Interest rates Banks
-
హౌసింగ్ లోన్, పోటీ పడి మరీ వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు
ముంబై: పండుగల సీజన్ నేపథ్యంలో నెలకొనే గృహ రుణ డిమాండ్‌లో మెజారిటీ వాటా పొందడానికి పోటీ పడుతున్న బ్యాంకుల్లో తాజాగా ప్రైవేటు రంగంలోని హెచ్ఎస్బీసీ, యస్ బ్యాంక్ లు చేరాయి. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... వడ్డీ భారం ఎక్కువై ఇతర బ్యాంకుల నుంచి గృహ రుణం మార్చుకునే వారికి (బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్) సంబంధించి వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.45 శాతంగా అమలు చేస్తున్నట్లు హెచ్ఎస్బీసీ ప్రకటించింది. బ్యాంకింగ్ పరిశ్రమలోనే ఇది అతి తక్కువ గృహ రుణ వడ్డీరేటు. ► ఇక కొత్త రుణాల విషయంలో బ్యాంక్ 6.70 శాతం వడ్డీ ఆఫర్ ఇస్తోంది. ఇది ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలకు సమానం. ► డిసెంబర్ 31 వరకూ అమలవుతుందని, తాజా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండబోదని హెచ్ఎస్బీసీ పేర్కొంది. ► యస్ బ్యాంక్ కూడా 6.70 శాతానికి గృహ రుణాన్ని ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. వేతనం పొందే మహిళలకు సంబంధించి ఈ ఆఫర్ 6.65 శాతంగా ఉంటుంది. ఇప్పటికే పలు బ్యాంకులు ఇలా... పండుగ సీజన్ డిమాండ్‌లో భారీ వాటా లక్ష్యంగా ఇప్పటికే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) గృహ రుణ రేట్లను ఇటీవలే భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణ లభ్యత ఉంటుందని ఎస్బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. ఇక మరో ప్రభుత్వ రంగ బీఓబీ కూడా పండుగల సీజన్‌ను పురస్కరించుకుని గృహ రుణ రేటు 6.75 శాతం వద్ద ప్రారంభమవుతుందని ప్రకటించింది. ప్రభుత్వ రంగ పీఎన్బీ కూడా రూ.50 లక్షలు దాటిన గృహ రుణంపై అరశాతం (50 బేసిస్ పాయింట్లు) వడ్డీరేటు తగ్గించింది. దీనితో ఈ రేటు 6.60 శాతానికి దిగివచ్చింది. హెడ్‌డీఎఫ్‌సీ రుణ రేటును 6.7 శాతానికి తగ్గించింది. చదవండి: ఒక్క లోను పొందాలంటే వంద తిప్పలు.. అందుకే ‘నావి’ వచ్చింది -
హోం లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు, ఇళ్లకు డిమాండ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగల కాలంలో (దీపావళి వరకు కొనసాగే సీజన్) ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంటుందని రియల్ ఎస్టేట్ డెవలపర్లు, కన్సల్టెంట్లు అంచనా వేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ అన్ని రకాల గృహ రుణాలను 6.7 శాతానికే ఇస్తున్నట్టు ప్రకటించడం, పలు ఇతర బ్యాంకులు సైతం గృహ రేట్లను గణనీయంగా తగ్గించడం డిమాండ్‌కు ఊతమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కోటక్ బ్యాంకు సైతం గృహ రుణ రేట్లను గణనీయంగా తగ్గించగా.. మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కూడా ఇదే విధమైన నిర్ణయాలు ప్రకటించొచ్చని రియల్ ఎస్టేట్ పరిశ్రమ అంచనా వేస్తోంది. చదవండి : లోన్ తీసుకునేవారికి బ్యాంకులు బంపర్ ఆఫర్స్ సానుకూల నిర్ణయం.. రుణం ఎంతనే దానితో సంబంధం లేకుండా క్రెడిట్ స్కోరు ఆధారితంగా గృహ రుణాలను 6.70 శాతం నుంచి ఆఫర్ చేస్తున్నట్టు ఎస్బీఐ గురువారం ప్రకటించడం గమనార్హం. అంతకుముందు వరకు రూ.75 లక్షల వరకు రుణాలపై 7.15 శాతం వడ్డీ రేటు అమల్లో ఉండేది. దీనిపై అనరాక్ గ్రూపు చైర్మన్ అనుజ్‌పురి స్పందిస్తూ.. ‘‘ఎస్బీఐ నిర్ణయం నిజంగా పోటీనిస్తుంది. ఈ కొత్త రేటు ప్రజాస్వామ్యయుతంగా ఉంది. ఏ బడ్జెట్లో కొనుగోలు చేసే వారైనా ప్రయోజనం పొందొచ్చు’’ అని చెప్పారు. ఎస్బీఐ సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ సీజన్లో గృహ నిర్మాణ రంగం మంచిగా పుంజుకుంటుందన్నారు. ప్రాసెసింగ్ ఫీజుల మాఫీ కూడా సానుకూల నిర్ణయంగా పేర్కొన్నారు. హౌసింగ్ డాట్ కామ్, మకాన్, ప్రాప్‌టైగర్ పోర్టళ్ల గ్రూపు సీఈవో వికాస్ వాధ్వాన్ సైతం ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇప్పటికే డిమాండ్ ఊపందుకున్న గృహ నిర్మాణ రంగానికి మరింత ప్రోత్సాహాన్నిస్తుందన్నారు. ధరలు స్తబ్ధుగా ఉన్నందున కొనుగోలుదారులకు కొంత ఆదా కూడా అవుతుందన్నారు.ప్రముఖ బ్యాంకులు రుణ రేట్లను తగ్గించడం ప్రేరణనిస్తుందని సోతెబీ ఇంటర్నేషనల్ రియాలిటీ సీఈవో అమిత్ గోయల్ అన్నారు. చదవండి: లోన్ ఇవ్వనందుకు ఎస్బీఐకి మొట్టికాయ -
బ్యాంకు ఖాతా తెరవకుండానే ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గూగుల్ పే యూజర్లు బ్యాంక్ ఖాతా తెరవకుండానే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయవచ్చు. ఈ విధమైన సేవలను పరిశ్రమలో తొలిసారిగా తాము ఆఫర్ చేస్తున్నట్టు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకటించింది. ఒక ఏడాదిపాటు చేసే ఎఫ్డీలపై 6.35 శాతం వరకు వడ్డీ అందుకోవచ్చని వెల్లడించింది. రూ.5 లక్షల వరకు డిపాజిట్ గ్యారంటీ ఉంటుందని వివరించింది. వినియోగదార్లు గూగుల్ పే యాప్‌లో బిజినెస్ అండ్ బిల్స్ విభాగంలో ఈక్విటాస్ బ్యాంక్‌ను ఎంచుకోవాలి. డిపాజిట్ చేయదలచిన మొత్తం, కాల పరిమితి నిర్ధేశిస్తూ వ్యక్తిగత, కేవైసీ వివరాలను సమర్పించాలి. కాల పరిమితి ముగియక ముందే ఎఫ్డీని రద్దు చేసుకుంటే అదే రోజు వినియోగదారుకు చెందిన బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుందని ఈక్విటాస్ వెల్లడిం చింది. చదవండి: పండుగ సెంటిమెంట్, కార్లను తెగకొనేస్తున్నారు -
వాయిదాలకూ పద్ధతులున్నాయ్!
బ్యాంకులు ఈ మధ్యే వడ్డీ రేట్లు కొంత తగ్గించాయి. గృహ రుణాలు కొంత ఆకర్షణీయంగా మారాయి. కోరుకుంటున్న ఇంటిని ఇక వాయిదాల్లో సొంతం చేసుకోవచ్చు అనుకుంటున్న వారు... దాన్ని తిరిగి చెల్లించేందుకు అందుబాటులో ఉన్న పద్ధతుల గురించి కూడా వివరంగా తెలుసుకోవాలి. ఎందుకంటే.. వీటిపై అవగాహన ఉంటే సునాయాసంగా రీపేమెంటు చేయొచ్చు. అలాంటి విధానాల్లో కొన్ని మీకోసం... * రుణాల రీపేమెంట్లో పలు ఆప్షన్లు * ఆదాయాన్ని బట్టి ఈఎంఐలలో హెచ్చుతగ్గులు క్రమంగా పెంచుకునే రీపేమెంట్... స్టెప్ అప్ రీ-పేమెంట్‌గా పిలిచే ఈ ఆప్షన్... ఉద్యోగం, లేదా వ్యాపారం ఇప్పుడిప్పుడే మొదలుపెడుతున్న వారికి బాగా పనికొస్తుంది. ఎందుకంటే కెరీర్ మొదట్లో వారికి ఆదాయం తక్కువగా ఉం టుంది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతుం టుంది. దీనికి అనుగుణంగానే ఈ విధానంలో ఈఎంఐలు ఉంటాయి. ప్రారంభంలో తక్కువగా ఉండే ఈఎంఐ... ఆదాయం పెరిగే కొద్దీ పెరుగుతుంటుంది. సరళీకృత రుణ వాయిదాలు... ఫ్లెక్సిబుల్ లోన్ ఈఎంఐలుగా పిలిచే ఈ ఆప్షన్... కెరీర్ ప్రారంభంలో ఉన్న వారికి కాకుండా రిటైర్మెంట్కు దగ్గరవుతున్నవారికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని స్టెప్ డౌన్ విధానంగా కూడా వ్యవహరిస్తారు. స్టెప్ అప్‌లో కట్టాల్సిన ఈఎంఐ మొత్తం.. ఏటా పెరుగుతూ పోతే, ఈ స్టెప్ డౌన్లో క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఉద్యోగం చేస్తున్నన్నాళ్లూ ఈఎంఐ అధిక మొత్తం ఉంటుంది. తర్వాత రిటైరయ్యే నాటికి బాగా తగ్గిపోతుంది. దశలవారీ చెల్లింపు.. నిర్మాణ దశలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తున్నప్పుడు ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. ప్రాపర్టీ పూర్తిగా చేతికొచ్చే దాకా ఎంత ఈఎంఐ కట్టాలనుకుంటున్నారన్నది మీరే ఎంపిక చేసుకోవచ్చు. ప్రాపర్టీ నిర్మాణ దశలో ఉండగానే రుణగ్రహీత కొంత భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా బ్యాంకులు ఈ విధానాన్ని అందిస్తున్నాయి. నిర్మాణ దశలో ఉన్న ఇంటిని తీసుకునేటప్పుడు దానికి పక్కాగా అన్ని అనుమతులూ ఉన్నాయో లేదో చూసుకోవటం మాత్రం ముఖ్యం. త్వరితగతి రీపేమెంట్.. మీ దగ్గర అదనంగా నిధులు ఉన్నప్పుడు... ఈఎంఐ మొత్తానికి మరికాస్త జోడించి కట్టే వెసులుబాటు కల్పిస్తుందీ యాక్సిలరేటెడ్ రీపేమెంట్ స్కీము. దీనివల్ల రుణం త్వరితగతిన తీరడంతో పాటు వడ్డీ భారమూ కాస్త తగ్గుతుంది. స్మార్ట్ఫిక్స్ విధానం.. ఫిక్స్డ్, ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల మేళవింపుతో ఉండే ఈఎంఐల విధానమే స్మార్ట్ఫిక్స్. దీనికి తొలి మూడేళ్ల పాటు కట్టాల్సిన ఈఎంఐని... ఫిక్స్డ్ వడ్డీ రేట్ల ప్రాతిపదికన లెక్కిస్తారు. ఈ స్థిర వడ్డీ రేటును బ్యాంకే నిర్ణయిస్తుంది. ఇక నాలుగో సంవత్సరం నుంచి ఫ్లోటింగ్ (చలన) ప్రాతిపదికన నెలవారీ కట్టాల్సిన ఈఎంఐ మొత్తాన్ని లెక్కిస్తుంది. ఒకవేళ వడ్డీ రేటు పెరిగితే ఆ మేరకు మీరు కట్టాల్సిన వడ్డీ మొత్తం పెరుగుతుంది. అలాగాకుండా వడ్డీ రేటు తగ్గితే.. ఇదీ తగ్గుతుంది.