insurgency
-
ఉగ్ర చీఫ్ నుంచి దేశ సారథి దాకా!
బీరూట్: 14 ఏళ్ల అంతర్యుద్ధాన్ని తట్టుకుని ఎలాగోలా పరిపాలన సాగిస్తున్న అసద్‌ను చావుదెబ్బతీస్తూ దాడులు మొదలెట్టిన కేవలం 11 రోజుల్లో దేశంపై పట్టుసాధించిన అబూ మొహమ్మెద్ అల్ గోలానీ గురించి సర్వత్రా చర్చ మొదలైంది. జిహాదీ ఉగ్రవాదిగా మొదలైన ప్రస్థానం నేడు దేశాధినేత స్థాయిలో కొత్త పంథాలో కొనసాగనుంది. 42 ఏళ్ల గోలానీ 2003లో తొలిసారిగా అల్‌ఖైదాతో చేతులు కలిపారు. ఇరాక్‌లో అమెరికా సేనలకు వ్యతిరేకంగా పోరాడారు. అమెరికాకు చిక్కి ఐదేళ్లు జైలుజీవితం గడిపారు. ఈ సమయంలోనే భావసారుప్యత ముఠాలను ఒక్కతాటి మీదకు తెచ్చి అల్‌ఖైదా.. అబూ బకర్ అల్ బాగ్దాదీ సారథ్యంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్‌ను స్థాపించింది. 2011లో సిరియాలో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించాలంటూ అబూబకర్.. గోలానీని సిరియాకు పంపించాడు. అక్కడ అల్‌ఖైదా అనుబంధ నుస్రా ఫ్రంట్‌ను స్థాపించారు. దీనిని ఆనాడే అమెరికా ఉగ్రసంస్థ ముద్రవేసింది. గోలానీని పట్టిస్తే ఒక కోటి డాలర్లు ఇస్తామని నజరానా ప్రకటించింది. 2013లో సిరియాలో అంతర్యుద్ధం మొదలయ్యాక నుస్రా ఫ్రంట్‌ను ‘ఇరాక్ అల్‌ఖైదా’లో కలిపేసి కొత్తగా ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)’ను స్థాపించాని అబూబకర్ సూచించారు. అయితే ఐసిస్ ఏర్పాటు నచ్చక సొంతంగా నుస్రా ఫ్రంట్‌ను గోలానీ కొనసాగించారు. 2013లో గోలానీని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. 2016లో అల్‌ఖైదాతో తెగతెంపులు చేసుకుని సొంతంగా జభాత్ ఫతే అల్–షామ్(ది సిరియా కాంక్వెస్ట్ ఫ్రంట్)ను గోలానీ స్థాపించారు. ఇంకొక ఏడాది తర్వాత దాని పేరును హయత్ తహ్రీర్ అల్ షామ్(సిరియా విమోచన సంస్థ)గా నామకరణం చేశారు. ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో తన పట్టు నిలుపుకున్నారు. స్వతంత్రంగా పోరాటంచేసే వేర్వేరు ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆధిపత్యాన్ని అణచివేసి, వారిని తమలో కలుపుకుని సంస్థను మరింత పటిష్టవంతం చేశారు. తుర్కియే అండతో చెలరేగిపోయిన వేర్పాటువాదుల దాడుల్లో చనిపోయిన కుర్దుల కుటుంబాలను కలిసి మంచివాడిగా పేరుతెచ్చుకున్నారు. 2016లో తొలిసారిగా బహిరంగంగా ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం అమెరికన్ జర్నలిస్ట్‌కు తొలిసారిగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ సంస్థ పశి్చమదేశాలకు వ్యతిరేకంగా పనిచేయబోదని, సిరియాపై ఆంక్షలు విధించడం సబబుకాదని, పరోక్షంగా అమెరికా ఆంక్షలను తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ పశి్చమదేశాల విదేశాంగ విధానాలను విమర్శించిన మాట వాస్తవమే. కానీ మేం అమెరికా, యూరప్ దేశాలతో యుద్ధాలకు దిగాలనుకోవట్లేము. మాకు శాంతిస్థాపనే ముఖ్యం’’ అని గోలానీ గతంలో వ్యాఖ్యానించారు. -
S Jaishankar: ఆత్మపరిశీలన చేసుకోండి
