కేరళలో చోరీ.. కుప్పంలో స్వారీ! | Kerala .. KUPPAM riding scene of the crime! | Sakshi
Sakshi News home page

కేరళలో చోరీ.. కుప్పంలో స్వారీ!

Jul 26 2014 3:43 AM | Updated on Aug 21 2018 5:46 PM

కేరళ పోలీసులు రెండు రోజులుగా కుప్పంలో హల్‌చల్ సృష్టిస్తున్నారు. లీజు పేరిట కేరళ నుంచి తెచ్చి కుప్పంలో తిప్పుతున్న వాహనాలను స్వాధీనం చేసుకునేందుకు...

  •     కేరళలో చోరీ అయిన వాహనాల్లో కుప్పం నాయకులు
  •      లీజుకు తెచ్చుకుని ఇరుక్కున్న వైనం
  • కుప్పం: కేరళ పోలీసులు రెండు రోజులుగా కుప్పంలో హల్‌చల్ సృష్టిస్తున్నారు.  లీజు పేరిట కేరళ నుంచి  తెచ్చి కుప్పంలో తిప్పుతున్న వాహనాలను స్వాధీనం చేసుకునేందుకు ఆ రాష్ట్రం గురువాయుూర్ డీఎస్పీ జయుచంద్రన్ ఆధ్వర్యంలో పోలీసులు రెండు రోజు లుగా కుప్పంలో వుకాం వేసి వాహనాలను గుర్తిం చారు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు స్థానిక పోలీసులను సంప్రదించారు. కేరళలోని షబీర్, జైలుద్దీన్ వాహనాన్ని బట్టి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు అడ్వాన్సులు తీసుకుని  లీజుకు ఇస్తారు.

    అడ్వాన్సుగా పొందిన నగదుతో వడ్డీ వ్యాపారం చేసుకుంటారు. ఐదారేళ్లుగా ఈ వ్యాపారం సాగుతోంది. కేరళ రాష్ట్రంలో భారీగా వాహనాలు చోరీకి గురికావడంతో అక్కడి పోలీసులు చేపట్టిన విచారణలో అసలు విషయూలు వెలుగు చూశాయి. షబీర్, జైలుద్దీన్‌ల నుంచి బెంగళూరుకు చెందిన జిలానీ, రఘు వుధ్యవర్తులుగా ఉంటూ కుప్పం పట్టణంలోని జబీ అనే వ్యక్తి ద్వారా వాహనాల లీజు వ్యవహారం నడిపారు. కుప్పం ప్రాంతానికి చెందిన 17 వుంది వద్ద 22 ఇన్నో వా, షిప్ట్, స్కార్పియో వంటి వాహనాలు ఉన్నాయుని తెలుసుకున్నారు.

    నిందితులను పట్టుకుని గురువారం కుప్పం చేరుకున్నారు. వాహనాలు తీసుకున్న వారి వివరాలు సేకరించారు. ఆ వాహనాలన్నీ చోరీకి గురైనట్టు  కేరళ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదైనట్టు ఎఫ్‌ఐఆర్‌ను అందజేసి వాహనాలు అప్పగించాలని కేరళ చెందిన డీఎస్పీ జయుచంద్ర కుప్పం సీఐ వేణుగోపాల్‌ను కలిశారు.

    ఆ వాహనాలను స్వాధీనం చేయాలని కోరారు.  కాగా ఈ వాహనాల లీజుకు తెచ్చుకున్న వారిలో టీడీపీ నాయుకులు 14 వుంది ఉన్నట్టు తెలి సింది. వాహనాలను స్వాధీనం చేసుకుంటే అవవూనంగా ఉంటుందని భావించి శుక్రవారం ఉదయుం నుంచి టీడీపీ నాయుకులు కేరళ పోలీసులతో జరిపిన రాజీ చర్చలు విఫలమయ్యూయి. తాము  అడ్వాన్సు కింద చెల్లించిన డబ్బును తిరిగిస్తే వాహనాలను స్వాధీనం చేస్తావుని పలువురు వాదిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement