insists
-
ఏపీ బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీలకు మొండిచేయి. రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులకు కేటాయింపులు నిల్
-
12 స్థానాల్లో పోటీ
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల పంపకంలో గందరగోళానికి ఇంకా తెరపడలేదు. తాము 12 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలంగాణ జన సమితి ప్రకటించింది. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పి.ఎల్ విశ్వేశ్వరరావు టీజేఎస్ పోటీ చేసే స్థానాల పేర్లు ప్రకటించారు. దుబ్బాక, మెదక్, మల్కాజ్గిరి, అంబర్‌పేట, సిద్దిపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్పూర్, జనగాం, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. కాగా, మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై సంప్రదింపులు ఇంకా సాగుతున్నట్లు టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి తెలిపారు. పార్టీ ప్రకటించిన అన్ని స్థానాల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటామని చెబుతూనే ఒకటి రెండు సీట్లు అటూఇటుగా పోటీ చేస్తామని చెప్పడం గందరగోళానికి తెరలేపింది. మిత్రపక్షాల స్థానాల్లోనూ పోటీ టీజేఎస్ పోటీ చేయనున్నట్లు ప్రకటించిన స్థానా ల్లో మహాకూటమి పక్షాలు కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన స్థానాలు కూడా ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్, ఆసిఫాబాద్ స్థానాల నుంచి కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్‌నగర్ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారు. పొన్నాల లక్ష్మయ్య ఆశిస్తున్న జనగాం స్థానం నుంచి తామే పోటీలో ఉంటామని టీజేఎస్ ప్రకటించింది. -
నచ్చిన మహిళా కో పైలెట్ కోసం పట్టు..
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా పైలట్ల తీరు మారడం లేదు. ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా, ఎంతమందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా పైలట్లు మాత్రం విధి నిర్వహణలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓ పైలట్ తన డిమాండ్ కోసం 110 మంది ప్రయాణీకులను సుమారు రెండు గంటలపాటు విమానంలో వేచి చూడాల్సిన పరిస్థితి కల్పించాడు. అసలు విషయానికి వస్తే... తనకు నచ్చిన మహిళా పైలట్‌ను కో-పైలట్‌గా ఇవ్వలేదన్న కారణంతో ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఉదయం ఏడు గంటలకు బయలుదేరాల్సిన విమానం తొమ్మిది గంటల తర్వాత బయలుదేరింది. పైలట్ మంకుపట్టుతో ఎయిర్ ఇండియా విమానంలో 110 మంది ప్రయాణీకులు రెండున్నర గంటలపాటు బలవంతంగా కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. దీంతో మాలే నుంచి చెన్నై మీదగా తిరువనంతపురం వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ సంఘటన జరిగింది. ప్రత్యేకంగా తాను కోరిన మహిళా కో పైలట్‌నే Al 263/264 విమానంలో తనతోపాటు విధులకు పంపించాలంటూ పైలట్ పట్టుబట్టడంతో అసలు గొడవ ప్రారంభమైంది. అయితే ఆమె అప్పటికే ఢిల్లీ ఫ్లైట్‌కు వెళ్ళాల్సిన రోస్టర్ లో ఉందని, అతడి డిమాండ్ తీర్చడం కుదరదని రోస్టర్ సెక్షన్ అధికారులు తేల్చి చెప్పారు. గురువారం ఉదయం విధులకు హాజరైన అతడు రోస్టర్ సెక్షన్ లో అదేతీరులో వ్యవహరించాడు. తనకు బీపీ పెరిగిందని, అనారోగ్యం పేరుతో కాలయాపన చేశాడు. అయితే అతడి ప్రయత్నం ఫలించకపోవటంతో...తాను కోరిన కో పైలట్‌ను పంపించనిదే విధులకు వెళ్లేది లేదంటూ తెగేసి చెప్పాడు. ఈ ఘటనతో ఉదయం ఏడు గంటలకు బయలుదేరాల్సిన విమానం తొమ్మిది గంటల తర్వాత బయలుదేరింది. కాగా ఇంత హంగామా చేసిన ఈ పైలట్ వారం క్రితం ఎయిర్ ఇండియాకు రాజీనామా చేసి, ప్రస్తుతం నోటీసు కాలంలో పని చేయటం గమనార్హం. అయితే ఈ విషయంపై పూర్తి వివరణ ఇచ్చేందుకు వైమానిక ప్రతినిధులు ఎవ్వరూ అందుబాటులో లేరు.