ప్రతికాత్మక చిత్రం
న్యూఢిల్లీ: పనామా, ప్యారడైజ్ పేపర్ లీకేజీ ఘటనల్లో దాదాపు 930 భారతీయులకు సంబంధించిన సంస్థల ఖాతాల్లో ఏకంగా రూ.20,353 కోట్లు జమయ్యాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం రాజ్యసభలో ఈ విషయం చెప్పారు.
‘ఈ ఏడాది అక్టోబర్ ఒకటినాటికి ఆయా ఖాతాల్లోని మొత్తాలపై రూ.152.88 కోట్ల పన్నులను వసూలుచేశాం’ అని మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. చట్టాలను అతిక్రమించిన సంబంధిత వ్యక్తులపై ఆదాయ పన్ను శాఖ చర్యలు తీసుకుందని చెప్పారు. వీటిపై 52 కేసులు నమోదయ్యాయన్నారు. మరో 130 కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయన్నారు.
విదేశాల్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టిన కొందరు భారతీయుల పేర్లు బహిర్గతమైన విషయం తెల్సిందే. మల్టీ ఏజెన్సీ గ్రూప్(ఎంఏజీ) ఆధ్వర్యంలో కేసుల దర్యాప్తు జరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment