Interference
-
US Election Results 2024: ముంచింది బైడెనే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డెమొక్రాట్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై పార్టీ నేతల్లో తీవ్ర అంతర్మథనం జరుగుతోంది. ఓటమికి అధ్యక్షుడు జో బైడెనే ప్రధాన కారణమంటూ వారిలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. అధ్యక్ష రేసు నుంచి ఆయన ఆలస్యంగా తప్పుకోవడం పార్టీ పుట్టి ముంచిందంటూ మండిపడుతున్నారు. హారిస్ తీరునూ పలువురు నేతలు తప్పుబడుతున్నారు. ‘‘ఉపాధ్యక్షురాలిగా బైడెన్ మానసిక సంతులనం సరిగా లేదని ముందే తెలిసి కూడా సకాలంలో బయట పెట్టలేదు. దానికి తోడు బైడెన్ స్థానంలో అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత కూడా ఆయన నీడ నుంచి బయట పడలేదు’’అంటూ వారు ఆక్షేపిస్తున్నారు. ‘‘దాంతో బైడెన్ విధానాలపై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పదేపదే తీవ్ర విమర్శలు చేసినా సమర్థంగా తిప్పికొట్టలేకపోయారు. వాటిలో లోటుపాట్లను సరిచేసుకుంటామని స్పష్టంగా చెప్పి ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు’’అంటూ వాపోతున్నారు. ఈ దారుణ ఓటమితో డెమొక్రటిక్ పార్టీ భవితపై నీలినీడలు కమ్ముకున్నాయన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. 81 ఏళ్ల బైడెన్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తానని 2023 ఏప్రిల్‌లోనే ప్రకటించారు. వయోభారం దృష్ట్యా తప్పుకోవాలని పార్టీ నేతలు చెప్పినా ససేమిరా అన్నారు. పారీ్టలో ట్రంప్‌ను ఓడించగల ఏకైక నేతను తానేనని వాదించారు. మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగే సత్తా తనకుందని, దేవుడు తప్ప ఎవరూ తనను తప్పించలేరని చెప్పుకున్నారు. కానీ ట్రంప్‌తో తొలి డిబేట్లో ఆయన దారుణంగా తడబడటం, ప్రసంగం మధ్యలో ఆగి పదాల కోసం తడుముకోవడం డెమొక్రాట్లను హతాశులను చేసింది. బైడెన్ మానసిక సంతులనంపై అనుమానాలు పెరిగాయి. అభిప్రాయానికి పార్టీ నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ఎట్టకేలకు జూలైలో పోటీ నుంచి తప్పుకుని హారిస్‌కు దారిచ్చారు. దాంతో ప్రచారానికి ఆమెకు తక్కువ సమయం లభించింది. దానికి తోడు అప్పటికే ట్రంప్ గెలుపు ఖాయమనే తరహా వాతావరణం నెలకొని ఉంది. దాన్ని మార్చేసి ట్రంప్‌ను గట్టిగా ఢీకొట్టేలోపే పోలింగ్ తేదీ ముంచుకొచ్చింది. ఇదంతా ఆయనకు బాగా కలిసొచ్చిందని డెమొక్రాట్లు ఇప్పుడు తీరిగ్గా నిట్టూరుస్తున్నారు.బైడెన్ నీడలోనే... అమెరికాలో గత 70 ఏళ్లలో అత్యంత తక్కువ ప్రజాదరణ పొందిన అధ్యక్షుడు బైడెనేనని గాలప్ పోల్ సర్వే తేల్చింది. ప్రజల మనసులు గెలవలేకపోయిన రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్ కంటే కూడా ఆయనకు తక్కువ మార్కులు పడ్డాయి. అలాంటి అధ్యక్షుడి నీడ నుంచి హారిస్ బయటపడలేకపోవడం కూడా ఓటమికి గట్టి కారణంగా నిలిచిందని ఆమె సహాయకులే అంటున్నారు. ‘‘ఉపాధ్యక్షురాలిగా బైడెన్ నిర్ణాయల్లో తాను భాగమేనని ఆమె భావించారు. అందుకే బైడెన్ విధానాలపై ట్రంప్ విమర్శలను తిప్పికొట్టడంలో వెనకా ముందయ్యారు. అలాగాక బైడెన్ విధానాల్లో లోటుపాట్లను సమీక్షించి దేశ ప్రయోజనాలకు అనుగుణంగా సవరించుకుంటామని స్పష్టంగా చెప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది’’అని వారంటున్నారు. ఎకానమీ, వలసల వంటి కీలక విధానాలపై ట్రంప్ దూకుడుకు హారిస్ నుంచి గట్టి సమాధానమే లేకపోయిందని గుర్తు చేస్తున్నారు. కనీసం వాటికి దీటైన ఇతర అంశాలను తెరపైకి తేవడంలో కూడా ఆమె విఫలమయ్యారంటున్నారు. అంతేగాక అధ్యక్షుడి మానసిక ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి తెలిసి కూడా ముందే చెప్పకుండా తమను, అమెరికా ప్రజలను హారిస్ మోసగించారని పలువురు డెమొక్రాట్లు ఆక్రోశిస్తున్నారు. పైగా 78 ఏళ్ల ట్రంప్‌తో పోలిస్తే కొత్త ఓటర్లను ఆకట్టుకోవడంలో 60 ఏళ్ల హారిస్ విఫలమయ్యారని వారు విశ్లేషిస్తున్నారు. తమ ప్రచార తీవ్రత చాలలేదని హారిస్ ప్రచార కమిటీ సీనియర్ సలహాదారు డేవిడ్ ప్లోఫ్ అంగీకరించారు. ఇది దారుణమైన ఓటమేనంటూ ఎక్స్‌లో వాపోయారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభు త్వంలో మంత్రిగా ఉన్న చౌదరి ఫవాద్ హుస్సేన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భారత్‌లో విద్వే షం, ఉగ్రవాద శక్తులను శాంతి సామరస్యా లు ఓడించాలని ఆకాంక్షించారు. దీనికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దీటైన సమాధానమిచ్చారు. ‘చౌదరి సాహిబ్, నేను, మా దేశ ప్రజలకు సమస్యల్ని పరిష్కరించుకునే సమర్థత ఉంది. మీ ట్వీట్ అవసరం లేదు. పాకిస్తాన్లో ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. మీ దేశం సంగతి చూసుకోండి. ఎన్నికలు భారత్ అంతర్గత వ్యవహారం. ఉగ్రవాదానికి అతిపెద్ద స్పాన్సర్‌గా ఉన్న పాకిస్తాన్ మా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించబోం’అని హెచ్చరించారు. ఆ తర్వాత కేజ్రీవాల్ అభిప్రాయాలపై చౌదరి ఫవాద్ హుస్సేన్ స్పందించారు. ‘ఉగ్రవాదానికి సరిహద్దులతో సంబంధంలేదు. పాక్‌లో ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నాయి. మెరుగైన సమాజం కావాలనే ఎవరైనా కోరుకుంటారు’అని పేర్కొన్నారు. ఈ పరిణామంపై బీజేపీ స్పందించింది. ‘ఆప్ నేత అవినీతి రాజకీయాలకు పాక్ నుంచి కూడా వంతపాడుతున్నారు. ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారీ పాక్ నుంచి స్పందిస్తుంటారు. దేశ శత్రువులతో కేజ్రీవాల్ అంటకాగుతున్నారనడానికి ఇదే రుజువు’ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ పేర్కొన్నారు. -
Russia: మా జోక్యం లేదు
వాషింగ్టన్: భారత ఎన్నికల్లో అమెరికా ప్రభుత్వ జోక్యం ఎంతమాత్రం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పష్టంచేశారు. భారత అంశాల్లో అమెరికా ఉద్దేశపూర్వకంగా తలదూర్చుతోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన నేపథ్యంలో అమెరికా అధికార ప్రతినిధి శుక్రవారం స్పందించారు. ‘‘ భారత్‌లోనేకాదు ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియలు, దేశ పాలనా విధానాల్లో అమెరికా కలగజేసుకోదు. ఎన్నికల నిర్ణయాలన్నీ భారతీయ ప్రజలే తీసుకుంటారు’’ అని అన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌సింగ్ పన్నూ గత ఏడాది భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ (రా) అధికారి, మరో భారతీయుడు కలిసి చంపేందుకు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసిందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జఖారోవా ఆరోపించారు. ఈ విషయాన్ని మిల్లర్ వద్ద మీడియా ప్రస్తావించగా.. ‘‘ అవన్నీ నిరాధార ఆరోపణలు. ప్రస్తుతం ఆ ఆరోపణలన్నీ జ్యూరీ వద్ద విచారణలో ఉన్నాయి. చట్టసంబంధ ఇలాంటి విషయంపై నేను ఇప్పుడే ఏమీ మాట్లాడలేను. అందుకే ఈ విషయాన్ని నేను ఇక్కడితో వదిలేస్తున్నా’ అని మిల్లర్ వ్యాఖ్యానించారు. రష్యా ఆరోపణలను భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి సైతం ఖండించారు. భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ అమెరికాలో ఇటీవల ఒక నివేదిక వెలువడటం, దానిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన తరుణంలో గార్సెట్టి శుక్రవారం భారత్‌ను పొగడ్తల్లో ముంచెత్తడం గమనార్హం. ‘‘ఢిల్లీలో బంధాన్ని అమెరికా వందశాతం విశ్వసిస్తోంది. 21వ శతాబ్దిలో చక్కటి సత్సంబంధాల్లో ఒకటిగా భారత్–అమెరికా బంధం నిలుస్తుంది. అమెరికాలో రెండు కిలోమీటర్లు నడచివెళ్లి ఓటేయడానికి బద్దకిస్తారు. కానీ భారత్‌లో ఎక్కడో కొండల్లో ఉండే మతాధికారి సైతం రెండు రోజులు కాలినడకన వెళ్లి మరీ ఓటు వేస్తారు. ట్రక్కుల్లో అనధికార నగదు తరలింపులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు. ఇలాంటి అంశాల్లో అమెరికా కంటే భారత్ మెరుగ్గా పనిచేస్తోంది. కేంద్రప్రభుత్వం లాగే అక్కడి విపక్షాల పాలిత రాష్ట్ర ప్రభుత్వాలూ శక్తివంతమైనవే. భారత చరిత్ర చూస్తే అక్కడి అందరి హక్కులకు గౌరవం దక్కుతుంది. మనల్ని మనం ఇష్టపడేకంటే భారతీయులే మనల్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పుడున్న ప్రపంచంలో ఇది నిజంగా అరుదైన విషయం’ అని భారత్‌ను ప్రశంసించారు. -
భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం
మాస్కో: భారత అంతర్గత వ్యవహారాలు, సార్వత్రిక ఎన్నికల్లో అమెరికా దురుద్దేశంతో కలగజేసుకుంటోందని రష్యా సంచలన ఆరోపణలు చేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను అమెరికాలో చంపేందుకు భారతీయ పౌరులు కుట్ర పన్నారని అమెరికా ఆరోపించిందిగానీ నమ్మదగ్గ సాక్ష్యాలను బయటపెట్టలేదని రష్యా గుర్తుచేసింది. రష్యా, సౌదీ అరేబియా తరహా పాలనా విధానాలను దేశంలో అమలుచేయాలని మోదీ సర్కార్ భావిస్తోందని అమెరికా ఒక నివేదిక వెల్లడించడంపై రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖారోవా గురువారం మాట్లాడారు. ‘‘ పన్నూను అంతమొందించేందుకు భారత ‘రా’ అధికారి, మరో భారతీయుడు నిఖిల్ గుప్తాతో కలిసి కుట్ర పన్నారని అమెరికా ఆరోపించింది. కానీ అందుకు బలమైన సాక్ష్యాలు ఒక్కదాని కూడా బయటపెట్టలేదు. సాక్ష్యాలు చూపకుండా ఊహాగానాలను వ్యాప్తిచేయడం తగదు. భారత విధానాలు, దేశ చరిత్రను అవగాహన చేసుకునే స్థాయి అమెరికాకు లేదు. అందుకే భారత్‌లో మత స్వేచ్ఛపై ఆరోపణలను అమెరికా నిరంతరం గుప్పిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ వాతావరణాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా ప్రయతి్నస్తోంది. అందుకే రాష్ట్రాల్లో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని, మత స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని నివేదికలు ఇస్తోంది’’ అని మారియా చెప్పినట్లు రష్యా అధికారిక ‘ఆర్టీ న్యూస్’ ఛానల్ ఒక వార్తను ప్రసారంచేసింది. గత ఏడాది అమెరికాలో పన్నూను భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ (రా) అధికారి చంపాలనుకున్న కుట్రను అమెరికా అధికారులు విజయవంతంగా భగ్నంచేశారని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనం వెలువరిచింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ ఉదంతంపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఇలాంటి నిరాధార ఆరోపణలు తగవని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ ఆనాడే ఢిల్లీలో ఆక్షేపించారు. -
‘భారత్ జోక్యం లేదు’.. కెనడాకు విచారణ కమిషన్ షాక్
