'వాట్స్ యాప్'పై మోదీ ఫోకస్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజల్లోకి సమాచారం తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా వినియోగంపై దృష్టి సారించారు. ఒకరికొకరు మాట్లాడుకోవటానికి వాట్స్ యాప్ వాడకం పెరగాలని కేంద్ర సమాచార, మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ తో పోల్చుకుంటే వాట్స్ యాప్ వాడకం పరిమితంగానే ఉందని ఓ సీనియర్ అధికారి అన్నారు. సోషల్ మీడియాను ఏ విధంగా వినియోగించుకోవాలో ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా వివరిస్తామని మీడియాతో కేంద్ర సమాచార మంత్రి తెలిపారు.
'టాకథన్' పేరుతో ప్రపంచవ్యాప్తంగా అంతర్గత సంబంధాలు పెంచుతామని, భవిష్యత్తులో మరిన్ని కొత్త పద్ధతులతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని మంత్రి చెప్పారు. ట్విట్టర్‌కు 16 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌కు కూడా దాదాపు అంతే సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరుపుకునే జాతీయ యువజన దినోత్పవం నాడు ఆన్లైన్ మీడియాపై ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తామని ఆయన చెప్పారు.