indian agent
-
Canada–India relations: నిజ్జర్ హత్యపై ఆధారాలిచ్చాం
టొరంటో/న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారత్‌పై విమర్శలు చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయంపై తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలను భారత ప్రభుత్వానికి చాలా వారాల క్రితమే అందజేసినట్లు ట్రూడో తెలిపారు. తీవ్రమైన ఈ అంశంలో వాస్తవాలను ధ్రువీకరించే విషయంలో నిర్మాణాత్మకంగా భారత్ వ్యవహరించాలని తాము కోరుకుంటున్నామన్నారు. భారత్ స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్నారు. కెనడాతో భారత్ సహకిస్తుందని ఆశిస్తున్నామన్నారు. దీనివల్ల సమస్య మూలాల్ని తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు. అయితే, అది ఎలాంటి సమాచారమో ఆయన వెల్లడించలేదు. కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడుతూ.. ‘కెనడా ప్రధాని చెబుతున్నట్లుగా గతంలో గానీ, ఇప్పుడు గానీ అటువంటి సమాచారం భారత ప్రభుత్వానికి అందనేలేదు. అటువంటిదేమైనా ఉంటే భారత ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుంది. ఇదే విషయాన్ని కెనడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం’అని స్పష్టం చేశారు. గతంలో కెనడా గడ్డపై భారత వ్యతిరేక హింసాత్మక చర్యలకు సంబంధించిన సమాచారం అందజేసినప్పుడు అటువైపు నుంచి స్పందన రాలేదని గుర్తు చేశారు. జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వ ఏజెంట్లకు దగ్గరి సంబంధం ఉందనే విషయంలో కెనడా నిఘా సంస్థలు చురుగ్గా దర్యాప్తు చేపట్టాయంటూ గత వారం ట్రూడో కెనడా పార్లమెంట్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీటిని భారత్ తీవ్రంగా ఖండించింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆ ఆరోపణలు ఆందోళనకరం: అమెరికా ఖలిస్తానీ వేర్పాటువాది హత్యకు సంబంధించి భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు. బ్లింకెన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌నుద్దేశించి ప్రధానమంత్రి ట్రూడో చేసిన ఆరోపణలపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. దీనిపై కెనడా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లా డుతున్నాం. భారత ప్రభుత్వంతో కూడా ప్రస్తావించాం. దర్యాప్తులో భారత్ సహకరించడం ఎంతో కీలకం. నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి బాధ్యులను తేల్సాల్సిన అవసరం ఉంది’అని ఆయన అన్నారు. భారత్‌పై ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణల వెనుక ఫైవ్ ఐస్ నుంచి అందిన నిఘా సమాచారమే ఆధారమని కెనడాలో అమెరికా రాయబారి డేవిడ్ కోహెన్ చెప్పారు. మత పెద్ద కాదు.. ఉగ్రవాదే: భారత్ నిజ్జర్ ఉగ్రవాదేనని భారత్ స్పష్టం చేసింది. ఉగ్ర శిక్షణ శిబిరాల నిర్వహణ, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సేకరించడం వంటి వాటితో అతడికి సంబంధాలున్నాయంది. అతడు ప్రముఖుడు కాదని పేర్కొంది. నిషేధిత ఖలిస్తాన్ కమాండో ఫోర్స్(కేసీఎఫ్)కు చెందిన గుర్దీప్ సింగ్ అలియాస్ హెరాన్వాలాకు అతడు సన్నిహితుడని తెలిపింది. 1980–90 మధ్య కాలంలో పంజాబ్‌లో గుర్దీప్ సింగ్200 వరకు హత్యలకు పాల్పడినట్లు గుర్తు చేసింది. బలవంతంపు వసూళ్లు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుల్లో ఉన్న నిజ్జర్ పోలీసుల అరెస్టు భయంతో 1996లో నకిలీ ధ్రువపత్రాలతో భారత్ నుంచి కెనడాకు పరారయ్యాడని అధికార వర్గాలు తెలిపాయి. ఇంటర్నెట్లో చూసే తెలుసుకున్నా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయం తాను ఇంటర్నెట్లోనే చూశానని బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఈబీ చెప్పారు. తనకీ విషయాలను దర్యాప్తు అధికారులెవరూ తెలపకపోవడం నిరుత్సాహం కలిగించిందన్నారు. ఫెడరల్ ప్రభుత్వం కీలకమైన సమాచారాన్ని అందించకపోవడంతో స్థానికంగా పౌరులకు భద్రత కల్పించే చర్యలపై తమ వంతుగా స్పందించలేకపోయామన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను ఆస్తులు జప్తు కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఆస్తుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. 2020లో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం(యూఏపీఏ)కింద నమోదైన కేసుకు సంబంధించి మొహాలిలో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) జనరల్ కౌన్సిల్‌గా చెప్పుకునే పన్నుకు చెందిన అమృత్‌సర్‌లోని ఖాన్కోట్ గ్రామంలో ఉన్న 5.7 ఎకరాల వ్యవసాయ భూమి, చండీగఢ్‌లోని సెక్టార్ 15/సి ప్రాంతంలోని ఇంటిలో కొంతభాగం ఉన్నాయన్నారు. -
బుర్హాన్ టెర్రరిస్టు కాదా? ఇండియన్ ఎజెంటా?
