సాక్షి, న్యూఢిల్లీ : పనామా పేపర్స్ సృష్టించిన కల్లోలం ఇంకా పూర్తిగా మార్చిపోకముందే 'ప్యారడైజ్ పేపర్స్' లీకేజీలు భారతీయ కుబేరుల గుండెల్లో గుబేలు పుట్టిస్తున్నాయి. పన్నులు ఎగ్గొట్టిన 714 మంది భారతీయు కుబేరుల బండారాన్ని ప్యారడైజ్ పేపర్స్ బట్టబయలు చేసింది. పన్నుల నుంచి తప్పించుకునేందుకు తమ ఆస్తులను ఎలా దాచుకున్నదీ ఈ పేపర్లు లీక్ చేసింది. 96 న్యూస్ ఆర్గనైజేషన్ల భాగస్వామ్యంతో విచారణ జరిపిన ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఈ డేటాను లీక్ చేశారు.. ఐసీఐజే 13.4 మిలియన్ పేపర్లను లీక్ చేసింది. గతంలో పనామా పేపర్స్‌ను లీక్ చేసింది కూడా ఐసీఐజేనే. 199 నాటి న్యాయ సంస్థ 'అప్లెబీ' నుంచి ఈ డాక్యుమెంట్లను ఐసీఐజే రాబట్టింది. అప్లెబీ సంస్థ రికార్డుల్లో ఆఫ్‌షోర్ కంపెనీలు, క్లయింట్ల బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన డేటా ఉంది.
ఈ డేటా లీక్‌లో సంఖ్యా పరంగా భారత్ 19వ స్థానంలో నిలిచింది. అప్లెబీ ఖాతాదారుల్లో భారతీయులు రెండోస్థానంలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం పెద్ద నోట్లను ప్రకటించి ఏడాది పూర్తయిన క్రమంలో 'యాంటీ-బ్లాక్ మనీ డే'ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంలో ప్యారడైజ్ పేర్లు వెలుగులోకి రావడం తీవ్ర ప్రకంపనాలను సృష్టిస్తోంది. ఈ ప్యారడైజ్ పేపర్లు ఆఫ్‌షోర్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ప్రముఖ వ్యక్తుల వివరాలను కూడా లీక్ చేసింది. లీకైన డాక్యుమెంట్లలో అమెరికా వాణిజ్య మంత్రి విల్‌బర్ రోస్ పేరు కూడా ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అల్లుడికి చెందిన 'నేవిగేటర్ హోల్డింగ్స్'లో ఆయనకి వాటా ఉన్నట్టు వెల్లడించింది. పేపర్ల లీకేజీపై స్పందించిన 'అప్లెబీ'తమ సమాచారం అపహరణకు గురైందని, అయితే తమ వద్ద ఎటువంటి అవకతవకలు జరగలేని స్పష్టం చేసింది. కాగా, పనామా పేపర్స్ కుంభకోణంలో చిక్కుకున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీప్ తన పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment