International calls
-
ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నాయా?! ఒక్క క్లిక్‌తో అంతా ఉల్టా పల్టా!
ఇటీవల ఇండోనేషియా (+62), వియత్నాం (+84), మలేషియా (+60), కెన్యా (+254), ఇథియోపియా (+251).. మొదలైన దేశాల నుంచి వచ్చే ఇంటర్నేషనల్ ఫోన్‌కాల్స్‌ను తమకు తెలియకుండా అప్రయత్నంగా.. అనుకోకుండా రిసీవ్ చేసుకుంటూ ఆర్థిక మోసాల బారిన పడుతున్నారు చాలా మంది. ఈ సైబర్‌నేరగాళ్ల నుంచి జాగ్రత్తపడటమే కాదు మన తోటివారికీ అవగాహన కలిగించడం అవసరం. ఆఫీసుకువెళ్లే హడావిడిలో ఫోన్ మోగితే లిఫ్ట్ చేసింది గీత. ఒక లార్జ్ గ్రూప్ ద్వారా ఆన్లైన్ ఆదాయ వనరులను పరిచయం చేయబోతున్నామని, అందుకు సంబంధించిన వివరాలను ఫోన్‌కి పంపుతున్నామని చెప్పారు కాలర్. అందుకు ఎన్ని లెవల్స్ ఉంటాయో, ఎలా పాల్గొనవచ్చో కూడా చెప్పిన విధానం గీతకు బాగా నచ్చింది. ముందు ఫ్రీ టాస్క్‌లో పాల్గొని, అంతా నచ్చితే కొనసాగించమని, అందుకు సంబంధించిన వివరాల మెసేజ్‌ను పంపుతామని, చెక్ చేసుకోమని, గ్యారంటీ ్రపాఫిట్ అని చెప్పడంతో గీతకు ఆనందమేసింది. ఆఫీసుకు వెళ్లాక ఫోన్‌కి వచ్చిన వాట్సప్ మెసేజ్ చూసింది. గ్రూప్‌లో జాయినవమని వచ్చిన మెసేజ్ అది. ఆ గ్రూప్‌లో జాయిన్ అయింది. చాలా మంది ఉన్న ఆ గ్రూప్‌లో పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారని అర్ధమైంది. ఆ గ్రూప్‌లో చూపించిన విధంగా తన అకౌంట్‌కి లాగిన్ అయి, ఫ్రీ టాస్క్‌లో చేరితే వెంటనే తన అకౌంట్లోకి రూ.500 వచ్చాయి. ఆనందపడుతూ వాళ్లు చెప్పిన టాస్క్‌ని పూర్తి చేస్తే, మరో రూ.1000 జమ అయ్యాయి. వాటిని విత్ డ్రా చేసుకున్నాక, పెయిడ్ టాస్క్‌కు వెళ్లి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాక కానీ, అర్ధం కాలేదు గీతకు తను మోసపోయానని. విదేశీ మోసగాళ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట కూడా ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారు. ఫేక్ లైక్స్.. డీపీ లు మొత్తం ఇండియన్ అమ్మాయిల ఫొటోలు ఉంటాయి. కానీ, ఫేక్‌ప్రొఫైల్స్ ఉంటాయి. మనవాళ్లే కదా అని జాయిన్ అవుతాం. వాయిస్ కూడా మన ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లైక్స్, యూ ట్యూబ్ వ్యూస్...పెంచడం కోసం ఒక టాస్క్ ఉంటుంది. ముందు ఫ్రీ టాస్క్‌ల పేరుతో ఆకట్టుకుంటారు. మనకు ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అప్పుడు ఆ గేమ్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిజమైన ప్లేయర్లతో పాటు స్కామర్లు కూడా ఉంటారు. రూ. 500 వచ్చాయని, రూ.1000 వచ్చాయని స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తుంటారు. కొంత టైమ్ అయ్యాక ఫ్రీ టాస్క్ పూర్తయిందని, పెయిట్ టాస్క్ ఉందని చెబుతారు. వీటిలో మళ్లీ రకరకాల గ్రూప్స్‌లో మనల్ని యాడ్ చేస్తారు. రూ.1000 పెడితే 1300 ఇస్తాడు. వెంటనే 300 రావడంతో ఆశ పెరుగుతుంది. 5000 పెడితే మరో 2000 అదనంగా వస్తాయని చూపుతారు. ప్రతీ టాస్క్ పై ఒత్తిడితో కూడా ప్రెజర్ ఉంటుంది.రూ. 7000 మన అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసేలోపు టైమ్ లాప్స్ అయిపోయిందని చెబుతారు. దీనిని డ్రా చేయాలంటే రూ. 10000 పెట్టమంటారు. ఇవన్నీ మల్టిపుల్ అకౌంట్స్ , ఇండియన్ అడ్రస్ ఉన్న ప్రైవేట్ బ్యాంకుల ఖాతాలు చూపుతారు. మనం నిజమే కదా అని నమ్మి వాళ్ల ట్రాప్‌లో పడతాం. అప్పుడు మెల్ల మెల్లగా రూ.50 నుంచి మొదలు పెట్టి పది లక్షల వరకు రూట్ మార్చుతుంటారు. ఇరవై రోజుల క్రితం 20 లక్షలు వరకు జరిగిన మోసం నిన్న 60 లక్షల రూపాయలతో సైబర్ క్రైమ్‌లో కేస్ నమోదైంది. స్పామ్ కాల్స్‌కి ఆన్సర్ చేయద్దు ♦ తెలియని ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్‌ని నమ్మద్దు. ఈ కాల్స్ వచ్చినప్పుడు అపనమ్మకంగానే కాదు అప్రమత్తంగానూ ఉండడటం అవసరం. ♦ కాలర్ ఐడెంటిటినీ వెరిఫై చేసుకోవాలి. ♦ ఆధార్‌కార్డ్, పాన్‌కార్డ్, బ్యాంక్ అకౌంట్ వంటి వ్యక్తిగత వివరాలను కాలర్స్‌కి ఇవ్వద్దు. ♦ స్పామ్ కాల్స్‌ని రిసీవ్ చేసుకోవద్దు. అలాంటి వాటిని ట్రూ కాలర్‌లో చెక్ చేసుకోండి. ♦ వాట్సప్, టెలిగ్రామ్, ట్రూ కాలర్‌లో అనుమానించదగిన ఫోన్‌కాల్స్ వచ్చినప్పుడు ఆ యాప్స్‌కి రిపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఒక సింగిల్ స్టెప్ ద్వారా యూజర్ రిపోర్ట్ చేయచ్చు. ♦ ఏ కాలర్ కూడా మనల్ని డబ్బు కట్టమని అడగరు. ఇలాంటప్పుడు గ్రూప్‌లో నుంచి ఎగ్జిట్ అవడం లేదా హ్యాంగప్ చేయాలి. ♦ ఏం చేస్తారో చూద్దాం అనుకొని గ్రూప్‌లో కొందరు ఎగ్జిట్ అవక అలాగే ఉండిపోతారు. అలాంటివాళ్లే ఎక్కువ ఇన్వెస్ట్ చేసి మోసపోతారు. గ్రూప్‌లో అలాగే ఉండి మిగతా మెంబర్లు ‘మాకు డబ్బులు వచ్చాయి’ అని షేర్ చేసే, స్క్రీన్ షాట్లకు పడిపోవద్దు. మోసపోతే.. ♦ 1930కి కాల్ చేయాలి. ♦హెల్ప్‌లైన్ వాళ్లు మోసపోయిన ఆధారాల డాక్యుమెంట్స్ ఇవ్వమంటారు. ♦ మోసగాళ్లు మల్టిపుల్ అకౌంట్స్‌ను ఉపయోగిస్తుంటారు. మన ద్వారా వాటికి డబ్బు ట్రాన్స్ఫర్ చేయిస్తారు. వాటి ఆధారంగా ఆయా రోజుల్లో మన ఖాతాలో నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్లాయో, మన ఖాతాకు ఎవరి ద్వారా డబ్బు వచ్చిందో చూసి ఆ అకౌంట్స్ అన్నింటినీ ఫ్రీజ్ చేస్తారు. అప్పుడు కేస్ ఫైల్ చేసి, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి, మన డబ్బులు మనకు వచ్చేలా చేస్తారు. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల,డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వాట్సాప్ కి ఆ తరహా కాల్స్ లిఫ్ట్ చేస్తే ఇక అంతే సంగతి
-
వాట్సాప్‌లో రాంగ్ కాల్స్ వస్తున్నాయా? జరభద్రం గురూ..!
భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా స్కామ్ చేసేవారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఒకప్పుడు సాధారణ కాల్స్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు అమాయక ప్రజలను మోసం చేసి డబ్బు గల్లంతు చేసేవారు. అయితే ఇప్పుడు వారు ట్రెండ్ మార్చేసి వాట్సాప్ కాల్స్ ద్వారా మోసం చేయడం ప్రారంభించేసాఋ. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కొంత మంది స్కామర్లు వాట్సాప్ ద్వారా అంతర్జాతీయ నెంబర్స్ నుంచి కాల్స్ చేస్తున్నారు. దేశం కోడ్ +84 నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయని కంప్లైంట్స్ వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులను మోసం చేయడానికి స్కామర్లు కనిపెట్టిన ఓ కొత్త మార్గమే వాట్సప్ కాల్స్. +84 అనేది వియాత్నం దేశం కోడ్ కాగా, +62 అనేది ఇండోనేషియా కోడ్, ఇక్కడ మరో నెంబర్ +223 (ఇది మాలి కోడ్). ఈ కోడ్స్ కలిగిన నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. వినియోగదారుడు ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైపోయింది. ఈ నెంబర్స్ నుంచి వస్తున్న కాల్స్ నిజంగా ఆదేశం నుంచి వస్తున్నాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి మోసాలకు పాల్పడే వ్యక్తులు ఆన్లైన్లో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెంబర్ (VoIP) కొనుగోలు చేస్తారని ఒక నివేదిక వెల్లడించింది. @WhatsApp I'm receiving spam calls. Please take stringent action. Atleast alert suspected #spam pic.twitter.com/BgxaJ2WKfd — I Bichewar (@IBichewar) April 11, 2023 ఈ స్పామ్ కాల్స్ గురించి V4WEB సైబర్ సెక్యూరిటీ వ్యవస్థాపక డైరెక్టర్ 'రితేష్ భాటియా' మాట్లాడుతూ.. VoIP నెంబర్ కొనుగోలు చేయడం చాలా సులభమని, ఆయా దేశాల నుంచే వాట్సాప్ యాక్టివేట్ చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపాడు. ఈ విధంగా యాక్టివేట్ చేసుకున్న తరువాత ప్రపంచంలో ఉన్న ఏ వినియోగదారునినైనా లక్ష్యంగా చేసుకోవచ్చని వివరించారు. @Cyberdost @TRAI these are two missed calls which I got on WhatsApp. Look like scammers.. 35minutes ago is today on 11th April. I blocked them and reported as spam on WhatsApp. Why are we seeing so many missed calls from these criminals. @BlrCityPolice pic.twitter.com/znQ1PL9HHa — Kuchkaamkaro (@Dheren14873751) April 11, 2023 ఇలాంటి రాంగ్ కాల్స్ చాలా మందికి వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయని కొంత మంది సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అంతర్జాతీయ నెంబర్ నుంచి వచ్చే వాట్సప్ కాల్స్ మోసపూరితమైనవి కావున ఎవరూ వాటిని రిసీవ్ చేయవద్దని సలహా ఇస్తున్నాము. ఇలాంటి వాటిని నిలువరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేటెస్ట్ టెక్నాలజీ, డేటా సైన్టిస్టులు, సంబంధిత నిపుణులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి కాల్స్ రాకుండా చూడటానికి చర్యలు జరుగుతున్నట్లు వాట్సాప్ ప్రతినిథి వెల్లడించారు. Getting lots of Whatsapp audio spam calls recently. Anybody else facing the same problem? +84 38 341 6618 is the recent one. — Pradeep 🇮🇳 (@nameisvp) April 10, 2023 ఇటీవల ఈ స్పామ్ కాల్స్ గురించి వివరిస్తూ.. ట్విట్టర్లో శ్రేయన్ష్ జైన్ అనే వ్యక్తికి ఒక ఇంటర్నేషనల్ కాల్ వచ్చిందని, అందులో ప్రిసిల్లా బారెట్ అనే పేరుతో HRగా పరిచయం చేసుకున్నారని, ఆ తరువాత పార్ట్ టైమ్ ఉద్యోగం చేయవచ్చని.. దీనికి యూట్యూబ్ వీడియోను లైక్ చేయాలనీ, ఒక్కో లైక్‌కు రూ. 50 వస్తుందని, ఇలా మీరు రోజుకి రూ. 10,000 కంటే ఎక్కువ సంపాదించవచ్చని చెప్పినట్లు తెలిపాడు. ఇదీ చదవండి: నిండా పాతికేళ్లు కాలేదు రూ. 100 కోట్లు సంపాదన - అతనేం చేస్తున్నాడో తెలుసా? ఇలాంటి మోసాలకు ఎవరూ బలి కాకుండా ఉండాలంటే రాంగ్ నెంబర్ నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్ స్వీకరించవద్దని తెలియజేస్తున్నాము. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
తెలంగాణలో కదిలిన డొంక..
