Indukuri Ramakrishnam Raju
-
భార్య టీడీపీ.. నేను వైఎస్సార్సీపీలోనే...
విజయనగరం: భార్య టీడీపీలో చేరితే తనను ఎమ్మెల్సీ పదవిలో నుంచి తొలగించడం అన్యాయమని ఇందుకూరి రఘరాజు అన్నారు. ఏ తప్పు చేయకున్నా శాసనమండలి చైర్మన్ తనను అన్యాయంగా పదవీచ్యుతుడిని చేశారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. విజయనగరంలోని ఓ హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ముందు రోజు నాలుగో నోటీసు ఇచ్చి డిస్మిస్ చేశారని, గతంలో మూడు నోటీసులు వచ్చిన సందర్భంలో పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదని ముందుగా స్పందించలేదన్నారు. షెడ్యూల్ 10 కింద డిస్మిస్ చేసినట్టు నోటీసులు ఇచ్చారని, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం నేనేమీ పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేదన్నారు. ఎస్.కోట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చేసిన వ్యవహారాలు నచ్చక పోవడంతో పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. తను ఏ పార్టీలో చేరలేదని, ఏ పార్టీ కోసం పని చేయలేదన్నారు. భార్య ఇందుకూరి సుబ్బలక్ష్మి (సుధారాజు) టీడీపీలో చేరారని, టీడీపీ వాళ్లతో నేను టచ్‌లో ఉన్నానని కారణాలు చూపి సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. నోటీసులు జారీ చేసిన సమయంలో కొన్ని కారణాల వల్ల హాజరుకాలేక సమయం కోరినప్పటికీ తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. తనకు పదవులు అంటే ఆసక్తి లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తనను పిలిచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, ఇప్పటికీ తను వైఎస్సార్సీపీలోనే ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి తనను బాధించిందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఎస్.కోట నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేశానని చెప్పారు. -
రఘురాజుపై అనర్హత వేటుకు రంగం సిద్ధం
ఈ చిత్రం చూశారా? టికెట్ పంచాయితీ ముగిసిన తర్వాత లోకేశ్‌తో గొంప కృష్ణ సహా ఎస్.కోట టీడీపీ నాయకులంతా ఫోజు ఇచ్చిన ఫొటో ఇది. అప్పటివరకూ అంతా తానై నడిపించిన రఘురాజు మాత్రం ఆ ఫొటోలో కనిపించకుండా దాగుండిపోయారు. ధైర్యం ఉంటే వారితో ఫొటో దిగవచ్చు కదా? అలా చేస్తే ఆయన రఘురాజు ఎందుకవుతారని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాజకీయ ద్రోహానికి పాల్పడిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే టీడీపీలోకి ఫిరాయించిన జంగా కృష్ణమూర్తి, సి.రామచంద్రయ్య, జనసేన పార్టీలోకి జంప్ చేసిన వంశీకృష్ణ యాదవ్‌పై శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు వేటు వేశారు. వాళ్లంతా బాహాటంగానే ఫిరాయించారు. వారికి భిన్నంగా తెరచాటు, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న రఘురాజు గుట్టు ఆలస్యంగానైనా వెలుగులోకి వచ్చింది. లోకేశ్ సహా టీడీపీ నాయకులతో అంటకాగుతున్న వ్యవహారం, వారితో కుమ్మకై ఎస్.కోటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును, విశాఖ లోక్‌సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఓడించేందుకు పన్నిన కుతంత్రాలు తేటతెల్లమయ్యాయి. ఈ నేపథ్యంలో రఘురాజుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో వైఎస్సార్సీపీ విప్ పాలవలస విక్రాంత్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 27న రావాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు తాఖీదులు పంపినా రఘురాజు డుమ్మా కొట్టేశారు. ఈనెల 31న ఆఖరిసారిగా మరో అవకాశం ఇస్తున్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్నవారంతా శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన మండల స్థాయి నాయకులు. వారి మధ్యలో కూర్చున్న వ్యక్తి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు. వారు వెళ్లింది ఏదో ప్రజాప్రయోజన కార్యక్రమం కోసం కాదు సుమీ... టీడీపీ టికెట్ కోసం పోటీపడిన కోళ్ల లలితకుమారి, గొంప కృష్ణ మధ్య సంధి కోసం! గత మార్చి నెలలో లోకేశ్‌ను కలిసేందుకు ఆయన ఇంట్లో వేచివున్న సదరు నాయకుల చిత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదవులిచ్చిన పారీ్టకే ద్రోహం... శృంగవరపుకోట నియోజకవర్గంలో టీడీపీ టికెట్ దక్కించుకున్న కోళ్ల లలితకుమారికి వ్యతిరేకంగా గళమెత్తిన గొంప కృష్ణ నోరుమూయించిన వ్యవహారం వెనుక పెద్ద తతంగమే నడిచింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... గత మార్చి నెలాఖరులో గొంప కృష్ణను, ఆయన అనుచరులను నారా లోకేశ్ హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకున్నారు. అక్కడ జరిగిన టికెట్ పంచాయితీకి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వెళ్లడం అప్పట్లో సంచలనమైంది. కాకపోతే ఆ భేటీ ఫొటోలేవీ అప్పట్లో బయటకు రాకపోవడంతో తాను ఇంకా వైఎస్సార్సీపీలోనే ఉన్నానంటూ రఘురాజు నటించారు. తెరవెనుక మాత్రం టీడీపీ మేలు కోసం విశ్వప్రయత్నాలు చేశారు. అప్పటికే ఎస్.కోట మండల వైస్ ఎంపీపీ పదవికి రాజీనామా చేయకుండానే తన భార్య ఇందుకూరి సుబ్బలక్ష్మి అలియాస్ సుధారాజును టీడీపీలోకి పంపించారు. లోకేశ్‌తో పచ్చ కండువా వేయించారు. బడ్డువరలోని స్వగృహంలో టీడీపీ సమావేశాలన్నీ పెడుతూనే అవేవీ తనకు సంబంధం లేదని బుకాయిస్తూ వచ్చారు. భార్య, భర్త వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పేమిటని, మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉండవచ్చా? అంటూ సుధారాజు ఘాటు వ్యాఖ్యలు చేసినా ఆయన ఖండించలేదు. రాజకీయంగా అండదండలు అందించిన బొత్సపైనే విమర్శలు చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అంత స్థాయి లేకపోయినా ఇచ్చిన మాట కోసం సామాజిక సమీకరణలనూ పక్కనబెట్టి ఎమ్మెల్సీని చేసిన వైఎస్సార్సీపీకే ద్రోహం చేసిన వ్యక్తి నుంచి అంతకన్నా ఏమీ ఆశించలేమని పార్టీ శ్రేణులు నివ్వెరపోయారు. ఎంత వారించినా తెగింపే... వాస్తవానికి పార్టీకి నష్టం చేసే పనులు చేయొద్దని, వారి రాజకీయాలకు ఇబ్బందేమీ ఉండదని రఘురాజు దంపతులకు వైఎస్సార్సీపీ అధిష్టానం నచ్చజెప్పి చేసింది. ఎంత వారించినా ‘స్థానికత’ ముసుగులో పార్టీకి ద్రోహం చేయడానికి తెగించారు. ఈ కుతంత్రంలోకి ఎస్ కోట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు కొందరినీ లాగేందుకు విఫలయత్నం చేశారు. ఎమ్మెల్సీ మూణ్నాళ్ల ముచ్చటే... ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం ఒక పార్టీ తరఫున చట్టసభల్లో అడుగుపెట్టిన వ్యక్తి తర్వాత సదరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం–1985 ప్రకారం అనర్హత వేటు పడుతుంది. ఈ ప్రకారం వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టిన రఘురాజు ఇప్పుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, అతనిపై చర్యలు తీసుకోవాలని అతనిపై ఫిర్యాదు దాఖలైంది. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు నోటీసులు పంపించారు. ఈ నెల 31న రఘురాజు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది. పారీ్టకి ద్రోహం చేసినట్లు వచ్చిన ఆరోపణలు రుజువైతే ఎన్నికల కమిషన్ అనుమతితో రఘురాజు సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. ∙ కోళ్ల’కు కాటు తప్పదా? వైఎస్సార్సీపీకి ద్రోహం చేసి టీడీపీ కోసం పనిచేస్తున్న రఘురాజు దంపతులతో తనకు మేలు జరుగుతుందని టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి భావిస్తున్నారు. కానీ లోకేశ్ సమక్షంలో జరిగిన పంచాయితీ గురించి తెలిస్తే ఆమె గుండె పగిలిపోవడం ఖాయమని టీడీపీ నాయకులే గుసగుసలాడుతున్నారు. తన భార్యను ఏదిఏమైనా సరే ఎమ్మెల్యే చేయాలన్నదే రఘురాజు జీవిత ఆశయమట! కడుబండి శ్రీనివాసరావును తప్పిస్తే ఆమెకే వైఎస్సార్సీపీ టికెట్ ఇప్పించాలని చేసిన ప్రయత్నాలే ఫలించలేదు. దీంతో టీడీపీని ఆశ్రయించారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్సీ చొరవతో లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన దామచర్ల సత్యకు చేరువయ్యారు. గత ఎన్నికల్లో రఘురాజు పోటీచేసి 30 వేల పైచిలుకు ఓట్లు సాధించారని, ఆయనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని దామచర్ల సత్యనారా లోకేశ్‌కు చెప్పారట! దీంతో రఘురాజుతో కలిసి వైఎస్సార్సీపీపై కుట్రకు టీడీపీ నాయకులు సిద్ధమైపోయారు. ఇందుకోసం కోళ్ల లలితకుమారికి తెలియకుండానే వారిమధ్య చీకటి ఒప్పందం కుదిరింది. 2029 నాటికి నియోజకవర్గ పునరి్వభజన ద్వారా ఎస్.కోట రెండు నియోజకవర్గాలు అవుతుందని, వాటిలో ఒక టికెట్ గొంప కృష్ణకు, రెండో నియోజకవర్గంలో టికెట్ రఘురాజు భార్య సుబ్బలక్ష్మికి ఇస్తామని లోకేశ్ గట్టి హామీ ఇచ్చారట! ఇద్దరికీ రెండూ ఇచ్చేస్తే మరి కోళ్ల లలితకుమారి పరిస్థితి ఏమిటనేదీ ఆగమ్యగోచరమే. చేరదీసిన గురువుకే పంగనామాలు పెట్టడంలో సిద్ధహస్తులైనవారి వెన్నుపోటు ఆమెకు కూడా తప్పేలా లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఆయన పేరులో ‘రాజు’ ఉన్నా.. తీరు మాత్రం ...
ఆయన పేరులో ‘రాజు’ ఉన్నా.. తీరు మాత్రం నీచం. నమ్మిన వారికే వెన్నుపోటు పొడుస్తారు. ప్రజల మధ్య చిచ్చుపెడతారు. నిత్యం కుటిల రాజకీయాలు నెరపుతూ వివాదాలకు కేంద్రబిందువవుతారు. ఆ ప్రాంత అభివృద్ధికి అవరోధం కలిగిస్తారు. అనునిత్యం అహంకారధోరణి ప్రదర్శించే ఆయనను ఏ పల్లె నమ్మదు. చివరకు ఏ పార్టీ కూడా శాశ్వతంగా ఇముడ్చుకోదు. ఆయన రాజకీయ ప్రస్థానం ఆది నుంచీ అంతే అంటూ కొన్ని ఘటనలను ఎస్.కోట వాసులు ప్రస్తావించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: శృంగవరపుకోట జెడ్పీటీసీ సభ్యుడిగా 2001–06 కాలంలో ఇందుకూరి రఘురాజు రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అదే సమయంలో బొత్స ఝాన్సీలక్ష్మి విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. సొంత సోదరుడిలా రఘురాజును ఆదరించారు. జిల్లాలో రాజకీయ దురంధరుడైన బొత్స సత్యనారాయణ కూడా అండదండలు అందించారు. ఇదే అదనుగా బొత్స శిష్యుడినంటూ రఘురాజు ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గంలో చక్రం తిప్పారు. స్థాయికి మించి ఎమ్మెల్సీ పదవి పొందేవరకూ వెన్నుదన్నుగా నిలిచిన బొత్స కుటుంబానికే ఇప్పుడు రఘురాజు వెన్నుపోటు పొడిచాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొత్స ఝాన్సీలక్ష్మి ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గం భాగంగా ఉన్న విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న సమయంలో తన భార్య సుబ్బలక్ష్మిని, అనుచర గణాన్ని టీడీపీలోకి పంపించేసిన వైనం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ తరహా తిరుగుబాటు ధోరణి కొత్తేమీ కాదని, గత రెండు దశాబ్దాలుగా ఎస్.కోట నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరున్నా వారికి సున్నం పెట్టడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత డప్పు.. తాను ఏ పారీ్టలో ఉన్నా తనది పార్టీ లైన్ (విధానం) కాదని, తనదంతా సొంత స్టైల్ అని ఇందుకూరి రఘురాజు ఎంతో గర్వంగా తరచూ వల్లిస్తుంటారు. శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎవ్వరు ఎమ్మెల్యేగా ఉన్నా, ఎవ్వరు అక్కడ అభ్యర్థులుగా ఉన్నా వారిని తన గుప్పెట్లో ఉంచుకోవాలనే ఆరాటం నిలువెల్లా కనిపిస్తూ ఉంటుంది. తన మాటల గారఢీకి లొంగకపోతే ఇక బెదిరింపుల పర్వం మొదలవుతుంది. ఇదే విధానంతో తన స్వగ్రామం బొడ్డవరతో పాటు పెద్దఖండేపల్లి, కిల్తంపాలెం, ముషిడిపాలెం గ్రామస్తులనూ శాసిస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. ప్రతిచోట రెండు వర్గాలుగా విడగొట్టి, అందులో ఒకరికి కొమ్ముకాస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటారనేది జగమెరిగిన సత్యం. రఘురాజు ఆధిపత్య ధోరణి, వెన్నుపోటు, దు్రష్పచారంతో ఇబ్బందిపడిన పార్టీ నాయకులు ఎందరో ఉన్నారు. శెట్టి గంగాధరస్వామి: గతంలో ఎస్టీ రిజర్వుర్డు నియోజకవర్గమైన ఎస్.కోట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థగా 1994, 1999 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేశారు. అంతకుముందు అనంతగిరి మండలంలో గిరిజనుల నాయకుడిగా, ఎంపీపీగా పనిచేశారు. ఈ రెండు దఫాలు ఓడిపోయినా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చురుగ్గా ఉండేవారు. 2001 సంవత్సరంలో ఎస్.కోట జెడ్పీటీసీగా రాజకీయాల్లోకి వచ్చిన రఘురాజుకు కొద్దిరోజుల్లోనే శెట్టి గంగాధర స్వామి ఎందుకో నచ్చలేదు. అడుగడుగునా ఆయన్ను ఇబ్బందిపెడుతూనే ఉండేవారు. ఇదెంతవరకూ వెళ్లిందంటే 2004 సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి పోటీచేయడానికి సిద్ధమైన గంగాధరస్వామికి ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ టిక్కెట్ దక్కకుండా చేశారు. అల్లు కేశవ వెంకట జోగినాయుడు: నియోజకవర్గాల పునరి్వభజన తర్వాత ఎస్.కోట జనరల్ నియోజకవర్గం అయ్యింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అల్లు కేశవ వెంకట జోగినాయుడుకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఇది రఘురాజుకు నచ్చలేదు. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాట్లాడినా వినలేదు. స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి ఓడిపోవడమే గాక జోగినాయుడు ఎన్నికగాకుండా దెబ్బతీశారు. ఫలితంగా టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి గట్టెక్కింది. ఫలితంగా నియోజకవర్గం అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రఘురాజుకే సీటు ఇచ్చింది. కానీ రెండోసారి కూడా ఓటమి తప్పలేదు. కుంభా రవిబాబు: శెట్టి గంగాధరస్వామికి గాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కుంభా రవిబాబుకు కాంగ్రెస్ అధిష్టానం 2004 ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది. గెలిచిన ఏడాది వరకూ రవిబాబు, రఘురాజు మధ్య సంబంధాలు బాగానే ఉండేవి. తర్వాత రఘురాజు ఎప్పటిలాగే ఆధిపత్యధోరణి, అహంకారం ప్రదర్శించడం మొదలెట్టారు. రవిబాబు పదవీకాలమంతా రఘురాజు తిరుగుబాటును ఎదుర్కోవడానికే సరిపోయింది. 2009 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అసలు రవిబాబు పనితీరు బాగోలేదని ఫిర్యాదు చేయడానికి రెండు బస్సుల్లో అనుచరులను రఘురాజు తీసుకెళ్లడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కడుబండి శ్రీనివాసరావు: రఘురాజు 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైఎస్సార్సీపీలో చేరారు. కానీ వైఎస్సార్సీపీ అధిష్టానం ఎస్.కోట టికెట్‌ను కడుబండి శ్రీనివాసరావుకు ఇచ్చింది. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభంజనంలో కడుబండి శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారిపై ఘన విజయం సాధించారు. కానీ రఘురాజు తనకు ప్రాబల్యం ఉందని చెప్పుకుంటున్న నాలుగు గ్రామ పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. అయినప్పటికీ రఘురాజుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి చట్టసభలో కూర్చోబెట్టింది. ఎమ్మెల్యే కడుబండి కూడా నియోజకవర్గంలో ఎవ్వరికీ ఇవ్వనంత ప్రాధాన్యం అతనికి ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అతను చెప్పిన అభ్యర్థులకే పార్టీ నుంచి మద్దతు పలికారు. ఇలా ఎంత గౌరవం ఇచ్చినా మళ్లీ అతనిలో ఆధిపత్య ధోరణి బయటకు వచ్చింది. కడుబండిని మార్చేయాలంటూ ఏకంగా ఉద్యమమే ప్రారంభించారు. తీరా కడుబండి శ్రీనివాసరావుకే మళ్లీ టికెట్ ఖరారు చేయడంతో తెరచాటు యుద్ధానికి తెరలేపారు. భార్య సుబ్బలక్షి్మని, కొంతమంది అనుచర గణాన్ని టీడీపీలోకి పంపించారు. ఈ ద్వంద్వ వైఖరిపై నియోజకవర్గం అంతా విమర్శలు వెల్లువెత్తడంతో రఘురాజు వర్గం దిద్దుబాటు చర్యలకు దిగింది. టీడీపీలో చేరిక వ్యవహారం రఘురాజుకు తెలియదని, ఆయనకు చెప్పకుండానే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లామని చెప్పడం కొసమెరుపు. -
ప్రజల పక్షాన పోరాడుతాం
రావులపాలెం, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తూ బలమైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేస్తారని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, క్రమశిక్షణ సంఘం రాష్ట్ర చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు ప్రజలకు భరోసా ఇచ్చారు. సోమవారం రావులపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కొత్తపేట నియోజకవర్గ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కుడిపూడి చిట్టబ్బాయి, ఇందుకూరి రామకృష్ణంరాజు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డి, తదితర నాయకులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు అమలు సాధ్యం కాని హామీలతో అన్ని పార్టీ నాయకులను కలుపుకుని పోటీ చేస్తే ఆ గాలిని తట్టుకుని జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచిన ఏకైక నాయకుడు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అని గుర్తు చేశారు. జగ్గిరెడ్డి విజయం ప్రజా విజయమన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కూటమి నేతలు చేస్తున్న దాడులను ఎదుర్కొనేందుకు గెలిచిన నాయకులతోపాటు స్థానికంగా ఉన్న నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనరెడ్డి చంద్రబాబులా ఆచరణ సాధ్యం కాని రైతు రుణ మాఫీ హామీ ఇచ్చి ఉంటే అధికారంలోకి వచ్చేవారమని, కానీ ప్రాణం పోయినా ప్రజలకు ఇచ్చిన మాట తప్పే నైజం తమ నాయకుడిది కాదన్నారు.చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా నిలదీస్తూ ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో జగ్గిరెడ్డి విజయం పార్టీకి ఆక్సిజన్ వంటిదని పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల సమస్యలపై జగ్గిరెడ్డి పోరాటం చేస్తూ ప్రజలకు అండగా ఉంటారని జిల్లా అధికార ప్రతినిధి మిండగుదిటి మోహన్ పేర్కొన్నారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఇది వైఎస్సార్ సీపీ ప్రతి కార్యకర్త గెలుపు అన్నారు. తనకు ఈ విజయం అందించిన ప్రజల రుణం తీర్చుకోడానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధులు పీకే రావు, గొల్లపల్లి డేవిడ్‌రాజు, సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధరరావు, ఇండస్ట్రియల్ విభా గం కన్వీనర్ మం తెన రవిరాజు, రావులపాలెం, ఆత్రేయపురం జెడ్పీటీసీ సభ్యులు సాకా ప్రసన్నకుమార్, మద్దూరి సుబ్బలక్ష్మి, ముత్యాల వీరభద్రరావు, నాతి అనురాగమయి పాల్గొన్నారు. -
సీటు రాకుంటే అమ్మేసుకున్నట్టా?
