే తేలిపోయే అవకాశముంది. వచ్చే ఏడాది వేసవిలో ఇంగ్లండ్‌ళో చాంపియన్స్ ట్రోపీ నాటికి ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశముంది. అప్పుడే సెలక్టర్లు 2019 వరల్డ్ కప్ వరకు ఎవరు జట్టు సారథిగా ఉండాలో నిర్ణయించే అవకాశముంది’ అని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా సేవలు అందిస్తూ భారత్ క్రికెట్ జట్టును గమనిస్తున్న చోప్రా.. ధోనీ అంతర్జాతీయ కెరీర్ కొనసాగింపుపైనా నిశితమైన విశ్లేషణ చేశారు. ‘ఎంతటి ప్రతిభాశాలి క్రికెటర్ అయినా.. కొంతకాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడి.. ఆ తర్వాత తెరమరుగై.. మళ్లీ ఆడటం అంటే చాలా కష్టమైన విషయం. ప్రస్తుతం టెస్టులు అధికంగా ఆడుతున్నారు. దీంతో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకొన్న ధోనీ సుదీర్ఘకాలం జట్టులో కొనసాగడం కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతటి సామర్థ్యమున్న క్రికెటర్‌కు అయినా సత్తా చాటడం అంత సులువు కాదు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లో టెస్టులకు అత్యున్నత ప్రమాణం ఉంది. క్రికెట్ పరంగా చూసుకుంటే వన్డేల కన్నా టెస్టులదే పైచేయి. ఈ నేపథ్యంలో ధోనీది చాలా క్లిష్టపరిస్థితే’ అని చోప్రా అభిప్రాయపడ్డారు.