international one day cricket
-
విండీస్‌తో భారత్ తొలి పోరు.. రోహిత్ వచ్చేశాడు!
అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ ‘సహస్ర’ సమరానికి సై అంటోంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ నేడు జరుగనుంది. కొత్త నాయకుడు రోహిత్ శర్మ తనకు లభించిన ఈ వెయ్యో వన్డేలో గెలిచి... తన సారథ్యానికి విజయబాట వేసుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా పర్యటనలో ఎదురైన చేదు అనుభవాన్ని ఈ విజయంతో తుడిచి పెట్టాలని టీమిండియా సహచరులు పట్టుదలతో ఉన్నారు. అహ్మదాబాద్: దక్షిణాఫ్రికా గడ్డపై క్లీన్‌స్వీప్ అయిన భారత జట్టును స్వదేశంలో కోవిడ్ చుట్టుముట్టింది. అయినా సరే సొంతగడ్డ అనుకూలతలతో, కొత్తగా రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా 1000వ వన్డే పోరాటానికి సిద్ధమైంది. మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగిన హోరాహోరీ టి20 సిరీస్‌లో విజయం సాధించిన ఉత్సాహంతో వెస్టిండీస్ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. ఇప్పుడు వన్డే సిరీస్‌లో శుభారంభం చేయాలని కరీబియన్ జట్టు తహతహలాడుతోంది. ఇరు జట్లను అనుభవజ్ఞుల కొరత వేధిస్తోంది. వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్, కరోనాతో ధావన్, శ్రేయస్, రుతురాజ్, సైనీలు దూరమవగా... మయాంక్ అగర్వాల్ క్వారంటైన్ పూర్తి కాలేదు. దీంతో భారత్ ఓపెనింగ్‌కు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఇషాన్ కిషన్. కెప్టెన్ రోహిత్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. చాన్నాళ్ల తర్వాత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు బరిలోకి దిగే అవకాశం రాగా... గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ తుది బెర్త్ కోసం దీపక్ హుడాతో పోటీపడనున్నాడు. ఇద్దరు ఆల్‌రౌండర్లు కావడంతో ఒకరికే ఛాన్సుంది. మరోవైపు విండీస్ జట్టుకు గాయంతో హెట్‌మైర్, కోవిడ్‌తో ఎవిన్ లూయిస్ దూరమయ్యారు. దీంతో కొత్త కుర్రాళ్లు ఒడియన్ స్మిత్, రొమరియో షెఫర్డ్, బ్రాండన్ కింగ్‌లతో భారత్‌తో సమరానికి సిద్ధమైంది. 999:ఇప్పటివరకు భారత్ 999 వన్డేలు ఆడింది. 518 మ్యాచ్‌ల్లో గెలిచింది. 431 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 9 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. 41 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. స్వదేశంలో భారత్ 345 వన్డేలు ఆడింది. ఇందులో 202 విజయాలు, 131 పరాజయాలు ఉన్నాయి. 3 మ్యాచ్‌లు ‘టై’ అయ్యాయి. 9 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. విదేశాల్లో భారత్ 654 వన్డేలు ఆడింది. ఇందులో 316 విజయాలు, 300 పరాజయాలు ఉన్నాయి. 6 మ్యాచ్‌లు ‘టై’కాగా, 32 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. 1974: భారత్ తమ తొలి వన్డేను 1974 జూలై 13న లీడ్స్‌లో ఇంగ్లండ్ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్లతో ఓడింది. వన్డేల్లో భారత్ తొలి విజయాన్ని 1975 ప్రపంచకప్‌లో ఈస్ట్ ఆఫ్రికాతో మ్యాచ్‌లో అందుకుంది. 