Inter first year exams
-
ఇంటర్ పరీక్షల ఫీజు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్‌లో జరిగే ఇంటర్ మొదటి, రెండో ఏడాది పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలను ఇంటర్ బోర్డ్ గురువారం ప్రకటించింది. ఫస్టియర్ అన్ని గ్రూపులకు, సెకండియర్ ఆర్ట్స్ గ్రూపుల విద్యార్థులు రూ.490, సెకండియర్ సైన్స్ గ్రూపు విద్యార్థులు (ప్రాక్టికల్స్ కలిపి) రూ.690 చెల్లించాలని పేర్కొంది. ఒకేషనల్ సైన్స్ గ్రూపు విద్యార్థులు రూ.690, బ్రిడ్జి కోర్సు సహా ఒకేషనల్ రాసేవారు రూ.840, సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులు రూ.690, బ్రిడ్జి కోర్సు అయితే రూ.840 చెల్లించాలని పేర్కొంది. ప్రైవేటు విద్యార్థులు ప్రతి సంవత్సరానికి రూ.490 చెల్లించాలని తెలిపింది. ఫస్టియర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే అసలు ఫీజు రూ.490తో పాటు, ప్రతి సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలని తెలిపింది. -
Telangana: చీఫ్ ఎగ్జామినర్లుగా జూనియర్లా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ మూల్యాంకన ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. దీనివల్ల మూల్యాంకనం, తద్వారా ఫలితాల వెల్లడి ఆలస్యం అయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాలు అంటున్నాయి. గత నెల 25 నుంచి మొదలైన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఈ నెల 3వ తేదీతో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.12 లక్షల మంది పరీక్షలు రాశారు. మొత్తం 40 లక్షలకు పైగా పేపర్లను అధికారులు మూల్యాంకనం చేసి, మార్కులు అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. నెలాఖరులోగా ఫలితాలు వెల్లడిస్తామన్న ధీమా కూడా అధికారులు వ్యక్తం చేశారు. ఇందుకు అనుగుణంగానే జిల్లా కేంద్రాల్లో ఈ నెల 3 నుంచి మూల్యాంకన ప్రక్రియను పెద్ద ఎత్తున మొదలు పెట్టారు. అయితే అధికారుల మధ్య సమన్వయ లోపం, ఇతర అంశాల కారణంగా ఇంతవరకు వేగం పుంజుకోలేదు. మమ్మల్ని అవమానించడమే..: మూల్యాంకనం సందర్భంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పలు వురు అధికారులు ఇంటర్ బోర్డ్ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. కానీ అధికారుల మధ్య సమ న్వయం లోపించడంతో వీటిని ఏమాత్రం పరిగణన లోనికి తీసుకోలేదని తెలిసింది. స్పాట్ వాల్యూయే షన్లో సీనియర్లకు కాకుండా, జూనియర్లకు ఎక్కు వగా బాధ్యతలు అప్పగించడం తొలిరోజే వివాదా స్పదమైంది. చీఫ్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎగ్జామి నర్లుగా జూనియర్లను వేయడం ఏమిటని సీనియర్ అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. సమస్య తలెత్తిన ప్పుడు పరిష్కరించడం వారికి కష్టమవుతుందని చెబుతున్నారు. ఇది తమను అవమానించడమేనని కొందరు అంటున్నారు. తాజా పరిణామాల ప్రభావం స్పాట్‌పై పడుతుందనే సందేహాలు ఉన్నతాధికారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అధికారుల తీరుతో విమర్శలు మూల్యాంకనం ఆలస్యమైతే, అధ్యాపకులు ఇదే విధుల్లో ఎక్కువ కాలం కొనసాగితే బోధన దెబ్బ తింటుందని ప్రభుత్వ అధ్యాపకులు చెబుతున్నారు. దాదాపు 40 లక్షల పేపర్లు కేవలం ప్రభుత్వ అధ్యాపకులే మూల్యాంకనం చేయడం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే వీలుందని చెబుతున్నారు. అయితే ప్రైవేటు కాలేజీల అధ్యాపకులను స్పాట్ వాల్యూయేషన్‌కు పంపేందుకు యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదని, తమ విద్యార్థుల క్లాసులు దెబ్బతింటాయని చెబుతున్నారని బోర్డు అధికా రులు అంటున్నారు. కాగా అధికారుల తీరును ప్రభుత్వ అధ్యాపకులు తప్పుబడుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు నష్టం కలిగినా ఫర్వాలేదని, ప్రైవేటు కాలేజీలు మాత్రం సక్రమంగా జరగాలన్నట్టుగా ఇంటర్ బోర్డ్ అధికారులు వ్యవహరించడం దారుణమని అంటున్నారు. ప్రైవేటు అధ్యాపకులను మూల్యాం కనంలో భాగస్వాములను చేయని పక్షంలో వారం రోజుల్లో పూర్తవ్వాల్సిన మూల్యాంకన ప్రక్రియ మూడు వారాలు పడుతుందని చెబుతున్నారు. మూల్యాంకనం కొనసా గుతుంటే విద్యా బోధనపై దృష్టి పెట్టలేమని అంటున్నారు. కీలక సమయంలో మొదటి, ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు నష్టం కలుగుతుందని పేర్కొంటున్నారు. ‘స్పాట్’కు రాకుంటే చర్యలు సాక్షి, హైదరాబాద్: స్పాట్ వాల్యుయేషన్ కోసం నియమించిన ప్రతీ సిబ్బంది సంబంధిత క్యాంపు కార్యాలయాల్లో విధిగా రిపోర్ట్ చేయాలని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆదేశాలను పాటించనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్ ఫస్టియర్ మూల్యాంకనం ఇప్పటికే మొదలైందని తెలిపారు. మొదటి విడత మూల్యాంకనంలో ప్రైవేటు కాలేజీల సిబ్బందిని తీసుకున్నా.. వారు చాలావరకు విధుల్లోకి రాలేదు. దీంతో, రెండోదశలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల వాళ్లంతా వాల్యుయేషన్‌కు రావాలని ఇంటర్ బోర్డ్ ఆదేశించింది. పూర్తయ్యే వరకూ సెలవు ఇవ్వాలి స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు సెలవులు ఇవ్వాలి. అప్పుడే మూల్యాంకనం త్వరగా పూర్తయి, ఫలితాలు సకాలంలో ఇవ్వొచ్చు. ఇంటర్ బోర్డ్‌లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మూల్యాంకన ప్రక్రియకు అడ్డంకులు కల్పిస్తున్నారు. ఇది ప్రైవేటు కాలేజీలకు పరోక్షంగా సహకరించడమే. – మాచర్ల రామకృష్ణగౌడ్, కన్వీనర్, తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి రెగ్యులర్ అధ్యాపకులకు అవమానం మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న రెగ్యులర్ అధ్యాపకులను అవమానించేలా ఇంటర్ బోర్లు వ్యవహరిస్తోంది. 60 శాతం కాంట్రాక్టు అధ్యాపకులను స్పాట్ వాల్యూయేషన్‌లో చీఫ్ ఎగ్జామినర్లుగా వేయడం, 40 శాతం రెగ్యులర్ వారిని వేయడం అవమానించడమే. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో మూల్యాంకన ప్రక్రియకు దూరంగా ఉంటాం. – తంగిరాల జగదీష్, రాష్ట్ర అధ్యక్షుడు, పీఆర్టీయూ -