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. తమ దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని ఆరోపణలు చేయటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయటంతో ప్రధాని జస్టిన్ ట్రూడ్ సీనియర్ అధికారులతో కూడిన విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఆ విచారణ కమిషన్ కీలక విషయాలు వెల్లడించింది. కెనడా ఎన్నికల్లో భారత్ అసలు జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పింది. ‘2021 కెనడా ఎన్నికల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లు ఆధారాలు లేవు. ఎలాంటి సాక్ష్యాలు మా దృష్టికి రాలేదు’ అని ఎన్నికల అధికారి దర్యాప్తు కమిషన్‌కు వెల్లడించారు. అయితే గతంలో జరిగిన రెండు కెనడా ఎన్నికల్లో మాత్రం చైనా జోక్యం చేసుకుందని కెనడా ఇంటెలిజెన్స్ ఎజెన్సీ కనుకున్నట్లు విచారణ కమిషన్ వెల్లడించింది. ఇక.. 2019, 2121 కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సెర్వీసెస్(సీఎస్ఐఎస్) ఆరోపణలు చేసింది. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ప్రతిపక్షాలు దర్యాప్తు చేయాలని ఒత్తిడి పెంచాయి. ఈ వ్యవహారంపై ప్రధాని జస్టిన్ ట్రూడో దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు చైనాతో పాటు భారత్ పేరు కూడా ప్రధాని ట్రూడో చేర్చారు. కెనడా చేస్తున్న ఆరోపణలపై భారత్ తీవ్రంగా ఖండించింది. ‘కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేసినట్ల మీడియా ద్వారా తెలిసింది. ఆ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండిస్తుంది. కెనడా చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదు’ అని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ ఫిబ్రవరిలో స్పష్టం చేశారు. ఇతర దేశాల ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవటం భారత్ విధానం కాదన్నారు. కెనడానే తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చుతోందని మండిపడ్డారు. -
5జీతో మన విమానాలకు ప్రమాదం? సమాధానం ఇచ్చిన కేంద్రం
మొబైల్ సర్వీసుల్లో 5జీని ప్రవేశపెట్టడంపై అమెరికన్ ఏవియేషన్ సెక్టార్ గజగజ వణికిపోయింది. ఇండియా నుంచి యూఎస్ఏ వెళ్లే విమాన సర్వీసులు సైతం నిలిచిపోయాయి. త్వరలో ఇండియాలో 5జీ సర్వీసులు ప్రారంభించనున్నందున మన విమాన సర్వీసుల భద్రతపై పార్లమెంటులో కేంద్రాన్ని వివరణ అడిగారు మన ఎంపీలు. 5జీ ట్రయల్స్‌కి అనుమతి ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు 5జీ సర్వీసుల వల్ల విమానాలకు ఏమైనా ప్రమాదమా ? దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఏదైనా రిపోర్టు ఉందా అంటూ పార్లమెంటు సభ్యులు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్స్‌తో పాటు 5జీకి కేటాయించిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌తో ఎయిరోనాటికల్ కమ్యూనికేషన్స్‌కి ఎటువంటి ఇబ్బంది లేదని కేంద్రం సమాధానం ఇచ్చింది. 5జీ సర్వీసుతో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎయిరోనాటికల్ వ్యవస్థకు భద్రత ఉందని కేంద్రం భరోసా ఇచ్చింది. మనదేశంలో జియో, వోడాఐడియా, ఎయిర్ఎట్, ఎంఎన్టీఎల్ సంస్థలకు 5జీ ట్రయల్స్ చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఎంపిక చేసిన ఏరియాల్లో ఈ ట్రయల్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. మరోవైపు ఈ ఏడాదిలోనే 5జీ సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్రం బడ్జెట్లో తెలిపింది. ఇటీవల అమెరికాలో 5జీ సర్వీసులు ప్రారంభించగా ... విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎయిరోనాటికల్ కమ్యూనికేషన్స్‌కి ఇబ్బంది అంటూ విమానాలను గాల్లోకి ఎగురనివ్వలేదు. చదవండి:అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం.. భయాలతో విమానాల రీషెడ్యూల్! -
చంద్రబాబు జోక్యం ప్రతికూలమే...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్న తీరు.. ప్రజా కూటమిపై ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు చూపబోతోందని సీపీఎం అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని పేర్కొంది. మొదట్లో కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఉండొచ్చునని భావించినా తెలంగాణ అనుకూల సెంటిమెంట్ పెరగడంతో ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని అభిప్రాయపడింది. శనివారం మఖ్దూమ్ భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తెలంగాణ ఎన్నికలు, రాజకీయ పరిణామాలు, బీఎల్ఎఫ్కున్న అవకాశాలను గురించి సమీక్షించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, 17 లోక్‌సభ నియోజకవర్గాల ఇన్చార్జీలు హాజరయ్యారు. వివిధ వర్గాల ప్రజలకిచ్చే పింఛను డబ్బును పెంచడం, రైతుబంధు పథకం, సమాజంలోని వివిధ రంగాలకు చెందిన వారి కోసం సంక్షేమ పథకాల అమలు, ఏదో ఒకరూపంలో లబ్ధి చేకూర్చేందుకు చేసిన ప్రయత్నాలు టీఆర్ఎస్కు ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం చేకూర్చాయని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తేనే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలు భావించినందువల్లే.. ఆ పార్టీకే మళ్లీ పట్టంగడుతున్నారని విశ్లేషించారు. మైనారిటీల ఓట్లు పెద్ద సంఖ్యలో పడటం కూడా టీఆర్ఎస్కు కలిసొచ్చే అంశమన్నారు. తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ తెరపైకి... తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేలా చంద్రబాబు చేసిన ప్రసంగాలు, ఆయన వ్యవహారశైలిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని సీపీఎం విశ్లేషించింది. తెలంగాణలో మరోసారి చంద్రబాబు వేలుపెడితే ఇక్కడి రాజకీయాలు, పరిస్థితుల్లో కూడా ప్రతికూల మార్పులొస్తాయనే ప్రజలు భావించారని అభిప్రాయపడింది. కూటమిని మొత్తం తన చుట్టే తిప్పుకోవడం, ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయడం మొదలుకుని, తానే ముందుండి నడిపించడం కూడా ఇక్కడి ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమైందని అంచనా వేసింది. ఎన్నికలకు ముందు చివరి 4,5 రోజుల పాటు చంద్రబాబు నిర్వహించిన విస్తృత ప్రచారం, ప్రస్తావించిన అంశాలు కూటమిపై ప్రతికూల ప్రభావం చూపాయని అభిప్రాయపడింది. సీపీఎంగా పోటీచేసిన భద్రాచలం, మిర్యాలగూడలలో, బీఎల్ఎఫ్ అభ్యర్థులున్న నారాయణ్‌పేట్, మధిరలలో కనీసం ఒక్కోస్థానంలోనైనా గెలిచే అవకాశాలున్నాయని భావిస్తోంది. -
వాళ్ల పెళ్లి వాళ్లిష్టం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: చట్టబద్ధ వయసు వచ్చిన తరువాత కుల, మతాలకు అతీతంగా వివాహం చేసుకున్న జంట జీవితంలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే బంధువులు, కుటుంబ సభ్యులు వారిపై హింసకు పాల్పడొద్దని, వేధించొద్దని, బెదిరించొద్దని స్పష్టం చేసింది. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ ముప్పు ఉందని భయపడే జంటలకు రాష్ట్ర ప్రభుత్వాలే రక్షణ కల్పించాలని కేంద్రం కోర్టుకు తెలిపింది. పరువు హత్యల నుంచి యువ జంటలను రక్షించాలని కోరుతూ 2010లో శక్తి వాహిని అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సవివర తీర్పును వెలువరిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ బుధవారం పేర్కొంది. ఖాప్ పంచాయతీలను గుర్తించబోమన్న ధర్మాసనం..వాటిని కేవలం కమ్యూనిటీ బృందాలుగానే పరిగణిస్తామని తెలిపింది. ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ స్పందిస్తూ..బంధువులు, ఖాప్ పంచాయతీ పెద్దల నుంచి తమకు ముప్పు ఉందని జంట భావిస్తే వివాహ నమోదు సమయంలోనే ఆ విషయాన్ని సదరు అధికారికి తెలియజేయాలని అన్నారు.