ఇస్లామాబాద్: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాకిస్తాన్ గడ్డపై పాకిస్తాన్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. పొరుగు దేశంతో సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని పాకిస్తాన్‌కు హితవు పలికారు. పాక్ పట్ల భారత్‌కు విశ్వాసం సడలిపోవడానికి కారణాలేమిటో అన్వేíÙంచాలని సూచించారు. విశ్వాసం బలపడితేనే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని తేల్చిచెప్పారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అనే మూడు భూతాలు ప్రాంతీయ సహకారానికి అతిపెద్ద అవరోధాలు అని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలు భారత్–పాకిస్తాన్ మధ్య వ్యాపారం, వాణిజ్యం, ఇంధన సరఫరా, ప్రజల మధ్య అనుసంధానాన్ని నిరోధిస్తున్నాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన బుధవారం జరిగిన షాంఘై సహకార సంఘం(ఎస్సీఓ) సభ్యదేశాల కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్(సీహెచ్‌జీ) 32వ సదస్సులో జైశంకర్ మాట్లాడారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమతాన్ని తప్పనిసరిగా గౌరవిస్తేనే సంబంధాలు బలపడతాయని, వ్యాపారం, వాణిజ్యం, అనుసంధానం కొనసాగుతాయని స్పష్టంచేశారు. పరస్పరం గౌరవించుకోవడంపైనే పరస్పర సహకారం అధారపడి ఉంటుందన్నారు. పరస్పర విశ్వాసంతో కలిసికట్టుగా పనిచేస్తే ఎస్సీఓ సభ్యదేశాలు ఎంతగానో లబ్ధి పొందుతాయని సూచించారు. 3 భూతాలపై రాజీలేని పోరాటం చేయాలి ఎస్సీఓ చార్టర్‌కు సభ్యదేశాలన్నీ కట్టుబడి ఉండాలని జైశంకర్ స్పష్టంచేశారు. చార్టర్ పట్ల మన అంకితభావం స్థిరంగా ఉన్నప్పుడే ఆశించిన లక్ష్యాలు సాధించగలమని అన్నారు. ప్రాంతీయంగా అభివృద్ధి జరగాలంటే శాంతి, స్థిరత్వం అవసరమని ఉద్ఘాటించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదంపై అందరూ రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల ఆవశ్యకతను జైశంకర్ మరోసారి నొక్కిచెప్పారు. భద్రతా మండలిని మరింత పారదర్శకంగా, ప్రభావవంతంగా మార్చాలంటే సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిందేనని వెల్లడించారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితిపై ఎస్సీఓ ఒత్తిడి పెంచాలని కోరారు. అంతకుముందు ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు జిన్నా కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న జైశంకర్‌తో పాక్ ప్రధాని షరీఫ్ కరచాలనం చేసి సాదర స్వాగతం పలికారు. -
Haryana Assembly Elections 2024: రెబెల్స్ దడ
హరియాణాలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ముఖ్యనేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ప్రదర్శన 10 సీట్లలో ఐదు నెగ్గింది) కనబర్చిన కాంగ్రెస్ హరియాణాను తమ ఖాతాలో వేసుకోగలమనే ధీమాలో ఉంది. రైతుల అసంతృప్తి, నిరుద్యోగం, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై రెజర్ల లైంగిక వేధింపుల ఆరోపణలు, అగి్నవీర్ పథకంపై యువతలో నెలకొన్న ఆగ్రహం.. కాంగ్రెస్ అవకాశాలను మెరుగుపరిచాయి. అయితే పార్టీలోని ఆధిపత్య పోరు కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. మరోవైపు బీజేపీ గడిచిన పదేళ్లలో చేసిన అభివృద్ధిపై ఆశలు పెట్టుకుంది. 