సాక్షి, హైదరాబాద్: విపత్కర పరిస్థితిలోనూ పాక్ విద్రోహబుద్ధి మానలేదు. ఆపత్కాలంలోనూ దాని తలపుల్లో ‘వల’పు కుట్రే. కోవిడ్వేళ పాక్‌కు చెందిన ఐఎస్ఐ కుట్రకోణాన్ని మన నిఘావర్గాలు బట్టబయలు చేశాయి. హరియాణాలో తీగ లాగితే తెలంగాణలో దాని డొంక కదిలింది. దేశంలో ఉగ్రకార్యకలాపాల ఉధృతికిగాను స్థానిక యువతను ఉగ్రవాదంవైపు నడిపించే కుట్రను ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రాష్ట్ర నిఘావర్గాల సమాచారంతో పోలీసులు నిజామాబాద్‌లో భగ్నం చేశారు. గతేడాది నవంబరులో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్(వీవోఐపీ) టెక్నాలజీ ద్వారా హనీట్రాప్‌తో హానీ తలపెట్టే కుట్ర చేసింది ఐఎస్ఐ. తాజాగా అలాంటి కుట్రే నిజామాబాద్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బయటపడింది. భీంగల్ మండలం ముచ్కురు గ్రామానికి చెందిన సిద్ధిపల్లి అజయ్‌కుమార్ (32), సిద్ధిపల్లి వినయ్‌కుమార్ అన్నదమ్ములు. వీరు ఉపాధి కోసం సౌదీకి వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చారు. ఈ ఏడాది జనవరిలో నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ చంద్రశేఖర్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అదే ఇంట్లో పలు నకిలీ సిమ్‌కార్డులు సేకరించి వీవోఐపీ సాంకేతికతతో ప్రైవేటు టెలిఫోన్ ఎక్సేంజ్ నిర్వహిస్తున్నారు. సౌదీలో ఉన్న సమయంలోనే వీరు అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చే వీఓఐపీ టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు. సాధారణంగా దేశంలోకి వచ్చే అనుమానాస్పద అంతర్జాతీయ కాల్స్‌పై నిఘావర్గాలు కన్నేసి ఉంచుతాయి. కానీ, లోకల్ కాల్స్‌పై అంతగా నిఘా ఉండదు. ఈ వెసులుబాటును ఆధారంగా చేసుకుని ఐఎస్ఐ నుంచి వచ్చే కాల్స్‌ను వీరు నిజామాబాద్‌లోనే లోకల్ కాల్స్‌గా మారుస్తున్నారు. దేశంలో ఉగ్రకార్యకలాపాలను నిఘా వర్గాలు గుర్తించకుండా ఆ కాల్స్‌ను భారత సైనికులను హనీట్రాప్(అమ్మాయిలతో మాట్లాడించి దేశ రహస్యాలు తెలుసుకుంటారు)లో దించడానికి, దేశంలోని తమ సానుభూతిపరులకు, వేర్పాటువాదులకు తాము ఇచ్చే ఆదేశాలు, చేసే ఆర్థిక సాయాలకు ఐఎస్ఐ దీన్ని వాడుకుంటోంది. తెలంగాణలో కదిలిన డొంక.. హరియాణాలో కొంతకాలంగా ఐఎస్ఐ ప్రేరేపిత ఓ వేర్పాటువాద సంస్థ కదలికలు ఊపందుకున్నాయి. కానీ, వీరికి ఎలాంటి అంతర్జాతీయ కాల్స్ రావడం లేదు. అనుమానంతో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) నిఘా పెట్టింది. పాకిస్తాన్ నుంచి వస్తున్న కాల్స్‌ను నిజామాబాద్‌లో లోకల్ కాల్స్‌గా మారుస్తూ వాటిని హరియాణాకు మళ్లిస్తున్నారని గుర్తించింది. ఐబీ ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన హైదరాబాద్‌లోని టెలికాం అధికారులు నిజామాబాద్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ అన్నదమ్ములను అరెస్టు చేసి కుట్రను ఛేదించారు. వారిని రిమాండ్‌కు తరలించారు. -
పాక్ వలపు వల.. గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చే ప్రైవేటు టెలిఫోన్ ఎక్స్చేంజ్ గుట్టు రట్టయింది. దేశంలోని ఆర్మీ అధికారులకు హనీట్రాప్ ద్వారా వల వేసేందుకు యత్నిస్తున్న పాకిస్తాన్ గూడచార సంస్థ ఐఎస్ఐ కుట్రను నగర టాస్క్‌ఫోర్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్ ద్వారా ఛేదించారు. నిందితులంతా అత్యాధునిక వీఓఐపీ (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్) సాంకేతికతను ఉపయోగించి ఈ పనికి పాల్పడుతున్నట్లు వెల్లడైంది. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, ఇంటర్నెట్ సాయంతో తక్కువ చార్జీలతో విదేశాలకు ఫోన్‌కాల్స్ మాట్లాడుకోడానికి వేసే ఎత్తుగడే వీఓఐపీ. ఈ విధానం ద్వారా విదేశాల నుంచి కాల్స్ వచ్చినా, దాన్ని రిసీవ్ చేసుకునేవారికి లోకల్ నంబరుతోనే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ తిరిగి ఆ నంబరుకు కాల్ చేసినా అది కనెక్ట్ కాదు. బయటపడింది ఇలా?.. ఇటీవల ఢిల్లీలో పనిచేసే ఇద్దరు ఆర్మీ అధికారులకు అనుమానాస్పద కాల్స్ వచ్చాయి. తిరిగి కాల్ చేస్తే కలవలేదు. అనుమానంతో మిలిటరీ ఇంటెలిజెన్స్‌కు సమాచారమిచ్చారు. వారు నగర పోలీసులను అప్రమత్తం చేయడంతో సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. మొత్తానికి ఢిల్లీలో తీగలాగితే ఎప్పట్లాగే హైదరాబాద్‌లో డొంక కదిలింది. సదరు కాల్స్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్మాయిల్ నగర్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీ నుంచి నుంచి వస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసుల రాకను గుర్తించిన ప్రైవేట్ టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ నిర్వాహకులు పారిపోయారు. పోలీసులు ప్రైవేట్ టెలిఫోన్ ఎక్సే్ఛంజ్‌కు సంబంధించిన పలు పరికరాలను, నగరం చిరునామాతో ఉన్న 60 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక ఇమ్రాన్‌ఖాన్, మహమ్మద్ అక్బర్ అనే పాత నేరస్థుల హస్తం ఉందన్న సమాచారంతో వారి కోసం గాలిస్తున్నారు. ఇలా శత్రుదేశం నుంచి వచ్చే కాల్స్‌ను మన ఆర్మీ అధికారులకు డైవర్ట్ చేయడం కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. పరారీలో ఉన్న అనుమానితులు చిక్కితేనే పాకిస్తాన్ నుంచి వచ్చే కాల్స్‌ను డైవర్ట్ చేయాల్సిన అవసరమేం వచ్చింది? ఆర్మీ అధికారులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్న విషయాలు వెల్లడయ్యే అవకాశముంది. దీన్ని హనీట్రాప్గానూ అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. -
టెల్కోలకు షాకిచ్చేసిన ట్రాయ్
న్యూఢిల్లీ : టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ అనుకున్నంత పని చేసేసింది. టెల్కోలకు షాకిస్తూ ఇంటర్నేషనల్ టర్మినేషనల్ రేటును సగం తగ్గించేసింది. కాల్స్ స్వీకరించేందుకు గాను, లోకల్ నెట్‌వర్క్‌లకు ఇంటర్నేషనల్ ఆపరేటర్ చెల్లించే టర్మినేషన్ రేటును నిమిషానికి 30 పైసలకు తగ్గిస్తున్నట్టు ట్రాయ్ పేర్కొంది. ఇప్పటి వరకు ఈ రేటు 53 పైసలుగా ఉండేది. ఇంటర్నేషనల్ టర్మినేషనల్ రేటును తగ్గిస్తున్నట్టు రెగ్యులేటరీ నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని టాప్ టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్‌లకు భారీగా ఇంటర్నేషనల్ కాల్స్ వస్తూ ఉంటాయి. వీటిపై విధించే ఛార్జీలతో కంపెనీలు బాగానే రెవెన్యూలను పొందుతున్నాయి. ప్రస్తుతమున్న ఛార్జీలే చాలా తక్కువగా ఉన్నాయని.. ఈ ఛార్జీలను ఒక్క రూపాయికి, అనంతరం రూ.3.50 కు పెంచాలని ఈ కంపెనీలు అంతకముందు కోరాయి. కానీ వీటికి షాకిస్తూ ఈ ఛార్జీలను సగం తగ్గించేసింది. ట్రాయ్ ఈ నిర్ణయంతో కంపెనీలు భారీగా తమ రెవెన్యూలను కోల్పోయే అవకాశముంది. ఇప్పటికే దేశీయంగా మొబైల్ టర్మినేషన్ రేటును తగ్గించడంతో, టెల్కోల ఆదాయానికి భారీగా గండికొడుతోంది. టర్మినేషనల్ ఛార్జీలను తగ్గించడంతో, దేశీయంగా కాల్ టారిఫ్‌లలో మధ్యవర్తిత్వాన్ని తగ్గించవచ్చని ట్రాయ్ చెబుతోంది. దీంతో అక్రమ వీఓఐపీ(వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్) గేట్‌వే బిజినెస్‌లకు చెక్ పెట్టొచ్చని పేర్కొంటోంది. ఇలా ఇంటర్నేషనల్ ఇన్కమింగ్ ట్రాఫిక్‌లో గ్రే మార్కెట్‌ను నిర్మూలించవచ్చని తెలిపింది. గ్రే మార్కెట్ ద్వారా దేశ భద్రతకు భారీగా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అంతేకాక రెవెన్యూలు లీకవుతాయని ట్రాయ్ చెప్పింది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఇన్కమింగ్కాల్ టర్మినేషనల్ ఛార్జీలను నిమిషానికి 0.53 పైసల నుంచి 0.30 పైసలకు తగ్గిస్తున్నట్టు పేర్కొంది. కానీ ఈ ఛార్జీల తగ్గింపుతో టెలికాం కంపెనీలు తమ రెవెన్యూల నుంచి 5వేల కోట్ల రూపాయల వరకు కోల్పోయే అవకాశముందని తెలిసింది. -
ఓన్లీ ఇన్ కమింగ్..!
సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ని వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) పద్దతిలో లోకల్ కాల్స్‌గా మార్చే కాల్ రూటింగ్ ఎక్స్ఛేంజ్లు ఇక్కడి కాల్స్‌ను (ఔట్ గోయింగ్) బయటి దేశాలకు పంపలేవు. కేవలం ఆయా దేశాల నుంచి వచ్చే వాటి మాత్రమే లోకల్ కాల్స్‌గా మార్చి ఇక్కడి వారికి (ఇన్కమింగ్) అందించగలవు. నగరంలోని మూడు చోట్ల అక్రమ ఎక్ఛ్సేంజ్‌లు ఏర్పాటు చేసి, రూటింగ్‌కు పాల్పడుతున్న ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఆ మొత్తం ఎగ్గొట్టడానికే... విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్ కాల్ అక్కడి ఎక్స్ఛేంజి నుంచి నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్‌కు చేరతాయి. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ గేట్ వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడ నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా శాటిలైట్ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇక్కడకు చేరిన ఫోన్‌కాల్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌ల ద్వారా ఇక్కడ కాల్ రిసీవ్ చేసుకునే ఫోన్‌కు వస్తుంది. ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్ఛ్సేంజ్‌లు సైతం విదేశీ కాల్ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మొత్తం చెల్లించకుండా తప్పించుకోవడానికి అక్కడి కాల్ ఆపరేటర్లే ఇక్కడ వ్యవస్థీకృత ముఠాలను ఏర్పాటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే సూత్రధారులంతూ విదేశాల్లోనే ఉంటారు. కొందరు సూత్రధారులు వివిధ ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ కాల్ రూటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి దందాలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి ఓ కాల్ విదేశాలకు వెళ్ళాలంటే (ఔట్ గోయింగ్) కచ్చితంగా అది సర్వీస్ ప్రొవైడర్ ద్వారానే జరగాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్ పైనా ఏజెన్సీల నిఘా ఉంటుంది. అనునుమానాస్పద దేశాలు, వ్యక్తులు, నెంబర్ల నుంచి వచ్చే వాటిని ట్యాప్ కూడా చేస్తారు. ఇందుకు ఉపకరించే సాధనాలు దేశలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్ ఇంటర్నేషనల్ గేట్‌వే ఐఎల్‌డీ ఆపరేటర్లకు ఉంటుంది. వారికి చిక్కకుండా హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ని వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పద్దతిలో లోకల్ కాల్స్‌గా మారుస్తుంటారు. రూటింగ్ జరిగేది ఇలా... విదేశీ ఆపరేటర్లు ఇక్కడి ఏజెన్సీలకు డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించే విధంగా ఓ విధానాన్ని రూపొందించారు. ఇక్కడ ఉంటున్న కొంత మందికి ఇంటర్నెట్ ద్వారా ఎరవేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చేస్తారు. అలా ఏర్పాటయిన తరవాత విదేశంలో ఉన్న ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చిన ఫోన్ కాల్ అక్కడ డేటాగా మారిపోతుంది. దాన్ని ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఇక్కడి వారిని ఎరవేసి ఏర్పాటు చేయించిన అత్యాధునిక పరికరాలకు పంపిస్తారు. వీరి దగ్గర ఉండే గేట్వేలు ఈ డేటాను మళ్లీ కాల్‌గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలకు చేరుతుంది. స్థానికంగా (లోకల్) బోగస్ వివరాలతో తీసుకున్న ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డులను సేకరించి ఈ సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలను తయారు చేస్తారు. గేట్‌వే నుంచి వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్ లోకల్‌గా మారిపోయి ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డునకు చెందిన నెంబరు (లోకల్) నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్ అందుకునే వారికి కనిపిస్తుంది. దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి సైతం కాల్‌ఛార్జ్ తగ్గుతుంది. దేశంలోని అనేక ఆపరేటర్లను రావాల్సిన ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్ను దెబ్బతింటున్నాయి. ఈ కారణంగానే ప్రాధాన్యం... ఆదివారం సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన ముఠాకు సంబంధించిన సమాచారం వారికి నిఘా వర్గాల నుంచి అందింది. పాక్ సహా ఇతర దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు భారత్‌లోని సైనిక, నిఘా సంస్థల అధికారుల్ని ట్రాప్ చేయడానికి చూస్తుంటాయి. దీనికోసం వారు ‘హనీ ట్రాప్’ విధానం వినియోగిస్తారు. ఆయా దేశాలకు చెందిన అధికారులే మహిళలు, యువతులుగా ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుంటారు.అధికారుల నుంచి వ్యక్తిగత సమాచారం సంగ్రహిస్తారు. ఆపై ఆ ఫొటోలను, సమాచారం చూపి స్తూ తమకు అనుకూలంగా మారాలంటూ బ్లాక్ మెయిల్‌కు దిగుతారు. ఈ కాల్స్ చేయడానికి కాల్ రూటింగ్ విధానాన్నే వినియోగిస్తారు. -
టెల్కోలకు షాక్: జియో మరో యుద్ధం
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో మరో యుద్ధానికి తెరతీయబోతుంది. ఇప్పటికే టెల్కోలకు ముప్పు తిప్పలు పెడుతున్న జియో, తాజాగా ఇంటర్నేషనల్ కాల్స్‌పై కూడా యుద్ధానికి దిగబోతుంది. అంతర్జాతీయ కాల్ టెర్మినేషన్ రేట్ల(ఐటీఆర్)ను నిమిషానికి 6 పైసలు, తర్వాత జీరోకి తీసుకురావాలని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, టెలికాం రెగ్యులేటరీని కోరుతోంది. ప్రస్తుతమున్న ఛార్జీలను 53 పైసల నుంచి రూ.1కి పెంచాలని జియో ప్రత్యర్థి కంపెనీలు కోరుతున్న క్రమంలో జియో ఈ మేర అభ్యర్థనను టెలికాం రెగ్యులేటరీ ముందుంచడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే దేశీయంగా విధించే ఐయూసీ ఛార్జీలను ట్రాయ్, 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గించింది. 2020 నాటికి వాటిని జీరో చేయనున్నట్టు కూడా ప్రకటించింది. దీంతో టెల్కోలు భారీ రెవెన్యూలను కోల్పోతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ కాల్ టెర్మినేషన్ రేట్లను కూడా జియో తగ్గించాలని కోరడం టెల్కోలను మరింత నష్టాల్లోకి దిగజార్చనుంది. అంతర్జాతీయ ఇన్కమింగ్ కాల్స్ ద్వారా రూ.5000 కోట్ల వరకు రెవెన్యూలు వస్తున్నాయి. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు 60 శాతానికి పైగా దేశీయ వైర్లెస్ యూజర్ బేస్‌ను కలిగి ఉన్నాయి. దీంతో ఐటీఆర్ రేట్లను తగ్గించడం, టెలికాం కంపెనీలను మరోసారి భారీగా దెబ్బకొట్టనుందని తెలుస్తోంది. ఈ రేటును ఫారిన్ క్యారియర్, స్థానిక ఆపరేటర్‌కు చెల్లిస్తారు. ఓటీటీ కాల్స్(వాట్సాప్ కాల్స్, ఫేస్‌టైమ్ ఆడియో..) పాపులారిటీ పెరిగిపోతుండటంతో, జియో ఐటీఆర్ రేట్లను తగ్గించాలని కోరుతోంది. ఐటీఆర్ రేట్లు తగ్గితే, భారత్‌కు చేసే కాల్స్ రేట్లు కూడా తగ్గిపోనున్నాయి. -
ఆ కాల్స్‌కు జియో స్పెషల్ ఆఫర్
తక్కువ ధరలకే హైస్పీడ్ 4జీ ఇంటర్నెట్, ఉచిత కాల్స్ అంటూ దేశీయ టెలికాం మార్కెట్లో ధరల యుద్ధాన్ని ప్రారంభించిన రిలయన్స్ జియో, మరో వార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతర్జాతీయ కాల్స్ పైనా ఇతర టెలికాం దిగ్గజాలతో ధరల యుద్ధాన్ని ప్రకటించింది. 'రేట్ కట్టర్ ప్లాన్' ను ప్రకటించింది. ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్న యూజర్లకు వారి అంతర్జాతీయ కాల్ ఛార్జీలు భారీగా కిందకి దిగొస్తాయని రిలయన్స్ జియో తన వెబ్సైట్లో పేర్కొంది. నిమిషానికి కనిష్టంగా మూడు రూపాయల ఛార్జీ మాత్రమే వేయనున్నట్టు పేర్కొంది. '' అమెరికా, కెనడా, న్యూజిలాండ్, హాంకాంగ్, సింగపూర్, అండోరా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, ఫ్రెంచ్ గినియా, ఇటలీ, లుక్సెంబర్గ్, మాల్టా, మంగోలియా, మోరోకో, పోలాండ్, పోర్చుగల్, రోమానియా, స్వీడన్, స్విట్జర్లాండ్, తైవాన్, యూకే వంటి దేశాలకు కాల్స్ చేసుకునే జియో యూజర్లకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది'' అని తెలిపింది. ఈ దేశాలకు కాల్స్ చేసుకునే జియో యూజర్లకు నిమిషానికి 3 రూపాయల ఛార్జీ మాత్రమే వేయనున్నట్టు వెల్లడించింది. అయితే 501 రూపాయలతో రిలయన్స్ జియో ''రేట్ కట్టర్ ప్లాన్'' ను యూజర్లు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రాన్స్, పాకిస్తాన్, ఇజ్రాయిల్, జపాన్, అర్జెంటీనా, డెన్మార్క్, దక్షిణకొరియా దేశాల కాల్స్ రేట్లను నిమిషానికి 4.8గా నిర్ణయిస్తున్నట్టు కంపెనీ వెబ్ సైట్ రిపోర్టు చేసింది. జియో ధన్ ధనా ధన్ ఆఫర్ కు పోటీగా తమ పోస్టు పెయిడ్ కొత్త ఆఫర్లు ప్రకటించిన ఎయిర్ టెల్ విదేశాలకు వెళ్లేవారికి డిస్కౌంట్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. వెంటనే జియో కూడా అంతర్జాతీయ కాల్స్ పైనా ధరల యుద్ధానికి తెరతీసింది. -
ఓన్లీ..ఇన్కమింగ్