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ప్రస్తుతం రగులుతున్న కల్లోలానికి ప్రధాన కారణం హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ ముజఫర్ వనినీ భధ్రతాదళాలు కాల్చిచంపడం. బుర్హాన్ కశ్మీరీ యూత్ ని ఆకర్షించి మిలిటెంట్లలోకి చేర్చే ఒక వ్యక్తి అని కేవలం సోషల్ మీడియాలో అతన్ని అనుసరించే వారికే తెలుసు. సాధారణ కశ్మీరీ పౌరుడి దృష్టిలో అతనొక 'ఇండియన్ ఏజెంట్'. బుర్హాన్ ఎన్ కౌంటర్ పై పత్రికల్లో వార్తలు వచ్చే వరకూ అక్కడి సాధారణ పౌరుడి అభిప్రాయం మారలేదు. దేశంలోని ప్రజలందరూ బుర్హాన్ కాల్చివేత యాంటీ టెర్రర్ ఆపరేషన్ గా భావిస్తే, జమ్మూ అండ్ కశ్మీర్ లిజరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్)కు చెందిన వారు మాత్రం బుర్హాన్ ను అమరవీరుడిగా ప్రచారం చేశారు. 1970ల్లో మిలిటెన్సీ ఉద్యమాన్ని నడపడంలో చక్రం తిప్పిన మక్బుల్ భట్ ను పాకిస్తాన్ భారతీయ గూఢచారిగా భావించి జైలుకు పంపింది. కశ్మీర్ లో కూడా భట్ గూఢచారిగా పనిచేస్తున్నాడని దృఢ నమ్మకం ఉండేది. కానీ, ఇండియా భట్ ను ఉరి తీసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 1980ల్లో ప్రారంభించిన జేకేఎల్ఎఫ్ కు భట్ పోస్టర్ ను ఉపయోగించి ప్రచారాన్ని ప్రారంభించారు. జైషే-ఈ-మహమ్మద్(జేఈఎమ్) చీఫ్ అఫ్జల్ గురూ కూడా కొంతకాలం వివాదాల చిక్కుకున్నాడు. సంస్థకు చెందిన అజాదీని ఉరి తీసిన తర్వాత పట్టు కలిగిన నేతగా ఎదిగాడు. అజాదీ జైల్లో ఉన్నప్పుడు ఒక్క కశ్మీరీ లాయర్ కూడా కేసును వాదించేందుకు ముందుకు రాలేదు. అందుకు ప్రధానకారణం 2001 పార్లమెంట్ దాడులకు సంబంధించిన సమాచారాన్ని అజాదీనే భారత్ కు చేరవేశాడని వేర్పాటువాదుల బలమైన నమ్మకం. 2008 అమర్ నాథ్ భూ వివాదం తర్వాత మిగతా మిలిటెంట్లలానే హిజ్బుల్, జేఈఎమ్ లకు బుర్హాన్ సమాచారం చేరవేస్తూ ఉండేవాడు. ఇవన్నీ చూసిన కశ్మీర్ ప్రజలు ఇతన్ని కూడా భారతీయ గూఢచారిగానే భావిస్తూ వచ్చారు. అతను నిజమైన ముజహిద్ అయితే, పోలీసులు అతన్ని చంపేసి ఉండాలి. కానీ, ఫేస్ బుక్ లో అతను పోస్టులు చేస్తుంటే భద్రతాదళాలు ఎందుకు చూస్తూ ఊరుకున్నాయి? ఇలాంటి ప్రశ్నలతో బుర్హాన్ ఓ గూఢచారి అనే ప్రచారం కశ్మీర్ లో ముఖ్యంగా దక్షిణ కశ్మీర్ లో జరిగింది. గత రెండు నెలలుగా సీఆర్పీఎఫ్, మిగతా భద్రతా దళాలపై మిలిటెంట్లు దాడులు చేసి జవానులను కాల్చి చంపుతున్నారు. దీంతో ఆపరేషన్ ను ప్రారంభించిన భద్రతాదళాలను మిలిటెంట్లు దారి మళ్లించి ఇంతవరకూ ఎవరినీ చంపకుండా.. కేవలం సోషల్ మీడియా ద్వారా యువతను ప్రభావితం చేస్తున్న బుర్హాన్ ను చంపేలా పాకిస్తాన్ కుట్ర చేసిందనీ ఓ అధికారి అన్నారు. బుర్హాన్ కాల్చివేతతో కశ్మీర్ లో కల్లోల పరిస్థితులు కల్పించడమే పాక్ ఉద్దేశమని, ప్రస్తుతం అదే జరుగుతోందని తెలిపారు.