20 స్థానాల్లో రెబెల్స్ ప్రభావంఅయితే రెండు పారీ్టలకూ తిరుగుబాటు అభ్యర్థులు దడ పుట్టిస్తున్నారు. టికెట్లు నిరాకరించడంతో.. పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. మరికొందరు ఇతర పార్టీల నుంచి నామినేషన్ వేశారు. మొత్తం మీద సొంత పార్టీలకు సవాల్ విసురుతున్నారు. హోరాహోరీ పోరులో రెబెల్స్ ఎవరి పుట్టిముంచుతారోననే దడ రెండు పారీ్టల్లోనూ ఉంది. హరియాణా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. కనీసం 20 నియోజకవర్గాల్లో రెబెల్స్ ఫలితాలను తారుమారు చేసే స్థితిలో ఉన్నారు. 15 స్థానాల్లో 19 మంది బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచారు. 20 నియోజకవర్గాల్లో 29 మంది కాంగ్రెస్ రెబెల్స్ పోటీలో ఉన్నారు. 7 స్థానాల్లో 12 మంది అసంతృప్త నేతలను కాంగ్రెస్ బుజ్జగించింది. అలాగే 6 నియోజకవర్గాల్లో బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు పార్టీ సీనియర్ల విజ్ఞప్తులను మన్నించి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హరియాణా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు గణనీయమైన ఓట్ల శాతాన్ని రాబట్టుకుంటూ వస్తున్నారు. ఇది ప్రధాన పారీ్టలకు తలనొప్పిగా మారింది. గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో వీరు ఓట్లను చీల్చితే.. తాము నష్టపోతామని కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అందరి దృష్టి హిసార్ పైనే.. బీజేపీ రెబెల్స్‌లో దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్నది సావిత్రి జిందాల్. ఓ.పి.జిందాల్ గ్రూపు చైర్పర్సన్ అయిన సావిత్రి భారత్‌లోనే అత్యంత సంపన్న మహిళ. హిసార్‌లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఆరోగ్యశాఖ మంత్రి కమల్ గుప్తాకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఆమె కుమారుడు నవీన్ జిందాల్ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గూటికి చేరి.. కురుక్షేత్ర ఎంపీగా గెలిచారు. కమల్ గుప్తా గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో హిసార్ నుంచి విజయం సాధించారు. 2009లో ఇక్కడ సావిత్రి జిందాల్ కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. గనౌర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి దేవేందర్ కౌశిక్‌కు రెబెల్ అభ్యర్థి దేవేందర్ కడ్యాన్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. బీజేపీ ఓటు బ్యాంకును వీరిద్దరూ పంచుకుంటుండడంతో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ శర్మకు కలిసివస్తోంది. కుల్దీప్ 2009, 2014లలో రెండుసార్లు గనౌర్ నుంచి గెలుపొందారు. బీజేపీ టికెట్‌ను నిరాకరించడంతో మాజీ విద్యుత్‌శాఖ మంత్రి రంజిత్‌సింగ్ చౌతాలా రైనా నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్నారు. 2009, 2014లలో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన రంజిత్‌సింగ్.. 2019లో రైనా నుంచి స్వతంత్ర అభ్యరి్థగా విజయం సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ చేరారు. గురుగావ్‌లో బీజేపీ ట్రేడ్ సెల్ మాజీ కనీ్వనర్ నవీన్ గోయల్ రెబెల్ అభ్యరి్థగా బరిలో నిలిచారు. సఫిదాన్‌లో బీజేపీ అభ్యర్థి రామ్‌కుమార్ గౌతమ్‌కు తిరుగుబాటు అభ్యర్థి బచన్‌సింగ్ ఆర్య చెమటలు పట్టిస్తున్నారు. సఫిదాన్‌లో బచన్‌సింగ్ 2009, 2019లలో రెండోస్థానంలో నిలువడం గమనార్హం. కాంగ్రెస్‌కూ సెగ.. అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున బలమైన నేత అనిల్ విజ్ మరోసారి బరిలో నిలువగా.. కాంగ్రెస్‌ను చిత్ర సర్వరా భయం వెంటాడుతోంది. 