International developments
-
పరిమిత శ్రేణిలోనే కదలికలు
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. డెరివేటివ్ కాంట్రాక్టుల నెలవారీ గడువు గురువారం(జూన్ 27)తో పూర్తి కానుండడం కూడా మార్కెట్లో ఊగిసలాట ఉండొచ్చంటున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. ‘‘స్టాక్ మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నప్పట్టకీ., కొనుగోళ్లు చేసేందుకు గానీ, అమ్మకాలు జరిపేందుకు గానీ ప్రేరేపించే అంశాలేవీ లేనందున సూచీలు పరిమిత శ్రేణిలో చలించవచ్చు. అలాగే బడ్జెట్ అంచనాల వార్తలకు అనుగుణంగా బడ్జెట్ ఆధారిత రంగ షేర్లలో మూమెంటమ్ అధికంగా ఉండొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 23,400 – 23,700 శ్రేణిలో దిద్దుబాటు ఉండొచ్చు. దిగువ స్థాయిలో 23,300–23,200 పరిధిలో తక్షణ మద్దతు నెలకొని ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సాంకేతిక నిపుణులు ప్రవేశ్ గౌర్ తెలిపారు. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే గతవారంలో సెన్సెక్స్ 217 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్లు లాభపడ్డాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశ నిర్ణయాల ప్రభావం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జరిగిన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశ నిర్ణయాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ముఖ్యంగా ఎరువులపై జీఎస్టీ 18% నుంచి 5 శాతానికి తగ్గింపు ప్రతిపాదనను మంత్రుల బృందానికి (జీవోఎం) సిఫార్సు చేయడంతో ఫెర్టిలైజర్లలో కదలికలు ఉండొచ్చు. అలాగే, ఈ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్‌పై జీఎస్టీకి సంబంధించి ఎటువంటి చర్చ జరగకపోవడంతో ఆన్లైన్ గేమింగ్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయ్ విధాన సంస్కరణలు, ఆర్థిక వృద్ధి కొనసాగింపుపై అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. ఈ జూన్ ఇప్పటివరకు(జూన్ 21 నాటికి) నికరంగా రూ.12,170 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫైనాన్సియల్ సరీ్వసెస్, టెలికం, రియల్టీ షేర్ల పట్ల ఆసక్తి కనబరిచారు. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్, అయిల్‌అండ్‌గ్యాస్ షేర్లను విక్రయించారు. ఇక డెట్ మార్కెట్ లో రూ.10,575 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు. ‘‘కేంద్రం వృద్ధికి మద్దతనిచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చనే ఆశలు ఎఫ్ఐఐలను కొనుగోళ్లకు ప్రేరేపిస్తున్నాయి. అయినప్పట్టకీ దేశీయ ఈక్విటీ మార్కెట్ వాల్యుయేషన్లు భారీ పెరిగాయనే నెపంతో ఎఫ్ఐఐలు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు’’ అని మార్నింగ్స్టాక్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవత్సవ తెలిపారు. ఇక మేలో ఎఫ్‌పీఐలు ఈక్విటీల నుండి రూ. 25,586 కోట్లను ఉపసంహరించుకున్నారు, ఏప్రిల్‌లో రూ. 8,700 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అదే మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్లు నికర పెట్టుబడి పెట్టారు. రెండు ఐపీఓలు, 2 లిస్టింగులు రెండు కంపెనీలు ఈ వారంలో నిధుల సమీకరణకు రానున్నాయి. ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ పబ్లిక్ ఇష్యూ మంగళవారం( 25న) ప్రారంభమై, గురువారం (జూన్ 27న) ముగియనుంది. తద్వారా రూ.1,500 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 26న ప్రారంభంకానుంది. 28న ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 171 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇదే వారంలో డీఈఈ డెవలప్మెంట్ ఇంజినీర్స్ షేర్లు మంగళవారం, ఆక్మే ఫిన్‌ట్రేడ్ షేర్లు శుక్రవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం అమెరికా మార్చి త్రైమాసిక జీడీపీ వృద్ధి గణాంకాలు గురువారం, అదే రోజు యూరోజోన్ జూలై కన్జూమర్ కాని్ఫడెన్స్ డేటా, జపాన్ మే రిటైల్ అమ్మక గణాంకాలు విడుదల కానున్నాయి. మరుసటి రోజు(శుక్రవారం) చైనా మార్చి క్వార్టర్ కరెంట్ ఖాతా లోటు, జపాన్ మే నిరుద్యోగ గణాంకాలు, బ్రిటన్ క్యూ1 జీడీపీ వృద్ధి డేటా వెల్లడి కానున్నాయి. భారత మే నెల వాణిజ్య లోటు, మౌలిక రంగ వృద్ధి, మార్చి త్రైమాసిక కరెంటు ఖాతా లోటు (సీఏడీ), విదేశీ కరెన్సీ రుణ గణాంకాలు శుక్రవారం విడుదల కానున్నాయి. -
లాభాలు కొనసాగే అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారమూ లాభాలను కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలు ఇందుకు దోహదపడొచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, పశి్చమాసియా ఘర్షణలు, క్రూడాయిల్ ధరలు, ఎఫ్ఐఐల కొనుగోళ్లు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి కదలికలపై కన్నేయోచ్చంటున్నారు. సెపె్టంబర్ క్వార్టర్ ఆదాయాలపై సానుకూల అంచనాలు, దేశీయ ద్రవ్యోల్బణ దిగిరావడం, మెరుగైన పారిశ్రామికోత్పత్తి నమోదు తదితర పరిణామాలు కలిసిరావడంతో గతవారం సెన్సెక్స్ 287 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు ఆర్జించింది. మరోవైపు అమెరికాలో ద్రవ్యల్బోణం పెరగడం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, దేశీయ ఐటీ కంపెనీల యాజమాన్య నిరాశజనక ఆదాయ అవుట్‌లుక్ వ్యాఖ్యలు సూచీల లాభాలను కట్టడి చేశాయి. కార్పొరేట్ ఫలితాలు కీలకం మార్కెట్ ముందుగా గత వారాంతాన విడుదలైన హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అవెన్యూ సూపర్ మార్ట్(డీ మార్ట్)లు ప్రకటించిన ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ–50 ఇండెక్సు లో 40% వెయిటేజీ కలిగిన కంపెనీల షేర్లు తమ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనా న్స్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు మొ త్తం 540 కంపెనీలు తమ క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ వార్తల నేపథ్యంలో షేరు ఆధారిత ట్రేడింగ్‌కు అధిక ప్రాధాన్యత ఉండొచ్చు. ప్రపంచ పరిణామాలు ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధ పరిమాణాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలకం కానున్నాయి. యుద్ధ ప్రభావంతో ఇప్పటికే బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 8% ర్యాలీ చేశాయి. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ గురువారం ‘ది ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్’ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అమెరికా రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి డేటా(మంగళవారం), బ్రిటన్ నిరుద్యోగ, సీపీఐ ద్రవ్యోల్బణ డేటా పాటు యూరోజోన్ సెపె్టంబర్ సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జపాన్ పారిశ్రామికోత్పత్తి, చైనా జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపైనా కన్నేయోచ్చు. ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల ఉపసంహరణ విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్ ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్– హమాస్ వంటి భౌగోళిక రాజకీయ అనిశి్చతులు ఇందుకు కారణమయ్యాయి. సెపె్టంబరులో రూ.14,767 కోట్లు వెనక్కి తీసుకోవడంతో ఈ ఏడాది ఈక్విటీలోకి ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 1.1 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు భారత ఈక్విటీల్లో రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫిబ్రవరిలో 6 శాతంగా ఉన్న అమెరికా ద్రవ్యోల్బణం జులైలో 3.2 శాతానికి తగ్గడం, అమెరికా ఫెడరల్ రేట్ల పెంపులో తాత్కాలిక విరామం వంటి పరిణామాలు భారత్‌లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడులకు దోహదం చేశాయి. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. క్యాపిటల్ గూడ్స్ ఆటోమొబైల్స్ రంగాల్లో కొనుగోళ్లను కొనసాగించారు. ఇదే నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు దేశీయ డెట్ మార్కెట్లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
ట్రేడింగ్ ట్రెండ్: సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరే చాన్స్
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు ఈ వారంలో జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. రుతుపవనాల వార్తలు మినహా దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ఇతర అంశాలేవీ లేనందున అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ధోరణికి అనుగుణంగానే కదలాడతాయని చెబుతున్నారు. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు కొనసాగడంతో గతవారం సూచీలు దాదాపు ఒక శాతానికి పైగా ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 759 పాయింట్లు, నిఫ్టీ 263 పాయింట్లు పుంజుకున్నాయి. వారాంతం రోజైన శుక్రవారం మునుపెన్నడూ లేనివిధంగా సరికొత్త రికార్డు స్థాయిలో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ జీవితకాల గరిష్ట స్థాయి (63,583)కి 198 పాయింట్లు, నిఫ్టీ ఆల్‌టైం హై (18,888)కి 62 పాయింట్లు చేరువులో ఉన్నాయి. సరికొత్త రికార్డు స్థాయిల నమోదు ఇప్పుడు నామమాత్రమే. సరికొత్త రికార్డులు సృష్టించిన తర్వాత ర్యాలీ కొనసాగుతుందా..? లేక గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగి వెనక్కి వస్తుందా అనేది వేచి చూడాల్సి అంశం. ఒకవేళ మొమెంటమ్ కొనసాగితే నిఫ్టీ 19,000 స్థాయికి చేరవచ్చు. అమ్మకాలు జరిగితే దిగువ స్థాయిలో 18,676 వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది’’ అని ఏంజెల్ వన్ టెక్నికల్, డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ సమీత్ చవన్ తెలిపారు. ప్రపంచ పరిణామాలు యూరోజోన్ నిర్మాణ ఉత్పాదక, కరెంట్ అకౌంట్ డేటా, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మంగవారం వెలువడనున్నాయి. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా కాంగ్రెస్ ఎదుట బుధవారం (జూన్ 21న) అమెరికా దేశ ఆర్థిక స్థితిగతులపై వివరణ (టెస్టిమోనీ) ఇవ్వనున్నారు. పావెల్ వ్యాఖ్యలను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ వర్గాలు నిశితంగా గమనించే వీలుంది. అదే రోజున జపాన్ కేంద్ర బ్యాంక్ పాలసీ సమావేశ నిర్ణయాలు, బ్రిటన్ మే ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. గురువారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లు వెల్లడవుతాయి. వారాంతం రోజున యూఎస్ తయారీ, సర్వీసు రంగ గణాంకాలు, జపాన్ ద్రవ్యోల్బణ, బ్రిటన్ రిటైల్ అమ్మకాలు విడుదల కానున్నాయి. వర్షపాత వార్తలపై దృష్టి స్టాక్ మార్కెట్ కదలికపై నైరుతి రుతుపవనాల వార్తలూ ప్రభావం చూపే అవకాశం ఉంది. రుతుపవనాల విస్తరణలో మరికొంత జాప్యం జరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నైరుతి రుతుపవనాల ఆలస్యం, ఎల్‌నినో ప్రభావం వర్షపాతంపై ఉండదని, దేశంలో సాధారణ వర్షపాతం నమోదవ్వొచ్చంటున్నారు. సాధారణ రుతుపవనాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎఎంసీజీ, ఎరువులు, వ్యవసాయం, వినియోగ, ఆటో రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. రెండు వారాల్లో రూ.16,405 కోట్లు భారత మార్కెట్లోకి విదేశీ నిధుల వెల్లువ కొనసాగుతోంది. గత మూడు నెలలుగా భారత ఈక్విటీలపై ఆసక్తి కనబరుస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ జూన్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. ఇప్పటి వరకు (116 తేదీల మధ్య) రూ.16,405 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ, వృద్ధిపై పలు రేటింగ్ ఏజెన్సీల సానుకూల ప్రకటనల అంశాలు ఎఫ్‌పీఐల కొనుగోళ్లకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. -
ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు కీలకం
ముంబై: స్టాక్ మార్కెట్లపై ఈ వారం స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలతో పాటు కంపెనీల త్రైమాసిక ఫలితాలు ప్రభావం చూపనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వచ్చే వారం జూన్ 6–8 తేదిల్లో జరిగే ఆర్బీఐ ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలకు(వడ్డీరేట్ల పెంపు) అనుగుణంగా మార్కెట్ పొజిషనింగ్‌కు సన్నద్ధం కావొచ్చంటున్నారు. వాతావరణ శాఖ వెల్లడించే వర్షపాత నమోదు వార్తలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించవచ్చు. ఇదే వారంలో ఏథర్, ఈముద్ర, ఈథోస్ ఐపీవోలు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘అమెరికా మార్కెట్ల రీబౌండ్ ర్యాలీ కొంత ఒత్తిడిని తగ్గించింది. అయితే అనిశ్చితులు తగ్గి స్థిరత్వాన్ని ఏర్పరుచుకోవడం కీలకం. చివరి ట్రేడింగ్ సెషన్లో సాంకేతికంగా నిఫ్టీ 16,350 స్థాయిపై ము గిసింది. బౌన్స్‌బ్యాక్ ర్యాలీ కొనసాగితే 16,400 స్థా యిని.., ఆపై 16,700 –16,800 శ్రేణిలో కీలక నిరో ధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు జరిగితే దిగువ స్థాయిలో 15,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 15,700 వద్ద మద్దతు లభిం చొచ్చు. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో రక్షణాత్మక రంగాలుగా భావించే ఎఫ్ఎంజీసీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించవచ్చు’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెచ్ యశ్ షా తెలిపారు. సూచీలు గత వారంలో మూడు ట్రేడింగ్ సెషన్లో లాభాలను ఆర్జించగా, రెండు రెండురోజులు నష్టాలను చవిచూసింది. మొత్తం ఐదు ట్రేడింగ్‌ల్లో సెన్సెక్స్ 558 పాయింట్లు, నిఫ్టీ 86 పాయింట్లు చొప్పున పెరిగాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను విశ్లేషిస్తే.., స్థూల ఆర్థిక గణాంకాలు జర్మనీ మే ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదల అవుతాయి. రేపు భారత జీడీపీ డేటాతో పాటు ఈయూ మే ద్రవ్యోల్బణ గణాంకాలు (మే 31)న వెల్లడి కానున్నాయి. దేశీయ మే జీఎస్టీ వసూళ్లు, వాహన విక్రయాల గణాంకాలూ బుధవారం(జూన్ 1న) విడుదల అవుతున్నాయి. అదే రోజున చైనా తయారీ రంగ గణాంకాలు, వెల్లడి అవుతాయి. యూఎస్ తయారీ డేటా గురువారం.., యూఎస్ ఉద్యోగ గణాంకాల డేటా శుక్రవారం విడుదల అవుతుంది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను తెలియజేసే ఈ గణాంకాల ప్రకటనకు ముందుకు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. కార్పొరేట్ ఫలితాల ప్రభావం దేశీయ ఆర్థిక ఫలితాల సీజన్ ఈ వారంతో ముగియనుంది. సుమారు 300కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. సన్ ఫార్మా, ఎల్ఐసీ, జుబిలెంట్ ఫుడ్స్, డెల్హివరీ, దిక్సాస్ టెక్నాలజీ, దీలీప్ బిల్డ్‌కాన్, డిష్ టీవీ, ధని సర్వీసెస్, ఈక్విటాస్ హోల్డింగ్స్, నురేకా, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టీటీకే ప్రస్టేజ్, వికాస్ ఎకో టెక్ సంస్థలు మొదలైనవి జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో ఒడిదుడుకుల ట్రేడింగ్ చవిచూడొచ్చు. మూడు లిస్టింగులు ముందుగా నేడు ఈథోస్ ఐపవో షేర్లు లిస్ట్ అవుతుంది. గ్రే మార్కెట్లో ఈ షేరు డిస్కౌంట్లో ట్రేడ్ అవుతోంది. లిస్టింగ్‌లో మెప్పించకపోవచ్చు. జూన్ ఒకటో తేదిన ఈ ముద్ర షేర్లు లిస్టవనున్నాయి. వారాంతపు రోజున స్పెషాలిటీ కెమికల్స్ తయారీ సంస్థ ఏథర్ ఇండస్ట్రీస్ షేర్లు ఎక్చే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. ఈ నేపథ్యంలో లిస్టింగ్‌ల స్పందనలను ఇన్వెస్టర్లు గమనించవచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు విదేశీ ఇన్వెస్టర్లు ఈ మే నెల(27 తేదీ నాటికి)లో ఇప్పటి వరకు రూ.44,346 కోట్ల షేర్లను అమ్మేశా రు. బాండ్లపై రాబడులు పెరగడం, పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచొచ్చనే భయా లు, దేశీయ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనల తో ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. మరి కొంతకాలం ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నా రు. ఎఫ్ఐఐలు గడిచిన ఎమినిది నెలల్లో రూ. 2.50 లక్షల కోట్ల పెట్టుబడులను విక్రయించడం ఈక్విటీ మార్కెట్లను ఒత్తిడికి గురిచేస్తోంది. -
మార్కెట్లకు ఎన్నికల ఫలితాల దిశానిర్దేశం
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, క్రూడాయిల్ రేట్లతో పాటు అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం దేశీ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. రాజకీయ పరిణామాలతో స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడైన నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, స్టాక్ ఎక్సే్చంజీలు నిఘా చర్యలను మరింత పటిష్టంగా అమలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘మంగళవారం వెల్లడయ్యే రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దేశీ.. అంతర్జాతీయ స్థూల ఆ ర్థిక గణాంకాల వెల్లడి, క్రూడాయిల్ రేట్ల కదలికలు తదితర అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మంచిది. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోణంలో చూస్తే అయిదు రాష్ట్రాల ఫలితాలు చాలా కీలకంగా ఉండనున్నాయి’ అని ఈక్విటీ99 సీనియర్ రీసెర్చ్ అనలిస్టు రాహుల్ శర్మ తెలిపారు. ‘ఒపెక్ సదస్సు, హువావే గ్లోబల్ సీఎఫ్‌వో అరెస్టు వంటి పరిణామాలు ఇన్వెస్టర్లను ఆందోళనలో పడవేశాయి. వీటితో పాటు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. స్వల్పకాలికంగా మార్కెట్లలో హెచ్చుతగ్గులకు ఆజ్యం పోయనున్నాయి’ అని ఎపిక్ రీసెర్చ్ సంస్థ సీఈవో ముస్తఫా నదీమ్ చెప్పారు. ‘అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల వెల్లువ, క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరుగుతుండటం వంటి అంశాలతో ఈ వారం దేశీ సూచీలు ఒత్తిళ్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కూడా హెచ్చుతగ్గులకు దారితీయొచ్చు. సూచీలు ఇంట్రా డేలో 1% పైగా అటూ ఇటూ సాధారణంగానే తిరిగేసే అవకాశం ఉంది’ అని ఎడెల్వీజ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటెజిస్ట్ సాహిల్ కపూర్ తెలిపారు. టెక్నికల్‌గా చూస్తే భారీ కరెక్షన్కు లోనైన నిఫ్టీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవడంతో బుల్స్ తిరిగొచ్చేందుకు ఆస్కారముందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని చెప్పారు. నిఫ్టీ గానీ 10,775 పాయింట్ల నిరోధాన్ని దాటితే మరింత పెరగొచ్చని, 10,588 పాయింట్ల వద్ద మద్దతు ఉండగలదని పేర్కొన్నారు. సెన్సెక్స్ గతవారం 521 పాయింట్లు క్షీణించి 35,673 వద్ద, నిఫ్టీ 183 పాయింట్ల నష్టంతో 10,694 వద్ద క్లోజయ్యాయి. రూపాయిపైనా ఒత్తిడి .. గతవారం ఆఖర్లో సమావేశమైన చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్ .. ముడిచమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో బ్రెట్ క్రూడ్ రేటు శుక్రవారం ఒక్కసారిగా 2 శాతం పైగా పెరిగింది. మరోవైపు, చైనా టెలికం దిగ్గజం హువావే గ్లోబల్ సీఎఫ్‌వో మింగ్ వాంఝూను కెనడాలో అరెస్టు చేయడం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీ మార్కెట్‌నూ కుదిపేసింది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో విడత వడ్డీ రేట్ల పెంచడంపై ఈ నెలలో నిర్ణయం తీసుకోనుండటం కూడా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించేందుకు కారణం కానుంది. వడ్డీ రేట్లు పెంపుతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలతో అంతర్జాతీయ ఫండ్స్ రిస్కు తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చని, ఫలితంగా అమ్మకాలు వెల్లువెత్తవచ్చని అనలిస్టులు పేర్కొన్నారు. 70.50–72.50 మధ్య రూపాయి .. ఈ వారంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 70.50–72.50 మధ్య తిరుగాడే అవకాశాలు ఉన్నాయని కొటక్ సెక్యూరిటీస్ డిప్యుటీ వైస్ ప్రెసిడెంట్ (కరెన్సీ, వడ్డీ రేట్ల విభాగం) అనింద్య బెనర్జీ తెలిపారు. ‘అమెరికా డాలర్‌ను ట్రేడర్లు భారీగా షార్ట్ చేశారు. కీలకమైన రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రాకపోవొచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సెషన్లో షార్ట్ కవరింగ్ జరిగి రూపాయితో పోలిస్తే డాలర్ ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయి’ అని ఆమె తెలిపారు. ‘వచ్చేవారం ఎన్నికల ఫలితాలే కీలకంగా ఉంటాయి. ఒకవేళ మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీనే వచ్చి.. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ఏ ఒక్కదాన్లోనైనా గెలుపొందిన పక్షంలో రూపాయి ర్యాలీ చేయొచ్చు. అలా కాకుండా బీజేపీ ఓడిపోతే.. రూపాయికి ప్రతికూలంగా కాగలదు‘ అని అనింద్య వివరించారు. ఇవి కాకుండా ఈ వారం వెల్లడయ్యే స్థూల ఆర్థిక గణాంకాలూ కీలకం కానున్నాయి. 12న పారిశ్రామికోత్పత్తి, వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) గణాంకాలు, డిసెంబర్ 14న టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం, ఎగుమతుల గణంకాలు విడుదల కానున్నాయి. 5 రోజుల్లో రూ. 400 కోట్లు దేశీ మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు న్యూఢిల్లీ: చైనా టెలికం పరికరాల సంస్థ హువావే సీఎఫ్‌వో అరెస్టుతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడిన నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) గత 5 సెషన్స్‌లో ఏకంగా రూ. 400 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం డిసెంబర్ 3–7 మధ్య వ్యవధిలో ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 383 కోట్లు ఉపసంహరించారు. అదే సమయంలో డెట్ మార్కెట్లలో రూ. 2,744 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డిసెంబర్ 6న ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయని, ఎఫ్‌పీఐలు ఒక్క రోజులోనే రూ. 361 కోట్ల విక్రయాలు జరిపారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ అనలిస్ట్ మేనేజర్ హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. హువావే సీఎఫ్‌వో మెంగ్ వాంఝూ అరెస్ట్ కావడంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా క్షీణించడం ఇందుకు కారణమైందన్నారు. -
అంతర్జాతీయ పరిణామాలు కీలకం
ముంబై: ప్రపంచవ్యాప్త వాణిజ్య రక్షణాత్మక చర్యలపై నెలకొన్న భయాలు, టర్కీ ఆర్థిక సంక్షోభం, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, విదేశీ నిధుల ప్రవాహం వంటి స్థూల అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు అత్యంత కీలకంగా ఉండనున్నట్లు దలాల్ స్ట్రీట్ పండితులు అంచనావేస్తున్నారు. వాణిజ్య యుద్ధ పరంగా సానుకూల వాతావరణానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. అమెరికా–చైనా దేశాల మధ్య చర్చలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈవారం / మార్కెట్‌కు పాజిటివ్‌గానే ఉండవచ్చని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ అన్నారు. టర్కీ లీరా ఏమాత్రం బలపడినా రూపాయి విలువకు స్వల్పకాలానికి కొంత బలం చేకూరుతుందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అంచనావేశారు. ముడిచమురు ధరల కదలికలు, రూపాయి విలువ అంశాలతో పాటు విదేశీ నిధుల ప్రవాహం కీలకంగా మారనుందని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ వెల్లడించారు. బుధవారం (ఆగస్టు 22న) బక్రీద్ సందర్భంగా మార్కెట్లకు సెలవు కాగా, ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. వడ్డీ రేట్లపై ఫెడ్ వ్యాఖ్య..! అమెరికా పాలసీ రేట్లపై ఈవారంలో ఫెడ్ చైర్మన్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్ పాట్నర్ దేవేంద్ర నెవ్గి అన్నారు. ఒకవేళ వడ్డీరేట్ల పెంపు ప్రకటన వెలువడితే మార్కెట్‌కు ఇది ప్రతికూల అంశంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెంపు దిశగా వ్యాఖ్యలు వెలువడితే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశం ఉందన్నారు. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండేందుకు అవకాశం ఉందన్నారు. ఎఫ్‌పీఐల నికర పెట్టుబడి రూ.7,577 కోట్లు ఆగస్టు 1–17 మధ్యకాలంలో ఎఫ్‌పీఐలు రూ.7,577 కోట్లను నికరంగా పెట్టుబడి పెట్టినట్లు ప్రొవిజినల్ డేటా ద్వారా వెల్లడయింది. రూ.2,409 కోట్లను ఈక్విటీలో నికరంగా ఇన్వెస్ట్‌చేసిన వీరు రూ.5,168 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడిపెట్టినట్లు తెలుస్తోంది. 11,495 వద్ద నిరోధం ‘నిఫ్టీకి అత్యంత కీలక నిరోధం 11,,495 పాయింట్ల వద్ద ఉంది. దిగువస్థాయిలో 11,340 వద్ద మద్దతు ఉంది.’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. 9 కంపెనీల ట్రేడింగ్ నిలిపివేత గీతాంజలి జెమ్స్, ఆమ్టెక్ ఆటో, ఈసున్ రేరోల్ అండ్ పనోరమిక్ యూనివర్సల్ షేర్లలో ట్రేడింగ్‌ను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించాయి. సెప్టెంబరు 4 నుంచి బీఎస్ఈ, 5 నుంచి ఎన్ఎస్ఈలు సస్పెండ్ చేయనున్నట్లు తెలిపాయి. తంబ్బి మోడరన్ స్పిన్నింగ్ మిల్స్, ఇండో పసిఫిక్ ప్రాజెక్ట్స్, హర్యానా ఫైనాన్షియల్, నోబుల్ పాలిమర్స్, సమృద్ధి రియల్టీ షేర్లలో ట్రేడింగ్‌ను నిలివేస్తున్నట్లు బీఎస్ఈ పేర్కొంది. డిసెంబరు 2017, మార్చి 2018 కాలానికి సంబంధించి ఈ సంస్థలు ఎల్ఓడీఆర్ రెగ్యులేషన్స్ పాటించలేదని బీఎస్ఈ తెలిపింది. ఎల్ఓడీఆర్ నిబంధనలను ఈ సంస్థలు పాటిస్తే మళ్లీ ట్రేడింగ్ కొనసాగే అవకాశం ఉందని ఎక్సే్ఛంజీలు తెలిపాయి. -
కరెన్సీ ఒడిదుడుకులపై అప్రమత్తత అవసరం
ప్రభుత్వాన్ని కోరిన నాస్కామ్ హైదరాబాద్: డాలర్‌తో రూపాయి మారకంలో తీవ్రమైన ఒడిదుడుకులు భారత్‌లోని ఏ పరిశ్రమకూ మంచిది కాదని నాస్కామ్ వ్యాఖ్యానించింది. అందుకని కరెన్సీ ఒడిదుడుకులకు సంబంధించి అంతర్జాతీయ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. అవసరమైనప్పుడు రూపాయి ఒడిదుడుకుల ప్రభావం కనిష్ట స్థాయిలో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చైనా యువాన్ కరెన్సీ తగ్గింపు కారణంగా దేశ ఐటీ పరిశ్రమపైఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఆయన తేల్చిచెప్పారు. డాలర్ బలపడడం వల్ల భారత ఎగుమతిదారులకు స్వల్పకాలిక లాభమే ఉంటుందని వివరించారు. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా లాభపడడం పరిశ్రమ అభిమతం కాదని, వ్యాపారం ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించడం ముఖ్యమని పేర్కొన్నారు.