అన్ని ప్రశ్నలూ అందులోంచే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేథమెటిక్స్, బొటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్–1 తేలికగా రాయగలిగామని చెబుతున్నారు. తాజా ప్రశ్నపత్రాలపై ఇంటర్ బోర్డ్ ఉన్నతాధికారులు విశ్లేషణ చేశారు. మొత్తంగా 98 శాతం ఇంటర్ బోర్డు విడుదల చేసిన ప్రాథమిక అభ్యసన దీపిక నుంచే ప్రశ్నలు వచ్చాయని అధికారులు చెప్పారు. గణితంలో 12, 13, 20 ప్రశ్నలు మాత్రమే బేసిక్ లెర్నింగ్ మెటీరియల్లోంచి రాలేదని... అయితే, వాటిని చాయస్ కింద వదిలేసినా వంద శాతం స్కోర్ చేయవచ్చని బోర్డు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని? సివిక్స్ (పొలిటికల్ సైన్స్): సెక్షన్ ఏలో 10 మార్కుల ప్రశ్నలు ఆరు ఇచ్చి మూడు రాయమన్నారు. ఇందు లో నాలుగు ప్రశ్నలు మెటీరియల్ నుంచి వచ్చాయి. సెక్షన్ బిలో ఐదు మార్కుల ప్రశ్నలు 16 ఇచ్చారు. ఇందులో 8 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. 13 ప్రశ్నలు మెటీరియల్లోంచే వచ్చాయి. సెక్షన్ సిలో రెండు మార్కుల ప్రశ్నలు 25 ఇచ్చి, 15 ప్రశ్నలు సమాధానాలు ఇవ్వమన్నారు. ఇందులో 5 మినహా అన్నీ కవర్ అయ్యాయి. గణితం: సెక్షన్ ఎలో రెండు మార్కుల ప్రశ్నలు 10 ఇంటికి పది మెటీరియలోంచే వచ్చాయి. సెక్షన్ బిలో 4 మార్కుల ప్రశ్నలు పదింటికి ఐదు రాయాలి. రెండు మినహా అన్నీ మెటీరియల్లోంచే వచ్చాయి. సెక్షన్ సిలో ఏడు మార్కుల ప్రశ్నలు తొమ్మిది ఇచ్చారు. ఇందులో అన్నీ కవర్ అయ్యాయి. బాటనీలో అన్ని సెక్షన్లలోనూ అన్ని ప్రశ్నలూ మెటీరియల్ పరిధిలోంచే వచ్చాయి. సమయం ఎంతో ఆదా : సయ్యద్ ఒమర్ జలీల్ (ఇంటర్ విద్య కమిషనర్) విద్యార్థులు అతి తక్కువ సమయంలోనే మంచి మార్కులు సాధించడానికి బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగపడుతోంది. ఇందులో మొత్తం ప్రశ్నలను వాటి సమాధానాలను క్షుణ్ణంగా చదివితే ఉత్తమ ఫలితాలు ఖాయం. ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులు విజయం సాధించడానికి దోహదపడుతోంది. ఇది కరదీపికే : ఉడిత్యాల రమణారావు (రీడర్ విద్యా పరిశోధనా విభాగం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్) ప్రాథమిక అభ్యసన దీపిక విద్యార్థులకు కరదీపికగా ఉపయోగపడుతోంది. వీటిని అనుసరించిన ప్రతీ ఒక్కరూ మంచి స్కోర్ చేయవచ్చని సబ్జెక్టు పరీక్షలు రుజువు చేశాయి. బేసిక్ మెటీరియల్‌ను అందరూ డౌన్లోడ్ చేసుకుని అనుసరిస్తే రాబోయే పరీక్షల్లో విజయం తథ్యం. -
TS: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు: ఇప్పటికైతే హ్యాపీ..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ప్రశ్నపత్రాలు సులువుగా ఉండటం విద్యార్థుల్లో జోష్ నింపుతోంది. చాలా మంది మంచి మార్కులు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్ పరిధిలోనే ప్రశ్నలుంటున్నాయని చెబుతున్నారు. ఐచ్ఛిక ప్రశ్నలివ్వడం కూడా కలసివస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకపైనా ఇదే మాదిరిగా ప్రశ్నలు ఉంటాయని బోర్డు అధికారులు భరోసా ఇస్తున్నారు. సాదాసీదాగా పరీక్షలు రాసేవారు కూడా పాస్ మార్కులు తెచ్చుకోవడం సులభమేనని అధ్యాపకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐచ్ఛిక ప్రశ్నల్లో సమాధానం ఇచ్చేందుకు వీలుగా బోర్డ్ విడుదల చేసిన స్టడీ మెటీరియల్‌లో పోర్షన్ ఉంటోందని వారు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన, కోవిడ్ వల్ల సిలబస్ పూర్తికాని పరిస్థితులను పరిగణలోనికి తీసుకునే ప్రశ్నపత్రాలు రూపొందించినట్టు అధ్యాపకవర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీలు సైతం ఇప్పటి వరకూ తాము అందించిన స్టడీ మెటీరియల్‌కు బదులు ఇంటర్ బోర్డ్ మెటీరియల్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కన్పిస్తోంది. సోమ, మంగళవారాల్లో జరిగిన లాంగ్వేజ్ పేపర్లలో ప్రశ్నలు తికమక పెట్టేలా లేవని నిపుణులు చెబుతున్నారు. మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్ సబ్జెక్టుల్లో ఈ అవకాశాలుండే వీలుందని కొంత సందేహిస్తున్నారు. అయితే, ఇవి కూడా ఇంచుమించు విద్యార్థులను ఇబ్బంది పెట్టబోవని ఇంటర్ బోర్డ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఐచ్ఛికాలతో నెట్టుకొచ్చారు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం జరిగిన ద్వితీయ భాష పరీక్షకు 4,30,563 (మొత్తం 4,59,240) హాజరయ్యారు. తాజా ఇంటర్ పరీక్షలను 70 శాతం సిలబస్ నుంచే ఇస్తున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఈమేరకే స్టడీ మెటీరియల్ ఇచ్చింది. అయితే, కొన్ని ప్రశ్నలు మాత్రం ఊహించని విధంగా వచ్చాయని తెలుగు సబ్జెక్టు విద్యార్థులు తెలిపారు. చాయిస్ ఇవ్వడం వల్ల ఆ ప్రశ్నల వల్ల ఇబ్బంది కలగలేదని చెప్పారు. 30 శాతం ప్రశ్నలు ప్రిపేర్ కాని చాప్టర్ల నుంచి వచ్చాయని, వీటిని చాయస్‌గా వదిలేశామని మెజారిటీ విద్యార్థులు ‘సాక్షి’కి తెలిపారు. తొలిరోజు మాత్రం విద్యార్థులు కొంత ఆందోళనగా కన్పించారు. ఆలస్యంగా పరీక్షలు జరగడం ఒకటైతే, పదవ తరగతి పరీక్షలు రాయకుండా ఇంటర్లోకి రావడం మరో కారణంగా అధ్యాపకులు చెబుతున్నారు. పరీక్షలు రాసే అవకాశం చాలా కాలం తర్వాత రావడంతో విద్యార్థుల్లో మొదట ఆందోళన నెలకొందని విశ్లేషిస్తున్నారు. రెండో రోజు మాత్రం ఆ సమస్య కనిపించలేదని ఇన్విజిలేటర్స్ పలువురు తెలిపారు. ఆత్మవిశ్వాసం పెరిగింది.. చాలాకాలం తర్వాత పరీక్షలు రాయాల్సి రావడంతో కొంత ఆందోళన అనిపించింది. బోర్డు మెటీరియల్ ఫాలో అవ్వడం, ప్రశ్నపత్రాలు ఐచ్ఛికాలతో ఉండటం వల్ల మొదటి రెండు పరీక్షలు తేలికగా రాశాం. మిగతా పరీక్షలు తేలికగా రాయగలనన్న ఆత్మవిశ్వాసం పెరిగింది. –శశాంక్ (విద్యార్థి, దిల్సుఖ్నగర్ పరీక్ష కేంద్రం వద్ద) పాసవడం తేలికే.. ఇప్పటివరకూ జరిగిన రెండు పేపర్లు గతంకన్నా భిన్నంగా ఉన్నాయి. ఎక్కువ భాగం బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్ నుంచే ప్రశ్నలు వచ్చాయి. విద్యార్థులు ఏమాత్రం దృష్టి పెట్టినా తేలికగా పాసయ్యే వీలుంది. ఇతర సబ్జెక్టుల విషయంలోనూ ఇదే పద్ధతి ఉంటే బాగుంటుంది. – జీకే రావు (ప్రైవేటు కాలేజీ లెక్చరర్) -
గంట ముందే కేంద్రానికి రావాలి
సాక్షి, హైదరాబాద్: రేపటి నుంచి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. పరీక్షల మూల్యాంకనం నవంబర్ మొదటి వారంలో మొదలువుతుందని, వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. బోర్డు జాయింట్ సెక్రటరీలు శ్రీనివాసరావు, నాయక్, ఓఎస్డీ సుశీల్‌తో కలసి జలీల్ శుక్రవారం మీడియాకు పరీక్షల వివరాలు తెలియజేశారు. ఈ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కోవిడ్ కారణంగా పదో తరగతి పరీక్షలు లేకుండా ప్రమోట్ అయ్యారని గుర్తు చేశారు. వరుసగా రెండో ఏడాది పరీక్షలు నిర్వహించలేకపోతే వారి భవిష్యత్‌కు ఇబ్బంది ఉంటుందనే ఫస్టియర్ పరీక్షలు పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నామన్నారు. 70 శాతం సిలబస్‌లోంచే ప్రశ్నాపత్రం రూపొందించామని, మునుపెన్నడూ లేని విధంగా 40 శాతం ఐచ్చిక ప్రశ్నలిస్తున్నామని తెలిపారు. తాము విడుదల చేసిన స్టడీ మెటీరియల్‌ను అనుసరిస్తే పరీక్షల్లో విజయం సాధించడం తేలికేనని జలీల్ చెప్పారు. వ్యాక్సినేషన్ పూర్తయిన 25 వేల మంది ఇన్విజిలేటర్లను గుర్తించామని వెల్లడించారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని, థర్మల్ స్క్రీనింగ్ తర్వాత అస్వస్థతగా ఉన్న విద్యార్థులను ఇందులో ఉంచుతామని చెప్పారు. పరీక్ష రాయగలిగితే ఐసోలేషన్‌లోనే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతో పరీక్షకు వెళ్లవచ్చన్నారు. ఆయన చెప్పిన ముఖ్యాంశాలు... ►పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు, వి ద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించేందు కు ప్రతీ జిల్లాలోనూ కలెక్టర్ నేతృత్వంలో హైపవర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎస్పీ, డీఐఈవో, సీనియర్ ప్రిన్సిపల్, జేఎల్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ►విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీతో సమన్వయం చేసుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, మెడికల్, విద్యుత్, పోస్టల్ సిబ్బంది ప్రత్యేక సేవలందిస్తారు. పరీక్ష కేంద్రాలు, ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ►హాల్టికెట్లలో తప్పులుంటే నోడల్ అధికారిని, ప్రిన్సిపాల్‌ను సంప్రదించి సాయం పొందొచ్చు. అభ్యర్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రానికి అనుమతించరు. 8.45 గంటలకు ఓఎంఆర్ అందజేస్తారు. 9 గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. కోవిడ్ జాగ్రత్తలు ►పరీక్ష విధుల్లో పాల్గొనే ఇన్విజిలేట ర్లు, అధికారులు, చీఫ్ సూపరింటెం డెంట్ సహా అందరినీ వ్యాక్సినేషన్ పూర్తయిన వారినే ఎంపిక చేశారు. పరీక్ష కేంద్రాన్ని శానిటైజేషన్ చేస్తారు. ప్రతీ విద్యార్థి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మాస్క్‌లు తెచ్చుకోని వారికి పరీక్ష కేంద్రాల్లో అందజేస్తారు. అంతేతప్ప ఆ కారణంతో పరీక్ష రాసేందుకు నిరాకరించరు. ►పరీక్షలు జరిగే వరకూ కేంద్రంలో స్టా ఫ్ నర్సు ఉంటారు. ఒక్కో పరీక్ష కేం ద్రంలో 250కి మించి విద్యార్థులు లే కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సామాజిక దూరాన్ని దృష్టిలో ఉం చుకుని బెంచ్‌కు ఒకరు లేదా ఇద్దరిని కూర్చోబెడతారు. విద్యార్థులు 50 ఎంఎల్ శానిటైజర్లు తెచ్చుకోవచ్చు. -
ఈ నెల 25 నుంచి తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
-
Telangana: పరీక్షలంటే భయపడితే కాల్చేయండి!
సాక్షి, హైదరాబాద్: పరీక్షలంటేనే భయం. కరోనా ఆ భయాన్ని మరింత పెంచింది. ఆ భయాన్ని పోగొట్టేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ ముందడుగు వేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్ నేపథ్యంలో... మానసిక ఒత్తిడి, పరీక్షల భయం ఉన్న విద్యార్థులకు క్లినికల్ సైకాలజిస్టుల సహాయాన్ని అందించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆందోళనకు గురయ్యే విద్యార్థులు సైకాలజిస్టులకు ఫోన్ చేసి సహాయం పొందాలని పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ఇచ్చే సైకాలజిస్టుల ప్యానల్లో వైద్యులు అనిత ఆరే (9154951704,), మేజర్ అలీ (9154951977), రజనీ తెనాలి (91549 51695), పి జవహర్లాల్ నెహ్రూ (91549 51699), యస్ శ్రీలత (9154951703), శైలజ పిశాపాటి (9154951706), అనుపమ (9154951687) ఉన్నారు. (చదవండి: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఆపలేం.. హైకోర్టు గ్రీన్‌సిగ్నల్) పరీక్షలకు సహకరిస్తాం: టీపీజేఎంఏ ఈ నెల 25 నుంచి జరిగే ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలకు అన్ని విధా ల సహకరిస్తామని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం (టీపీజేఎంఏ) అధ్యక్షుడు గౌరీ సతీశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్‌తో చర్చల అనంతరం ఆయన ఈ నిర్ణయాన్ని వెలువరించారు. పెండింగ్‌లో ఉన్న కాలేజీల ఉపకారవేతనాలకు సంబంధించిన ప్రతిపాదన ప్రభుత్వానికి పంపుతామని ఆయన హామీ ఇచ్చారని సతీశ్ తెలిపారు. (చదవండి: చలో సర్కారు బడి.. అదే సమస్య మరి!) -
తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఆపలేమని తేల్చిచెప్పిన హైకోర్టు
-
తెలంగాణ: లైన్ క్లియర్, 25 నుంచి ఇంటర్ పరీక్షలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది. ఇంటర్ పరీక్షలు ఆపలేమని హైకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. ఈ నెల 25 నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను ఆపడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది. ఇంటర్ బోర్డ్ పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. చదవండి: TS Inter 1st Year Exams: ఇంటర్ పరీక్షలు.. ఇక డొంక తిరుగుడు ప్రశ్నలుండవ్! ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందని, పిటిషన్ దాఖలు చేయడంలో ఆలస్యమైనందని హైకోర్టు పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పిటిషన్ వెనక్కి తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. కాగా తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 25 నుంచి ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దు చేయాలని గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. చదవండి: హైదరాబాద్‌లో దృశ్యమైన బాలుడు అనీష్ మృతి పేరేంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. ఇంటర్ ఫస్టియర్ ప్రమోటైన విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించవద్దని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇంటర్ పరీక్షలను రద్దు చేయలేమని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 58 మంది ఇంటర్ విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. -
Huzurabad bypoll: ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రీషెడ్యూల్ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 25 నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయి. 29,30 తేదీన జరగాల్సిన పరీక్షలను ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. అక్టోబర్ 29న జరగాల్సిన పరీక్షలను అక్టోబర్ 31.. 30న జరగాల్సిన పరీక్షలను నవంబర్ 1న నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.(చదవండి: బెట్టు వీడని ఏజెంట్లు.. మెట్టు దిగని సర్కారు) ఈ నెల 25న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1, 26న ఇంగ్లీష్ పేపర్-1, 27న మాథ్స్ పేపర్-1ఏ, బోటని పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1, 28న మ్యాథ్స్ పేపర్-1బీ, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1, 31న ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1, నవంబర్ 1న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, నవంబర్ 2న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1 పరీక్షలు జరుగుతాయి. చదవండి: బాలికలకు చాక్లెట్ల ఆశ చూసి.. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం.. -
25 నుంచి తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షల తేదీని శుక్రవారం ఇంటర్ బోర్డు ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ రెండు వరకు పరీక్షలు నిర్వహిస్తామని టైంటేబుల్ విడుదల చేసింది. గతంలో ప్రకటించిన ప్రకారమే 30 శాతం సిలబస్‌ను తప్పించి, 70 శాతం సిలబస్‌లోనే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. విద్యార్థులందరినీ ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేశారు. కాగా, కోవిడ్ తీవ్రత తగ్గిందని వైద్య, ఆరోగ్య శాఖ ఆగస్టులో తెలపడంతో ఈ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నెలరోజుల క్రితమే తెలిపారు. విద్యార్థులు రెండో ఏడాది సిలబస్‌తో పాటు, వివిధ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఫస్టియర్ పరీక్షలపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటిని పక్కన పెట్టి ఇంటర్ బోర్డు పరీక్షల తేదీలను వెల్లడించింది. -
తెలంగాణలో అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. 2020-21 విద్యాసంవత్సరానికి చెందిన ఫస్టియర్ విద్యార్థులకు (ప్రస్తుతం సెకండియర్‌లో ఉన్న విద్యార్థులు) పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 70 శాతం సిలబస్ నుంచే ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందినే విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో ఒకటి, రెండు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, ఏఎన్ఎం లేదా స్టాఫ్ నర్సు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. చదవండి: సివిల్స్-2020 ఫలితాలు విడుదల పరీక్షల షెడ్యూల్ ► అక్టోబర్ 25న సెకండ్ లాంగ్వేజ్ ►అక్టోబర్ 26న: ఇంగ్లీష్ పేపర్ 1 ►అక్టోబర్ 27న: మాథ్స్ పేపర్1a,బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ 1 ►అక్టోబర్ 28న: మాథ్స్ పేపవర్ 1బీ, జూవాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 ►అక్టోబర్ 29న: ఫిజిక్స్ పేపర్1, ఎకనమిక్స్ పేపర్1 ►అక్టోబర్ 30 న: కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 ► నవంబర్ 1న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ►2న మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది విద్యాశాఖ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. నేరుగా సెకండ్ ఇయర్‌కు విద్యార్థులను ప్రమోట్ చేసింది. అయితే ప్రమోట్ అయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. కరోనా పరిస్థితులు మళ్ళీ తలెత్తితే సెకండ్ ఇయర్లో మార్కులు కేటాయించడంపై ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రస్తుతం వారికి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. -
‘ఫస్టియర్’ ప్రశాంతం
ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. గ్రేటర్లో మొదటి పరీక్షలకు 5101 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సు మొరాయించడంతో...అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులు కాస్త ఇబ్బందిపడ్డారు. చాలా మంది వారికి లిఫ్ట్ ఇవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు. పోలీసు వాహనంలో కొందరిని పరీక్ష కేంద్రాలకు తరలించారు. ఇక ఇంటర్ సెకండియర్ పరీక్షలు షెడ్యూలు ప్రకారం మార్చి 2 వతేదీ నుంచి ప్రారంభమవుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు మరోసారి స్పష్టం చేసింది. సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు లేదని ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి స్పష్టం చేసింది. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే (మార్చి 2న సెకండ్ ఇయర్) పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. అభ్యర్థులు నిర్థేశిత సమయానికి గంట ముందే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. ఆలస్యంగా వచ్చిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. హైదాబాద్ జిల్లాలో 79574 మంది విద్యార్థులకు 77258 మంది హాజరుకాగా, 2316 మంది గైర్హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 5803 మందికి 56538 మంది హాజరయ్యారు. 1515 మంది గైర్హజరయ్యారు. మేడ్చల్‌జిల్లాలో 60876 మందికి 59606 మంది పరీక్ష రాయగా, 1270 మంది గైర్హ జరైనట్లు ఆయా జిల్లాల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించారు. నిమిషం ఆలస్యం నిబంధనలో కొంత సడలింపు ఇచ్చారు. నాలుగైదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను కూడా లోనికి అనుమతించారు. తొలితప్పిదంగా భావించి వారిని హెచ్చరించారు. మాల్‌ప్రాక్టీస్, మాస్‌కాఫియింగ్ వంటి ఎలాంటి కేసులు నమోదు కాలేదు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంతో ఆయా సెంటర్ల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో విద్యార్థులు కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. మొరాయించిన ఆర్టీసీ బస్సు...పోలీసు వాహనంలో తరలింపు మారేడుపల్లి: ఇంటర్ పరీక్షలు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. పరీక్ష సెంటర్‌కు బయలుదేరే ముందే ఆర్టీసీ బస్సు మొరాయించడంతో విద్యార్థులు కంగారుపడ్డారు. చివరకు ఆ దారిలో వెళ్లే వాహనదారులను లిఫ్ట్ అడిగి కొందరు బయలుదేరగా...మరికొంత మందిని మారేడుపల్లి సీఐ శ్రీనివాసులు తన వాహనంలో ఎక్కించుకుని స్వయంగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మాగ్నెట్ స్కూల్ అండ్ జూనియర్ మహిళా కళాశాలలో 78 మంది విద్యార్ధులు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు. వీరికి మారేడుపల్లిలోని బాలికల జూనియర్ కళాశాలలో పరీక్ష సెంటర్ కేటాయించారు. ఉదయం 7:30 గంటలకు రాణీగంజ్–2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విద్యార్థులను తరలించేందుకు హాస్టల్‌కు చేరుకుంది. 7:45 గంటల ప్రాంతంలో విద్యార్థులు బస్సులో వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. తీరా బయలుదేరే ముందు బస్సు మొరాయించింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురై కన్నీటిపర్యంతమయ్యారు. మారేడుపల్లి సీఐ శ్రీనివాసులు ఆ దారిగుండా వచ్చే ఆటోలను ఆపి విద్యార్థులను పరీక్షహాల్‌కు తరలించారు. కొందర్ని తన వాహనంలో పరీక్ష సెంటర్‌కు తీసుకువెళ్ళారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : ఈ నెల 25 నుంచి జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇంటర్ పరీక్షల ప్రాంతీయ అధికారి బి.వెంకటేశ్వరరావు చెప్పారు. స్థానిక సెయింట్ థెరిస్సా జూనియర్ కళాశాలలో శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, కస్టోడియన్స్, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లతో పరీక్షల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరుగుతాయన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 22,673 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,293 మంది హాజరుకానున్నారని తెలిపారు. విద్యార్థులను 40 నిమిషాలు ముందుగానే పరీక్ష హాలులోకి అనుమతించాలని వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు విజయరావు, రామలక్ష్మి, షా బాబా, హై పవర్ కమిటీ సభ్యులు ప్రభాకరరావు, బిల్లీ గ్రహం పాల్గొన్నారు.