19:భారత్ ఇప్పటి వరకు మొత్తం 19 దేశాలతో వన్డే మ్యాచ్‌లు ఆడింది. శ్రీలంకతో అత్యధికంగా 162 మ్యాచ్‌లను భారత్ ఆడింది. ఆ తర్వాతి వరుసలో ఆస్ట్రేలియా (143), వెస్టిండీస్ (133), పాకిస్తాన్ (132), న్యూజిలాండ్ (110), ఇంగ్లండ్ (103), దక్షిణాఫ్రికా (87), జింబాబ్వే (63), బంగ్లాదేశ్ (36), కెన్యా (13), అఫ్గానిస్తాన్ (3), ఐర్లాండ్ (3), యూఏఈ (3), నెదర్లాండ్స్ (2), హాంకాంగ్ (2), బెర్ముడా (1), ఈస్ట్ ఆఫ్రికా (1), నమీబియా (1), స్కాట్లాండ్ (1) ఉన్నాయి. 418: వన్డేల్లో భారత్ సాధించిన అత్యధిక స్కోరు. 2011 డిసెంబర్ 8న ఇండోర్ లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 418 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (219) డబుల్ సెంచరీ సాధించాడు. 26: వన్డేల్లో భారత జట్టుకు 26 మంది కెప్టెన్‌గా వ్యవహరించారు. ధోని అత్యధికంగా 200 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించాడు. ఆ తర్వాతి వరుసలో అజహరుద్దీన్ (174), గంగూలీ (146), కోహ్లి (95), ద్రవిడ్ (79), కపిల్ దేవ్ (74), సచిన్ (73), గావస్కర్ (37), వెంగ్‌సర్కార్ (18), అజయ్ జడేజా (13), శ్రీకాంత్ (13), రైనా (12), సెహ్వాగ్ (12), రవిశాస్త్రి (11), రోహిత్ శర్మ (10), వెంకట్రాఘవన్ (7), గంభీర్ (6), బేడీ (4), ధావన్ (3), కేఎల్ రాహుల్ (3), రహానే (3), వాడేకర్ (2), అమర్నాథ్ (1), కిర్మాణీ (1), విశ్వనాథ్ (1), కుంబ్లే (1) ఉన్నారు. 54: వన్డేల్లో భారత్ అత్యల్ప స్కోరు. 2000 అక్టోబర్ 29న షార్జాలో శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ 26.3 ఓవర్లలో 54 పరుగులకు ఆలౌటైంది. -
క్రికెట్‌కు హైదరాబాద్ అల్లుడు గుడ్‌బై
లండన్ : పాకిస్తాన్ క్రికెటర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికాడు. సీనియర్ ఆటగాడనే ట్యాగ్‌తో ఈ ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న మాలిక్ దారుణ ప్రదర్శనతో విమర్శలపాలయ్యాడు. మూడు మ్యాచ్‌లే ఆడిన అతను 8, 0, 0 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌తో మెగాటోర్నీలో పాక్ కథ ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మాలిక్‌కు చోటుదక్కకపోయినప్పటికి ఆటగాళ్లు అతనికి ఘనంగా వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ‘క్రికెట్ వరల్డ్‌కప్’ అధికారిక ట్వీటర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. ఇక అంతకు ముందు మాలిక్ సైతం ట్విటర్ వేదికగా అంతర్జాతీయ వన్డేల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ‘ఈ రోజు అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నాను. నాతో ఆడిన ఆటగాళ్లు, శిక్షణ ఇచ్చిన కోచ్‌లు, కుటుంబ సభ్యులు,మిత్రులు, మీడియా, స్పాన్సరర్స్, ముఖ్యంగా నా అభిమానులకు ధన్యవాదాలు. లవ్ యూ ఆల్.’ అని ట్వీట్ చేశాడు. షోయబ్ మాలిక్ తన చివరి వన్డే మాంచెస్టర్ వేదికగా భారత్‌పై ఆడాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 89 పరుగుల(డక్‌వర్త్‌లూయిస్) తేడాతో ఓడిపోయింది. మాలిక్ ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. 1999లో తొలి వన్డే ఆడిన మాలిక్ 20 ఏళ్ల కెరీర్లో 287 వన్డేల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 34.55 సగటుతో 7,534 పరుగులు చేశాడు. 39.19 సగటుతో 158 వికెట్లు పడగొట్టాడు. 20 ఏళ్లపాటు పాక్ క్రికెట్‌కు సేవలందించిన మాలిక్‌కు యావత్ క్రికెట్ ప్రపంచం శుభాకాంక్షలు తెలుపుతోంది. మాజీ క్రికెటర్లు, అభిమానులు ట్విటర్ వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. రెండో ఇన్నింగ్స్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నారు ‘ప్రతీ కథకు ఓ ముగింపు ఉంటుంది. కానీ జీవితంలో ప్రతి ముగింపుకు ఓ కొత్త ఆరంభం కూడా ఉంటుంది. మాలిక్ 20 ఏళ్లు నీ దేశం గర్వించేలా ఆడావు. అలాగే ఎంతో గౌరవం, వినయంతో నీ ఆటను కొనసాగించావు. నీవు సాధించిన ప్రతి మైలురాయి పట్ల నేనెంతో గర్వపడ్డా.’ అని సానియా మీర్జా ట్వీట్ చేసింది. 2010 ఏప్రిల్ 12న వివాహబంధంతో సానియా- మాలిక్‌లు ఒక్కటైన విషయం తెలిసిందే. ‘Every story has an end, but in life every ending is a new beginning’ @realshoaibmalik 🙃 u have proudly played for your country for 20 years and u continue to do so with so much honour and humility..Izhaan and I are so proud of everything you have achieved but also for who u r❤️ — Sania Mirza (@MirzaSania) July 5, 2019 -
అత్యుత్తమ వన్డే క్రికెటర్‌గా రిచర్డ్స్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ నిలిచారు. ‘క్రిక్ఇన్ఫో క్రికెట్ మంత్లీ’ నిర్వహించిన ఈ ఆన్లైన్ పోల్‌లో ఈ మాజీ ఆటగాడికి ఎదురులేకుండా పోయింది. సుప్రసిద్ధ ఆటగాళ్లు, వ్యాఖ్యాతలు, రచయితలతో కూడిన 50 మంది జ్యూరీ ఈ ఎంపిక చేసింది. సచిన్, వసీం అక్రమ్, గిల్‌క్రిస్ట్, ధోని కూడా పోటీలో నిలిచారు. అయితే జ్యూరీలో 29 మంది రిచర్డ్స్కు అనుకూలంగా నిలవడంతో 179 పాయింట్లతో తను టాప్‌గా నిలిచాడు. 70, 80వ దశకంలో రిచర్డ్స్ వన్డే క్రికెట్‌ను శాసించారు. అలాగే తమ జట్టుకు 1975, 79 ప్రపంచకప్‌లను అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక వన్డేల్లో 49 సెంచరీలు, 18,426 పరుగులు చేసినప్పటికీ టాప్‌గా నిలువడంలో సచిన్ విఫలమయ్యాడు. రెండో స్థానం కోసం సచిన్, అక్రమ్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా 68 పాయింట్లతో సచిన్, 66 పాయింట్లతో అక్రమ్ వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. గిల్‌క్రిస్ట్ (29), ధోని (25) ఆ తర్వాత ఉన్నారు. జ్యూరీలో రాహుల్ ద్రవిడ్, పాంటింగ్, స్మిత్, ఇయాన్ చాపెల్, లాయిడ్ తదితరులు ఉన్నారు. వీరు ఎంపిక చేసిన వన్డే డ్రీమ్ టీమ్‌లో... గిల్‌క్రిస్ట్, సచిన్, పాంటింగ్, రిచర్డ్స్, కలిస్, ధోని, జయసూర్య, కపిల్, అక్రమ్, వార్న్, గార్నర్ చోటు దక్కించుకున్నారు. -
ముక్కోణపు టోర్నీ విజేత భారత్ ‘ఎ’
