Indian one-day team
-
యువరాజ్ వస్తాడా?
భారత వన్డే జట్టు ఎంపిక నేడు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ న్యూఢిల్లీ: ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కొత్త సెలక్షన్ కమిటీ తొలిసారి నేడు సమావేశం కాబోతోంది. న్యూజిలాండ్‌తో ఈ నెల 16 నుంచి జరిగే ఐదు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు ఎంపిక నేడు జరగనుంది. వన్డే కెప్టెన్ ధోని నేతృత్వంలోని జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అరుుతే ప్రస్తుతం రాహుల్, ధావన్ ఇద్దరూ గాయాలతో ఉండటంతో కొత్త ఓపెనర్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నారుు. అరుుతే ప్రస్తుతం టెస్టు జట్టుతో ఉన్న గంభీర్ కూడా రేసులోనే ఉన్నాడు. అరుుతే యువరాజ్ సింగ్ మళ్లీ వన్డే జట్టులోకి వస్తాడా? అనేదే ఆసక్తికరం. దులీప్ట్రోఫీ సందర్భంగా కుంబ్లేతో మాట్లాడిన యువరాజ్ సింగ్ ఇటీవల ఎన్సీఏకు వెళ్లి ఫిట్నెస్ టెస్టులో పాల్గొని పాసయ్యాడు. ఈ నేపథ్యంలో వన్డేల్లోకి యువరాజ్ పునరాగమనం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు రైనా కూడా పునరాగమనం కోసం ఎదురు చూస్తున్నాడు. అశ్విన్, జడేజాలతో పాటు మూడో స్పిన్నర్‌గా యజువేంద్ర చహల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇర్ఫాన్ పఠాన్, హార్దిక్ పాండ్యా, స్టువర్ట్ బిన్నీ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ స్లాట్ కోసం పోటీ పడుతున్నారు. ఒకట్రెండు మార్పులు మినహా పెద్దగా సంచలనాలు లేకుండానే ఎమ్మెస్కే సారథ్యంలోని కొత్త సెలక్టర్లు పని పూర్తి చేసే అవకాశం ఉంది. -
రాయుడు సత్తాకు పరీక్ష
- నేటి నుంచి దక్షిణాఫ్రికా ‘ఎ’తో భారత్ ‘ఎ’ తొలి అనధికారిక టెస్టు వాయనాడ్ (కేరళ): భారత వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగుతున్న అంబటి తిరుపతి రాయుడు ఇప్పుడు టెస్టు టీమ్‌లోకి ఎంపికయ్యేందుకు ఒక సదవకాశం లభించింది. భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి తొలి మ్యాచ్ ఇక్కడ జరగనుంది. భారత జట్టుకు రాయుడు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆటగాడిగానే కాకుండా నాయకత్వ ప్రతిభను కూడా నిరూపించుకోవాలని రాయుడు పట్టుదలగా ఉన్నాడు. వాయనాడ్ జిల్లాలోని కృష్ణగిరిలో కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) సొంతంగా నిర్మించుకున్న స్టేడియంలో జరుగుతున్న తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. దక్షిణ భారతదేశంలో అతి ఎత్తయిన ప్రాంతంలో ఏర్పాటైన క్రికెట్ స్టేడియంగా దీనికి గుర్తింపు ఉంది. ఇటీవల ముక్కోణపు వన్డే సిరీస్ గెలుచుకున్న వన్డే జట్టులోని పలువురు భారత ఆటగాళ్లు ఈ టెస్టు టీమ్‌లోనూ ఉన్నారు. జట్ల వివరాలు భారత్: అంబటి రాయుడు (కెప్టెన్), కరుణ్ నాయర్, ముకుంద్, బైన్స్, శ్రేయస్ అయ్యర్, బాబా అపరాజిత్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, అక్షర్ పటేల్, కరణ్ శర్మ, మిథున్, శార్దుల్, ఈశ్వర్ పాండే, జాక్సన్, జీవన్‌జోత్ సింగ్. దక్షిణాఫ్రికా: విలాస్ (కెప్టెన్), బ్యూరాన్ హెండ్రిక్స్, బవుమా, క్లోట్, డి బ్రూన్, డి లాంజ్, రీజా హెం డ్రిక్స్, కేశవ్ మహరాజ్, ప్యాటర్సన్, పీడ్, రమేలా, సోట్సోబ్, వాన్ జిల్, విల్జోన్, వీస్, డి కాక్.