భారత్-పాక్ దోస్తీ బస్సు పునరుద్ధరణ
లాహోర్: భారత్-పాక్ దోస్తీ బస్సును బుధవారం పునరుద్ధరించారు. తమను ఓబీసీల్లో చేర్చాలంటూ జాట్లు చేపట్టిన ఆందోళన హరియాణాలో హింసాత్మకం కావడంతో 21న ఆ బస్సును రద్దు చేశారు. పరిస్థితులు కుదుటపడడంతో 21 మంది ప్రయాణికులతో కూడిన బస్సు లాహోర్ నుండి ఢిల్లీకి బయలుదేరిందని పాక్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ తెలిపారు. మరోవైపు సంఝౌతా ఎక్స్ప్రెస్ రైలును గురువారం నుండి పునరుద్ధరిస్తున్నట్లు పాక్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.