Indian Engineers
-
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా: '3 ఇడియట్స్' సీన్‌తో..
ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యుగంలో భారతీయ ఇంజనీర్లకు సలహాలు ఇచ్చారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ (FAANG) వంటి సంస్థల్లో ఇంటర్వ్యూల్లో ఎలా విజయం సాధించాలో వివరిస్తూ.. రోట్ లెర్నింగ్ గురించి వివరించారు. ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా.. బట్టీ పడితే ఉపయోగం లేదని అన్నారు. కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ తప్పకుండా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని అన్నారు.దీనికి ఉదాహరణగా 3 ఇడియట్స్ సినిమా గురించి వివరించారు. ఈ సినిమాలో మోటార్ ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్నకు ఓ విద్యార్ధి బట్టీ పట్టిన సమాధానం చెబుతాడు. ఆ పద్దతి సరైనది కాదని వివరించారు. ఒక వ్యక్తి ఎంత స్మార్ట్ అయినప్పటికీ.. ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టడంలో విఫలమవుతున్నారని ఆయన అన్నారు. -
తాలిబన్ చెర నుంచి భారతీయుల విడుదల
ఇస్లామాబాద్: గత సంవత్సర కాలంగా తమ దగ్గర బందీలుగా ఉన్న ముగ్గురు భారతీయ ఇంజనీర్లను అఫ్గాన్ తాలిబన్లు సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు తాలిబన్ నాయకులు స్థానిక రేడియో చానల్లో మాట్లాడినట్లు మీడియా సంస్థలు కథనాలు రాశాయి. అఫ్గాన్‌లో అమెరికా ప్రత్యేక రాయబారి అయిన జల్మే ఖలిల్జాద్ ఇస్లామాబాద్‌లో తాలిబన్ నాయకులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ముగ్గురు భారతీయ బందీలను తాలిబన్లు విడుదల చేశారని ఇందుకు ప్రతిగా అఫ్గాన్ జైళ్లలో ఉన్న 11 మంది తాలిబన్ నాయకులను విడుదల చేసినట్లు తెలిపాయి. అయితే ఈ పరిణామాలపై స్పందించేందుకు అఫ్గాన్ అధ్యక్ష కార్యాలయం, రక్షణ శాఖ నిరాకరించాయి. దీనిపై అఫ్గాన్ ప్రభుత్వం నుంచి గానీ, భారత ప్రభుత్వం నుంచి గానీ ఎటువంటి ప్రకటన రాలేదు. విడుదల అయిన బందీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా తాలిబన్లు వెల్లడించలేదు. అయితే జైళ్ల నుంచి విడుదలైన తాలిబన్ నేతలను అభినందిస్తున్న ఫొటోలు, వీడియోలను మాత్రం విడుదల చేశారు. కాగా 2018 మేలో బాగ్లాన్ రాష్ట్రంలోని ఓ పవర్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఏడుగురు భారతీయ ఇంజనీర్లను, వారి డ్రైవర్‌ను తాలిబన్లు అపహరించిన సంగతి తెలిసిందే. ఈ పని తామే చేశామని అప్పట్లో ఏ గ్రూప్ కూడా ప్రకటించలేదు. అయితే అపహరణకు గురైన ఏడుగురిలో ఒకరిని ఈ మార్చిలో విడుదల చేశారు. -
అఫ్గాన్‌లో ఏడుగురు భారతీయుల కిడ్నాప్
కాబూల్/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో ఏడుగురు భారతీయ ఇంజనీర్లు అపహరణకు గురయ్యారు. అఫ్గాన్‌లోని బాగ్లాన్ ప్రావిన్స్‌లో భారత్‌కు చెందిన ఒక కంపెనీ తరఫున విద్యుత్ కాంట్రాక్ట్ పనుల్ని పర్యవేక్షిస్తున్న వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా పొరబడి తాలిబన్లు అపహరించారని అఫ్గాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. కేఈసీ ఇంటర్నేషనల్ ఉద్యోగులైన వీరంతా ఆదివారం తెల్లవారుజామున మినీ బస్సులో విద్యుత్ నిర్వహణ పనుల కోసం వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక న్యూస్ చానల్ తెలిపింది. ఇంజనీర్లతో పాటు, వారు ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్‌ను బాగ్లాన్ ప్రావిన్స్ రాజధాని పుల్–ఇ–ఖొమ్రిలోని బాగ్–ఇ–షమల్ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు అపహరించినట్లు వెల్లడించింది. కాబూల్‌లోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులు కూడా ఇంజనీర్ల కిడ్నాప్‌ను నిర్ధారించారు. కిడ్నాప్‌కు గురైన ఏడుగురు భారతీయులు అఫ్గాన్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. కిడ్నాపునకు గురైన వీరంతా ఏ రాష్ట్రం వారో ఇంకా తెలియరాలేదు. ఈ అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందిస్తూ.. అఫ్గానిస్తాన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించింది. భారత్‌కు చెందిన ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఆర్పీజీ గ్రూపు అనుబంధ కంపెనీయే కేఈసీ ఇంటర్నేషనల్.. మా ఉద్యోగుల్ని కాపాడండి: ఆర్పీజీ చైర్మన్ ఈ ఉదంతంపై బాగ్లాన్ గవర్నర్ అబ్దుల్లా నెమటి మాట్లాడుతూ.. ‘భారతీయ ఇంజనీర్లను బందీలుగా పట్టుకున్న తాలిబన్ ఉగ్రవాదులు వారిని పుల్–ఇ–ఖొమ్రిలోని దండ్–ఇ–షహబుద్దీన్ ప్రాంతానికి తరలించారు. స్థానిక ప్రజల సాయంతో తాలిబన్ ఉగ్రవాదులతో అఫ్గాన్ అధికారులు మాట్లాడారు. భారతీయుల్ని అపహరించినట్లు ఉగ్రవాదులు అంగీకరించారు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు గా భావించి వారిని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు’ అని చెప్పారు. స్థానిక గిరిజన నేతల మధ్యవర్తిత్వంతో అపహరణకు గురైన భారతీయుల్ని విడిపించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని నెమటి తెలిపారు. మరోవైపు అపహరణకు పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. బాగ్లాన్ ప్రావిన్స్ నుంచి భారతీయుల అపహరణపై అఫ్గాన్ అధికారులతో సంప్రదిస్తున్నామని, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కేఈసీ కంపెనీ యాజమాన్య సంస్థ ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయెంక ట్వీట్ చేస్తూ.. మా ఉద్యోగుల్ని కాపాడాలని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లోని వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో దాదాపు 150 మంది భారతీయ ఇంజనీర్లు పనిచేస్తున్నారని భారత ఎంబసీ అధికారి ఒకరు తెలిపారు. 2016లో ఆగాఖాన్ ఫౌండేషన్ తరఫున పనిచేసేందుకు అఫ్గాన్ వెళ్లిన భారతీయ మహిళను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు 40 రోజుల అనంతరం విడుదల చేశారు. -
అమ్మో అమెరికా !
-
అమెరికాలో 9.5 లక్షల మంది భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు!
ఆసియా నుంచి అత్యధికంగా వలస వెళ్లింది భారత్ నుంచే.. 2003 నుంచి 2013కు 85 శాతం పెరిగిన సంఖ్య ఎన్‌సీఎస్‌ఈఎస్ తాజా నివేదికలో వెల్లడి వాషింగ్టన్: ఆసియా దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్లిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో భారత్ అగ్రస్థానంలో ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఆసియా ఖండంలోని 29.60 లక్షల మంది వలస శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో 2013 నాటికి భారత్ నుంచి 9.50 లక్షల మంది అగ్రరాజ్యంలో పనిచేస్తున్నట్లు అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌సీఎస్‌ఈఎస్) పేర్కొంది. 2003తో పోలిస్తే వారి సంఖ్య 85 శాతం పెరిగిందని వివరించింది. అలాగే అదే కాలానికి ఫిలిప్పీన్స్‌కు చెందిన వారి సంఖ్య 53 శాతం, హాంకాంగ్, మకావు సహా చైనాకు చెందిన వారి సంఖ్య 34 శాతం పెరిగినట్లు ఎన్‌సీఎస్‌ఈఎస్ తెలిపింది. 2003లో 2.16 కోట్ల మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అమెరికాలో ఉండగా 2013 నాటికి వారి సంఖ్య 2.9 కోట్లకు చేరిందని నివేదిక పేర్కొంది. ఇందులో వలస వచ్చిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సంఖ్య 34 లక్షల నుంచి 52 లక్షలకు పెరిగిందని నివేదిక వివరించింది. 2013 గణాంకాల ప్రకారం 63 శాతం మంది అమెరికా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు జన్మతః పౌరులుకాగా 22 శాతం మంది శాశ్వత నివాసితులు, 15 శాతం మంది తాత్కాలిక వీసాలపై నివసిస్తున్న వారు ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ఈఎస్ చెప్పింది. ఈ నివేదిక ప్రకారం 2013 నాటికి వలస శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో 57 శాతం మంది ఆసియా ఖండంలో పుట్టినవారు ఉండగా 20 శాతం మంది ఉత్తర అమెరికా ఖండం (అమెరికాను మినహాయించి), సెంట్రల్ అమెరికా, కరీబియన్ లేదా దక్షిణ అమెరికాలో పుట్టిన వారు, 16 శాతం మంది యూరప్‌లో పుట్టిన వారు, 6 శాతం ఆఫ్రికాలో పుట్టిన వారు ఉన్నారు. 2013లో 32 శాతం మంది వలస శాస్త్రవేత్తలు తమ అత్యధిక విద్యాభ్యాసం మాస్టర్స్ డిగ్రీ అని చెప్పగా 9 శాతం మంది తమ అత్యధిక విద్యాభ్యాసం డాక్టరేట్ అని చెప్పారు. అమెరికాలో పుట్టిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లతో సమానంగా 2013లో 80 శాతం మందికిపైగా వలస శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఉపాధి పొందారు. వలస శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో అత్యధికంగా 18 శాతం మంది కంప్యూటర్, గణిత శాస్త్రాల్లో పనిచేస్తుండగా 8 శాతం మంది ఇంజనీరింగ్‌లో పనిచేస్తున్నారు. -
ఇండియన్ 'యాపిల్' !
అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ విజయంలో భారతీయులదే ప్రధాన పాత్ర. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. యాపిల్ తయారు చేస్తున్న అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాల రూపకల్పనలో భారత ఇంజనీఇర్లే కీలక పోషిస్తున్నారు. అంతేకాదు ఈ సంస్థలో పనిచేస్తున్న నిపుణుల్లో మూడొంతులు మంది భారతీయులే కావడం విశేషం. 171 బిలియన్ డాలర్ల విలువ కలిగిన యాపిల్ వ్యాపారం వేగంగా విస్తరించడానికి భారత ఐటీ వ్యాపారులు తమ వంతు కృషి చేస్తున్నారు. యూపిల్ కంపెనీ భారత ఇంజినీర్లపై బాగా ఆధారపడుతుందని అమెరికాకు చెందిన హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ తెలిపింది. యూపిల్ నుంచి హెచ్-1బీ వీసా దరఖాస్తులు పెరగడమే ఇందుకు నిదర్శమని పేర్కొంది. 2001-2010 మధ్యలో ఈ కంపెనీ 1,750 హెచ్-1బీ వీసాల దరఖాస్తులు చేసింది. 2011-13 కాలంలో ఈ సంఖ్య వేగంగా పెరిగి 2,800కు చేరింది. వీటిలో ఎక్కువ వీసాలు భారతీయుల కోసమేనని వెల్లడించింది. ఈ సమాచారాన్ని బట్టి చూస్తే ఐఫోన్, ఐపాడ్ రూపకర్తలు భారత ఇంజినీర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారని అర్థమవుతోందని విశ్లేషించింది. యూపిల్ లో పనిచేస్తున్న ఇంజినీర్లలో మూడొంతుల మంది భారతీయులేనని హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ ప్రధాన విశ్లేషకుడు పరీఖ్ జైన్ తెలిపారు. ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు భారతీయ ఇంజినీరే అని చెప్పారు. వీరంతా హెచ్1బీ వీసా లేదా గ్రీన్ కార్డు కలిగినవారని వెల్లడించారు. 47 వేల మంది అమెరికాలో నేరుగా పనిచేస్తున్నారని 2012లో యూపిల్ వెల్లడించింది. వీరిలో 7,700 మంది కస్టమర్ సపోర్ట్ ఆపరేటర్లు, 27,350 మంది రిటైల్ స్టోర్స్ లో పనిచేస్తున్నారు. మిగతా 12 వేల మంది ఇంజినీర్లు, డిజైనర్లు, మార్కెటర్లు, ఇతర వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఉన్నారు. భారత్ లో తమ మార్కెట్ ను మరింత పెంచుకునేందుకు అవుట్ సోర్సింగ్ వ్యూహాన్ని యాపిల్ అమలు చేస్తోంది. భారత్ కు చెందిన మూడు అగ్రశేణి సంస్థలతో సహా నాలుగు ఐటీ కంపెనీలకు తమ పనులు అప్పగించింది. భారతీయ ఉద్యోగులపైనే కాదు ఇండియన్ కంపెనీల మీద ఆధారపడుతున్న అమెరికా టెక్నాలజీ దిగ్గజాన్ని 'ఇండియన్ యాపిల్' అని సంబోధించినా అతిశయోక్తి కాబోదేమో!