interest in Business
-
చిన్నారి కన్నీరు
► కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న నాయుడుపేట సీఐపై ► చర్యలు తీసుకోవాలని దళితకుటుంబం వేడుకోలు ► కష్టం గుర్తుకొచ్చి కంటతడి పెట్టిన చిన్నారి ► న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు దళిత కుటుంబం వేడుకోలు నెల్లూరు (బృందావనం) : తమ స్థలాన్ని కాజేసిన వడ్డీ వ్యాపారికి కొమ్ముకాస్తు తమకు అన్యాయం చేస్తున్న నాయుడుపేట సీఐ రత్తయ్యపై చర్యలు తీసుకోవాలని నాయుడుపేట పొగగొట్టం కాలనీకి చెందిన దళిత కుటుంబం పోలీసు ఉన్నతాధికారులను కోరారు. కాలనీకి చెందిన పిగిలం లక్ష్మమ్మ, ఆమె కుమారుడు నాగార్జున, కోడలు ప్రతిమ స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. లక్ష్మమ్మ మాట్లాడుతూ తన భర్త తాగుడుకు బానిస కావడంతో అవకాశంగా తీసుకుని అతనికి స్థానిక వడ్డీ వ్యాపారి కొండూరు పొండురాజు తమకు తెలియకుండా రూ.15 వేల వరకు ఇచ్చారన్నారు. అప్పుకు తన భర్తతో కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకుని తనకు 2008లో ప్రభుత్వం ఇచ్చిన విలువైన ఇంటి స్థలాన్ని కాజేసేందుకు పాండు రాజు యత్నిస్తున్నాడని తెలిపారు. 2009లో ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారన్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేస్తే అప్పటి ఎస్ఐ తమకు న్యాయం చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించగా కమిషన్ ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ విచారణ జరిపి పాండురాజును తమ జోలికి వెళ్లదంటూ హెచ్చరించారన్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 22న కొందరు రౌడీలతో వచ్చి నా ఇంటి తాళం పగులగొట్టి సామాన్లు వీధిలో వేశారన్నారు. అడ్డుకున్న తనను, తన కోడలు ప్రతిమ, మనుమరాళ్లు సుప్రజ,సుప్రియలపై దాడి చేశారన్నారు. ఈ విషయమై సీఐ రత్తయ్యకు ఫిర్యాదు చేస్తే ఆయన నిందితులకు కొమ్ముకాస్తూ కోర్టుకెళ్లమని చెబుతున్నాడని ఆరోపించారు. జరిగిన సంఘటనలు వివరిస్తుండగా చిన్నారి సుప్రజ కన్నీటి పర్యంతమైంది. కొంతసేపు స్తబ్ధత నెలకుని, వాతావరణం గంభీరంగా మారింది. -
ఫైనాన్స్‌పై ఉక్కుపాదం
సాక్షి, ఖమ్మం: కొందరి ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రాంసరీ నోట్లు, చెక్కులు, ఏటీఎం కార్డులు, బంగారం, ఇతర వస్తువులను తనఖా పెట్టుకుని, గిరిగిరి తదితర అక్రమ వడ్డీ వ్యాపారాలతో జిల్లాలోని కొంతమంది కోట్లకు పడగలెత్తారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇలాంటి వ్యాపారం జిల్లాలో నడుస్తోంది. అవసరానికి డబ్బు తీసుకుని అధిక వడ్డీతో చెల్లించలేక చివరకు కొంతమంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు జిల్లాలో జరిగాయి. సంపదకు మించి అప్పులు చేస్తూ వ్యాపారులు ఐపీ దాఖలు చేస్తుండటంతో వీరికి అప్పులు ఇచ్చిన వారు కూడా గుల్లవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ అక్రమ వ్యాపారంపై ఎస్పీ రంగనాథ్ దృష్టి పెట్టారు. దీనిని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా 200 పోలీస్ బృందాలు ఏకకాలంలో 200 చిట్ఫండ్లు, 300 మంది వడ్డీ వ్యాపారుల కార్యాలయాలపై దాడులు చేశారు. ఖమ్మం, భద్రాచలం, మణుగూరు, ఇల్లందు, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో ఈ దాడులు ఎక్కువగా జరిగాయి. వ్యాపారుల నుంచి వందలాది ఖాళీ ప్రాంసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, బ్యాంక్ ఏటీఎం కార్డులు, దస్తావేజులు స్వాధీనపర్చుకున్నారు. అక్రమంగా అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇష్టానుసారంగా వ్యవహరించే అక్రమ వ్యాపారులపై మరిన్ని తనిఖీలు, సోదాలు జరుగుతాయని పేర్కొన్నారు. వ్యాపారులు లాభార్జనే ధ్యేయంగా అక్రమ వ్యాపారం చేస్తూ సంపదకు మించి అప్పులు చేస్తూ చివరకు కట్టలేని స్థితిలో కోట్ల రూపాయలకు ఐపీ దాఖలు చేస్తూ పారిపోతున్నారని పేర్కొన్నారు. వీరి వల్ల అనేకమంది పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల బలహీనతలను సొమ్ముగా చేసుకుని తమ వ్యాపారాన్ని విస్తరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారిపై నిఘా ముమ్మరం చేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. మైనింగ్ ఉన్న ప్రాంతాల్లో అవసరాలకు తీసుకున్న డబ్బుకు ష్యూరిటీగా ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు పెట్టుకుని కార్మికుల వేతనాన్ని కూడా వడ్డీవ్యాపారులు డ్రా చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని, వీటిని ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. -
కేరళలో చోరీ.. కుప్పంలో స్వారీ!
