inter certificate
-
గుడ్‌న్యూస్.. వరద బాధితులకు ఉచితంగా ఇంటర్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ఇటీవల ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, సెప్టెంబర్‌లో సంభవించిన వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలామంది తమ సర్టిఫికెట్లు కోల్పోయారు. ఇలాంటి వారికి ఉచితంగా సర్టిఫైడ్ కాపీలు/ డూప్లికేట్ సర్టిఫికెట్లు అందించాలని ఇంటర్ విద్యా మండలి నిర్ణయించినట్లు ఇంటర్ విద్య కార్యదర్శి కృతికా శుక్లా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అంశంపై వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్ఐవోలు, డీఐఈవోలు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు వారు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపల్, జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని, లేదా నేరుగా బోర్డు అధికారులను గాని సంప్రదించాలని సూచించారు.పదో తరగతి హిందీ సిలబస్ కుదింపుసాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 1,000 ప్రభుత్వ సీబీఎస్ఈ స్కూళ్లను ప్రభుత్వం స్టేట్ సిలబస్‌లోకి మార్చిన నేపథ్యంలో ఆయా స్కూళల్లో సిలబస్‌ను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు పరీక్షలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా హిందీ సిలబస్ అధికంగా ఉన్న నేపథ్యంలో కొన్ని చాప్టర్లను తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ స్కూళ్ల విద్యార్థులకు జూన్– జూలై సిలబస్‌తో ఎఫ్ఏ–1 హిందీ నమూనా పరీక్షను మంగళవారం పూర్తి చేశామని తెలిపారు. అలాగే, కొత్త విధివిధానాల ప్రకారం పదో తరగతి విద్యార్థులకు హిందీ సిలబస్ అధికంగా ఉన్నందున పద్యభాగ్–7 (ఆత్మత్రాణ్), గద్యభాగ్–11 (తీసరీ కసమ్ కే వశల్ పకార్ శేలేంద్ర), గద్యభాగ్–12 (అబ్ కహా దూస్రోంకే దుఖ్ సే దుఖీ హోనీవాలీ), ఉపవాచక్–3 (టోపీ శుక్లా) పాఠాలను తొలగిస్తున్నట్టు తెలిపారు. కేఎల్‌యూ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదలతాడేపల్లిరూరల్ : గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ క్యాంపస్‌లలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశ నిమిత్తం జాతీయస్థాయిలో నిర్వహించనున్న ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష 2025 పోస్టర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, విద్యావిధానం, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే రాయితీలు, స్కాలర్షిప్ విధానం గురించి యూనివర్సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ జగన్నాథరావు, వైస్ చాన్సలర్ డాక్టర్ పార్థసారథి వర్మ, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. డాక్టర్ పార్థసారథి వర్మ మాట్లాడుతూ యూనివర్సిటీ అందించే ఇంజినీరింగ్ కోర్సులకు మొదటి విడత ప్రవేశ పరీక్షను డిసెంబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
కేరళ వరదలు : సర్టిఫికెట్లు లేవని యువకుడి ఆత్మహత్య
తిరువనంతపురం : కేరళను ముంచెత్తుతున్న వరదలు ఒక పంతొమ్మిదేళ్ల యువకుని భవిష్యత్తుని కూడా మింగాయి. వరదల్లో సర్టిఫికెట్లు నాశనం అయిన విషయం తట్టుకోలేని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. కొజికోడ్కు చెందిన కైలాష్ మరి కొద్ది రోజుల్లో ఐటీఐ కోర్సులో జాయిన్ కావాల్సి ఉంది. అందుకోసం కొంత డబ్బుతో పాటు కొత్త బట్టలు కూడా కొని పెట్టుకున్నాడు. కానీ అనుకోని ప్రమాదంలా వచ్చిన వరదలు అతని ఆశల్ని చిదిమేసాయి. కేరళను ముంచెత్తిన భారీ వరదల్లో కైలాష్ నివాసం కూడా మునిగి పోయింది. దాంతో కైలాష్ తల్లిదండ్రులతో కలిసి సమీప సహాయక శిబిరానికి వెళ్లాడు. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు లేవని ప్రకటించడంతో కైలాష్ ఆదివారం తన నివాసానికి చేరుకున్నాడు. కానీ ఇంటి పరిస్థితుల చూసిన అతనికి నోట మాట రాలేదు. ఎందుకంటే ఆ వరదల్లో కైలాష్ ఇంట్లోని వస్తువులే కాక అతని ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్లు కూడా నాశనమయ్యాయి. దాంతో మనస్తాపం చెందిన కైలాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హాల్‌టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం
* నిప్పంటించుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి * 90 శాతం గాయాలతో పరిస్థితి విషమం * ఇంటర్ సర్టిఫికెట్‌కు గుర్తింపు లేకపోవడమే కారణం * అడ్మిషన్ సమయంలో పట్టించుకోని కళాశాల * పరీక్షల సమయంలో హాల్‌టికెట్ జారీ చేయని ఉన్నత విద్యామండలి * కాలేజీ నిర్వాకంపై తోటి విద్యార్థుల ఆగ్రహం మొయినాబాద్: హాల్‌టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సర్టిఫికెట్లు సరిగా తనిఖీ చేయకుండా అడ్మిషన్ ఇచ్చిన కాలే జీ యాజమాన్యం.. తీరా పరీక్షల సమయంలో హాల్‌టికెట్ రాలేదని చేతులె త్తేయడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. 90 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరులో గాయత్రి ఆలయ సమీపంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్‌కు చెందిన కె.శివమహేష్(21).. గతేడాది తొలుత విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివినట్లు సర్టిఫికెట్‌ను ఇంజనీరింగ్ కాలేజీలో మహేశ్ సమర్పించాడు. అయితే ఆ కాలేజీకి గుర్తింపు లేదని, ఇంటర్ సర్టిఫికెట్ చెల్లద సిబ్బంది ఇంజనీరింగ్ అడ్మిషన్‌ను రద్దు చేశారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా హిమాయత్‌నగర్‌లో ఉన్న అభినవ్ హైటెక్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈఈఈ గ్రూపులో శివమహేశ్ చేరాడు. సదరు కళాశాల యాజమాన్యం అతడి సర్టిఫికెట్లను తనిఖీ చేయకుండానే కాసులకు కక్కుర్తి పడి అడ్మిషన్ ఇచ్చింది. ఆరు నెలలుగా కళాశాలకు వెళ్తున్న మహేశ్.. మొదటి సంవత్సరం పరీక్షకు ఫీజు సైతం చెల్లించాడు. అయితే హాల్‌టికెట్ల జారీ కోసం విద్యార్థుల సర్టిఫికెట్లను తనిఖీ కోసం ఉన్నత విద్యామండలికి కళాశాల యాజమాన్యం పంపించింది. మహేశ్ ఇంటర్ చదివిన కాలేజీకి ప్రభుత్వ గుర్తింపు లేదని, హాల్‌టికెట్ జారీ చేయడం లేదని ఉన్నత విద్యామండలి తెలియజేసింది. దీంతో ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం ఈ నెల 12న శివమహేశ్కు తెలిపింది. సోమవారం నుంచి మొదటి ఏడాది పరీక్షలు ప్రారంభం కావడం.. పరీక్షకు హాల్‌టికెట్ రాకపోవడంతో శివమహేశ్ తీవ్రంగా మనస్తాపం చెందాడు. చిలుకూరు రెవెన్యూ పరిధిలోని గాయత్రి ఆలయం సమీపంలోని నిర్మాణుష్య ప్రదేశంలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలకు తాళలేక పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని ఓ ఇంటి వాచ్‌మన్ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తీవ్రంగా గాయపడిన శివమహేశ్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. శివమహేశ్‌ను చేర్చుకునే సమయంలోనే కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లను క్షణంగా తనిఖీ చేయాల్సింది. అప్పుడే ఇంటర్ సర్టిఫికెట్ చెల్లదని గుర్తించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని తోటి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో చేరి 6 నెలలుగా తరగతులకు హాజరై తీరా పరీక్షల సమయంలో హాల్ టికెట్ రాకపోవడంతో శివమహేశ్ మనోవేదనకు గురైనట్లు పేర్కొన్నారు.