Indian names
-
సుచిన్..షోజే..చీవాలా!!
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగం విషయంలో బాగానే ప్రిపేరయినట్లున్నారు. ఎందుకంటే దీన్లో ఆయన బోలెడన్ని భారతీయ పేర్లు, పండుగలు, హిందీ సినిమాలను కూడా జొప్పించారు. కాకపోతే వాటిని పలకటంలో మాత్రం తడబడ్డారు. నరేంద్రమోదీని ఛాయ్ వాలాగా సంభోదించబోయి ‘చీవాలా’ అన్నారు. ఇక వేదాలను వేస్టాస్గా... స్వామి వివేకానంద పేరును వివేకాముందగా... సచిన్ టెండూల్కర్‌ను సుచిన్ టెండూల్కర్‌గా పేర్కొన్నారు. దీంతో పాటు షోలే సినిమాను షోజే అని అన్నారు. దిల్వాలే దుల్హనియా లేజాయెంగే సినిమా పేరును షార్ట్‌కట్‌లో చక్కగా డీడీఎల్జే అని పలికేశారు. ఈ తప్పులపై ట్విటర్లో ట్రోలింగ్ బాగానే జరిగింది. కాకపోతే ఇన్ని పేర్లను పలకటానికి ట్రంప్ బాగానే హోమ్ వర్క్ చేసి ఉంటారంటూ చాలామంది వీటిని తేలిగ్గానే తీసుకున్నారు. ఇక సచిన్ టెండూల్కర్ పేరును సుచిన్ టెండూల్కర్‌గా పలికినందుకు ట్రంప్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ట్విట్టర్ వేదికగా విమర్శించింది. అయినా అమెరికాలో సగం మంది క్రికెట్ అంటేనే... ‘అదేం ఆట?’ అని అడిగే పరిస్థితి ఉంది. అలాంటిది ట్రంప్ ఏకంగా సచిన్ పేరునే బట్టీపట్టినందుకు ప్రశంసించాలంటూ కొందరు పేర్కొనటం కొసమెరుపు!!. ట్రంప్ తొలిరోజు పర్యటన సాగిందిలా ► ఉదయం 11.40కి అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రంప్ దంపతులు చేరుకున్నారు. ► 12.10: సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు ► 12.50: మొటెరా స్టేడియంకు వెళ్లారు ► 1.15: ట్రంప్ ప్రసంగం ప్రారంభించారు. ► 2.50: అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ► 4.15: ఆగ్రా ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ► 4.50: తాజ్‌మహల్ సందర్శనకు వచ్చారు ► 6.45: తిరిగి ఆగ్రా ఎయిర్ బేస్‌కు వెళ్లారు ► 7.40: ఢిల్లీలోని పాలమ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు ► 8.00: మౌర్య హోటల్లో రాత్రి బస -
భారతీయుల బండారం బట్టబయలు
సాక్షి, న్యూఢిల్లీ : పనామా పేపర్స్ సృష్టించిన కల్లోలం ఇంకా పూర్తిగా మార్చిపోకముందే 'ప్యారడైజ్ పేపర్స్' లీకేజీలు భారతీయ కుబేరుల గుండెల్లో గుబేలు పుట్టిస్తున్నాయి. పన్నులు ఎగ్గొట్టిన 714 మంది భారతీయు కుబేరుల బండారాన్ని ప్యారడైజ్ పేపర్స్ బట్టబయలు చేసింది. పన్నుల నుంచి తప్పించుకునేందుకు తమ ఆస్తులను ఎలా దాచుకున్నదీ ఈ పేపర్లు లీక్ చేసింది. 96 న్యూస్ ఆర్గనైజేషన్ల భాగస్వామ్యంతో విచారణ జరిపిన ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఈ డేటాను లీక్ చేశారు.. ఐసీఐజే 13.4 మిలియన్ పేపర్లను లీక్ చేసింది. గతంలో పనామా పేపర్స్‌ను లీక్ చేసింది కూడా ఐసీఐజేనే. 