2009, 2014లలో అనిల్ విజ్ చేతిలో ఓటమి చవిచూసిన చిత్ర 2019లో స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగి రెండోస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యరి్థని మూడోస్థానానికి నెట్టారు. దాంతో కాంగ్రెస్ ఆమెను ఆరేళ్లు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. జగధారి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు ఆదర్శపాల్ గుర్జా ర్ పార్టీ మారి ఆప్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అక్రమ్ ఖాన్‌కు గట్టి సవాల్ విసురుతున్నారు. ఇది బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్వర్పాల్కు అడ్వాంజేట్గా మారింది. అక్రమ్‌ఖాన్ 2009లో బీఎస్పీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లలో రెండోస్థానానికి పరిమితమయ్యారు. సదౌ రా నియోజకవర్గంలో బ్రిజ్‌పాల్ చప్పర్ బీఎస్పీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేణు బాలాపై పోటీచేస్తునానరు. రేణు 2019లో 17 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అయితే సదౌరాలో బీఎస్పీ 2009, 2019లలో 18–19 శాతం ఓట్లు సాధించడం.. కాంగ్రెస్ అభ్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మొత్తం మీద ఏ పార్టీని రెబెల్స్ ఎంతమేరకు దెబ్బతీస్తారనేది అక్టోబరు 8న ఓట్ల లెక్కింపు తర్వాత తేలనుంది. హరియాణా అసెంబ్లీకి అక్టోబరు 5న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తాలిబన్ల పైచేయి: ఇక మిగిలింది రెండే ఆప్షన్లు!
సైన్యం నుంచి పోరు, ప్రతిఘటనలు లేకుండానే అఫ్ఘనిస్తాన్.. పూర్తిగా తాలిబన్ సంస్థ వశం అయ్యేలా కనిపిస్తోంది. దేశంలోని దాదాపు ప్రధాన పట్టణాలన్నీ ఆదివారం ఉదయం నాటికల్లా తాలిబన్ల స్వాధీనంలోకి వచ్చేశాయి. దీంతో ఏ క్షణమైనా తమ ఆధిపత్యాన్ని తాలిబన్లు ప్రకటించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్క కాబూల్ మినహా దాదాపు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లోకి తాలిబన్ దళాలు చొచ్చుకెళ్లాయి. శనివారం మజర్–ఏ–షరీఫ్‌ను చుట్టుముట్టి బైకులు, వాహనాలపై పరేడ్ నిర్వహిస్తూ గాల్లోకి కాల్పులు జరిపారు తాలిబన్లు. మజర్‌ను ఆక్రమించిన కొద్ది గంటలకే.. తూర్పు నగరం జలాలాబాద్‌ను స్వాధీనం చేసుకోవడం విశేషం. అఫ్గానిస్తాన్‌లోని 34 ప్రావిన్సుల్లో(రాష్ట్రాలు) 22 తాలిబన్ల అధీనంలోకి రాగా.. ఆదివారం ఉదయం కల్లా మరో నాలుగింటిని స్వాధీనం చేసుకున్నారు. ‘తెల్లారి చూసేసరికి తాలిబన్లు తెల్ల జెండాలను పాతారు. ఎలాంటి ప్రతిఘటనను ఎదుర్కొకుండానే వాళ్లు ఊళ్లోకి ప్రవేశించారు’ అని జలాలాబాద్‌కు చెందిన ఓ స్థానికుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. శనివారం జాతిని ఉద్దేశించి ‘అఫ్గాన్ల ప్రాణాలు తీస్తుంటే ఊరుకోం. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే సహించం’ అంటూ గంభీర ప్రకటనలు చేసిన అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ.. సైన్యంలో ధైర్యం నింపడంలో మాత్రం ఘోరంగా విఫలం అవుతున్నాడు. 48 గంటల్లోగా రాజకీయ మార్గాల్లో పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు అష్రాఫ్ ప్రకటించడం, ఆపై కొన్ని గంటలకే మజర్–ఏ–షరీఫ్, జలాలాబాద్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడం విశేషం. దీంతో తాలిబన్ల ఆక్రమణ దాదాపు పూర్తి అయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక లొంగిపోవడమో లేదంటే హోరాహోరీగా పోరాడడమో అనే ఆప్షన్లు మాత్రమే అఫ్ఘన్ ప్రభుత్వం ముందు మిగిలాయని అంచనా వేస్తున్నారు. ఇది చదవండి: సైన్యం-తాలిబన్ల ఘర్షణ, ఎలా మొదలైందంటే.. అమెరికా బలగాల పని ఇదిలా ఉంటే తాలిబన్ దాడుల నేపథ్యంలో కాబూల్‌లోని రాయబార కార్యాలయ సిబ్బంది, సాధారణ పౌరుల తరలింపు కోసం సైన్యాన్ని రంగంలోకి దించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాదు తాలిబన్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారాయన. ఈ మేరకు ఇదివరకే భారీగా సైన్యం చేరుకోగా, మరికొంత మంది ఆదివారం రాత్రికల్లా చేరుకునే అకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాబూల్‌కి దక్షిణంగా కేవలం 11 కి.మీ. దూరంలో ఉన్న చార్ అస్యాబ్ జిల్లా వరకు తాలిబన్లు వచ్చేశారని లోగర్ ప్రావిన్స్ చట్ట సభల ప్రతినిధి హోడా అహ్మది ప్రకటించేశాడు కూడా. మరోవైపు ఎటుచూసినా తాలిబన్లను ఎదుర్కొకుండా ఆయుధాలను-వాహనాలను అప్పగించేసి స్వచ్ఛందంగా లొంగిపోతోంది అఫ్గన్ సైన్యం. 1994లో అఫ్గన్ అంతర్యుద్ధంలో బలమైన విభాగంగా ఎదిగిన తాలిబన్లు.. 1996 నుంచి 2001 వరకు మిలిటరీ ఆర్గనైజేషన్‌గా ప్రకటించుకున్న తాలిబన్లు, అఫ్ఘనిస్థాన్‌లో అరాచకాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. 9/11 దాడుల తర్వాత అమెరికా దళాలు తాలిబన్లను అణిచివేసే ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. అయితే తాజాగా అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న పరిణామాల తర్వాత 75వేల సభ్యులతో తాలిబన్ తిరిగి అఫ్ఘన్ ఆక్రమణకు తిరిగి ప్రయత్నించి.. లక్క్ష్యం నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. విష ప్రచారం యువతులను బలవంతంగా తాలిబన్లకు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారనే కథనాలను తాలిబన్ సంస్థ కొట్టిపడేసింది. ఇదంతా ఆఫ్ఘన్ ప్రభుత్వం చేస్తున్న విషపూరిత ప్రచారంగా పేర్కొంది. తాలిబన్ ప్రతినిధి సుహాలీ షాహీన్ ఈ మేరకు వరుస ట్వీట్లలో ఆ ఆరోపణలను ఖండించారు. నిరాధారమైన కథనాలతో కుట్రను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డాడు. మరోవైపు అమెరికా, భారత్ సహా ఏ దేశం అయినా సరే అఫ్గన్ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే సహించలేదని తాలిబన్లు హెచ్చరించారు కూడా. 1/2 Recently the Kabul Adm has launched baseless and vicious propaganda, sometimes claiming, the Islamic Emirate forces people to marry their daughters, or to marry them to the Mujahidin. Sometimes they say that the Mujahidin are killing people, killing prisoners and captives, — Suhail Shaheen. محمد سهیل شاهین (@suhailshaheen1) August 14, 2021