ముక్కోణపు టోర్నీ విజేత భారత్ ‘ఎ’ | The winner of a triangular tournament in India 'A' | Sakshi
Sakshi News home page

ముక్కోణపు టోర్నీ విజేత భారత్ ‘ఎ’

Published Thu, Aug 15 2013 1:00 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM

ముక్కోణపు టోర్నీ విజేత భారత్ ‘ఎ’

ముక్కోణపు టోర్నీ విజేత భారత్ ‘ఎ’

 ప్రిటోరియా: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో భారత జట్టు ఆధిపత్యాన్ని ‘ఎ’ జట్టు కూడా కొనసాగించింది. లీగ్ దశలో రెండుసార్లు ఓడించిన జట్టును ఫైనల్లో చిత్తు చేసింది. ఎ జట్ల ముక్కోణపు వన్డే టోర్నీని గెలిచి... భవిష్యత్ కూడా తమదే అని ఘనంగా చాటింది. ఇక్కడి డివిలియర్స్ మైదానంలో బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ ‘ఎ’ 50 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ‘ఎ’ను చిత్తు చేసి ముక్కోణపు సిరీస్ విజేతగా నిలిచింది.
 
 భారత్ 49.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ కాగా, ఆసీస్ 46.3 ఓవర్లలో 193 పరుగులకే కుప్పకూలింది. లీగ్ దశలో రెండు మ్యాచ్‌ల్లోనూ ఆసీస్ చేతిలో ఓడినా...ఫైనల్లో మాత్రం మన జట్టు ఆధిక్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే రోహిత్ శర్మ (6) వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే పుజారా (1) కూడా అవుటయ్యాడు.
 
 అయితే ఈ దశలో దినేశ్ కార్తీక్ (75 బంతుల్లో 73; 10 ఫోర్లు), శిఖర్ ధావన్ (65 బంతుల్లో 62; 9 ఫోర్లు) కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 108 పరుగులు జోడించారు. రైనా (17) విఫలం కాగా, రాయుడు (49 బంతుల్లో 34; 3 ఫోర్లు), సాహా (41 బంతుల్లో 31; 2 ఫోర్లు) కలిసి గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్, కౌల్టర్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కోలుకోలేకపోయింది. నదీమ్‌కు 3, షమీకి 2 వికెట్లు దక్కాయి.
 
 స్కోరు వివరాలు
 భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) హాజల్‌వుడ్ 6; ధావన్ (సి) పైన్ (బి) హెన్రిక్స్ 62; పుజారా (సి) ఫించ్ (బి) మాక్స్‌వెల్ 1; కార్తీక్ (బి) కౌల్టర్ 73; రైనా (ఎల్బీ) (బి) మిచెల్ మార్ష్ 17; రాయుడు (బి) హాజల్ వుడ్ 34; సాహా (సి) మాక్స్‌వెల్ (బి) హెన్రిక్స్ 31; రసూల్ (సి) హాజల్‌వుడ్ (బి) కౌల్టర్ 5; పాండే (బి) కౌల్టర్ 1; షమీ (బి) హాజల్‌వుడ్ 3; నదీమ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 3, వైడ్ 6, నోబాల్ 1) 10; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 243.
 వికెట్ల పతనం: 1-20; 2-34; 3-142; 4-158; 5-166; 6-229; 7-236; 8-238; 9-243; 10-243.
 
 బౌలింగ్: హాజల్‌వుడ్ 10-1-31-3; సంధూ 6-0-50-0; మాక్స్‌వెల్ 5-1-24-1; కౌల్టర్ 9.2-1-35-3; అహ్మద్ 6-0-42-0; హెన్రిక్స్ 10-047-2; మిచెల్ మార్ష్ 3-0-11-1.
 ఆస్ట్రేలియా ‘ఎ’ ఇన్నింగ్స్: ఫించ్ (బి) షమీ 20; షాన్ మార్ష్ (సి) పుజారా (బి) షమీ 11; మాడిసన్ (సి) రైనా (బి) పాండే 7; మాక్స్‌వెల్ (సి) పుజారా (బి) రైనా 12; మిచెల్ మార్ష్ రనౌట్ 2; హెన్రిక్స్ (సి) రైనా (బి) నదీమ్ 20; పైన్ (బి) రసూల్ 47; కౌల్టర్ (స్టంప్డ్) సాహా (బి) నదీమ్ 5; హాజల్‌వుడ్ (స్టంప్డ్) సాహా (బి) నదీమ్ 30; సంధూ (నాటౌట్) 21; అహ్మద్ (రనౌట్) 9; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 6, వైడ్ 3) 9; మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 193.
 వికెట్ల పతనం: 1-30; 2-33; 3-50; 4-52; 5-53; 6-76; 7-88; 8-142; 9-176; 10-193.
 
 బౌలింగ్: షమీ 7.3-1-30-2; రైనా 10-1-33-1; పాండే 8-1-47-1; నదీమ్ 10-1-34-3; ధావన్ 1-0-13-0; రసూల్ 10-1-30-1.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement