Industrial Revolution
-
మానసిక ఆరోగ్యంతోనే అభివృద్ధి
మానవ సమాజంలో పని అనేది ఒక అంత ర్భాగం. మానవుడు ఆహా రం కోసం చేసే వెదుకు లాట/ వేట మొట్టమొదటి పనిగా చెప్తారు. 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం పని గంటలు, పని ‘సంస్కృతి’లో అనేక మార్పులు తీసుకువచ్చింది. పరిశ్రమలు, కార్మికులు కలసి ఒక సంస్థాగత వ్యవస్థగా ఏర్ప డ్డారు. టెక్నాలజీ అభివృద్ధి చెందడం, ఇంటర్నెట్ ప్రవేశంతో కొత్తకొత్త ఉద్యోగాల రూపకల్పన జరగడం ప్రారంభమయింది. యాంత్రికీకరణ, కృత్రిమ మేధ అభివృద్ధితో ఇది మరింత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక మనిషి తన జీవిత కాలంలో సుమారుగా తొంభైవేల నుండి ఒక లక్ష గంటల పాటు పని ప్రదేశంలోఉంటాడని అంచనా. అంటే యుక్త వయసు నుండి రిటైరయ్యే వరకు ఉన్న జీవిత కాలంలో ఇది సుమారు మూడు వంతుల సమయం. ఒక ఉద్యోగస్థుడు తన సహ చరులతో ఇంతకాలం గడపడం వలన వారితో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకుంటాడు. ఈ బంధాలు, పనిచేసే వాతావరణం, యాజమాన్యంతో ఉండే సంబంధం... ఇవన్నీ ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని చాలావరకు ప్రభావితం చేస్తాయి. కనుకనే ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ‘పని చేసే ప్రదేశంలో మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి’ అనే నినాదంతో ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపు కుంటోంది. పని ప్రదేశాల్లో ఒత్తిడి అనేది అత్యంత సహజ మైన విషయం. అయితే ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే పలు రకాల శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ఒక సర్వే ప్రకారం ప్రతీ పదిమందిలో ఎనిమిది మంది ఏదో ఒక రకమైన ఒత్తిడిని ఎదు ర్కొంటున్నట్లు తేలింది. ప్రతి నలుగురిలో ఒకరు చికిత్స అవసరం అయిన మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలా బాధపడే వారిలో కేవలం నలభై శాతం మంది మాత్రమే సరైన వైద్య సహాయం పొందుతున్నారు. అయితే ఇది ఉద్యోగి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం ద్వారా ఉత్పాదకతను కూడా తగ్గిస్తుంది. ఇది మిగిలిన ఉద్యోగుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ఉద్యోగితో పాటుగా యాజమాన్యాలు / సంస్థలు తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద తగిన జాగ్రత్తలు తీసు కోవలసిన అవసరం ఉంది. సరైన సమయపాలన పాటించడం, ఒత్తిడికి గురైనపుడు సహచరుల, యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళి సహాయం పొందడం; పనికి, వ్యక్తిగత జీవితానికి హద్దులు పెట్టుకొని కొంత సమయం తనకోసం మాత్రమే కేటాయించుకోవడం, వారాంతాల్లో కుటుంబ సభ్యులతో సమయం గడపడం, పనిలో అప్పుడప్పుడు కొంత విరామం తీసుకోవడం లాంటివి చేయడం ద్వారా ఉద్యోగి ఒత్తిడిని కొంత వరకు తగ్గించవచ్చు. విభిన్న షిఫ్ట్ సిస్టవ్ులో పనిచేసే దంపతులు కలిసి ఉండే సమయం తక్కువ అవడంవల్ల కలిసి క్వాలిటీ టైవ్‌ు గడిపే అవకాశాలు సన్నగిల్లి వీరి మధ్య కొన్ని మనస్పర్థలు, అనుమా నాలు తలెత్తే అవకాశముంది. సమర్థంగా పనిచేసే వారిని యాజమాన్యం ఎప్పటికప్పుడు ప్రోత్సహించి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల వీరిలో మానసిక స్థైర్యం పెంపొందుతుంది. మహిళా ఉద్యోగులు, ఒకవైపు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ; మరోవైపు ఉద్యోగ బాధ్యతల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. అలాంటి వారి ఎడల సంస్థలు కొన్ని వెసులుబాట్లు ఇస్తే, వీరు ఒత్తిడికి లోను కాకుండా ఉండగలరు. కంపెనీలు కూడా ఈ మధ్య కాలంలో ‘వర్క్ ఫ్రమ్ హోవ్‌ు’ను ప్రోత్సహించడం వలన ఉద్యో గుల్లో ఉత్పాదకత పెరిగినట్లు గణాంకాలు చెబు తున్నాయి. ప్రతి సంస్థ అర్హత కలిగిన మానసిక వైద్యులు లేదా క్లినికల్ సైకాలజిస్టుల సేవలు తమ ఉద్యోగులకు కల్పించాలి. యోగా, ధ్యానం, ఒత్తిడి గురించి వర్క్‌షాప్స్ వంటి కార్యక్రమాలు తరచుగా తమ సంస్థల్లో జరిగేలా ఏర్పాట్లు చేయాలి. ఒక క్రమ పద్ధతిలో నైపుణ్య పరీక్షలు జరిపి అర్హులైన వారికి ఇంక్రిమెంట్లు, పదోన్న తులు, ఇతర వసతులు కల్పించడం ద్వారా ఉద్యోగస్థుల్లో సంతృప్తి శాతాన్ని పెంచవచ్చు. ఎప్పుడైతే ఉద్యోగస్థులు తమ పనిపట్ల తృప్తితో ఉంటారో వారు మరింత పాజిటివ్ ధృక్పథంతో, సంస్థ అభివృద్ధికి కృషిచేస్తారు. వారు మిగిలిన వారికి ఒక మంచి ఉదాహరణగా నిలిచి, ఒక చక్కని పని సంస్కృతి అనేది సంస్థలో అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని సంస్థలు పని ప్రదేశాల్లో ఉద్యోగుల, కార్మికుల మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. జీవితంలోగాని,వృత్తిలో గాని విజయం సాధించాలంటే మనసును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోవడమనేది చాలా ముఖ్యమని అందరూ గుర్తించాలి. డా‘‘ ఇండ్ల రామసుబ్బారెడ్డి వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్యనిపుణులు(రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
2023.. అత్యంత వేడి సంవత్సరం !
దుబాయ్: నెల రోజుల్లో ముగిసిపోనున్న 2023 ఏడాది.. చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కనుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) గురువారం నివేదించింది. నివేదిక తాలూకు వివరాలు నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. పారిశ్రామిక విప్లవం ముందునాటి కాలంతో పోలిస్తే ఈ ఏడాది 1.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగిందని డబ్ల్యూఎంఓ ప్రధాన కార్యదర్శి పిటేరీ టాలస్ చెప్పారు. ‘‘ఈ ఏడాది తొలినాళ్లలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితర జలాలు వేడెక్కి సంభవించిన ‘ఎల్‌నినో’ పరిస్థితి కారణంగా వచ్చే ఏడాది సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రి సెల్సియస్‌ను దాటనుంది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే నాలుగేళ్లు 1.5 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యే వీలుంది. ఆ తర్వాత దశాబ్దంలో ఇది సర్వసాధారణ స్థితిగా నిలిచిపోయే ప్రమాదముంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. -
అత్యంత ‘వేడి’ సంవత్సరం ఏదంటే..! ఆ నివేదిక ఏం చెబుతోంది?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. పారిశ్రామిక విప్లవ కాలం(1850–1900) ముందు నాటి ఉష్ణోగ్రత కంటే 2022లో ప్రపంచ ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యింది. 2022 సంవత్సరం ఇప్పటిదాకా ఆరో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుకెక్కిందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) వెల్లడించింది. ఈ మేరకు ‘స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్–2022’ నివేదికను శుక్రవారం విడుదల చేసింది. నివేదికలో ఏం వెల్లడించారంటే.. ► 2015 నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తద్వారా కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు పెరిగాయి. ఈ గ్రీన్‌హౌజ్ వాయువులు 2021లో రికార్డు స్థాయిలో వెలువడ్డాయి. ► అంటార్కిటికాలో, యూరప్‌ల్లో హిమానీనదాలు కరిగిపోతున్నాయి. ► 2013 నుంచి 2022 దాకా సముద్రాల నీటిమట్టం ప్రతిఏటా సగటున 4.62 మిల్లీమీటర్ల చొప్పున పెరిగింది. 1993– 2022 మధ్య రెట్టింపైంది. ► 2022లో అధిక ఉష్ణోగ్రతల వల్ల భారత్‌లో పంటల ఉత్పత్తి పడిపోయింది. పలు రాష్ట్రాల్లో అడవుల్లో కార్చిచ్చు వ్యాప్తించింది. ► పంటల ఉత్పత్తి పడిపోవడం, అదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభం కావడంతో భారత్ నుంచి గోధుమలు, బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించాల్సి వచ్చింది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బందులు తీవ్ర ఎదుర్కొన్నాయి. ► వాతావరణ మార్పుల వల్ల భారత్‌లో గతేడాది వరదలు కొండ చరియలు విరిగిపడడం వల్ల 700 మంది మరణించారు. వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 900 మంది బలయ్యారు. ► అస్సాంలో వరదల వల్ల 6.63 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ళీ గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలు పెరుగుతున్న కొద్దీ వాతావరణంలో ప్రతికూల మార్పులు కొనసాగుతూనే ఉంటాయని, అవి భూగోళంపై మానవళికి ముప్పుగా పరిణమిస్తాయని డబ్ల్యూఎంఓ సెక్రెటరీ జనరల్ ప్రొఫెసర్ పెటిరీ తలాస్ చెప్పారు. ► కరువు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను తట్టుకొనే శక్తి ప్రపంచంలో 100కుపైగా దేశాలకు ఏమాత్రం లేదని అధ్యయనంతో తేలింది. -
COP27: 2015–2022.. ఎనిమిదేళ్లు అత్యంత వేడి
న్యూఢిల్లీ: పారిశ్రామిక విప్లవం (1850–1900) కంటే ముందునాటి సగటు ఉష్ణోగ్రత కంటే 2022లో అంతర్జాతీయంగా ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉండనుందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) వెల్లడించింది. ఫలితంగా 2015 నుంచి 2022 దాకా.. ఎనిమిదేళ్లు ‘అత్యంత వేడి’ సంవత్సరాలుగా రికార్డుకెక్కుతాయని తెలియజేసింది. ఈజిప్ట్‌లో జరుగుతున్న కాప్–27 సదస్సు సందర్భంగా ఆదివారం ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. 1993 నుంచి ఇప్పటిదాకా సముద్ర నీటి మట్టం రేటు రెండింతలు పెరిగిందని వెల్లడించింది. 2022 సంవత్సరం ఐదు లేదా ఆరో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులో చేరుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వివరించింది. -
ఆ సత్తా భారత్ సొంతం
కేవడియా(గుజరాత్): ప్రపంచ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారత్ ముందుండి నడిపించగలదని, ఆ సామర్థ్యం భారత్ సొంతమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని కేవడియాలో జరుగుతున్న ఇండస్ట్రీ 4.0 అనే సదస్సునుద్దేశిస్తూ ప్రధాని మోదీ వర్చువల్‌గా ఒక సందేశం పంపారు. అందులోని సారాంశం ఆయన మాటల్లోనే.. ‘ అధునాతన సాంకేతికత ఆలంబనగా నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలవ్వాలి. సృజనాత్మక ఆలోచనలతోనే ఇది సాధ్యం. వేర్వేరు కారణాల వల్ల గత పారిశ్రామిక విప్లవాల్లో భారత్ భాగస్వామి కాలేకపోయింది. ఇండస్ట్రీ 4.0కు సారథ్యం వహించే సుధృఢ లక్షణాలు దేశానికి ఉన్నాయి. యువజనాభా, డిమాండ్, స్వేచ్ఛాయుత వాణిజ్యానికి బాటలుపరిచే కేంద్ర ప్రభుత్వం సమష్టిగా దీన్ని సుసాధ్యంచేయగలవు. ప్రపంచ వస్తు గొలుసు వ్యవస్థలో భారత్ కీలక భూమిక పోషించేలా చేయగల సమర్థత దేశీయ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలకు ఉంది. ఇందుకోసం సంస్కరణలు తెస్తూ, రాయితీల తోడ్పాటు అందిస్తూ అధునాతన సాంకేతికతను సంతరించుకున్న ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషిచేస్తున్నాం’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘3డీ ప్రింటింగ్, మెషీన్ లెర్నింగ్, డేటా అనలైటిక్స్, ఎల్ఓటీ వంటి రంగాల్లో పారిశ్రామికాభివృద్ధితో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ వృద్ధిచెందుతోంది’ అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే కార్యక్రమంలో అన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుజరాత్ కోసం 75 , కర్ణాటక కోసం 100 ఈవీ బస్సులను ప్రారంభించారు. పుణెలోని ఇండస్ట్రీ 4.0(సీ4ఐ4) ల్యాబ్‌నూ మొదలుపెట్టారు. స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్‌పై భారీ పరిశ్రమల శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. పర్యావరణహిత అభివృద్ధిని భారత్ చాటిచెప్పింది పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థికాభివృద్ధిని భారత్ సాధిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు భారత్ ‘వైల్డ్‌లైఫ్ వీక్’ను పాటిస్తోంది. ఈ మేరకు దేశ ప్రజలకు మోదీ హిందీలో గురువారం ఇచ్చిన సందేశాన్ని కేంద్ర పర్యావరణశాఖ శుక్రవారం ట్వీట్ చేసింది. ఆ సందేశంలో మోదీ ఏం చెప్పారంటే.. ‘పరిశ్రమలతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యం. అయితే, పరిశ్రమలతో పర్యావరణానికి ముప్పు పొంచి ఉంటుంది. కానీ, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లకుండానే ఆర్థికాభివృద్ధి దిశగా పయనించడమెలాగో ప్రపంచానికి భారత్ సాధించి చూపింది. సరైన విధానపర నిర్ణయాలు, అమలుతోనే ఇది సాకారమైంది. తోటి జీవాల పట్ల, జీవావరణం, జీవ వైవిధ్యం మీద మనిషి మరింత దృష్టిసారించాలి. భారత్ గడిచిన ఎనిమిదేళ్లలో కొత్తగా 259 స్థలాలను అభయారణ్యాలుగా గుర్తించి సంరక్షణ బాధ్యతలు తీసుకుంది. పులుల సంఖ్యను రెట్టింపు చేసుకుంటూ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంకంటే ముందే చేరుకున్నాం. ఆసియా సింహాలు, గజరాజుల సంఖ్యా పెరుగుతోంది’ అని అన్నారు. -
పారిశ్రామిక దిగ్గజాల చూపు ‘ఇండస్ట్రీ ఫ్రెండ్ ఆంధ్రప్రదేశ్’ వైపు
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక విప్లవం గురించి మును ముందు చర్చించుకోవలసి వస్తే 2019కి ముందు.. ఆ తర్వాత అని చెప్పుకోవలసి వస్తుంది. ఎందుకంటే 2019 తర్వాతనే ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులు ఊపందుకున్నాయి. ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా పచ్చపత్రికలు ఎన్ని కుళ్లు రాతలు రాసినా దత్తపుత్రులు ఎంత రోతగా ఏడ్చినా రాష్ట్రం పారిశ్రామికంగా పరుగులు పెడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ప్రపంచవ్యాప్తంగా సానుకూల వాతావరణం ఉన్నా పెట్టుబడులు అంతంత మాత్రంగానే ఉండేవి. కానీ 2019లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా వంటి సంక్షోభాలు ఆర్ధిక వ్యవస్థలను తల్లకిందులు చేసిన ప్రతికూల పరిస్థితుల్లోనూ పారిశ్రామిక పెట్టుబడులు చంద్రబాబు హయాంలో కన్నా ఎక్కువగా వచ్చాయి. పారదర్శకమైన విధానాలు, లంచాలకు ఆస్కారం లేని పర్యవేక్షణలు ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. వరుసగా మూడో ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఇండస్ట్రియల్ స్టేట్‌గా రూపాంతరం చెందింది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు ఇపుడు ఏపీ వైపే చూస్తున్నారు. కొత్త పరిశ్రమలు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్‌ను మించిన అనువైన వేదిక పారదర్శకమైన పారిశ్రామిక విధానాలు ఇంకెక్కడా లేవని వారు భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు కల్పిస్తోన్న సదుపాయాలు ఇస్తోన్న ప్రోత్సాహకాలతో అందరిలోనూ విశ్వాసం పెరిగింది. పరిశ్రమలకు అత్యంత అనువైన విధానాలు ఉన్నాయి కాబట్టే ఆంధ్ర ప్రదేశ్ వరుసగా మూడో ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే నంబర్ వన్‌గా కొనసాగుతోంది. పారిశ్రామిక వేత్తలు ఏపీలో సంతోషంగా ఉన్నారనడానికి ఇదే తిరుగులేని నిదర్శనం. ఇంతగా రాష్ట్రం దూసుకు పోతుంటే.. ప్రతిపక్ష తెలుగుదేశం, దానికి వంత పాడే కొన్ని మీడియా సంస్థలు మాత్రం రోజూ ప్రభుత్వంపై బురద జల్లుతూ కాలక్షేపం చేస్తున్నాయి. పరిశ్రమల స్థాపన మొదలుకుని ఉత్పత్తి సాధించే వరకు ప్రతీదశలోనూ ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న పారిశ్రామిక విధానాలు పారదర్శకంగా ఉండడమే కాకుండా ప్రోత్సాహ కరంగా ఉంటున్నాయని పారిశ్రామిక వేత్తలు భావిస్తున్నారు. అందుకే ఏపీపై దిగ్గజాలకు నమ్మకం కుదిరింది. గతంలో ఎన్నడూ ఏపీ వైపు చూడని పారిశ్రామిక వేత్తలు ఇపుడు ఏపీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే 2019 నుండి ఇప్పటి వరకు ఏపీలో పెట్టుబడులు ఏటా పెరుగుతూ వస్తున్నాయి. కరోనా సంక్షోభం ప్రపంచం మొత్తాన్ని చావుదెబ్బతీసిన గడ్డుకాలంలోనూ ఏపీలో పెట్టుబడులు ఆశాజనకంగానే ఉండడం అందుకు నిదర్శనం. గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోల్చి చూస్తే వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోందంటున్నారు నిపుణులు. కొత్తగా పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి. దాంతో ఆ ఉద్యోగుల ఇళ్లల్లో జీవితాలు బాగుపడుతాయి. ఆ క్రమంలో గ్రామాలకు గ్రామాలు వెలుగుతాయి. అంతిమంగా ప్రభుత్వానికి ఆదాయమూ పెరుగుతుంది. మూడేళ్లుగా ఈ ఆర్ధిక సూత్రాన్ని అనుసరించే ఆంధ్ర ప్రదేశ్ గ్రోత్ రేట్ అద్భుతంగా పెరుగుతూ వచ్చి ఇపుడు దేశంలోనే అగ్రగామిగా ఉంది ఏపీ. తాజాగా 11.43శాతం గ్రోత్ రేట్ తో ఏపీ నంబర్ వన్ గా నిలిచి దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే ప్రతిపక్ష టీడీపీ మాత్రం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రావడం లేదని ఉన్న పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయని విష ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అయితే అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. ఈ విషయాన్ని తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సాక్ష్యాధారాలతో సహా ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోన్న తీరును వివరించారు. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటిని దక్కించుకోడానికి దేశంలోని 17 రాష్ట్రాలు పోటీలు పడ్డాయి. వాటిలో ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, హిమాచల ప్రదేశ్ రాష్ట్రాలు వాటిని దక్కించుకున్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఏపీలోని ప్రతిపక్షం ఏపీకి ఆ పార్కు వద్దే వద్దు అంటూ ఏకంగా కేంద్రానికి లేఖలు రాసింది. చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేత శాసన మండలిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్వయంగా తన లెటర్ హెడ్‌పై కేంద్రానికి లేఖలు రాసి అడ్డంగా దొరికిపోయారు. టీడీపీ నేతలు చెప్పే సాకులు ఏంటంటే డ్రగ్ పార్క్ వస్తే కాలుష్యం పెరుగుతుంది కాబట్టి అడ్డుకున్నామని కథలు మొదలెట్టారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే కాకినాడలో దివీస్ ఫార్మా కంపెనీని దగ్గరుండి పెట్టే కార్యక్రమం చేశారు చంద్రబాబు. ఒక పక్క ఇలా అసత్య ప్రచారం చేస్తోన్న తెలుగుదేశం మరో పక్క ఏపీకి వచ్చే పరిశ్రమలను రానీయకుండా అడ్డుకోడానికి విఫల యత్నాలు కుట్రలు చేస్తోంది. ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా పచ్చపత్రికలు ఎన్ని కుళ్లు రాతలు రాసినా దత్తపుత్రులు ఎంత రోతగా ఏడ్చినా రాష్ట్రం పారిశ్రామికంగా పరుగులు పెడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పనలోనూ స్థూల జాతీయోత్పత్తిలోనూ కూడా చంద్రబాబు పాలనలో కన్నా ఇపుడే ఆంధ్రప్రదేశ్ అద్భుత ఫలితాలు సాధిస్తోందని ఆయన అంటున్నారు. పరిశ్రమల స్థాపన ఒక ఎత్తు అయితే వచ్చే పరిశ్రమలకు సరిపడ మానవ వనరులను సిద్దం చేయడం మరో ఎత్తు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఏ కొత్త పరిశ్రమ వచ్చినా స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని నిబంధన పెట్టారు. అందుకు అనుగుణంగా ఆ 75 శాతం ఉద్యోగాలను భర్తీ చేయడానికి వీలుగా యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అంటున్నారు సీఎం జగన్. అందుకోసం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీలను పెట్టడంతో పాటు అన్ని నియోజకవర్గాలను అనుబంధంగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక పక్క భారీ పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూనే మరో పక్క సూక్ష్మ చిన్న మధ్య తరహా తయారీ సంస్థలపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఒకప్పుడు పరిశ్రమ పెట్టడానికి ఎవరైనా వస్తే మాకేంటి అని అడిగే సంస్కృతి ఉండేదని.. దానికి చరమగీతం పాడడం వల్లనే ఇపుడు పరిశ్రమలు తరలి వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. -
CM YS Jagan: విప్లవం సృష్టిస్తున్నాం
సాక్షి, కడప/బద్వేలు/గోపవరం/అట్లూరు: వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక విప్లవం సృష్టిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా సుమారు 75 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. రాయలసీమ రూపురేఖలు మారుతాయని స్పష్టం చేశారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా తొలిరోజు గురువారం ఆయన ప్రొద్దుటూరు, గోపవరం, కొప్పర్తిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తొలుత రూ.515.90 కోట్లతో ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత గోపవరం మండలంలో రూ.800 కోట్లతో ఏర్పాటు చేయనున్న సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. సాయంత్రం కడప సమీపంలోని కొప్పర్తిలో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎంఐహెచ్), వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, పలు కంపెనీల ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 540 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్, మరో 3,167 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ రెండింటిలో రూ.1,580 కోట్లతో వసతులు కల్పిస్తున్నామన్నారు. రోడ్లు, విద్యుత్ సరఫరా, ఫ్యాక్టరీ షెడ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇక్కడ నిర్మించిన నాలుగు షెడ్లలో ఇప్పటికే ఈఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ సంస్థ ఏర్పాటైందని, ఏప్రిల్ నాటికి 1800 మందికి ఉపాధి కల్పిస్తుందని స్పష్టం చేశారు. 50 మంది అక్క చెల్లెమ్మలకు జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చామని, వాళ్లంతా శిక్షణ పూర్తయ్యాక ఇక్కడే పని చేస్తారని చెప్పారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. మరెన్నో సంస్థలు ► మరో ఆరు ఎలక్ట్రానిక్ సంస్థలు గ్రౌండ్ బ్రేకింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మొదటిది ఈఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్. రెండవది డిజికాన్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ. మూడవది సెలకాన్ రెజుల్యూట్ సంస్థ. నాలుగవది చంద్రహాస్ ఎంటర్ప్రైజెస్, ఐదవది యూటీఎస్‌పీఎల్. ఆరవది డిక్సన్ రెండవ ప్లాంట్. ► ఈ ఆరు సంస్థలు దాదాపు రూ.600 కోట్ల పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించాం. ఈ పరిశ్రమల ద్వారా ఆరు నుంచి తొమ్మిది నెలల్లో దాదాపు 7,500 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ► వీవీడీఎన్ అనే మరో సంస్థ కూడా ఇక్కడ రూ.365 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది. ఈ ఒక్క సంస్థ ద్వారానే 6,400 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆరు నుంచి తొమ్మిది నెలల్లోనే ఇది కార్యరూపం దాలుస్తుంది. బ్లాక్ పెప్పర్, హార్మోనిసిటీ అనే మరో రెండు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఐఏటీ డివైజ్‌లు, ట్యాబ్లెట్స్ తయారీ ఈ పార్కులోనే జరగబోతోంది. కార్బన్ మెగా టౌన్షిప్ మాస్టర్ ప్లాన్‌ను సీఎంకు వివరిస్తున్న కంపెనీ ప్రతినిధులు రాయలసీమ రూపురేఖలు మార్చేలా.. ► వీవీడీఎన్ సంస్థ 5జీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, బిగ్‌డేటా, ఎనలిటిక్, ఒరిజినల్ డిజైన్, మ్యానిఫ్యాక్చరింగ్ చేయబోతోంది. ఇదే పార్కులో మరో 18 ఎంఎస్ఎంఈల ప్రారంభానికి కూడా శిలాఫలకాలు వేస్తున్నాం. ► రాయలసీమ ఎన్విరాన్‌కేర్, బీఎస్ ల్యాబొరేటరీ, స్వర్ణముఖి కాంక్రీట్ రూ.84 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. వీటి ద్వారా మరో 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిన తర్వాత ఇక్కడ 75 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ► చదువుకున్న మన పిల్లలకు మన జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు రావాలని, మొత్తం రాయలసీమ ప్రాంతానికి మంచి జరుగుతుందని అడుగులు ముందుకు వేస్తున్నాం. ఒకవైపు కొప్పర్తి, మరొకవైపు నెల్లూరు, చిత్తూరు సరిహద్దుల్లోని శ్రీసిటీ.. రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు ఉపయోగపడతాయి. వీటి వల్ల ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా. మీ అందరికీ అందుబాటులో ఉంటాం ► ఎలక్ట్రానిక్స్ ఎంఎస్ఎంఈ రంగంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు కొప్పర్తిని ఎంచుకున్నందుకు పారిశ్రామిక వేత్తలందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ మద్దతుగా ఉంటూ అన్ని విధాలా సహకారం అందిస్తాం. పరిశ్రమలు ఇక్కడికి రావడానికి పరిశ్రమల శాఖ నుంచి సుబ్రమణ్యం, నందకుమార్, జయలక్ష్మి చాలా కృషి చేశారు. వీరంతా మీకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ► సీఎంఓ నుంచి సోలోమన్ కూడా మీతో ప్రారంభం నుంచి సంప్రదింపులు చేస్తున్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది, కష్టం వచ్చినా ఒక్క ఫోన్‌కాల్ ద్వారా అందుబాటులో ఉంటాం. పరిశ్రమలు ఏర్పాటు చేసిన వారికి ఇస్తామని చెప్పిన ఇన్సెంటివ్స్ ఇచ్చాం. పారిశ్రామిక వేత్తలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ఇన్సెంటివ్‌ల గురించి పదేపదే చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రజలు సెంచురీ ఫ్లై వుడ్‌తో 6 వేల మందికి ఉపాధి ► వెనుకబడిన ప్రాంతమైన బద్వేలు నియోజకవర్గంలోని గోపవరంలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమతో యువతకు ఉపాధి, రైతుల ప్లాంటేషన్‌కు గిట్టుబాటు ధర లభిస్తుంది. దేశంలోనే అతి పెద్దదైన వుడ్ పరిశ్రమ బద్వేలులో ఏర్పాటు చేయడం చాలా సంతోషించ దగ్గ విషయం. ► దీంతో ప్రత్యక్షంగా రెండు వేల మందికి, పరోక్షంగా నాలుగు వేల మందికి ఉపాధి దొరుకుతుంది. వైఎస్సార్, ప్రకాశం, నెల్లూరు జిల్లా రైతులు సాగు చేస్తున్న సుబాబుల్ కర్రలకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. వ్యవసాయ హబ్‌తో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశముంది. తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగు పడతాయి. ► రైతులు సైతం తమ భూములు ఇచ్చి పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావడం గొప్ప విషయం. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సెంచురీ ఫ్లై బోర్డ్స్ లిమిటెడ్ (పీసీఐఎల్) యాజమానులు సజ్జన్ భజాంక, సంజయ్ అగర్వాల్‌కు కృతజ్ఞతలు. ► బద్వేలు నియోజకవర్గంలో ఇప్పటికే రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు ప్రస్తుతం రూ.6 కోట్లతో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేశాం. కాశినాయన మండల కేంద్రంలో నూతనంగా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో బద్వేలు ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుంది. లక్షాధికారులుగా రైతులు ► గోపవరం జాయింట్ ఫార్మింగ్ కో ఆపరేటివ్ సోసైటీ ప్రాజెక్టు భూముల్లో కొంత భాగాన్ని వ్యవసాయ–పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు తీసుకున్నారు. ఇందులో లీజు ద్వారా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ప్రస్తుతం రెండు ఎకరాల వంతున 201 మందికి పట్టాలు అందజేశారు. ► ఈ సందర్భంగా పట్టాలు అందుకున్న ఎస్సీ రైతులు దేవదాసు, మాతంగి పుట్టి, రవీంద్రబాబు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు పెద్ద పీట వేశారని సంతోషం వ్యక్తం చేశారు. భారీ పరిశ్రమకు సమీపంలో తమకు రెండు ఎకరాలకు పట్టా ఇచ్చి లక్షాధికారులుగా చేస్తున్నారన్నారు. ► ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజద్‌బాష, మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, శాసన మండలి వైస్ ఛైర్మన్ జకియాఖానం, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సీఎం విజన్‌తోనే ముందుకు వచ్చాం సీఎం వైఎస్ జగన్ గొప్ప దార్శనికత కలిగిన నాయకుడు. మేము మొదట సెంచురీ ప్లై్లౖవుడ్ కంపెనీని తమిళనాడు లేదా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకున్నాం. అయితే సీఎం జగన్ మమ్మల్ని ఒప్పించి, అనువైన ప్రాంతాన్ని చూపించి అన్ని రకాలుగా అండగా నిలుస్తుండటంతో గోపవరంలో ఏర్పాటు చేస్తున్నాం. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,600 కోట్లు కాగా, మొదటి విడతలో రూ.800 కోట్లు పెడుతున్నాం. ప్రత్యక్షంగా 2 వేలమందికి, పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి లభిస్తుంది. రైతులకు కనీసం 50 శాతం ఆదాయం పెరిగే అవకాశముంది.మొదటి దశలో ఎండీఎఫ్ వుడ్స్ తయారీ పరిశ్రమను రూ.600 కోట్లతో, లామినేటెడ్ వుడ్స్ పరిశ్రమను రూ.200 కోట్లతో చేపడతాం. ఎండీఎఫ్ను 18 నెలల్లో, లామినేటెడ్ వుడ్స్‌ను 15 నెలల్లో పూర్తి చేస్తాం. రెండో విడతలో రూ.200 కోట్లతో ప్లైవుడ్స్, రూ.600 కోట్లతో పార్టికల్ బోర్డ్ వ్యాపారాన్ని చేపడతాం. ఇవి 2024 డిసెంబర్ నాటికి పూర్తవుతాయి. – సజ్జన్ భజాంక, సంజయ్ అగర్వాల్, సెంచురీ ప్లైవుడ్ కంపెనీ యజమానులు -
Andhra Pradesh: పారిశ్రామిక విప్లవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ పారిశ్రామిక విప్లవం దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక గతిని మార్చేసేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన రెండు భారీ పారిశ్రామిక పార్కుల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏపీ మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ సకాలంలో పారిశ్రామిక పార్కులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో అభివృద్ధి చేసిన వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎంఐహెచ్), 801 ఎకరాల్లో అభివృద్ధి చేసిన వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)లను ఈ నెల 23న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్ ద్వారా రూ.25,000 కోట్ల భారీ పెట్టుబడులు 75,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. వైఎస్సార్ ఈఎంసీ ద్వారా రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 25,000 మందికి ఉపాధి కల్పించనుంది. గరువారం వైఎస్సార్ ఈఎంసీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. డిక్సన్ సంస్థకు తొలి దశలో అభివృద్ధి చేసిన నాలుగు షెడ్లను అందించనున్నారు. కొప్పర్తి డిక్సన్ యూనిట్లో పని చేయడానికి తీసుకున్న ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేస్తారు. కీలక ఒప్పందాలు ► ఈఎంసీలో డిక్సన్ సంస్థ రూ.127 కోట్ల పెట్టుబడితో హెచ్ఏసీ కెమెరా, ఐపీ కెమెరా, డీవీఆర్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్ ద్వారా 1,800 మందికి ఉపాధి లభించనుంది. డిక్సన్ రూ.80 కోట్ల పెట్టుబడితో ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్లెట్స్ తయారీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్ ద్వారా మరో 1,100 మందికి ఉపాధి లభించనుంది. ► వీటితో పాటు ఫాక్స్‌కాన్, డీజీకార్న్, రెసల్యూట్, ఆస్ట్రమ్ వంటి పలు సంస్థలతో పెట్టుబడుల ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకోనుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా తైవాన్‌కు చెందిన ప్రభుత్వ రంగ ప్రమోషన్స్ ఏజెన్సీ, రష్యాకు చెందిన ఏజెన్సీ, మన దేశంలోని ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ అసోసియేషన్స్ (ఐఈఎస్ఏ)లతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ► వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్‌లో ఏర్పాటైన 18 ఫార్మా, సిమెంట్, పెయింట్స్ తయారీకి చెందిన యూనిట్లను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ 18 యూనిట్ల ద్వారా మరో 2,000 మందికి ఉపాధి లభిస్తుంది. ► వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్‌లో రూ.401 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పిట్టి రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కు ఎకరం రూ.10 లక్షలు చొప్పున 117.85 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఈ యూనిట్ ద్వారా మరో 2,000 మందికి ఉపాధి లభించనుంది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలోని వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ముఖద్వారం రెండు భారీ యూనిట్లకు శంకుస్థాపన ► రెండు పారిశ్రామిక పార్కుల ప్రారంభోత్సవంతో పాటు మరో రెండు భారీ యూనిట్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేయనున్నారు. బద్వేల్ వద్ద రూ.956 కోట్ల పెట్టుబడితో సెంచురీ ప్లైబోర్డ్ ఇండియా లిమిటెడ్ యూనిట్ పనులకు డిసెంబర్ 23 ఉదయం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ► ఈ యూనిట్ ద్వారా 2,266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించడంతోపాటు రైతులకు ప్రయోజనం కలగనుంది. సుమారు 22,500 ఎకరాల్లో సాగు చేసిన రూ.315 కోట్ల విలువైన యూకలిప్టస్ చెట్లను ఈ సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేయనుంది. ► పులివెందులలో రూ.110 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ యూనిట్ పనులకు డిసెంబర్ 24న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ యూనిట్ ద్వారా 2,122 మందికి ఉపాధి లభించనుండగా అందులో అత్యధికంగా మహిళలకు అవకాశం రానుంది. 23న ప్రారంభించే కంపెనీలివే.. స్వర్ణముఖి కాంక్రీట్స్, శ్రీ దుర్గా సిమెంట్స్, ఫిలెమన్ లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్, అవన్ని ఆర్గానిక్స్, రాయలసీమ ఎన్విరాన్ కేర్, బీఎస్ ల్యాబొరేటరీస్, యునోటెక్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ గణేష్ శానిటేషన్, ఎస్ పెయింట్స్ మాన్యుఫాక్చరర్స్, అక్షర నోట్‌బుక్ అండ్ బైండింగ్ ఇండస్ట్రీ, ఆర్డీఎల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుమిత్ర ల్యాబ్స్, మణి కెమ్ ఫార్మా, శ్రీ లక్ష్మి మేఘన ఎంటర్ప్రైజెస్, ఎస్ఎన్ఆర్ ఫార్మా, శ్రీ లక్ష్మీ బయో ఆర్గానిక్స్, ఒబ్లి ఇండస్ట్రీస్, స్టార్ పేపర్ బోర్డ్స్. -
డిజిటల్ విప్లవానికి భారత్ సారథ్యం
న్యూఢిల్లీ: తొలి మూడు పారిశ్రామిక విప్లవాలను అందుకోలేకపోయినప్పటికీ జియో ఊతంతో నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ సారథ్యం వహించగలిగే అవకాశం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వెల్లడించారు. పుష్కలమైన ఐటీ సామర్థ్యాలు, అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, చౌక స్మార్ట్ డివైజ్‌ల కలయిక ఇందుకు దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ సారథ్యం వహించేందుకు కావల్సిన సరంజామాను సమకూర్చే ఉద్దేశంతోనే జియో రూపకల్పన జరిగిందని అంబానీ చెప్పారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వరల్డ్ సిరీస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ‘దేశం ఎదుర్కొంటున్న డేటా కష్టాలకు ముగింపు పలకాలని, డిజిటల్ విప్లవాన్ని తేవాలని లక్ష్యంగా పెట్టుకుని జియో ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా అత్యంత వేగవంతంగా, విస్తృతంగా కవరేజీ ఇచ్చే ప్రపంచ స్థాయి డిజిటల్ నెట్‌వర్క్‌ను మేం నిర్మించాం‘ అని అంబానీ చెప్పారు. 2జీ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు దేశీ టెలికం రంగానికి 25 ఏళ్లు పడితే... తాము కేవలం మూడేళ్లలోనే సొంత 4జీ నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నామని తెలిపారు. ‘నేడు భారత్‌లో డేటా వినియోగం ప్రతి నెలా 6 ఎక్సాబైట్ల పైగా ఉంటోంది. జియో రావడానికి పూర్వం.. నాలుగేళ్ల క్రితం నాటి పరిస్థితులతో పోలిస్తే ఇది 30 రెట్లు ఎక్కువ. మొబైల్ డేటా వినియోగానికి సంబంధించి కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే భారత్ 155వ ర్యాంకు నుంచి అగ్రస్థానానికి చేరింది‘ అని అంబానీ చెప్పారు. తద్వారా అధునానత టెక్నాలజీలను అమలు చేసేందుకు భారత్ ఇంకా సిద్ధంగా లేదన్న అపోహలను జియో పటాపంచలు చేసిందన్నారు. -
త్వరలో పారిశ్రామిక విప్లవం
సాక్షి, హిందూపురం(అనంతపురం): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానంతో పారిశ్రామిక విప్లవం వస్తోందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్‌భార్గవ్ అన్నారు. శుక్రవారం హిందూపురంలోని సప్తగిరి కళాశాలలో పరిశ్రమలశాఖ కమిషనర్ సుబ్రమణ్యం అధ్యక్షతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ‘పరిశ్రమస్థాపన–సులభతరమైన అనుమతులు’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో రజత్‌భార్గవ్ మాట్లాడారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమల్లో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందుకోసం ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యాన్ని యువతకు కల్పించేందుకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యం ఉద్యోగులు అందించబోతున్నామన్నారు. రాష్ట్రంలో 1,16,000 చిన్న తరహా క్టస్టర్లుండగా వాటి అభివృద్ధికి ప్రభుత్వం రూ.4 వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తోందన్నారు. రానున్న ఐదేళ్లకాలంలో రాష్ట్రంలో 13 పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఒక్కో పరిశ్రమలో 10వేల నుంచి 12వేల మందికి ఉద్యోగాలు దక్కుతాయన్నారు. ఇక పరిశ్రమల పేరుతో భూములు తీసుకుని ఇంతవరకూ పరిశ్రమలు ఏర్పాటు చేయని వారి నుంచి భూములు వెనక్కు తీసుకుంటామన్నారు. దేశానికే మనం ఆదర్శం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని రజత్ భార్గవ్ వివరించారు. అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించారన్నారు. త్వరలోనే వైజాగ్–చైన్నె, బెంగళూరు–చెన్నై కారిడర్లు వస్తున్నాయని, ఇందులో ఎనిమిది క్లస్టర్లు ఉంటాయని చెప్పారు. బెంగళూరు–చెన్నై కారిడార్‌లో ఉన్న హిందూపురం క్లస్టర్లు మార్కెటింగ్ అభివృద్ధికి వచ్చే ఏడాది రూ.1,500 నుంచి రూ. 2 వేల కోట్ల నిధులు కేటాయింపులు ఉంటాయన్నారు. అలాగే పరిశ్రమలకు అనుకులంగా జిల్లాలో విమానాశ్రయాల నుంచి రవాణా సౌకర్యాలు పెంచుతున్నామన్నారు. కర్నూలు ఎయిర్‌పోర్టును మరో ఏడాదిలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనుకూలం కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, పరిశ్రమలు నెలకొల్పడానికి జిల్లాలో అవసరమైన భూములతో పాటు గొల్లపల్లి, హంద్రీనీవా ద్వారా నీటిసదుపాయం ఉందన్నారు. అలాగే మానవ వనరులు కూడా అధికంగా ఉన్నాయన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని, అందువల్లే సింగిల్ డెస్క్ ద్వారా వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం తరఫున అందించాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు. జిల్లాలో రూ.8 వేల కోట్ల పెట్టుబడితో 48 ప్రముఖ కంపెనీలు 36 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అయితే ఇంకా వృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ, ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు రాష్ట్ర ప్రభుత్వం టాప్ ప్రియారీటి ఇస్తోందని, అన్ని శాఖలను కలవాల్సిన పనిలేకుండా ఆన్లైన్ ద్వారా అన్ని అనుమతులు సులభతరంగా మంజురు అయ్యేలా రూపకల్పన చేసిందన్నారు. అనంతరం పర్యావరణ హితం కోసం రూపొందించిన క్యారీ ఏ బ్యాగ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం తూమకుంట పారిశ్రామికవాడలోని పరిశ్రమలను పరిశీలించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ జాహ్నవి, సబ్ కలెక్టర్ నిశాంతి, స్పెషల్ ఆఫీసర్ సుదర్శనబాబు, సమాచార శాఖ ఏడీ జయమ్మ, తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నాలుగో పారిశ్రామిక విప్లవానికి కేంద్రం... భారత్
న్యూఢిల్లీ: భారత్‌ను నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రానికి వేదికగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఎంచుకుంది. ఈ కేంద్రాన్ని ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ప్రభుత్వం, వ్యాపార సంస్థలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి నూతన టెక్నాలజీ విధానాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. ఈ కేంద్రం మహారాష్ట్రలో ఏర్పాటు కానుంది. డ్రోన్లు, కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలను తొలి మూడు ప్రాజెక్టులుగా పరిగణనలోకి తీసుకుంది. వీటిలో ముందుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్‌లర్నింగ్, బ్లాక్‌చెయిన్‌పై ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్టు డబ్ల్యూఈఎఫ్ ప్రకటించింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ సహకారంతో, దిగ్గజ వ్యాపార సంస్థలు, విద్యారంగం, స్టార్టప్‌లు, అంతర్జాతీయ సంస్థలతో కలసి నూతన విధానాలను రూపొందించడంతోపాటు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఙానాలకు ప్రోటోకాల్స్ తీసుకురానున్నట్టు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. కేంద్రం తరఫున నీతి ఆయోగ్ ఈ భాగస్వామ్యాన్ని సమన్వయపరుస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలతో డబ్ల్యూఈఎఫ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. మరిన్ని రాష్ట్రాలతోనూ ఈ విధమైన భాగస్వామ్యం రానున్న రోజుల్లో ఉంటుందని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. ‘‘ఏ విధంగా మనం తయారు చేస్తాం, ఏ విధంగా వినియోగించుకుంటాం, ఏ విధంగా సంప్రదింపులు చేస్తాం, ఏ విధంగా జీవిస్తామన్న దాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవం మార్చివేయనుంది’’ అని డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లౌస్ష్వాబ్ తెలిపారు. ఈ విప్లవంతో మరిన్ని ఉద్యోగాలు: ప్రధాని నాలుగో పారిశ్రామిక విప్లవం ఉద్యోగాల స్వరూపాన్ని మార్చేస్తుందని, మరిన్ని ఉపాధి అవకాశాలు అందివస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టెక్నాలజీ అభివృద్ధితో ఉద్యోగాలు పోతాయన్న భయాలను తేలికపరిచే ప్రయత్నం చేశారు. నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. నాలుగో పారిశ్రామిక విప్లవ ఫలాలను పొందేందుకు విధానాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ‘‘మన వైవిధ్యం, జనాభా సంఖ్య పరంగా సానుకూలత, వేగంగా వృద్ధి చెందే మార్కెట్, డిజిటల్ మౌలిక