కేరళలో చోరీ అయిన వాహనాల్లో కుప్పం నాయకులు లీజుకు తెచ్చుకుని ఇరుక్కున్న వైనం కుప్పం: కేరళ పోలీసులు రెండు రోజులుగా కుప్పంలో హల్చల్ సృష్టిస్తున్నారు. లీజు పేరిట కేరళ నుంచి తెచ్చి కుప్పంలో తిప్పుతున్న వాహనాలను స్వాధీనం చేసుకునేందుకు ఆ రాష్ట్రం గురువాయుూర్ డీఎస్పీ జయుచంద్రన్ ఆధ్వర్యంలో పోలీసులు రెండు రోజు లుగా కుప్పంలో వుకాం వేసి వాహనాలను గుర్తిం చారు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు స్థానిక పోలీసులను సంప్రదించారు. కేరళలోని షబీర్, జైలుద్దీన్ వాహనాన్ని బట్టి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు అడ్వాన్సులు తీసుకుని లీజుకు ఇస్తారు. అడ్వాన్సుగా పొందిన నగదుతో వడ్డీ వ్యాపారం చేసుకుంటారు. ఐదారేళ్లుగా ఈ వ్యాపారం సాగుతోంది. కేరళ రాష్ట్రంలో భారీగా వాహనాలు చోరీకి గురికావడంతో అక్కడి పోలీసులు చేపట్టిన విచారణలో అసలు విషయూలు వెలుగు చూశాయి. షబీర్, జైలుద్దీన్ల నుంచి బెంగళూరుకు చెందిన జిలానీ, రఘు వుధ్యవర్తులుగా ఉంటూ కుప్పం పట్టణంలోని జబీ అనే వ్యక్తి ద్వారా వాహనాల లీజు వ్యవహారం నడిపారు. కుప్పం ప్రాంతానికి చెందిన 17 వుంది వద్ద 22 ఇన్నో వా, షిప్ట్, స్కార్పియో వంటి వాహనాలు ఉన్నాయుని తెలుసుకున్నారు. నిందితులను పట్టుకుని గురువారం కుప్పం చేరుకున్నారు. వాహనాలు తీసుకున్న వారి వివరాలు సేకరించారు. ఆ వాహనాలన్నీ చోరీకి గురైనట్టు కేరళ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదైనట్టు ఎఫ్ఐఆర్ను అందజేసి వాహనాలు అప్పగించాలని కేరళ చెందిన డీఎస్పీ జయుచంద్ర కుప్పం సీఐ వేణుగోపాల్‌ను కలిశారు. ఆ వాహనాలను స్వాధీనం చేయాలని కోరారు. కాగా ఈ వాహనాల లీజుకు తెచ్చుకున్న వారిలో టీడీపీ నాయుకులు 14 వుంది ఉన్నట్టు తెలి సింది. వాహనాలను స్వాధీనం చేసుకుంటే అవవూనంగా ఉంటుందని భావించి శుక్రవారం ఉదయుం నుంచి టీడీపీ నాయుకులు కేరళ పోలీసులతో జరిపిన రాజీ చర్చలు విఫలమయ్యూయి. తాము అడ్వాన్సు కింద చెల్లించిన డబ్బును తిరిగిస్తే వాహనాలను స్వాధీనం చేస్తావుని పలువురు వాదిస్తున్నారు.