ప్రిటోరియా: అంతర్జాతీయ వన్డే క్రికెట్లో భారత జట్టు ఆధిపత్యాన్ని ‘ఎ’ జట్టు కూడా కొనసాగించింది. లీగ్ దశలో రెండుసార్లు ఓడించిన జట్టును ఫైనల్లో చిత్తు చేసింది. ఎ జట్ల ముక్కోణపు వన్డే టోర్నీని గెలిచి... భవిష్యత్ కూడా తమదే అని ఘనంగా చాటింది. ఇక్కడి డివిలియర్స్ మైదానంలో బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ ‘ఎ’ 50 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ‘ఎ’ను చిత్తు చేసి ముక్కోణపు సిరీస్ విజేతగా నిలిచింది. భారత్ 49.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ కాగా, ఆసీస్ 46.3 ఓవర్లలో 193 పరుగులకే కుప్పకూలింది. లీగ్ దశలో రెండు మ్యాచ్‌ల్లోనూ ఆసీస్ చేతిలో ఓడినా...ఫైనల్లో మాత్రం మన జట్టు ఆధిక్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే రోహిత్ శర్మ (6) వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే పుజారా (1) కూడా అవుటయ్యాడు. అయితే ఈ దశలో దినేశ్ కార్తీక్ (75 బంతుల్లో 73; 10 ఫోర్లు), శిఖర్ ధావన్ (65 బంతుల్లో 62; 9 ఫోర్లు) కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 108 పరుగులు జోడించారు. రైనా (17) విఫలం కాగా, రాయుడు (49 బంతుల్లో 34; 3 ఫోర్లు), సాహా (41 బంతుల్లో 31; 2 ఫోర్లు) కలిసి గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్, కౌల్టర్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కోలుకోలేకపోయింది. నదీమ్‌కు 3, షమీకి 2 వికెట్లు దక్కాయి. స్కోరు వివరాలు భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) హాజల్‌వుడ్ 6; ధావన్ (సి) పైన్ (బి) హెన్రిక్స్ 62; పుజారా (సి) ఫించ్ (బి) మాక్స్వెల్ 1; కార్తీక్ (బి) కౌల్టర్ 73; రైనా (ఎల్బీ) (బి) మిచెల్ మార్ష్ 17; రాయుడు (బి) హాజల్ వుడ్ 34; సాహా (సి) మాక్స్వెల్ (బి) హెన్రిక్స్ 31; రసూల్ (సి) హాజల్‌వుడ్ (బి) కౌల్టర్ 5; పాండే (బి) కౌల్టర్ 1; షమీ (బి) హాజల్‌వుడ్ 3; నదీమ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 3, వైడ్ 6, నోబాల్ 1) 10; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 243. వికెట్ల పతనం: 1-20; 2-34; 3-142; 4-158; 5-166; 6-229; 7-236; 8-238; 9-243; 10-243. బౌలింగ్: హాజల్‌వుడ్ 10-1-31-3; సంధూ 6-0-50-0; మాక్స్వెల్ 5-1-24-1; కౌల్టర్ 9.2-1-35-3; అహ్మద్ 6-0-42-0; హెన్రిక్స్ 10-047-2; మిచెల్ మార్ష్ 3-0-11-1. ఆస్ట్రేలియా ‘ఎ’ ఇన్నింగ్స్: ఫించ్ (బి) షమీ 20; షాన్ మార్ష్ (సి) పుజారా (బి) షమీ 11; మాడిసన్ (సి) రైనా (బి) పాండే 7; మాక్స్వెల్ (సి) పుజారా (బి) రైనా 12; మిచెల్ మార్ష్ రనౌట్ 2; హెన్రిక్స్ (సి) రైనా (బి) నదీమ్ 20; పైన్ (బి) రసూల్ 47; కౌల్టర్ (స్టంప్డ్) సాహా (బి) నదీమ్ 5; హాజల్‌వుడ్ (స్టంప్డ్) సాహా (బి) నదీమ్ 30; సంధూ (నాటౌట్) 21; అహ్మద్ (రనౌట్) 9; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 6, వైడ్ 3) 9; మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 193. వికెట్ల పతనం: 1-30; 2-33; 3-50; 4-52; 5-53; 6-76; 7-88; 8-142; 9-176; 10-193. బౌలింగ్: షమీ 7.3-1-30-2; రైనా 10-1-33-1; పాండే 8-1-47-1; నదీమ్ 10-1-34-3; ధావన్ 1-0-13-0; రసూల్ 10-1-30-1.