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీటు వస్తే ఎమ్మెల్యే అయిపోతామనే నమ్మకంతో ఉండి.. తీరా సీటు రాకపోయేసరికి అమ్మేసుకుంటున్నారని విమర్శలు చేయడం వారి ఆవివేకాన్ని తెలియజేస్తోందని పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు విమర్శించారు. సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం నార్కెడమిల్లిలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమసుందరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తనను కలసిన విలేకర్లతో ఇందుకూరి మాట్లాడుతూ, జగన్మోహన్రెడ్డి సీటు ఇస్తే ఎమ్మెల్యే అయిపోదామనే భావనలో ఉన్నవారికి అవకాశాలు రాకపోవడంతో చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడైన బుచ్చిమహేశ్వరరావు సీట్లు బేరం పెడుతున్నారనడాన్ని రామకృష్ణంరాజు తీవ్రంగా ఖండించారు. బుచ్చిమహేశ్వరరావు అమలాపురం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఆశించగా, జగన్మోహన్రెడ్డి అతనికి టిక్కెట్టు ఇస్తామని ఏ నాడూ చెప్పని విషయం ఆయనకు తెలియంది కాదని చెప్పారు. తాను చైర్మన్‌గా ఉన్న క్రమశిక్షణ కమిటీలో సభ్యుడైన బుచ్చిమహేశ్వరరావు ఎంపీ టిక్కెట్టు ఇవ్వకపోవడం, ఎమ్మెల్యే సీటు బాబూరావుకు ఇస్తున్నారని తెలియజేయగా, సమర్థత, స్థానిక పరిస్థితుల ఆధారంగా కేటాయిస్తున్న విషయం తెలియచేసి భవిష్యత్‌లో జగన్మోహన్రెడ్డి సముచితస్థానం కల్పిస్తారని చెప్పానన్నారు. సరేనన్న బుచ్చిమహేశ్వరరావు ఇంతలోనే అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. ఆయన వెనుక జగన్మోహన్రెడ్డి అంటే గిట్టని పార్టీల నాయకులు ఉండి అలా మాట్లాడించినట్టుగా ఉందన్నారు. ఒక్కో నియోజకవర్గంలో నలుగురైదుగురు ఆశావహులు టిక్కెట్లు ఆశిస్తుండగా, అందరికీ సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండదనే విషయం రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి తెలియంది కాదన్నారు. ఆ నలుగురైదుగురిలో ఒకరికి కేటాయిస్తే మిగిలినవారు తమ భవిష్యత్ కోల్పోతామనే బాధతో పార్టీపైనా, జగన్మోహన్రెడ్డిపైనా అవాకులు, చవాకులు పేలడం వారి దిగజారుడుతనాన్ని చెప్పకనే చెపుతోం దని రామకృష్ణంరాజు విమర్శించారు. సమర్థులు, స్థానిక పరిస్థితులు, సామాజిక సమతూకాల ఆధారంగానే సీట్లపై జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు.