International Tour
-
Moushmi Kapadia: ఎడారి చీకటి నుంచి వెన్నెల వెలుగులోకి...
‘మీ బిడ్డ నాలుగు–అయిదు సంవత్సరాలకు మించి బతకడు’ అని వైద్యులు చెప్పినప్పుడు ఎత్తైన చోటు నుంచి చీకటిలోయల్లో పడిపోయినట్లు తల్లడిల్లి పోయింది . మూడు సంవత్సరాలు డిప్రెషన్ చీకట్లో కూరుకుపోయిన మౌష్మి ఒక్కొక్క అడుగు వేస్తూ వెలుగుదారిలోకి వచ్చింది. ఆట–పాటలతో తనలో ఉత్సాహాన్ని నింపుకొంది. ఆ ఉత్సాహాన్ని శక్తి చేసుకుంది. గా దేశాన్ని చుట్టి వచ్చింది. గా ఎన్నో సాహసాలు చేసింది ఇంటి గడప దాటలేడు అనుకున్న కుమారుడికి ప్రపంచం చూపుతూ ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తోంది మౌష్మి కపాడియా... మౌష్మి కపాడియా కుమారుడు ఆర్ఎస్ఎమ్డీ) అని నిర్ధారించిన వైద్యులు ‘ఇది నయం చేయలేని వ్యాధి’ అన్నారు. ఆ బాధ మాటలకు అందనిది. తట్టుకోలేనిది. తనలో తాను ఎంతో కుమిలిపోయింది మౌష్మి. పిల్లాడికి సంబంధించి ఏం చేయాలి? ఏం చేయకూడదు, ఎలా కేర్ తీసుకోవాలో వివరించారు వైద్యులు. వేదాన్షును తీసుకొని దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న భర్త ప్రియేష్ దగ్గరకు వెళ్లింది. మూడేళ్ల వయసులో వేదాన్ష్ కు గురయ్యాడు. ఐసీయూలో ఉన్న తన బిడ్డను చూసి కుప్పకూలిపోయింది మౌష్మి. ఆ భయానకమైన రోజు ఇప్పటికీ తన కళ్లముందే కదలాడుతున్నట్టు ఉంటుంది. బిడ్డ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలియదు. తాను చేయగలిగిందల్లా దూరం నుంచి బిడ్డను చూస్తూ మనసులో ఏడ్వడం మాత్రమే. ఆశ కోల్పోయిన వైద్యులు... ‘దేవుడిని ప్రార్థించండి. మేము మా వంతు ప్రయత్నం చేశాం’ అన్నారు. ఈ మాటలు తనను మరింత కృంగిపోయేలా చేశాయి. వెంటిలేటర్‌పై అయిదురోజులు ఉన్నాడు వేదాన్షు. ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ ఒకరు మెరుగైన చికిత్స కోసం ఇండియాకు వెళితే మంచిది అని సలహా ఇచ్చాడు. అతడి సలహా ప్రకారం బిడ్డను తీసుకొని భర్తతో కలిసి ముంబైకి వచ్చింది మౌష్మి. అబ్బాయిని ఇంటికి తీసుకువెళ్లిన రోజును గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ వణికిపోతుంది మౌష్మి. ‘ఇరవై ఏళ్ల క్రితం దుబాయ్‌లో వైద్యసదుపాయాలు అంత బాగాలేవు. శ్వాస తీసుకోవడానికి అవసరమైన ప్రత్యేక యంత్రాలు లేవు’ అని దుబాయ్‌లో ఆనాటి పరిస్థితులను గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. ముంబైలోని హాస్పిటల్లో కొన్నిరోజులు ఉన్న తరువాత వేదాన్షు పరిస్థితి మెరుగుపడింది. ఆశాదీపం ఏదో కనిపించి ఆ క్షణంలో ధైర్యం ఇచ్చింది. అయితే వైద్యులు మాత్రం... ‘నాలుగు–అయిదు సంవత్సరాలకు మించి బతకడు’ అని చెప్పారు. బలహీనమైన ఊపిరితిత్తుల వల్ల వేదాన్షు ఎన్నోసార్లు నిమోనియా బారిన పడ్డాడు. ‘ఇంటి నుంచి ఆస్పత్రి–ఆస్పత్రి నుంచి ఇంటికి’ అన్నట్లు ఉండేది పరిస్థితి. కొంత కాలం తరువాత మరో బిడ్డకు జన్మనిచ్చింది మౌష్మి. ఇది మౌష్మి జీవితాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. డిప్రెషన్ అనే చీకట్లోకి తీసుకెళ్లింది. ‘అకారణంగా కోపం వచ్చేది. చీటికిమాటికి చిరాకు పడేదాన్ని. తలుపులు గట్టిగా వేసేదాన్ని. నేను డిప్రెషన్లో ఉన్నాను అనే విషయం అప్పుడు తెలియదు. ఇలా ఎందుకు చేస్తున్నాను? అని నా గురించి నేను ఆలోచించే పరిస్థితిలో లేను. ఆ సమయంలో నా ఫ్రెండ్ ఒకరు కౌన్సిలింగ్‌కు వెళ్లమని సలహా ఇచ్చారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. అయితే మందుల ప్రభావంతో ఆమె బరువు పెరిగింది. ఆ బరువు మోకాళ్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ‘ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి’ అని చెప్పారు వైద్యులు. అలా తన ఫిట్నెస్ జర్నీ మొదలైంది. కొత్త జీవితానికి మొదటి అడుగు పడింది. తనకు ఇష్టమైన టెన్నిస్ ఆడడం మొదలు పెట్టింది. ఆడుతున్న సమయంలో తన మూడ్ చేంజ్ అవుతున్నట్లు, ఉత్సాహం వచ్చి చేరుతున్నట్లు అనిపించింది. జుంబా క్లాసులలో కూడా చేరి మరింత ఉత్సాహాన్ని పెంచుకుంది. మూడేళ్లపాటు డిప్రెషన్‌తో పోరాడి బయట పడిన మౌష్మి ఇద్దరు బిడ్డలను కంటి పాపల్లా చూసుకోవాలనుకుంది. ‘గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోని బెస్ట్ మామ్ కావాలనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. మూడు సంవత్సరాలుగా తనను వెంటాడిన నిరాశానిస్పృహలు, విషాదం కోపం లాంటి వాటి నుంచి బయటపడిన తరువాత పిల్లలతో హాయిగా గడిపే కాలం, పిల్లలే నా ప్రపంచం అనే కల కన్నది. బైక్‌పై దేశాన్ని చుట్టి రావాలి... ఎత్తైన పర్వతశిఖరాలను అధిరోహించాలి అనేది తన కల. పీడకలలాంటి జీవితం నుంచి బయటపడ్డ మౌష్మి కపాడియా తన కలను నిజం చేసుకుంది. పర్వతారోహణకు సంబంధించి ఎన్నో సాహసాలు చేసింది. ఇంటికే పరిమితం అవుతాడనుకున్న వేదాన్షుకు ప్రపంచాన్ని చూపింది. ‘విషాదం తప్ప అతడికి తోడు ఏదీ లేదు’ అని ఇతరులు సానుభూతి చూపే సమయంలో ‘నిరంతరం ఆనందమే నా బలం’ అని ధైర్యంగా ముందుకువెళ్లేలా చేసింది. బిడ్డతో కలిసి 21 దేశాలకు వెళ్లి వచ్చిన మౌష్మి కపాడియా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకుంది. సవాళ్లను అధిగమించేలా... వేదాన్ష్లో వయసుకు మించిన పరిణతి కనిపిస్తుంది. ఓటమికి తలవంచని వేదాన్షు నోటి నుంచి తరచుగా వచ్చే మాట ‘హ్యాపీ ఎబౌట్ ఎవ్రీ థింగ్ అండ్ శాడ్ ఎబౌట్ నథింగ్’ ‘జీవితం మన ముందు ఎన్నో సవాళ్లు పెడుతుంది. వాటిని అధిగమిస్తామా లేదా అనేదానిపైనే మనం ముందుకు వెళ్లే దారి నిర్ణయం అవుతుంది’ అంటాడు వేదాన్ష్. -
Chennamadhavuni Ashok raj: విశ్రాంతి ఉద్యోగానికే... జీవితానికి కాదు!
ప్రతిరోజూ మనదే. ప్రతిరోజునీ శ్వాసించాలి. ప్రతిరోజునీ ఆఘ్రాణించాలి. ప్రతిరోజునీ ఆస్వాదించాలి. ప్రతిరోజుకీ జీవం ఉండాలి. అప్పుడే... జీవితం జీవంతో ఉంటుంది. సంతోషాల సుమహారమవుతుంది. ‘బోర్ కొడుతోంది’ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరి ముని పెదవుల మీద ఉంటుందీ మాట. పిల్లలను బోర్డమ్ నుంచి బయటేయడం సులువే. కానీ రిటైర్ అయిన వాళ్లను వేధించే బోర్‌డమ్‌కు పరిష్కారం ఎలా? వయసు పై బడేకొద్దీ... అలవాటు పడిన జీవితం నుంచి కొద్దిపాటి మార్పును కూడా స్వీకరించలేని మొండితనం ఆవరించేస్తుంటుంది. ఆ మొండితనం నుంచి బయటపడలేక అవస్థలు పడే వార్ధక్యానికి ఓ సమాధానం చెన్నమాధవుని అశోక్‌రాజు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల దగ్గరకు వెళ్లిన తల్లిదండ్రులు ‘మేమక్కడ ఉండలేక΄ోయాం. బోర్ కొట్టి చచ్చాం. ఒక్క రోజు ఒక్క యుగంలా గడిచింది’ అనే వాళ్లకు సమాధానంగా అశోక్‌రాజు తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. కలప కరెంట్ స్తంభాలు ‘‘మేము హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో విశ్రాంత జీవనం గడుపుతున్నాం. యూఎస్‌లోని రెడ్మాండ్లో మా పెద్దమ్మాయి, అల్లుడు, మనుమరాలు ఉన్నారు. గడచిన ఏడాది నేను, మా ఆవిడ వీణారాణి... పెద్దమ్మాయి దగ్గరకు వెళ్లి ఆరు నెలలు ఉండి డిసెంబర్లో ఇండియాకొచ్చాం. టూర్లో భాగంగా... యూఎస్‌లో టకోమా – సియాటెల్ ఎయిర్΄ోర్ట్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన రెడ్మాండ్కు చేరుకున్నాం. రోడ్డు వెడల్పుగా, ఇరువైపులా నిటారుగా పెరిగిన చెట్లతో పచ్చగా ఉన్నాయి పరిసరాలు. కర్రలతో నిర్మించిన ఇళ్లు చూడముచ్చటగా ఉన్నాయి. ఇంటి చుట్టూ ఎత్తుగా పెరిగిన చెట్లతో అడవిమధ్యలో ఇల్లు కట్టినట్లు ఉంది. ఇంటి నిర్మాణంలో మాత్రమే కాదు, విద్యుత్ స్తంభాలుగా కూడా కలపనే వాడతారు. బాగా ఎత్తుగా పెరిగిన చెట్లను కరెంట్ స్తంభాలుగా ఉపయోగిస్తారు. పైన్ లేక్, లేక్ వాషింగ్టన్, స్నో క్యూలమిన్ ఫాల్స్, విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను చూశాం. ఓపెన్ ప్లేస్ మేరిమూర్ పార్క్‌లో సినిమా చూడడం మాకు విచిత్రమైన అనుభూతి. మన దగ్గర ఉన్నట్లు క్లోజ్డ్ థియేటర్ కాదది. బహిరంగ ప్రదేశంలో లాన్లో కుటుంబాలతో కూర్చుని స్నాక్స్ తింటూ, కూల్డ్రింకులు తాగుతూ సినిమా చూస్తుంటారు. పాశ్చాత్యంలో మన పతంజలి యోగ మెక్సికోలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశం కంకూన్కెళ్లాం. అక్కడ క్లౌన్ ΄్యారడైజ్ క్లబ్... ఐదు వందలకు పైగా గదులున్న పెద్ద హోటల్. యూఎస్, కెనడా, బ్రెజిల్, యూకే నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. మన దగ్గర ఫైవ్‌స్టార్ హోటళ్లలో జిమ్లుంటే... అక్కడ అతిథుల కోసం డెయిలీ రొటీన్లో యోగసాధన కూడా ఉంది. అక్కడి శిక్షకులు పతంజలి యోగ పుస్తకాన్ని ఆధారం చేసుకుని స్పానిష్ భాషలో వివరిస్తున్నారు. థియరీని మక్కీకి మక్కీ నేర్చుకుని అర్థమైనంతలో సాధ్యమైనంత వరకు ఆచరణలో పెడుతున్నారని అర్థమైంది. నాకున్న ముప్పై ఏళ్ల యోగ సాధన అనుభవంతో సీనియర్ సిటిజెన్ కోసం ఆరు రోజుల కోర్సు డిజైన్ చేసి నేర్పించాను. పవన ముక్తాసనం, మకరాసనం, సర్పాసనం, వజ్రాసనం, భుజంగాసనం, సూర్య నమస్కారాలతోపాటు ్రపాణాయామం, భస్త్రిక సాధనను కూడా వాళ్లు వీడియో తీసుకుని ఇకపై ఇలాగే సాధన చేస్తామని చె΄్పారు. పర్యటన కోసం అక్కడికి వెళ్లిన భారతీయులకంటే పాశ్చాత్యులు, అక్కడ స్థిరపడిన భారతీయులు యోగసాధన పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. శంకర నేత్రాలయ కోసం దాండియా యూఎస్ పర్యటనలో కొన్ని రోజులు అట్లాంటాలో గడిపాం. అట్లాంటాలో ఉన్న రోజుల్లో నేను రోజూ జేమ్స్ క్రీక్ క్లబ్లో యోగసాధన చేసేవాడిని. అక్కడి వారి కోరిక మేరకు యోగాతోపాటు విపస్సన ధ్యాన ప్రక్రియ కూడా నేర్పించాను. అక్కడ ఉద్యోగ, వ్యాపారాల్లో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. వాళ్లకు యోగ సాధన చేయాలని ఉన్నప్పటికీ టీచర్ లేక΄ోవడంతో ్రపాక్టీస్ చేయలేక΄ోయేవారు. ‘అట్లాంటా విజిటర్స్ అసోసియేషన్’ వాట్సాప్ గ్రూప్‌లో కనెక్ట్ అయ్యాం. అక్కడ చాలా విశాలమైన కమ్యూనిటీ హాల్ ఉంది. అందులో సమావేశపరిచి యోగ, విపస్సన నేర్పించాను. వీటన్నింటికంటే నాకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయం ఏమిటంటే... సియాటెల్‌లోని మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో నవరాత్రి సందర్భంగా నిర్వహించిన కల్చరల్ ్ర΄ోగ్రామ్లో పాల్గొనడం. ఎందుకంటే అది మనదేశంలో పేదవారికి ఉచితంగా వైద్యం అందించే సేవాసంస్థ ‘శంకర్ నేత్రాలయ’ కోసం ఫండ్ రైజింగ్ ్ర΄ోగ్రామ్. పాశ్చాత్య గడ్డ మీద మన భారతీయులతో కలిసి దాండియా నాట్యం చేయడం, విదేశీయులకు నేర్పించడం, అది కూడా ఒక సామాజిక ప్రయోజనం కోసం కావడం నాకు సంతోషాన్నిచ్చింది. మనం ఎక్కడ ఉన్నా సరే... రోజును ఉపయుక్తంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుందని నమ్ముతాను. అదే ఆచరణలో పెడతాను. పని... చేసే వారికి ఎదురొస్తుంది! ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. పెద్దమ్మాయి అమెరికా, చిన్నమ్మాయి ఆస్ట్రేలియాలో స్థిరపడడంతో రెండేళ్లకోసారి ఒక్కో అమ్మాయి దగ్గరకు వెళ్లడం అలవాటు చేసుకున్నాం. ఎక్కడ ఉన్నా నాకు బోర్ అనే మాట నా దగ్గరకు చేరదు. ఎందుకంటే మనిషి సంఘజీవి. ఏ సంఘంలో ఉంటే ఆ సంఘంతో మమేకమై జీవించాలనేది నా ఫిలాసఫీ. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అక్కడి వాళ్లతో కలిసి కమ్యూనిటీ ఫార్మింగ్ చేశాను. మా చిన్నల్లుడి సహకారంతో అక్కడి లైబ్రరీలో తెలుగు పుస్తకాలు పెట్టే ఏర్పాటు చేయగలిగాను. మనం ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేయడానికి సిద్ధంగా ఉంటే చాలు. అక్కడ మన అవసరం ఏమిటో, మనం మాత్రమే చేయగలిగిన పని ఏమిటో మనకు కనిపించి తీరుతుంది. ఒక్కమాటలో చె΄్పాలంటే పని మనకు ఎదురొస్తుంది. అలా ఒక వ్యాపకంలో నిమగ్నమైతే చాలు. మన వల్ల మరొకరికి ప్రయోజనమూ కలుగుతుంది. మనకు రోజు నిర్వీర్యంగా గడిచి΄ోకుండా ఉపయుక్తంగా గడిచిన సంతోషమూ కలుగుతుంది’’ అన్నారు చెన్నమాధవుని అశోక్‌రాజు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వీల్‌చైర్ ట్రావెలర్
‘నా వీల్‌చైరే నా రెక్కల గుర్రం’ అంటుంది పర్విందర్ చావ్లా. ప్రపంచంలో 196 దేశాలు ఉంటే ఇప్పటికి వీల్‌చైర్ మీదే 59 చుట్టేసింది. 15 ఏళ్ల వయసులో ఆర్థ్రయిటీస్ వల్ల వీల్‌చైర్‌కి పరిమితం అయిన చావ్లా జీవితాన్ని ఉత్సాహంగా ఉంచడానికి పర్యటనలను మార్గం చేసింది. తిరగాలన్న పురుగు కుట్టనే కూడదు... ఒక్కసారి కుట్టాక ఎన్ని అడ్డంకులొచ్చినా ఆగరు అంటున్న చావ్లా అన్నీ సక్రమంగా ఉన్నా లోకాన్ని చూడక కుదేలై ఉండేవారికి చాలా స్ఫూర్తినిస్తోంది. ఆమెకు 15 ఏళ్లు ఉన్నప్పుడు జరిగింది అది. ఏదో పెళ్లి ఫంక్షన్. భోజనానికి కూచున్న పర్విందర్ చావ్లా తినడానికి దవడ తెరవలేకపోయింది. ఆ తర్వాత పెళ్లి వాళ్లందరూ డాన్స్ చేస్తుంటే తానూ డాన్స్ చేయబోయి నడుము వంచలేక కింద పడిపోయింది. డాక్టర్ దగ్గరకు తీసుకెళితే తీవ్రమైన రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ అన్నారు. ఆ తర్వాత పర్విందర్ చావ్లా జీవితం రెండేళ్ల పాటు నరకంగా మారింది. మంచం మీద పడుకునే ఉండిపోయింది. ఇటు నుంచి అటు కదలాలన్నా విపరీతమైన నొప్పి.ఆ తర్వాత మెల్ల మెల్లగా కోలుకుంది. కాని చేతి వేళ్లతో సహా చాలా శరీర భాగాల్లోని జాయింట్లు దెబ్బతిన్నాయి. 21 ఏట వచ్చే సరికి వీల్ చైర్‌కు పరిమితం కాక తప్పలేదు. కొద్దిగా లేవగలదు. నాలుగు అడుగులు వేయగలదు. కాని మిగిలినదంతా వీల్‌చైర్ పైనే. శరీరాన్ని కదల్చే వీలు లేకుండా చేసి జీవితం తనను ఆపగలిగింది... కాని కదలకుండా ఉండిపోయి జీవితాన్ని గెలవనీకూడదు. దానిని ఓడించాలి అని పర్విందర్ నిశ్చయించుకుంది. వైష్ణోదేవి యాత్ర మొదలు పర్విందర్ చావ్లాది లూధియానా. తండ్రికి హోటల్ బిజినెస్ ఉంది. తల్లి గృహిణి. కూతురి అవస్థ చూసి తండ్రి నీ ఇష్టమైన పని చేసి సంతోషంగా ఉండు అని ప్రోత్సహించాడు. ఆ సమయంలోనే కాలేజీ ఫ్రెండ్స్ కొందరు వైష్ణోదేవిని దర్శించుకోవడానికి జమ్ము కశ్మీర్ వెళుతుంటే పర్విందర్ కూడా వాళ్లతో వెళ్లాలనుకుంది. కాని వీల్‌చైర్‌తో ఆ ప్రయాణం ఏ మాత్రం అనువుగా ఉంటుందో తెలియదు. పర్విందర్ ధైర్యం చేసింది. వైష్ణోదేవి మందిరం చేరుకుంది. లోపలికి వెళ్లడానికి ర్యాంప్ లేదు. నలుగురు భక్తులు కుర్చీతో సహా లేపి ఆమెను లోపలికి తీసుకెళ్లారు. అందాక ఇంట్లో, పరిమిత వీధుల్లో తిరిగిన పర్విందర్కు ఆ హిమాలయాల చెంత, ఆ ప్రకృతి మధ్యన, ఆ ఆధ్యాత్మిక ప్రదేశంలో అమితమైన ఆనందం కలిగింది. ఏమిటి... ప్రయాణాలు చేస్తే ఇంత బాగుంటుందా? అనుకుంది. ‘అప్పుడే నన్ను తిరిగే పురుగు కుట్టింది’ అంటుంది పర్విందర్ నవ్వుతూ. ఒంటరిగానే తిరగాలని... పర్విందర్ ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయ్యింది. అక్కడి నుంచే ప్రపంచ దేశాలన్నీ తిరగాలని నిశ్చయించుకుంది. ఆమె అప్పటికే దాదాపు లక్షన్నర రూపాయల విలువైన మంచి నాణ్యత కలిగిన లైట్ వెయిట్ వీల్‌చైర్‌ను ఏర్పాటు చేసుకుంది. దాని మీద కూచుని రోడ్ల మీద హాయిగా తిరగొచ్చు. దానిని సెకన్లలో మడిచి ట్యాక్సీలో ఎక్కించి ఎయిర్పోర్ట్ వెళ్లొచ్చు. సెకన్లలో తెరిచి కూచోవచ్చు. ఎవరో ఒకరు తోడు వస్తే బాగుంటుంది కానీ వారి కదలికలకి తన కదలికలకి చాలా తేడా ఉంటుంది. అందుకే తాను ఒక్కర్తే తిరగాలని నిశ్చయించుకుంది. దుబాయ్‌తో మొదలు ప్రపంచ దేశాలన్నింటిలోకి వీల్‌చైర్ ఫ్రెండ్లీ దేశం దుబాయ్ అని పర్విందర్ తెలుసుకుంది. అందుకే మొదట ఆ దేశానికే ఒంటరిగా ప్రయాణం కట్టింది. ప్రయాణం చేసే ముందు తాను దిగబోయే హోటల్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటుంది పర్విందర్. అక్కడ ఉన్న మెట్ల గురించి, ర్యాంప్‌ల గురించి, గదిలో టాయిలెట్ల సౌకర్యం గురించి దివ్యాంగులను సపోర్ట్ చేసేలా అక్కడ వ్యవస్థ ఉందో లేదో చూసుకుని వెళుతుంది. ‘మీరు భాష రాని దేశానికి వెళుతున్నట్టయితే గూగుల్ ట్రాన్స్‌లేటర్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి’ అంటుంది పర్విందర్. ఆ తర్వాత ఆమె బాలీ వెళ్లింది. ఆ తర్వాత రోమ్. ఆ తర్వాత అలా అలా ఆమె ప్రయాణాలు సాగిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు 53 ఏళ్లు ఆమెకు. 59 దేశాలు చూసింది. ‘ఒక వంతు ప్రపంచం చూశాను. ఇంకా మూడు వంతులు చూడాలి’ అంటుందామె. ఈ ప్రయాణాల వల్లే కాబోలు ఆమె నైరాశ్యం దరి చేరకుండా ఉత్సాహంగా ఉంటుంది. మనుషులే తోడు ఏ దేశం వెళ్లినా మనుషులే తోడుగా సాయం చేయడం ఆమె గమనించింది. ‘మనం మంచిని చూస్తే మంచి చెడును చూస్తే చెడు ఈ లోకంలో కనిపిస్తాయి. ఎందరో ముక్కూ మొహం తెలియని వ్యక్తులు ఈ పర్యటనల్లో నాకు సాయం చేశారు. కొందరు బస్సు ఎక్కిస్తే మరి కొందరు నేను దిగాల్సిన హోటల్ వరకూ వచ్చి దిగబెట్టి వెళ్లారు. ‘మీరు ప్రకృతిని చూడాలంటే ఆస్ట్రేలియా వెళ్లాలి. నేను