indiramma house applications
-
దరఖాస్తులకు మరో చాన్స్
సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 21 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గ్రామసభల్లోనూ ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో ఆదివారం ఓ సర్క్యులర్‌ను పంపారు. దాని ప్రకారం గ్రామ సభల్లో కొత్త రేషన్‌కార్డులు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్ల చేర్పు కోసం దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది. అదే విధంగా ఒక కుటుంబం నుంచి వేరు పడుతున్న కుటుంబాలకు కొత్త కార్డులిచ్చేందుకు కూడా దరఖాస్తులు తీసుకోవాలి. కుటుంబ పెద్దతో పాటు ఇతర కుటుంబ సభ్యు ల వివరాలు, వారి ఆధార్ కార్డులు, కులం, మొబైల్ నంబర్, చిరునామా తదితర వివరాలను సేకరించాలి. అదేవిధంగా ప్రజాపాలన సేవా కేంద్రాలు, మీసేవ కేంద్రాల నుంచి వచ్చే దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక ఇప్పటికే వచ్చిన 1.36 కోట్ల మందికి సంబంధించిన 41.25 లక్షల కుటుంబాల దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేయాలి. కులగణనలో భాగంగా కార్డు లేదని సమాచారం ఇచ్చిన వారి వివరాలను కూడా పరిశీలించాలి. వీటికి తోడు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించిన తర్వాతే లబ్ధిదారుల జాబితాను ఖరారు చేయాల్సి ఉంటుందని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.గ్రామసభల్లో ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి ఇందిరమ్మ ఇళ్లకు కూడా గ్రామసభల్లో దరఖాస్తులు వస్తే తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో పక్కా ఇళ్లు లేని వారి వివరాలను కలెక్టర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల లాగిన్‌లో అందుబాటులో ఉంచామని, వాటి పరిశీలన వెంటనే పూర్తి చేయాలని సర్క్యులర్‌లో సూచించారు. రేషన్‌కార్డుల తరహాలోనే దరఖాస్తుదారుల అన్ని వివరాలను గ్రామ సభల్లో నమోదు చేసుకోవాలని, ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా వచ్చే దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను మదింపు చేయడం, ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోలేని వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడం, ఇందుకు సంబంధించి ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునే విధంగా గ్రామసభలు నిర్వహించాలని సూచించారు.ఆ పంచాయతీల్లోనూ ఆత్మీయ భరోసా భూమి లేని పేదల కుటుంబాలకు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాయాన్ని ఆ కుటుంబంలోని మహిళల బ్యాంకు ఖాతాకు జమ చేయాలని సీఎస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన నిబంధనలను ఇప్పటికే కలెక్టర్లకు, డీఆర్డీవోలకు పంపామని పేర్కొన్నారు. అదే విధంగా 2023–24 సంవత్సరంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం అయిన 156 గ్రామ పంచాయతీల్లోనూ ఈ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని సర్క్యులర్‌లో సీఎస్ స్పష్టం చేశారు. -
నియోజకవర్గానికి 500 ఇళ్లు
* డబుల్ బెడ్రూం ఇళ్లపై సూత్రప్రాయ నిర్ణయం * గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక * జిల్లా కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు * సమగ్ర సర్వే వివరాల ఆధారంగా నిర్ధారణ.. సర్వేలో సొంతిల్లు లేదని పేర్కొన్న వారికే అవకాశం * ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు మొండిచెయ్యే! సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై స్పష్టతనిచ్చే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. రాష్ర్టవ్యాప్తంగా గూడులేని పేద కుటుంబాలు లక్షల్లో ఉన్నప్పటికీ తొలుత నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్లను నిర్మించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇంటి యూనిట్ ఖర్చు, నిర్మించాల్సిన వైశాల్యాన్ని ఇంకా ఖరారు చేయనప్పటికీ నియోజకవర్గాలవారీగా ఇళ్ల కేటాయింపుపై మాత్రం ప్రణాళికను సిద్ధం చేస్తోంది. లబ్ధిదారుల గుర్తింపునకు గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలలోనే ఈ కసరత్తు మొదలుకాబోతోంది. దీనికి సంబంధించి తాజాగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆధారంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. సొంతిల్లు లేనట్లుగా సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేసుకున్న పేదలనే పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుని, పనుల ప్రారంభానికి ఎదురుచూస్తున్న వారు ఆశలు కొట్టేసుకోవాల్సిందేనని తేలిపోయింది. డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామసభల నిర్వహణ బాధ్యతను ఆర్డీవోలకు అప్పగించారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలపై సీఐడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో భారీ వ్యయంతో కూడుకున్న డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో సర్కారు జాగ్రత్త వహిస్తోంది. గ్రామ సభల్లో ఒక్కో కుటుంబ వివరాలను పరిశీలించి సర్వేలో పేర్కొన్న విషయాలతో సరి చూసుకుని, దాన్ని నిర్ధారిస్తూ కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాలనీలుగా నిర్మాణం.. లబ్ధిదారు తనకున్న స్థలంలో ఇంటిని నిర్మించుకునే పాత పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలికింది. లబ్ధిదారుకు ఉన్న స్థలంతో ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ప్రత్యేకంగా ఓ ప్రాంతాన్ని గుర్తించి అక్కడే ఇళ్లను ఓ కాలనీగా నిర్మిస్తుంది. నిర్మా ణ బాధ్యతను గృహనిర్మాణ శాఖకు ఇవ్వొద్దని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చింది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో ఇళ్లను నిర్మిస్తే ఖర్చు కలిసొస్తుందని భావిస్తున్న సర్కారు.. ఈ మేరకు నిర్మాణ సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను కలెక్టర్లకే అప్పగించింది. అర్హులెందరో లెక్క తేలిన తర్వాత నిర్మాణదారులను ఆహ్వానిస్తూ టెండర్లను పిలవనున్నారు. ఈ నెలాఖరున మొదలుపెట్టే గ్రామసభల ద్వారా అర్హుల లెక్క తేలే అవకాశముంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న ఇళ్ల యూనిట్ కాస్ట్ ఎక్కువగా ఉన్నందున జిల్లాల్లో నిర్మించే ఇళ్ల విస్తీర్ణాన్ని తగ్గించాలని యోచిస్తోం ది. 425 చదరపు అడుగుల మేర ఉండేలా చూడాలని భావిస్తోంది. దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.