inpatients
-
డాక్టర్ స్మైల్
డాక్టర్లు మందులు రాస్తారు.శీతల్ అగర్వాల్ వాటితోపాటు తన నవ్వులను టానిక్‌లా జత చేస్తుంది.శీతల్ బహుశా దేశంలో మొదటి మహిళా ‘మెడికల్ క్లౌన్’.అంటే ఇన్ పేషెంట్స్‌గా ఉన్న చిన్నారులను, వృద్ధులను హుషారుగా పలకరించిఉత్సాహపరిచే విదూషకురాలు. నిరాశ నిస్పృహలను కలిగించే అనారోగ్యం నుంచి బయట పడాలంటే తనలాంటి వారు అవసరమని‘కౌన్సిలర్ల’కు బదులుగా ‘క్లౌన్సిలర్లను’ తయారు చేసే సంస్థను స్థాపించిందామె.శీతల్ ఆలోచనను పెద్ద పెద్ద ఆస్పత్రులు ఆహ్వానిస్తున్నాయి. వినూత్న సేవ డాక్టర్లే ఆహ్వానిస్తూ ‘మొదట మేము ప్రతి శనివారం ఏదో ఒక హాస్పిటల్‌కు వెళ్లాలని అనుకున్నాం. కాని మాకు వచ్చిన స్పందన చూసి డాక్టర్లు, నర్సులు మమ్మల్ని ఆహ్వానించసాగారు. మందులకు స్పందించనివారు కూడా నవ్వులకు స్పందిస్తున్నారని వారి అభిప్రాయం. ముఖ్యంగా చిన్న పిల్లల ఆస్పత్రుల్లో మెడికల్ క్లౌన్ల అవసరం చాలా ఉందని మాకు అర్థమైంది. హాస్పిటల్‌లోని భయాన్ని పోగొట్టాలంటే వారికి మాలాంటి వారు కనపడుతుండాలి. అందుకే ఇన్ పేషెంట్స్‌గా ఉన్న పిల్లలు మా రాక కోసం ఎదురు చూస్తుంటారు. అంతే కాదు వారి ముఖంలో నవ్వును చూసి తల్లిదండ్రులు కార్చే ఆనందబాష్పాలకు విలువ కట్టలేం. – శీతల్ పిల్లలో, పెద్దలో ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందనుకోండి... అప్పుడు వారిలో ఒక రకమైన నిర్లిప్తత వచ్చేస్తుంది. వారిని అటెండ్ చేస్తున్న అయినవారిలో అలసట వచ్చేస్తుంది. నవ్వులు మర్చిపోతారు. ఉత్సాహం మర్చిపోతారు. అప్పుడు ఎవరైనా వచ్చి, వింత వింత చేష్టలు చేసి, పిచ్చి మాటలు చెప్పి హాయిగా నవ్విస్తే ఎలా ఉంటుంది? తిరిగి బలం రాదూ? శీతల్ అగర్వాల్ చేస్తున్నది అదే. నవ్వుతో రోగుల్లో జీవాన్ని తేవడం. హాస్పిటల్లో జోకర్ ఇంగ్లిష్‌లో క్లౌన్ అంటే విదూషకుడు. కాని జన సామాన్యం జోకర్ అనీ బఫూన్ అనీ అంటుంటారు. అలాంటి బఫూన్ వేషంలో హాస్పిటల్లో ప్రవేశించి ఒక ఉత్సాహకరమైన వాతావరణం తేవడాన్నే ‘మెడికల్ క్లౌనింగ్’ అంటారు. ఢిల్లీకి చెందిన 36 ఏళ్ల శీతల్ అగర్వాల్‌కు ఈ మెడికల్ క్లౌనింగ్ గురించి 2016 వరకూ తెలియదు. సోషల్ ఆంత్రోపాలజీ చదివి, లాఫ్టర్ యోగా థెరపీ నేర్చుకుని, ఒక ఎన్.జి.ఓలో ఉద్యోగం చేస్తున్న శీతల్ 2016 సంవత్సరంలో అహ్మదాబాద్‌కు వెళ్లినప్పుడు అక్కడి ఒక హాస్పిటల్లో మెడికల్ క్లౌన్ను చూసింది. అతను బఫూన్ వేషం వేసుకుని పేషెంట్స్‌ను హుషారు పరచడం శీతల్‌కు చాలా నచ్చింది. ఢిల్లీకి తిరిగి వచ్చి నెట్లో మెడికల్ క్లౌనింగ్ గురించి తెలుసుకుంది. దేశంలో కొంత మంది ఇలాంటి సేవ చేస్తున్నారని, హాస్పిటల్స్‌లో ఇలాంటి వారి అవసరం ఉందని తెలుసుకుంది. ఒక్కతే మొదలయ్యి ‘ఢిల్లీలో అప్పటి వరకూ మెడికల్ క్లౌన్‌గా ఎవరూ పని చేయడం లేదు. ఫేస్బుక్లో నేను పోస్ట్ చేసి ఆసక్తి ఉందా ఎవరికైనా అని అడిగితే కొంతమంది స్పందించారు. నేను కేంద్ర మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకుని మొదట ఐదుమందితో ఒక గ్రూప్ మొదలుపెట్టాను. మాకు ట్రైనింగ్ ఏమీ లేదు. తెలిసిందల్లా ఎదుటివారికి మనస్ఫూర్తిగా ఉల్లాసం అందించడమే. అదే సంవత్సరం నేను ఢిల్లీలోని ‘చాచా నెహ్రూ హాస్పిటల్’లో మొదటిసారిగా మెడికల్ క్లౌనింగ్ చేశాను. కాని ఎలా చేయబోతామా అనే భయం చాలా కలిగింది. మేం వెళ్లేసరికి పిల్లలు చాలామంది ఏడుస్తున్నారు. పేషెంట్లు వెయిటింగ్లో ఈసురోమంటున్నారు. కాని ఒక్కసారి మేము రంగంలో దిగి వింత చేష్టలతో తమాషా పలకరింపులతో తిరుగాడేసరికి పిల్లలు ఏడుపు ఆపేశారు. అందరిలో కుతూహలం, ఉత్సాహం వచ్చింది. ఐదు ఫ్లోర్లలో ఐదు గంటల పాటు తిరిగితే మా వల్ల అందరి ముఖాల్లో ఆనందం చూసి ఎంతో తృప్తి కలిగింది’ అంది శీతల్ అగర్వాల్. 500 వాలెంటీర్లు ఈ ఐదారేళ్లలో శీతల్ పిలుపు మేరకు 500 మంది వాలెంటీర్లు మెడికల్ క్లౌన్లుగా ఆమె స్థాపించిన సంస్థ ‘క్లౌన్సెలర్స్’లో నమోదు అయ్యారు. వీరంతా యూనివర్సిటీ విద్యార్థులు, కార్పొరెట్ సంస్థల ఉద్యోగులు. ‘మా జీవితంలో ఇలాంటి పని సంతృప్తిని ఇస్తుంది’ అని వారు ఈ వినూత్న సేవకు వస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కశ్మీర్‌లలో శీతల్ బృందాల సేవలు కొనసాగుతున్నాయి. ఆస్పత్రుల్లోనే కాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్‌లకు, మానసిక చికిత్సాలయాలకు కూడా వీరు వెళుతున్నారు. ఈ సేవలో మరింతమంది పాల్గొనాలని కోరుకుందాం. -
గుంటూరు జీజీహెచ్‌లో నిత్యాన్నదానం
అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టటానికి మించిన మంచిపనిలేదని లోకోక్తి. అన్నదానం మహాయజ్ఞంతో సమానమని చెబుతారు. అటువంటి మహాకార్యం గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పురుడుపోసుకుంటోంది. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వారి సహాయకులకు జనవరి నుంచి రెండుపూటలా ఉచితంగా అన్నం పెట్టనున్నారు. ఇందుకు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సంకల్పించారు. ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగటానికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. సాక్షి, గుంటూరు: గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్) నైపుణ్యమైన వైద్యసేవలకు పెట్టింది పేరు. అవిభక్త కవలల శస్త్రచికిత్సల నుంచి గుండె శస్త్రచికిత్సల వరకు అనేక క్లిష్టమైన వైద్యసేవలను అందించిన ఘనత కలిగింది ఈ వైద్యశాల. రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి రోగులు ఈ ఆస్పత్రికి వస్తుంటారు. వీరిలో పేద, మధ్యతరగతి రోగులే అధికం. 1,500 మందికిపైగా రోగులు ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతుంటారు. వీరికి ఒకరిద్దరు కుటుంబసభ్యులో, బంధువులో సహాయంగా ఉంటారు. సహాయంగా ఉండేవారి సంఖ్య 2,500 నుంచి మూడువేల వరకు ఉంటుంది. రోగులకు చికిత్స, భోజనం బాధ్యత ఆస్పత్రిదే. సహాయకులు మాత్రం సొంత డబ్బుతో తినాల్సిందే. ఉదయం టిఫిన్, రెండుçపూటలా భోజనానికి ఒక్కొక్కరికి రూ.200 వరకు ఖర్చవుతుంది. 3 వేల మంది సహాయకులు రోజుకు రూ.6 లక్షల భోజనానికే వెచ్చించాల్సి వస్తోంది. ఈ సహాయకుల్లో పలువురు చేతిలో డబ్బులేక పస్తులుంటున్నారు. ప్రస్తుతం పొగాకు వ్యాపారి పోలిశెట్టి సోమసుందరం రోజూ మధ్యాహ్నం 500 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నారు. చలించిన మంత్రి కుటుంబసభ్యులు, ఆప్తులు అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి సహాయంగా ఉంటూ.. డబ్బులేక కొందరు, సరిపోక కొందరు ఆకలితో బాధపడుతుండటాన్ని గమనించిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చలించిపోయారు. సాటి మనుషులు ఆకలితో బాధపడకుండా చూడాలని అనుకున్నారు. ఇందుకోసం నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మహత్కార్యానికి కోటిరూపాయల విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆస్పత్రి ప్రాంగణంలో ఏపీఎన్జీవో సంఘం ఇచ్చిన రూ.25 లక్షలతో నిర్మిస్తున్న భవనాన్ని అన్నదాన భవనంగా ఉపయోగించనున్నారు. రెండంతస్తుల్లో ఒకేసారి 300 మంది భోజనం చేసేలా వసతులు సమకూరుస్తున్నారు. అత్యాధునిక వంటశాల రూపుదిద్దుకుంటోంది. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఆధునిక వంటసామగ్రిని తెప్పించారు. తరువాత ఉదయం 11 గంటల నుంచి, రాత్రి 7 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ప్రారంభించాలని, పరిమితి లేకుండా ఎందరు సహాయకులున్నా అందరికీ భోజనం పెట్టాలని నిర్ణయించారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, దాతలు తలోచేయి వేస్తే ఈ అన్నదానయజ్ఞం నిరాటంకంగా సాగుతుంది. జనవరి మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే జనవరి మొదటి వారంలో జీజీహెచ్‌లో రోగుల సహాయకులకు ఉచిత భోజన కార్యక్రమం అందుబాటులోకి తీసుకువస్తాం. ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలపించేలా భవనంలో వసతులు సమకూరుస్తున్నాం. ఆస్పత్రి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జిల్లా ఇన్చార్జి మంత్రి -
జనం నెత్తిన రుద్దేస్తున్నారు..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నాశిరకం మందులు రాజ్యమేలుతున్నాయి. తక్కువ ధరకు లభించే జనరిక్ మెడిసిన్, గడువు ముగిసిన ఖరీదైన బ్రాండెడ్ మందులకు కొత్తగా లేబుళ్లు అతికించి విక్రయిస్తున్నారు. వీటిని వేసుకున్న వారికి వ్యాధి తగ్గక పోగా మరింత ముదురుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పటికప్పుడు ఫార్మా కంపెనీలు, రిటైల్, హోల్‌సేట్ మెడికల్ దుఖానాల్లో తనిఖీలు నిర్వహించి గడువు ముగిసిన, నాశిరకం మందులను గుర్తించి, విక్రయదారులపై కేసులు నమోదు చేయాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు మామూళ్ల మత్తులో జోగుతుండటతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కేన్సర్, పక్షవాతం, కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న ఇన్‌పేషెంట్లకు గుట్టుచప్పుడు కాకుండా వీటిని అంటగడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోగుల బంధువులు ఎవరైనా దీనిని గుర్తించి, ఫిర్యాదు చేయాలని భావించి డ్రగ్ ఇన్స్పెక్టర్లకు ఫోన్ చేస్తే...వారిలో పలువరు అసలు ఫోన్లే ఎత్తడం లేదు. డీసీఏ అధికారుల వైఖరితో విసుగుచెందిన రోగులు, వారి బంధువులు ఏసీబీని ఆశ్రయిస్తుండటం విశేషం. ఇటీవల డీఐ లక్ష్మిఓ రక్తనిధి కేంద్రం నుంచి నగలరూపంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన విషయం తెలిసిందే. తనిఖీలకు వచ్చి... రాష్ట్ర వ్యాప్తంగా 500పైగా మందుల తయారీ కంపెనీలు ఉన్నాయి. 27వేలకు పైగా హోల్‌సేల్, రిటైల్ దుఖానాలు కొనసాగుతున్నాయి. ఇందులో 80 శాతం కంపెనీలు, హో ల్‌సేల్ దుఖానాలు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. వాస్తవానికి తుది గడువుకు మూడు నెలల ముందే స్టోర్‌లో నిల్వ ఉన్న మందులను గుర్తించి ఆయా ఔషధ కంపెనీలకు తిప్పి పంపాల్సి ఉంది. అయితే నగరంలోని కొన్ని ఆస్పత్రుల్లోని మందుల దుఖానాలు ఇందుకు విరుద్ధంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న అమాయక ఇన్పేషంట్లకు గుట్టుగా ఈ మందులను వాడుతున్నట్లు తెలిసింది. ఓపీ రోగులు కొనుగోలు చేసిన మందులు బయట ఎవరైనా గుర్తించే ప్రమాదం ఉండటంతో ఇన్‌పేషెంట్లకే వాటిని వినియోగిస్తున్నారు. దీంతో సర్జరీ తర్వాత ఒకటి రెండు రోజుల్లో నయం కావాల్సి గాయం వారం పదిరోజులైనా మానకపోవడం, వ్యాధి తీవ్రత తగ్గక పోవడానికి ఇదే కారణమని పలువురు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు ప్రతి మూడు నెలలకోసారి ఆయా దుఖానాల్లో తనిఖీలు నిర్వహించిగడువు ముగిసిన, సమీపించిన మందులను ముందే గుర్తించి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అయితే తనిఖీలకు వెళ్తున్న ఇన్స్పెక్టర్లలో పలువురుఫార్మసీల ముఖం చూడకుండానే బయటికి వెళ్లిపోతున్నట్లు తెలిసింది. తనిఖీలు ముమ్మరం చేశాం నాశీరకం మందులు అమ్ముతూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫార్మా కంపెనీలు, రిటైల్, హోల్‌సేల్ దుఖానాలపై డ్రగ్ కంట్రోల్ విభాగం ప్రత్యేంగా దృష్టిసారించింది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. నాశిరకం మందుల విక్రయాలను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాం. తనిఖీల విషయంలో డీఐలు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2018లో 20,200 దుఖానాల్లో తనిఖీలు నిర్వహించి, 5700 ఉల్లంఘన లు గుర్తించాం. 20 నాశిరకం మందులను గుర్తించాం. లైసెన్స్ లేకుండా మందులు అమ్ముతున్న 64 దుఖానాలను సీజ్ చేశాం. వీరిలో 24 మందికి ఇప్పటికే శిక్షలు కూడా పడ్డాయి. 2019లో ఇప్పటి వరకు 13370 తనిఖీలు నిర్వ హించాం. 4780 ఉల్లంఘనలు, తొమ్మిది నాశిరకం మందులను గుర్తించి ఆ మేరకు కేసులు నమోదు చేశాం. లైసెన్సులు లేకుండా మందులు అమ్ముతున్న 42 మందుల దుఖానాలను సీజ్ చేశాం. 32 మందికి ఇప్పటికే శిక్షలు పడ్డాయి. వీటిలో గడువు ముగిసిన మందులు నిల్వ చేయడం, కనీస అర్హత లేని నాన్ఫార్మసిస్ట్ మందులు విక్రయిస్తుండటం, మందులు కొనుగోలు, విక్రయాలకు సంబంధించి రికార్డులు సరిగా నిర్వహించడం వంటి ఉల్లంఘనలే ఎక్కువగా ఉన్నాయి. –వెంకటేశ్వర్లు, జాయింట్ డైరెక్టర్, డీసీఏ -
'సరోజినీ'లో మళ్లీ సేవలు ప్రారంభం
హైదరాబాద్ : మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో దాదాపు 15 రోజుల విరామం తర్వాత ఇన్‌పేషంట్ సేవలు శుక్రవారం మళ్లీ ప్రారంభమైనాయి. ఈ రోజు ఉదయం అవుట్ పేషంట్ విభాగానికి వచ్చిన రోగుల్లో 40 మందిని ఇన్‌పేషంట్లుగా ఆసుపత్రలో చేర్చుకున్నారు. వీరికి సోమవారం శస్త్రచికిత్సలు చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సదరు ఆసుపత్రిలో ఇటీవల క్యాటరాక్ట్ శాస్త్రచికిత్స చేయించుకున్న ఏడుగురు బాధితులకు కంటిచూపు పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకుని... కేసు నమోదు చేసింది. అలాగే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు కూడా నోటీసులు జారీ చేసింది.