దేశీయ సెమీకండక్టర్ చిప్‌లను అభివృద్ధి చేసిన ఆ ఐఐటీ..!
టెక్నాలజీ పరంగా దేశంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. ప్రముఖ ఐఐటీ-భువనేశ్వర్ క్యాంపస్ అత్యాధునిక యాప్స్ కోసం రెండు సెమీకండక్టర్ చిప్‌లను అభివృద్ధి చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్(ఐసీ) చీప్ ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్(ఐఓఎంటి)లో శక్తివంతమైన సురక్షిత బయోమెడికల్ డేటా ప్రసారానికి సహాయపడితే, మరో చీప్ స్వల్ప-శ్రేణి తక్కువ శక్తి గల ఆర్ఎఫ్ ఫ్రంట్ ఎండ్ఐసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) యాప్స్ వంటి వాటిలో శక్తిని ఆదా చేస్తుంది.
డాక్టర్ ఎంఎస్ మణికందన్, డాక్టర్ శ్రీనివాస్ బొప్పు నేతృత్వంలోని పరిశోధకుల బృందం అల్ట్రా-లో పవర్ కాంప్లిమెంటరీ మెటల్-ఆక్సైడ్ సెమీకండక్టర్(సీఎంఓఎస్) డేటా మార్పిడి ఐసీని రూపొందించి అభివృద్ధి చేసింది. "ఈ ఐసీ వేగంగా బయోమెడికల్ డేటాను ప్రసారం చేస్తుంది, తక్కువ శక్తిని ఎడ్జ్ కంప్యూటింగ్ లేదా క్లౌడ్ కంప్యూటింగ్ పరికరాలకు వినియోగిస్తుంది" అని మణికందాన్ అన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ మ్యాన్ పవర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ ఐసీ అభివృద్ధి చేశారు. మొహాలీలోని సెమీ కండక్టర్ లేబొరేటరీ(ఎస్ సిఎల్)లో ఫ్యాబ్రికేట్ చేసినట్లు తెలిపారు.
డాక్టర్ విజయ శంకర రావు, పసుపురేడి నేతృత్వంలోని మరో బృందం డిజిటల్ ఇంటెన్సివ్ సబ్ శాంపులింగ్ షార్ట్ రేంజ్ గల పవర్ ఆర్ఎఫ్ ఫ్రంట్ ఎండ్ ఐసీని రూపొందించి అభివృద్ధి చేసింది. చిప్‌లో అనేక డిజైన్ ఆవిష్కరణలు ఉన్నాయి. దీనిని తైవాన్ సెమీకండక్టర్ తయారీ కంపెనీలో ఫ్యాబ్రికేట్ చేశారు. ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్ వి రాజా కుమార్ మాట్లాడుతూ.. "గత నాలుగు సంవత్సరాలుగా చాలా కష్టపడి పనిచేసిన తర్వాత ఈ సెమీకండక్టర్ చిప్స్ అభివృద్ధి చేసినట్లు" తెలిపారు.
(చదవండి: 2021లో భారత్‌లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!)