199 నాటి న్యాయ సంస్థ 'అప్లెబీ' నుంచి ఈ డాక్యుమెంట్లను ఐసీఐజే రాబట్టింది. అప్లెబీ సంస్థ రికార్డుల్లో ఆఫ్‌షోర్ కంపెనీలు, క్లయింట్ల బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన డేటా ఉంది. ఈ డేటా లీక్‌లో సంఖ్యా పరంగా భారత్ 19వ స్థానంలో నిలిచింది. అప్లెబీ ఖాతాదారుల్లో భారతీయులు రెండోస్థానంలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం పెద్ద నోట్లను ప్రకటించి ఏడాది పూర్తయిన క్రమంలో 'యాంటీ-బ్లాక్ మనీ డే'ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంలో ప్యారడైజ్ పేర్లు వెలుగులోకి రావడం తీవ్ర ప్రకంపనాలను సృష్టిస్తోంది. ఈ ప్యారడైజ్ పేపర్లు ఆఫ్‌షోర్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ప్రముఖ వ్యక్తుల వివరాలను కూడా లీక్ చేసింది. లీకైన డాక్యుమెంట్లలో అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రోస్ పేరు కూడా ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అల్లుడికి చెందిన 'నేవిగేటర్ హోల్డింగ్స్'లో ఆయనకి వాటా ఉన్నట్టు వెల్లడించింది. పేపర్ల లీకేజీపై స్పందించిన 'అప్లెబీ'తమ సమాచారం అపహరణకు గురైందని, అయితే తమ వద్ద ఎటువంటి అవకతవకలు జరగలేని స్పష్టం చేసింది. కాగా, పనామా పేపర్స్ కుంభకోణంలో చిక్కుకున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీప్ తన పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. -
నల్లకుబేరుల పేర్లను వెల్లడించొద్దు: అసోచామ్
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకున్న భారతీయుల పేర్లను ప్రభుత్వం అనాలోచితంగా వెల్లడించరాదని పారిశ్రామిక మండలి అసోచామ్ పేర్కొంది. నల్లకుబేరుల బండారాన్ని బయటపెట్టాలని రాజకీయంగా డిమాండ్లు జోరందుకున్న నేపథ్యంలో అసోచామ్ వాదన ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వంద్వ పన్నుల నిరోధ ఒప్పందాలు(డీటీఏటీ) అటు భారతీయ పౌరులకు, కార్పొరేట్లకు చాలా ముఖ్యమని.. దీనివల్ల రెండుసార్లు పన్నులు చెల్లించే పరిస్థితి తప్పుతుందని అసోచామ్ తెలిపింది. ‘ఎలాంటి లెక్కలూ చూపకుండా విదేశాల్లో సొమ్ముదాచుకున్నారన్న ఆరోపణలకు సంబంధించి వ్యక్తుల పేర్లను బహిర్గతం చేయడం వల్ల నల్లధనంపై పోరాటానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. డీటీఏటీలో ఉల్లంఘనల వల్ల భారత్ విశ్వసనీయత దెబ్బతింటుంది. ఒకవేళ ప్రభుత్వం వెల్లడించిన వ్యక్తులు, కంపెనీలపై ఆరోపణలు రుజువు కాకపోతే వాళ్ల ప్రతిష్టకు భంగం వాటిల్లడమేకాకుండా... భారత్‌లోని చట్టాలపైన కూడా నమ్మకం సన్నగిల్లేందుకు దారి తీస్తుంది’ అని అసోచామ్ అభిప్రాయపడింది. సరైన సాంకేతిక పరిజ్ఞానం, పారదర్శక పన్నుల విధానం వంటి వ్యవస్థీకృత మార్పుల ద్వారా ఈ నల్లధనం జాడ్యానికి అడ్డుకట్టవేయొచ్చని పేర్కొంది. నల్లకుబేరులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని.. వాళ్ల పేర్లను బయటపెడతామంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం తెలిసిందే.