సదుపాయాలు అనేవి పరిశోధన, అమలు విషయంలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చగలిగే సామర్థ్యాలున్నవి’’ అని పేర్కొన్నారు. గత పారిశ్రామిక విప్లవాల్లో భారత్ పాల్గొనలేకపోయినందున, నాలుగో పారిశ్రామిక విప్లవంతో భారత్ పాత్ర ఆశ్చర్యకరమైన రీతిలో ఉంటుందని చెప్పారు. ‘‘మొదటి రెండు పారిశ్రామిక విప్లవాల సమయంలో భారత్ స్వతంత్ర దేశం కాదు. మూడో పారిశ్రామిక విప్లవం సందర్భంలో స్వాతంత్య్రం కారణంగా వచ్చిన సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ఉంది’’ అని ప్రధాని వివరించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చెయిన్, బిగ్‌డేటా అనేవి భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళతాయన్నారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ... దేశంలో టెలీ సాంద్రత 93 శాతానికి చేరిందని, 50 కోట్ల మంది మొబైల్స్ వాడుతున్నారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కువగా డేటా వినియోగించే దేశం మనదని, అదే సమయంలో చౌక రేట్లున్నాయన్నారు. దేశంలో 120 కోట్ల మందికి ఆధార్ ఉందని, 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు ఆప్టిక్ ఫైబర్ అనుసంధానత త్వరలోనే పూర్తవుతుందన్నారు. -
పారిశ్రామిక విప్లవం 4.0
► రేపటి నుంచి భారత సాంకేతిక సదస్సు ► బెంగళూరు వేదికగా శాస్త్రవేత్తల సమావేశం ► పారిశ్రామిక, వ్యవసాయరంగాలపై చర్చలు సాక్షి ప్రత్యేక ప్రతినిధి, బెంగళూరు: భారత్‌ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడమే లక్ష్యంగా రేపటి నుంచి రెండు రోజులపాటు బెంగళూరులో ‘ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్–2017’ నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు 2013లో తొలిసారి బెంగళూరులోనే మొదలైంది. ప్రపంచ దేశాలు నాలుగో పారిశ్రామిక విప్లవంవైపు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ఏడాది ‘పారిశ్రామిక విప్లవం 4.0’ పేరుతో కీలక సదస్సు నిర్వహిస్తున్నారు. దీనికి ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్(ఐటీసీ) చైర్మన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎల్.వి. మురళీకృష్ణారెడ్డి అధ్యక్షత వహిస్తారు. భారత్ పారిశ్రామిక రంగంలో దూసుకెళ్లేందుకు 10 అంశాలు కీలకమని భావించిన నిర్వాహకులు కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సిస్టమ్ ఇంజనీరింగ్ తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు. నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ సదస్సులో అమెరికా, స్విట్జర్లాండ్ తదితర దేశాలకు చెందిన ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు హాజరై డెమోలు ఇస్తారు. ఇస్రో సాధించిన విజయాలపైనా ప్రత్యేక చర్చ ఉంటుంది. వెయ్యి మంది పారిశ్రామికరంగ ప్రతినిధులు, ఇంజనీరింగ్ కాలేజీల ప్రొఫెసర్లు, విద్యార్థులు, ప్రభుత్వరంగ నిపుణులూ పాల్గొంటారు. వ్యవసాయరంగంపై ప్రత్యేక సదస్సు సదస్సులో భాగంగా వ్యవసాయంపై 200 మందితో వర్క్‌షాపు నిర్వహిస్తున్నారు. ఇక్రిశాట్, నాబార్డ్ ప్రతినిధులు పాల్గొననున్న ఈ వర్క్‌షాపులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తులు, కూలీలు, సాగులో జాగ్రత్తలపై చర్చలు జరుపుతారు. ఇటీవల శాస్త్రసాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన విజయాలు, సాధించాల్సిన అంశాలపై 48 స్టాళ్లతో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. భారత రక్షణ పరిశోధన–అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో), ఓఎన్జీసీ, ఐబీఎం, ఇక్రిశాట్, ఇస్రో సంస్థల ప్రతినిధులు కొత్త టెక్నాలజీ అంశాలను వివరిస్తారు. ఎఫ్ఈఈ(ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌లెన్సీ), డబ్ల్యూఏఈ(వరల్డ్ అకాడమీ ఆఫ్ ఇంజనీర్స్), ఏఐఎంఓ(ఆలిండియా మాన్యుఫాక్చరర్స్ ఆర్గనైజేషన్), ఏఎస్ఎంఈ (అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్), ఐఐపీఈ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంజనీర్స్) ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నారు. ఐఐపీఈ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఉడే. పి.కృష్ణా, బెంగళూరు ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎం.అన్నాదొరై, అగ్రిటెక్ చైర్మన్ డాక్టర్ ఎస్.అయ్యప్పన్, ఐటీసీ నేషనల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఆర్.ఎం. వాసగమ్, కర్ణాటక వ్యవసాయ, ఉద్యానవన శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.మహేశ్వరరావు తదితర ప్రతినిధులు హాజరుకానున్నారు. దేశాభివృద్ధికి దోహదం సాంకేతిక రంగ నిపుణులకు ఈ సదస్సు చక్కని వేదిక. పరిశోధన, సాంకేతిక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులపై చర్చలు జరుగుతాయి. సదస్సు మన దేశా భివృద్ధికి దోహదపడు తుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగసంస్థలకు, విద్యార్థులకూ ప్రయోజనం ఉంటుంది. – డాక్టర్ ఎల్.వి. మురళీకృష్ణారెడ్డి, ఐటీసీ చైర్మన్ -
పాలనారంగ కాణాచి సీఎస్
అభిప్రాయం పాలనా పరంగా సొంత తమ్ముడిని కూడా జైలుపాలుచేసిన నిజాయితీకి పూర్వ ఐసీఎస్ అధికారి సీఎస్ రామచంద్రన్ మారుపేరు. దేశ పారిశ్రామిక విధానంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. స్వాతంత్య్రానికి పూర్వం, ఆ తర్వాత భారతీయ పాలనారంగంలో ఎనలేని సేవలందించిన సివిల్ సర్వెం ట్‌గా, మానవతావాదిగా, ఆధ్యాత్మికవాదిగా, దేశానికి వన్నె తెచ్చిన వ్యక్తి సీఎస్ఆర్. డిసెంబర్ 13, 2016న సాయంత్రం జరిగే దివంగత సీఎస్ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా 102 ఏళ్లు పైబడిన వీకే రావుగా ప్రసిద్ధులైన వల్లూరి కామేశ్వరరావు (1937 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ (ఇండియన్ సివిల్ సర్వీస్) ఐసీఎస్ అధికారి), సీఎస్‌ఆర్‌పై వారి కూతురు, మాజీ ఐఏఎస్ అధికారిణి, గాయత్రి రామచంద్రన్ రాసిన పుస్తకాన్ని హైదరాబాద్ నగరంలోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో ఆవిష్కరించనున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పూర్వ ఐఏఎస్ అధికారులు ఎం. గోపాలకృష్ణ, ఎస్. పార్థసారథి, టీఎల్ శంకర్, ప్రఖ్యాత వైద్యులు డా. ఏపీ రంగారావు ప్రసంగించనున్నారు. తమిళనాడుకు చెందిన దివంగత సీఎస్ సుబ్రమణియన్, ఐసీఎస్ అధికారి కావలసి ఉన్నప్పటికీ, వామపక్ష భావాల ప్రభావంతో, స్వాతంత్య్ర సమరం జరిగే రోజుల్లో, కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉన్నప్పటికీ, ఉద్యమాలలో పాల్గొనేవారు. ఆ నేపథ్యంలో ఒక పర్యాయం స్వయానా ఆయన తమ్ముడి ఉత్తర్వులకు లోబడి జైలు పాలవ్వటం జరిగింది. ఆ ఉత్తర్వులను జారీ చేసిన వ్యక్తి నాటి హోం సెక్రటరీ (అంతర్గత భద్రతా అధికారి) ఐసీఎస్ అధికారి, దివంగత సీఎస్ రామచంద్రన్ కావటం విశేషం. ఆ విధంగా అన్నదమ్ముల్లో పెద్దవాడైన సీఎస్ సుబ్రమణియన్ ఐసీఎస్ చదవడానికి ఇంగ్లండ్ దేశం వెళ్లినప్పటికీ, మధ్యలోనే ఇండియాకి వచ్చి, నాటి మద్రాసు నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించడానికి, నిర్మాణాత్మకంగా ఎదగడానికి మూల కారణం అయ్యారు. తమ్ముడు సీఎస్ రామచంద్రన్ మాత్రం ఫిజిక్స్‌లో బిఎస్సీ ఆనర్స్ పూర్తి చేశారు. 1940 సివిల్ సర్వీసుల పోటీ పరీక్షకు హాజరై ఉత్తమ శ్రేణిలో సఫలీకృతులయ్యారు. సీఎస్ రామచంద్రన్ ఐసీఎస్‌కు ఎంపికైన తర్వాత అప్పట్లో మధ్య భారత్‌గా పిలువబడే బేరార్-సెంట్రల్ ప్రావిన్సెస్ కేడర్‌కు కేటాయించడంతో, 1942లో అక్కడ ఉద్యోగిగా చేరారు. 1942 నుండి 1948 వరకు సెంట్రల్ ప్రావిన్సిస్‌లో పని చేసి, తరువాత, మద్రాసు ప్రెసిడెన్సీకి కేడర్‌ను బదలాయించుకున్నారు. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో డిప్యుటేషన్‌పైన పనిచేశారు. ఆయన లాల్ బహదూర్‌శాస్త్రి వద్ద కూడా పని చేశారు. శాస్త్రి నిరాడంబరత సీఎస్‌కు ఆదర్శప్రాయమయింది. దేశ పారిశ్రామిక విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావటంలో ఇరువురు కలిసి పనిచేశారు. అందుకే, నేటికీ సీఎస్ గారి సేవలు భారతదేశ పారిశ్రామిక పటిష్టతకు పునాదులు వేయటంలో దోహదపడ్డారుు అని విశ్వసించే వారు లేకపోలేదు. తర్వాత కాలంలో అనేక ప్రముఖ పదవులను భారత ప్రభుత్వంలో చేపట్టిన రామచంద్రన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో అదనపు కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం సలహాదారునిగా, కుటుంబ నియంత్రణ, వైద్యశాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశారు. దేశాన్ని పరిపాలనాపరంగా తీర్చిదిద్దటంలో అందెవేసిన చేరుుగా అంతర్జాతీయంగా కూడా పలు కీలక పదవులు సీఎస్ఆర్కు కట్టబెట్టారు. రామచంద్రన్ ఆధ్యాత్మిక విషయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చేవారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలపై అపారమైన విశ్వాసం ఉండేది. ఈయన కంచి కామకోటి పీఠం పరమాచార్యులు శంకరాచార్యుల వారికి అనుంగు శిష్యులు. కంచి మఠాలు, సంస్థల స్థాపనలో పరిరక్షణలో కాలం గడిపేవారు. ఎన్నో దేవాలయాల స్థాపనలో భాగస్వాముల య్యారు. ఉత్తర భారతదేశంలోని బదరీనాథ్, కేదార్నాథ్ దేవాలయానికి 1977లో అధ్యక్షులుగా నియమించారు. భారతదేశంలో ఆదిశంకరుని సంప్రదాయాలు కొనసాగటంలో బదరీనాథ్, కేదార్నాథ్ దేవాలయాలను ఉన్నత స్థానంలో నిలపటంలో వీరి కృషి ఎనలేనిది. సీఎస్ రామచంద్రన్ ఢిల్లీలోని ‘‘సౌత్ ఇండియన్ సమాజ్’’ అధ్యక్షులుగా దక్షిణ భారతదేశంలోని సాంస్కృతిక సంస్థల అభివృద్ధ్దిలో పాలుపంచుకున్నారు. కేరళ నుంచి ఆంధ్ర వరకు అన్ని సంప్రదాయాల మేలు కలరుుకగా దీనిని తీర్చిదిద్దటంలో సీఎస్ఆర్ సఫలీకృతులయ్యారు. దక్షిణ భారతీయులను ఒక్కతాటిపైకి తెచ్చి సంప్రదాయాల కాణాచిగా తీర్చిదిద్దటంలో వీరిది అందె వేసిన చేయి. (డిసెంబర్ 13, 2016 సాయంత్రం హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో జరగనున్న దివంగత ఐసీఎస్ అధికారి సీఎస్ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలలో.. ఆయన కుమార్తె మాజీ ఐఏఎస్ అధికారిణి, గాయత్రి రామచంద్రన్ తన తండ్రిపై రాసిన పుస్తకావిష్కరణ సందర్భంగా) వనం జ్వాలా నరసింహరావు వ్యాసకర్త తెలంగాణ ముఖ్యమంత్రి పేషీలో ప్రధాన పౌర సంబంధాల అధికారి మొబైల్ : 80081 37012 -
ప్రగతి పేరు, ప్రకృతితో పోరు
పారిశ్రామిక విప్లవానికి ముందు ఈ స్థాయిలో మానవాళి ఎరుగని విధ్వంసానికి అసలు కారణం ఏమిటి? విధ్వంసంలో కూడా ‘ప్రగతినీ/అభివృద్ధి’నీ చూడగల్గినది సామ్రాజ్యవాద -పెట్టుబడి వ్యవస్థ మాత్రమే. ప్రసిద్ధ పర్యావరణ శాస్త్ర పరిశోధకుడు, ఆర్థిక విశ్లేషకుడు బెలామీ ఫాస్టర్ చెప్పినట్టు ‘ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అవతరించినది మొదలు మానవాళికి, ప్రకృతికి మధ్య అంతకుముందు నెలకొని ఉన్న సంప్రదాయ సమతుల్యత కాస్తా తిరిగి పాదుకొల్పడానికి వీలులేనంతగా తారుమారైపోయింది.’ ‘వాదనలు ఎన్నిరకాలైనా వినిపించవచ్చు గాక! కానీ, బహుకొద్దిగానే ఉన్న దేశ అపురూపమైన వనరులనూ, ప్రకృతి వనరులనూ; అంతే స్థాయిలో ఉన్న నిధులనూ అదుపుగా, పొదుపుగా ఆచితూచి వినియోగించుకోగల జీవన శైలికి ప్రభుత్వాలూ, పౌరులూ అలవాటు పడకపోతే భవిష్యత్తు, మనుగడ ప్రశ్నార్థకం కాకతప్పదు.’ - గౌతమ్ భాటియా (ప్రసిద్ధ వాస్తుశాస్త్రవేత్త, శిల్పకారుడు) వాన ఎక్కువైతే రొంపి కరువు, వాన తక్కువైతే వరపు కరువని శతాబ్దాల అనుభవం. తమ అవసరాల కొద్దీ మానవులు, అధికార తాపత్రయంతో ప్రభుత్వాలు అపురూపమైన ప్రకృతి వనరుల మీద శక్తికి మించి ఆధిపత్యం నెలకొల్పడానికి చేస్తున్న ప్రయత్నం ఎంత ఉధృతంగా వికటిస్తుందో ఇంతకు ముందు చూశాం. ఇప్పుడు కూడా చూస్తున్నాం. ప్రత్యక్షంగా అనుభవి స్తున్నాం. గతంలో ఎన్నడూ ఎరుగని ప్రకృతి వైపరీత్యం దూసుకువచ్చి లక్షలాది ప్రాణాలను తోడుకుపోయిన ఉదంతాలు కూడా మన ఇరుగు పొరు గున, ఆసియా ఖండంలోనూ (అండమాన్, తమిళనాడు; ఇండోనీసియా) చూశాం. ఎప్పటివారో తెలియదు కానీ కాకరపర్తి కృష్ణశాస్త్రి ‘ప్రళయ సంరంభం’ శీర్షికతో రాసిన కవితలో సునామీ జలఖడ్గాన్ని స్వయంగా చూశారా అన్న రీతిలో, అనూహ్యమైన శైలితో, ‘భీకర లీల లేచి అతివేల జవం బున వచ్చి/ దుస్సహమై ధరముంచి’ అని రాశారు. ప్రకృతి వైపరీత్యాలకు మారుపేర్లుగా గత కొద్ది సంవత్సరాలుగా అలాంటి భీకర దృశ్యాలు వాతావరణంలో కనిపించి ప్రజలను అతలాకుతలం చేశాయి. ఎల్-నినో (దుర్భిక్షానికి), లా నినో (అతివర్షానికి) మరింత విధ్వంసంతో కూడిన వైపరీ త్యాలుగా నమోదైనాయి. ఇవి రుతువులను తారుమారు చేశాయి. విభజనకు నిరసన అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలను గత రెండువారాలుగా నూరేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో వర్షాలు ముంచెత్తాయి. వేలాది ఎకరాలలో పంటలు నాశనమైనాయి. వానకన్నా ముందు ఆకస్మిక వరదలు వచ్చి (కొన్నేళ్ల నాటి కర్నూలు విధ్వంసం మాదిరిగా) నగరాలను, పట్టణాలను ధ్వంసం చే శాయి. ఇప్పట్లో పూరించలేని స్థాయిలో నష్టం కలిగించాయి. వాణిజ్యం స్తంభించింది. వాతావరణ శాఖ హెచ్చరికలను సైతం అవహేళన చేస్తున్నట్టు ఈ వైపరీత్యం విరుచుకుపడింది. కానీ ఒకటి... గతంలో కన్నా, ప్రస్తుతం ఉన్న మెరుగైన సాంకేతిక వ్యవస్థ చాలావరకు జననష్టాన్ని నివారించడానికి ఆస్కారం కల్పిం చింది. సకాలంలో అప్రమత్తం చేయగల సాంకేతిక వ్యవస్థ ఉన్నప్పటికీ, ముందు చూపులేని నాయకులు మాత్రం సరైన సమయంలో స్పందించ డంలో విఫలమైనారు. పేదలు, బలహీన వర్గాలు, మధ్య తరగతి ప్రతిసారి దారుణంగా నష్టపోతోంది. నిజానికి పాలకుల ఈ తరహా చండితనానికి మరో ప్రధాన కారణం ఉంది. పాలకులకూ కావాలి ఆ స్పృహ పర్యావరణ సమతౌల్యం ఘోరంగా దెబ్బతిన్న ప్రాంతాలలో భారత్ 13వ స్థానంలో ఉన్నదని శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వేలు ఘోషిస్తున్నాయి. సముద్ర గర్భంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం గతంలో విశ్వ వ్యాప్తంగా భూతలం మీద పర్యావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయడానికి తగిన సాక్ష్యాలు దొరికాయని లండన్‌లోని జాతీయ సాగర పరి శోధన కేంద్రం వెల్లడించింది. హిమనదాలుగా నిరంతరం తమ ఉనికిని కాపా డుకునే ధృవప్రాంతాలను ఆవరించి ఉండే ఆర్కిటిక్ ప్రాంత శీతల స్థితి కూడా అదుపు తప్పి, అక్కడ వాతావరణం వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు హెచ్చ రించారు. భూగర్భంలో శీతల స్థితిని అంచనా కట్టేందుకు కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ అంశాలకు పూర్తి స్పృహ పాలకులకు కూడా ఉండాలి. అప్పుడే ప్రకృతి వైపరీత్యాల వేళ స్పందించవలసిన విధంగా స్పందించ గలుగుతారు. సమర్థ పాలకునిగా, ఉన్నతాధికారిగా, ఇంజనీర్‌గా సేవలు అందించిశాశ్వత కీర్తిని పొందిన సర్ ఆర్థర్ కాటన్‌ను గోదావరి జిల్లాల ప్రజలు నాటికీ నేటికీ వివాహాది శుభకార్యాలలో ‘కాటనాయ నమః’ అంటూ పూజిస్తారు. కాని ఈ ఆధునిక భగీరథుడిని (కాటన్‌ను) కరువు కాటకాలొస్తే ప్రజలు చస్తే చస్తారు, పరాయి దేశంలో ప్రజల కోసం ఎందుకు అంత ఖర్చు చేయవలసి వచ్చిందో సంజాయిషీ ఇవ్వమని లండన్ కోర్టు ముందుకు బ్రిటీష్ వలస పాలకులు ఈడ్చారు. దానికి కాటన్ సమాధానం - ‘కరువు కాటకాలతో చనిపోతున్న ప్రజలకు మనం ఆనకట్టలు, రిజర్వాయర్ల ద్వారా జలధారలు అందజేస్తే మన పాలనలోని ప్రజలను రక్షించుకోవడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయానికి ఆదాయం పెరుగుతుంద’ని బుద్ధిచెప్పి వచ్చాడు. ఈ స్ఫూర్తి ఇప్పటి కొందరు మన పాలకులకు లేదు. ‘యథా రాజా తథా ప్రజా’ అన్న సామెత అవినీతిలో కూరుకుపోయిన నేటి కొందరు పాల కులకు, కొందరు ఇంజనీర్లు, మరికొందరు కాంట్రాక్టర్లకు వర్తించినంతగా మరెవరికీ వర్తించదు. కనుకనే కాటన్ సహా కొందరు ప్రజా ప్రయోజనాల స్పృహకల్గిన పాలకులు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యలాంటి హేమాహేమీ ఇంజనీర్లు వివిధ చిన్న జలమార్గాల అనుసంధానం ద్వారా కాల్వల ద్వారా రవాణా వ్యవస్థను పెంపొందించి, స్థిర పరచడానికి కృషి చేశారు. ఫలితంగా 1890ల నాటికే గోదావరి, కృష్ణల నదీ వ్యవస్థతో బకింగ్‌హామ్ కెనాల్‌కు వంకలు, వాగుల్ని కూడా అనుసంధానించి, ఆంధ్రలోని కాకినాడ నుంచి తమిళనాడులోని విల్లుపురందాకా, 450 మైళ్ల పర్యంతం జలమార్గాన్ని సుస్థిరం చేశారు. ఈ వరసలోనే కాకినాడ-పుదుచ్చేరి మార్గంలో బకింగ్‌హామ్ కెనాల్ సహా పెక్కు కాల్వలను కలపడానికి ఆ తరువాత కాలంలో ప్రయత్నం జరిగింది. ఈ బకింగ్ కెనాల్ చరిత్ర కాలగతిలో ‘గత జలసేతు బంధనం’గా ముగిసిపోకుండా ఉండి ఉంటే, సెకనుకు 5,600 క్యూబిక్ అడుగుల నీటిని బట్వాడా చేయగల శక్తిగల బకింగ్‌హామ్ ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని భారీ వరద ముంపునుంచి రక్షించుకుని ఉండే పని అని పాల్ హైలాండ్ రాసిన ‘ఇండియన్ బామ్’ పుస్తకం వెల్లడిస్తోంది (హిందూ, 5-12-2015). నిజాం కాలం ప్రాజెక్టులు పాలనా వ్యవస్థలో అవినీతి అంతర్భాగమైనప్పుడు జలమార్గాల వ్యవస్థ నిర్వహణలోనూ, కట్టడాలలోనూ చోటు చేసుకుంటుంది. కాని నిరంకుశ నిజాం పాలనలో రిజర్వాయర్ల నిర్మాణంలోనే కాదు, కనీసం మురుగునీటి పారుదలకు డ్రైనేజీ వ్యవస్థను నిర్మించిన తీరు గమనించాల్సిందే. అలాంటి పథకం లేనందుననే ప్రస్తుతం నగరాలను, పట్టణాలను ముంచెత్తుతున్న వానలు, వరదలతో డ్రైనేజీ వ్యవస్థకు నవరంధ్రాలు మూసేసినట్టయింది. ఉపరితలంలోనే మురుగు పారుదలయ్యేట్టు స్వతంత్ర భారత పాలకులు వ్యవస్థను నిర్మించినందున మొత్తం డ్రైనేజీ పారుదల నిర్మాణ పథకం లోప భూయిష్టంగా తయారై నగర శోభ కూడా మారు రూపు తొడిగింది. ఇటీవల భారీ వరదలకు ఇబ్బందులపాలైన హైదరాబాద్ నగరంలో, కొన్ని రోజులనాడు మొజంజాహి మార్కెట్ పొడవునా, పబ్లిక్ గార్డెన్స్ వద్ద (తెలుగు విశ్వవిద్యాలయం లైన్లో) తవ్వకాలు జరుగుతున్నప్పుడు నిజాం నాటి మురుగునీటి, వర్షపునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి నిర్మించిన కట్టడం పది అడుగుల లోతున కన్పించింది. భూమిని పరీక్షించే సమయంలో అది కన్పించలేదు. మెట్రో రైలు నిర్మాణంలో భారీ దిమ్మలకు అవసరమైన పునాదుల తవ్వకంలో ఆ నిర్మాణ రహస్యం బయల్పడింది. అందుకే అంత లోతుగా డ్రైన్ పైప్‌లైన్‌ను పది అడుగుల లోతున వేస్తారని అనుకోలేదని మెట్రోరైల్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.వి.ఎస్. రెడ్డి ఆశ్చర్యం వెలిబుచ్చారు. ‘ఆ పైప్‌లైన్ సుందరమైన నిర్మాణం’ అని కూడా కితాబు ఇచ్చారు. ఆశ్చర్యమే మంటే ఇందుకు సంబంధించిన పటాలుగానీ, డ్రాయింగ్స్గానీ జి.హెచ్. ఎం.సి. దగ్గర, మున్సిపల్ వాటర్ బోర్డు వద్ద లభించక పోవటం. ఇదే సమయంలో ‘హైటెక్ సిటీ’ నిర్మాణం తన గొప్పేనని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతాచేసి అదే హైటెక్ సిటీకి కీలకమైన భూగర్భ (అండర్ గ్రౌడ్) డ్రైనేజీ వ్యవస్థను నిర్మించలేకపోయాడని మరవరాదు. ఆధు నిక పాలకులు ‘ప్రగతి/అభ్యుదయం’ చాటున సహజ వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నందుననే ప్రకృతి ఎదురుదాడికి దిగవలసివస్తోంది. దెబ్బతిన్న సమతౌల్యంతో ఇక్కట్లు పారిశ్రామిక విప్లవానికి ముందు ఈ స్థాయిలో మానవాళి ఎరుగని ఈ విధ్వం సానికి అసలు కారణం ఏమై ఉంటుంది? విధ్వంసంలో కూడా ‘ప్రగతిని/ అభివృద్ధి’నీ చూడగల్గిన ఏకైక వ్యవస్థ సామ్రాజ్యవాద -పెట్టుబడి వ్యవస్థ మాత్రమే. పర్యావరణ శాస్త్ర ప్రసిద్ధ పరిశోధకుడు, ఆర్థిక విశ్లేషకుడైన బెలామీ ఫాస్టర్ చెప్పినట్టు ‘ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అవతరించినది మొదలు మానవాళికి, ప్రకృతికి మధ్య అంతకుముందు నెలకొని ఉన్న సంప్రదాయ సమతుల్యత కాస్తా తిరిగి పాదుకొల్పడానికి వీలులేనంతగా తారుమారై పోయింది’’ (‘ది వల్నరబుల్ ప్లానెట్: 1999 న్యూయార్క్). అంత కన్నా నిశితంగా, కారల్‌మార్క్స్ సహచరుడైన ఫ్రెడరిక్ ఏంగెల్స్ ఈ పరిణామం గురించి 150 ఏళ్ల క్రితమే ఇలా హెచ్చరించాడు: ‘ఆసియా మైనర్, మెసపటోమియా, గ్రీస్ తదితర ప్రాంతాల్లోనూ ప్రజలు సాగుకు లాయకైన భూముల్ని పొందేందుకు అటవీభూముల్ని ధ్వంసం చేశారేగాని, ఈ పని మూలంగా భూమిలో తేమను సంరక్షించగల రిజర్వాయర్లు, అడవులకీ పరి రక్షణా కేంద్రాలనీ గుర్తించలేకపోయారు. అలాగే, ఏడాదిలో ఎక్కువ రోజుల పాటు పర్వత సానువుల నుంచి నిరంతరం జాలువారే ఊటలను కాపాడు కోలేక పోతామని వారు గుర్తించలేక పోతున్నారు. ఫలితంగా, వర్షాకాలాల్లో మైదాన ప్రాంతాల్ని ముంచెత్తే భారీ వరదల్ని నిరోధించలేక పోతున్నారు. ఆ విధంగా విదేశాలలోని ప్రజల్ని జయించి పెత్తనం చెలాయించే పరాయి వాడిలా మనం ప్రకృతిపట్ల వ్యవహరించరాదు! abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
పారిశ్రామిక విప్లవం దిశగా తెలంగాణ: మంత్రి జూపల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక విప్లవం సాధన దిశగా సాగుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన సచివాలయంలో ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ పార్లమెంటరీ కార్యదర్శి, ఎంపీ హాన్ స్టీవెన్ సియోబోతో భేటీ అయ్యారు. పారిశ్రామికీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఉన్నాయని ఆస్ట్రేలియన్ ప్రతినిధి బృందం వ్యాఖ్యానించింది. గనులు, వ్యవసాయం, నీటి యాజమాన్యం తదితర రంగాల్లో ప్రావీణ్యత కలిగిన ఆస్ట్రేలియాకు తెలంగాణలో ఆయా రంగాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని సియోబో అభిప్రాయం వ్యక్తం చేశారు. సూక్ష్మ సేద్యం, మౌళిక సౌకర్యాలు, విద్య, రోడ్డు భద్రత తదితర అంశాల్లో తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు ఏర్పరుచుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, వివిధ జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, పారిశ్రామిక పార్కుల అభివృద్ధి తదితర అంశాలను ఆస్ట్రేలియన్ బృందానికి జూపల్లి ఈ సందర్భంగా వివరించారు. భౌగోళికంగా హైదరాబాద్‌కు ఉన్న ప్రత్యేకతలను వివరించడంతో పాటు, ఎగుమతులు, రవాణాకు అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని మంత్రి జూపల్లి వెల్లడించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో భూ విలువ తక్కువగా ఉందన్నారు. -
ట్రైమెక్స్ నోట్లో ఇసుక
శ్రీకాకుళం: రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం సృష్టిస్తామని.. కొత్త పరిశ్రమలు పెట్టి.. నిరుద్యోగాన్ని రూపుమాపేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న తెలుగుదేశం ప్రభుత్వం వాస్తవానికి అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. రాజకీయ కారణాలతో ఉన్న పరిశ్రమలనే మూత వేయించేందుకు కుట్ర లు పన్నుతోంది. అందులోనూ 2004లో తాను అధికారంలో ఉన్నప్పుడే అన్ని అనుమతులిచ్చి ఏర్పాటు చేయించిన పరిశ్రమను మూసి వేయిం చే ప్రయత్నాలు చేయిస్తోంది. గార మండలం తోనంగి, వత్సవలసల్లో బీచ్ శాండ్ పరిశ్రమ ఏర్పాటుకు ట్రైమెక్స్ సంస్థకు 2004లో అప్పటి సీఎం చంద్రబాబు అనుమతులి చ్చారు. ఆ మేరకు రూ.400 కోట్లతో ట్రైమెక్స్ పరిశ్రమ ఏర్పాటై పని చేస్తోంది. 2010లో అప్పటి సీఎం కె.రోశయ్య దీన్ని ప్రారంభిం చారు. దీనిద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 2 వేల మంది ఉపాధి పొందుతున్నారు. మరోవైపు పరిశ్రమ యాజమాన్యం ప్రతి ఏటా కోట్లాది రూపాయలతో సీఎస్ఆర్ పథకం కింద తీరప్రాంత గ్రామా ల్లో ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతోంది. రోడ్ల అభివృద్ధితో పాటు దేవాలయాల అభివృద్ధి, మంచినీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణకు లక్షలాది రూపాయలను శాశ్వత ప్రాతిపదికన ఖర్చు చేస్తోంది. ఓ స్కూల్, ఆస్పత్రిని కూడా నిర్వహిస్తోంది. ఇవి కాకుం డా ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భాల్లో, అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నా లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. ఇన్ని విధాలుగా సమాజానికి ఉపయోగపడుతున్న ట్రైమెక్స్ పరిశ్రమను మూ సి వేయించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేయడమో.. పరిశ్రమ కాలుష్యాన్ని వెదజల్లడమో దీనికి కారణం కాదు. ఈ పరిశ్రమ యజమాని ఇటీవలి ఎన్నికల్లో వేరే పార్టీ తరఫున పోటీ చేశారన్న అక్కసుతోనే ప్రభుత్వం కక్షసాధింపునకు పాల్పడుతోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అం దులో భాగంగా పరిశ్రమకు అవసరమైన ముడిపదార్ధం రాకుండా కొందరు అడ్డుకుం టున్నారు. 2012లో టీడీపీ బడా నాయకులే యాజమాన్యానికి, స్థానికులకు మధ్య ఓ ఒప్పందం కుదిర్చి అక్కడ ఉన్న మహిళలకే మైనింగ్ హక్కు కల్పించారు. వారి ద్వారానే సంస్థ మైనింగ్ జరుపుకునేలా ఒప్పందాన్ని కుదిర్చారు. ఈ ఒప్పందం మూడేళ్ల పాటు ఉండేలా కూడా నిర్ణయించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు తాము అధికారంలోకి రాగానే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిం చడం ప్రారంభిం చారు. అలాగే పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో ట్రైమెక్స్ సంస్థ కొన్ని భూములను కొనుగో లు చేసింది. అందులో కూడా మైనింగ్ చేయకుండా కొందరు అడ్డుకోవడమే కాకుండా ఆ భూములను పంచాలని డిమాండ్ చేస్తుండ డం విడ్డూరం. జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్న పరిశ్రమను మూసివేయించాలని చూడటం తగదని, రెండు వేల కుటుంబాలు వీధిన పడకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.