►కాల్ రూటింగ్ ఎక్స్ఛేంజ్లు కాల్స్ పంపలేవు ►సూత్రధారి మతీన్‌పై గతంలోనూ పలు కేసులు ►హార్డ్‌డిస్క్ పునరుద్ధరించాకే స్పష్టత: సీసీఎస్ డీసీపీ సిటీబ్యూరో: హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ను వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పద్దతిలో లోకల్ కాల్స్‌గా మార్చే కాల్ రూటింగ్ ఎక్స్ఛేంజ్లు ఇక్కడి కాల్స్‌ను బయటి దేశాలకు పంపలేవని (ఔట్ గోయింగ్) అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఆయా దేశాల నుంచి వచ్చే వాటికి లోకల్ కాల్స్‌గా మార్చి ఇక్కడి వారికి అందించగలవని (ఇన్కమింగ్) వివరిస్తున్నారు. కాల్ రూటింగ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన తండ్రీకొడుకులు అహ్మద్ సిద్ధిఖీ, ఫహద్ అహ్మద్ సిద్ధిఖీలను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్ కాల్ అక్కడి ఎక్స్ఛేంజి నుంచి నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్‌కు చేరతాయి. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ గేట్ వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడ నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా శాటిలైట్ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇక్కడకు చేరిన ఫోన్‌కాల్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లోని ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌ల ద్వారా ఇక్కడ కాల్ రిసీవ్ చేసుకునే ఫోన్‌కు వస్తుంది. ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌లకు సైతం విదేశీ కాల్ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మొత్తం చెల్లించకుండా తప్పించుకునేందుకు అక్కడి కాల్ ఆపరేటర్లే ఇక్కడ వ్యవస్థీకృత ముఠాలను ఏర్పాటు చేసుకుంటాయి. కొందరు సూత్రధారులు వివిధ ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ కాల్ రూటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి దందాలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి ఓ కాల్ విదేశాలకు వెళ్ళాలంటే కచ్చితంగా అది సర్వీస్ ప్రొవైడర్ ద్వారానే జరగాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మతీనుద్దీన్పై అనేక కేసులు హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆఘాపురలో అహ్మద్ సిద్ధిఖీ, ఫహద్ అహ్మద్ సిద్ధిఖీలతో కాల్ రూటింగ్ ఎక్స్ఛేంజ్ను ఏర్పాటు చేయించింది రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన మతీనుద్దీన్ అలియాస్ మతీన్‌గా పోలీసులు నిర్థారించారు. ఇతను గతంలోనూ ఇలాంటి దందాలు చేసి పోలీసులకు చిక్కాడు. సీసీఎస్లోనూ మతీన్‌పై కాల్ రూటింగ్ ఆరోపణలతో కేసు నమోదై ఉంది. కొన్ని కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అహ్మద్ సిద్ధిఖీ, ఫహద్ అహ్మద్ సిద్ధిఖీ ఇంటిపై దాడులు నిర్వహించేందుకు వెళ్లగా పోలీసులు ఇంట్లోకి రాకుండా నిందితుల తరఫు వారు దాదాపు గంట సేపు ఆపారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు స్థానిక పోలీసులు, బస్తీ పెద్దల సహకారంతో ఇంట్లోకి వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు భారీ ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈలోపు అప్రమత్తమైన నిందితులు తమ ల్యాప్‌టాప్‌తో పాటు ఓ కంప్యూటర్ను ధ్వంసం చేశారు. వీటి హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్న సైబర్‌క్రైమ్ పోలీసులు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే కాల్స్ ఎక్కడ నుంచి వచ్చాయి? ఎవరికి చేరాయి? అనే దానిపై స్పష్టత వస్తుందని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. నిందితుల నుంచి 64 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో సహకరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డీఓటీ) సహకారం తీసుకుంటున్నామన్నారు. ఆ కారణంగానే ప్రాధాన్యం... పాక్ సహా ఇతర దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు భారత్‌లోని సైనిక, నిఘా సంస్థల అధికారుల్ని ట్రాప్ చేయడానికి చూస్తుంటాయి. ఇందుకుగాను వారు వారు ‘హనీ ట్రాప్’ విధానం వినియోగిస్తారు. ఆయా దేశాలకు చెందిన అధికారులే మహిళలు, యువతులుగా ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో నిజంగానే యువతుల్ని రంగంలోకి దింపుతారు. కొంత పరిచయం పెరిగిన తర్వాత ఇక్కడి అధికారుల నుంచి వ్యక్తిగత సమాచారం సంగ్రహిస్తారు. ఆపై ఆ ఫొటోలను, సమాచారం చూపిస్తూ తమకు అనుకూలంగా మారాలంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. ఈ కాల్స్ చేయడానికి కాల్ రూటింగ్ విధానాన్నే వినియోగిస్తారు. ఇటీవల దేశ వ్యాప్తంగా కొన్ని ఏజెన్సీల అధికారులకు కొన్ని రకాలైన బెదిరింపు కాల్స్ వచ్చాయి. కాల్ బ్యాక్ చేసే అవకాశం లేని నేపథ్యంలో రూటింగ్ ద్వారానే దీనికి పాల్పడ్డారు. అలాంటి రూటింగ్ కాల్స్ హైదరాబాద్ నుంచి వచ్చినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనిపై ఆరా తీస్తున్న సమయంలోనే ఈ గ్యాంగ్ చిక్కింది. దీనికితోడు అహ్మద్ సిద్ధిఖీ రెండు పాస్పోర్ట్స్ కలిగి ఉండటం, ఒకదాన్ని వినియోగించి 2004లో పాకిస్థాన్‌కు వెళ్ళి రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరిని లోతుగా విచారించడానికి కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
కాల్ కేటుగాళ్లు
► కాల్ డైవర్షన్ రాకెట్ గుట్టురట్టు! ► అంతర్జాతీయ ఇన్కమింగ్ కాల్స్ లోకల్‌గా మార్పు ► సూత్రధారులు విదేశాల్లో, హైటెక్ పద్దతిలో వ్యవహారం ► ఏజెన్సీల నిఘాకు చిక్కకుండా ఫోన్లు చేసేందుకు ఆస్కారం ► హబీబ్‌నగర్‌లో సైబర్ క్రైమ్ కాప్స్ దాడి, అదుపులో నిందితులు హైదరాబాద్: విదేశాల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్ పైనా ఏజెన్సీల నిఘా ఉంటుంది. అనునుమానాస్పద దేశాలు, వ్యక్తులు, నెంబర్ల నుంచి వచ్చే వాటిని ట్యాప్ కూడా చేస్తారు. ఇందుకు ఉపకరించే సాధనాలు దేశం లోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్ ఇంటర్నేషనల్ గేట్‌వే ఐఎల్‌డీ ఆపరేటర్లకు ఉంటుంది. వారికి చిక్కకుండా హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ను వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పద్దతిలో లోకల్ కాల్స్‌గా మారుస్తున్న హైటెక్ ముఠాగుట్టును సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ను ఈ రకంగా మార్చడం ద్వారా ప్రభుత్వానికీ పన్ను రూపంలో రావాల్సిన కోట్ల ఆదాయానికి గండి పడుతోంది. విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్ కాల్ అక్కడి ఎక్సేంజి నుంచి నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్‌కు చేరతాయి. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ గేట్ వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడ నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా శాటిలైట్ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇక్కడకు చేరిన ఫోన్‌కాల్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌ల ద్వారా ఇక్కడ కాల్ రిసీవ్ చేసుకునే ఫోన్‌కు వస్తుంది. ఈ తతంగం అంతా సెకను కంటే తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌లకు సైతం విదేశీ కాల్ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకునే వీరు తమ ఆదాయం నుంచి నిర్ణీత మొత్తాన్ని పన్నురూపంలో చెల్లిస్తారు. అయితే విదేశీ ఆపరేటర్లు ఇక్కడి వారికి డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించేలా ఓ విధానాన్ని రూపొందించారు. స్థానికులు కొందరికి ఇంటర్నెట్ ద్వారా ఎరవేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చేస్తారు. వాటి ద్వారా విదేశాల్లోని ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చిన ఫోన్ కాల్ అక్కడ డేటాగా మారిపోతుంది. దాన్ని ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఇక్కడి వారితో ఏర్పాటు చేయించిన అత్యాధునిక పరికరాలకు పంపిస్తారు. వీరి దగ్గర ఉండేగేట్వేలు ఈ డేటాను మళ్లీ కాల్‌గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలకు చేరుతుంది. స్థానికంగా (లోకల్) బోగస్ వివరాలతో తీసుకున్న ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డులను సేకరించి ఈ సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలను తయారు చేస్తారు. గేట్‌వే నుంచి వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్ లోకల్‌గా మారిపోయి ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డునకు చెందిన నెంబరు (లోకల్) నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్ అందుకునే వారికి కనిపిస్తుంది. దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి సైతం కాల్ఛార్జి తగ్గుతుంది. దీంతో దేశంలోని పలువురు ఆపరేటర్లకు రావాల్సిన ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్నులకు గండిపడుతోంది. దేశంలోని సర్వీసు ప్రొవైడర్ల ఆదాయానికి గండి కొట్టడం ద్వారా విదేశీ సర్వీసు ప్రొవైడర్ ఆ మొత్తాన్నీ మిగుల్చుకుంటున్నాడు. ఇక్కడ అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసి సహకరించిన స్థానికులు హవాలా రూపంలో కమీషన్ పంపిస్తుంది. నగరానికి చెందిని ఓ మహిళకు ఇటీవల ఓ నెంబర్ నుంచి అభ్యంతర, అశ్లీల సందేశాలు వస్తుండటంతో ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎంతగా ప్రయత్నించినా ఆ నెంబర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు ఇంటర్నెట్ ఆధారిత నెంబర్‌గా, వీఓఐపీ పరిజ్ఞానంతో పని చేస్తున్నట్లు గుర్తించారు. సదరు ఇంటర్నెట్ ఆపరేటర్‌ను సంప్రదించిన పోలీసులు హబీబ్‌నగర్ ప్రాంతంలో దాదాపు 60 కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. తొలుత పోలీసులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిందితుల తరఫు వారు దాదాపు గంట సేపు అడ్డుకున్నారు దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు, స్థానిక పోలీసులతో పాటు బస్తీ పెద్దల సహకారంతో ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు భారీ ఉపకరణాలు, ఆరు ఎయిర్‌గన్స్, 10 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆ ఆయుధాలు తమ ఫామ్‌హౌస్‌లో వినియోగించేవిగా నిందితులు వెల్లడించారు. వీరు నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ డైవర్షన్ కేంద్రాలు (అక్రమ ఎక్సేంజ్‌లు) ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేంద్రనగర్ సహా మిగిలిన ప్రాంతాల్లోని వాటిని గుర్తించడంతో పాటు మిగిలిన నిందితుల్ని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో కొన్ని ఎయిర్‌గన్స్ ఉన్నాయి. వీటికి లైసెన్స్ అవసరం లేదు. మరికొన్ని అత్యాధునిక హంటింగ్ గన్స్‌గా గుర్తించాం. వీటికి లైసెన్స్ అవసరమా? లేదా? అనేది పరిశీలిస్తున్నాం. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం’ అని అన్నారు. -
‘కాల్’ కంత్రీలు
అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ను లోకల్‌గా మళ్లింపు తక్కువ ధరలకు అందిస్తున్న ముఠా అరెస్ట్ రాంగోపాల్‌పేట్ : అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మళ్లిస్తున్న ముఠాను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ లింబారెడ్డి, ఉత్తర మండలం ఇన్స్పెక్టర్ ఏపీ ఆనంద్ కేసు వివరాలు వెల్లడించారు. కేపీహెచ్‌బీ ప్రశాంత్ అపార్ట్మెంట్లో నివసించే కృష్ణ చైతన్య(29) బీటెక్ పూర్తి చేశాడు. ఆగాపూరకు చెందిన గడ్డం రాజ్సాయి రాహుల్ కుమార్(28), అదే ప్రాంతానికి చెంది పిట్లం రామకృష్ణ(27), సిద్ధార్థ(24), షేక్‌పేట్ మారుతీనగర్‌కు చెందిన పిట్ల అనురూప్ స్నేహితులు. వీరు ముఠాగా ఏర్పడి ఆసిఫ్‌నగర్, హాంక్‌కాంగ్‌లో కృష్ణ చైతన్య ఎండీగా, డీవీఎల్ గ్రూప్ (డిజిటల్ వాయిస్ ల్యాబ్ గ్రూప్) అనే సంస్థను ఏర్పాటు చేశారు. అలాగే హైదర్షాకోట్లో దేశి వాయిస్ మొబైల్ ల్యాబ్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థను నెలకొల్పారు. ఈ ముఠా అంతర్జాతీయ ఫోన్ కాల్స్ (ఐఎస్టీడీ)ను ఇంటర్నెట్ ద్వార లోకల్ కాల్స్‌గా మార్చి తక్కువ ధరలకు వివిధ సంస్థలకు, వ్యక్తులకు అందిస్తున్నారు. ఐఎస్టీడీ కాల్స్‌ను లెసైన్సు కలిగిన కొన్ని టెలికాం సంస్థలు మాత్రమే గేట్ వే ద్వార పంపిస్తుంటారు. ఈ కాల్స్ ఎక్కడి నుంచి ఎవరికి వెళుతున్నాయి అనేది నమోదు అవుతుంది. కానీ ఈ సంస్థ ఢిల్లీ నుంచి వీఓఎస్ అనే సాప్ట్‌వేర్‌ను ఉపయోగించి, ఇంటర్నెట్ ద్వారా అంతర్జాతీయ కాల్స్‌ను మళ్లిస్తున్నాయి. దీంతో లెసైన్సు కలిగిన టెలికాం సంస్థలు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా వీరి ద్వార వెళ్లే కాల్స్‌ను గుర్తించడం కష్టం. వీటికి కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ లేకపోవడంతో తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఉపయోగించుకునే అవకాశాలుంటాయి. ఇది జాతీయ భద్రతకు కూడా చాలా ముప్పు ఉంటుంది. నిందితులు కొన్ని సంస్థలతో ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుని వారికి తక్కువ ధరలకే అంతర్జాతీయ కాల్స్‌ను అందిస్తున్నాయి. అలాగే నెట్లో యాడ్స్ ఇచ్చి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారి కార్యాలయాలపై దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు సీపీయూలు, ఐదు మొబైల్ ఫోన్లు తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ధర్యాప్తు కోసం ఆసిఫ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో మరో నిందితుడు అనుదీప్ పరారీలో ఉన్నారు. -
టెలి‘కామ్‌గా’ ముంచేశారు
ఇంటర్నేషనల్ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చిన వైనం రూ.30 కోట్ల కుచ్చు టోపీ గుట్టురట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు ముఠా అరె స్టు, రూ.40 లక్షల సొత్తు స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: టెలి కమ్యూనికేషన్ శాఖకు సుమారుగా రూ.30 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన హైటెక్ ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా సైబరాబాద్‌లోని మూడు ప్రాంతాల నుంచి ఆరేళ్లుగా చీకటి వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగించింది. ఆరుగురు సభ్యులున్న ముఠాను సైబర్‌క్రైమ్, స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.40 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని కమిషనర్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ ఏసీపీ జయరాంతో కలసి ఎస్ఓటీ ఓఎస్డీ రాంచంద్రారెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కూకట్‌పల్లికి చెందిన దామర్ల వెంకట కృష్ణప్రసాద్, కల్లూరి కల్యాణ్ చక్రవర్తి, రావూరి దుర్గా శ్రీనివాస్, మాదాపూర్‌కు చెందిన మద్దుల సుబ్బమనోజ్ దీపక్, దేవసాని శ్రీనివాస్‌రెడ్డి, అల్వాల్‌కు చెందిన నరేష్ కుమార్ తన్నీరు ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా ఉన్నత చదువులు చదివినవారే. అక్రమ మార్గంలో త్వరగా కోటీశ్వరులు కావాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి, ఆరేళ్ల క్రితం చీకటి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ మేరకు కూకట్పల్లి, అల్వాల్, మల్కాజ్గిరి ప్రాంతాలలో ఇళ్లను అద్దెకు తీసుకుని కావాల్సిన కంప్యూటర్లు, సెల్ఫోన్లు, సిమ్‌కార్డులు తదితర పరికరాలు సమకూర్చుకున్నారు. విదేశాల్లో బంధువులు ఉంటూ, నగరంలో నివాసముంటున్న వారే వీరి వినియోగదారులు. విదేశాలలో ఉన్న బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో తక్కువ ఖర్చుతో మాట్లాడాలనుకునే వారు ఈ ముఠాన సంప్రదిస్తారు. ఈ ముఠా సాంకేతిక పరిజ్ఞానం (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్)తో ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి కస్టమర్ల నుంచి డబ్బులు దండుకునే వారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఓటీ, సైబర్‌క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి వీరివ్యాపార స్థావరాలపై గురువారం అర్ధరాత్రి మెరుపుదాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.40 లక్షల విలువైన నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్, 11 సెల్ఫోన్లు, 281 సిమ్‌కార్డులు, 72 రూటర్స్, 16 వైర్లెస్ యాంటెన్నాలు, టెలికమ్యూనికేషన్ పరికరాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో టెలికాం శాఖకు వీరు సుమారు రూ.30 కోట్ల నష్టాన్ని కలిగించారని తేలింది. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, రాజశేఖరరెడ్డి, ఉమేందర్, వెంకట్‌రెడ్డి, గురురాఘవేందర్, ఎస్ఐలు రవి, ఆంజనేయులు పాల్గొన్నారు.