అక్కడకు వెళ్లి నెలల తరబడి ఉంటాను’ అంటుందామె. అమెరికాలో కొన్ని నగరాలు, లండన్ వీల్‌చైర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మన దేశంలో ఆగ్రా పూర్తిగా వీల్‌చైర్ ఫ్రెండ్లీ. ఆ తర్వాత మన దేశంలో ఢిల్లీ అంటుందామె. కాని చైనాలో ఆమెకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ‘వాళ్లు మనం ఏం చెబుతున్నామో అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు’ అంటుంది పర్విందర్. ఆమె ప్రయాణాలు ఆమెకు స్వస్థత కలిగిస్తూనే ఉంటాయి. దోహాలో..., ఆస్క్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్లో... -
'మనీల్యాండరింగ్ కోసమే విదేశీ పర్యటనలు'
-
దేశీ ఖర్చు.. విదేశీ టూరు
సెలవుల సీజన్లో విహారాల జోరు రెండుమూడు రోజులకు విదేశీ ప్యాకేజీలు స్థానిక టూర్ల బదులుగా వీటికే ఓటేస్తున్న తీరు ఏ టూరుకైనా ప్రయాణ బీమా ఉండాల్సిందే! ఇది సెలవుల సీజన్. క్రిస్మస్, న్యూ ఇయర్, ఆ వెంటే సంక్రాంతి అన్నీ వరసగా వచ్చేస్తున్నాయి. మరి సెలవులకు ఎక్కడికెళ్లాలి? సెలవులంటే మరీ ఎక్కువ రోజులేమీ ఉండవు కదా! ఈ చోటా బ్రేక్ ఎక్కడ తీసుకోవాలి? కాకపోతే సెలవుల కాన్సెప్ట్ ఇపుడు మారింది. 3-4 రోజులు దొరికితే... ఎంచక్కా విదేశాలకు చెక్కేసే ట్రెండ్ పెరుగుతోంది. దీనికి తగ్గట్టే ఎయిర్‌లైన్ సంస్థలూ డిస్కౌంట్లతో ఊరిస్తున్నాయి. వీటి వివరాలే... ఈ వారం కథనం... ఇంతకుముందు సెలవులొచ్చాయంటే... కుటుంబాలకు సరదాగా గడపడానికి మొదట గుర్తుకొచ్చేవి ఊటీ, కేరళే. యువతీయువకులకైతే గోవా. కాకపోతే ఆదాయాలు గణనీయంగా పెరగటం, బడ్జెట్ ఎయిర్‌లైన్స్ రావటంతో... ఇపుడు అదే ఖర్చుతో థాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాలు చుట్టివచ్చేస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విమానంలో కేరళ, గోవాలకు వెళ్లి రెండ్రోజులు ఉండాలంటే కనీసం రూ. 20 నుంచి రూ. 30 వేలదాకా ఖర్చవుతోంది. అదే ఖర్చుతో ఇప్పుడు బ్యాంకాక్‌లో నాలుగు రోజులు ఉండి వచ్చే వీలుండటంతో... రెండు మూడు రోజులు సెలవులు దొరికితే చాలు... విదేశాలను చుట్టి వచ్చేసే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ధర పెరిగితే... టూర్ తగ్గుతుంది డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణతతో విదేశీయానం కొద్దిగా భారమైనా విదేశాలకు వెళ్లడానికి యువత ఏ మాత్రం వెనకాడటం లేదు. అవసరమైతే రోజుల సంఖ్యను తగ్గించుకుంటామే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోబోమని వారు చెబుతున్నట్లు యాత్రా డాట్ కామ్ తన సర్వేలో పేర్కొంది. రూపాయి కోలుకునే దాకా ఆగే పరిస్థితి లేదని, గతంలో వారం రోజులు గడిపితే ఇప్పుడు నాలుగైదు రోజులు మాత్రమే విదేశాల్లో ఉంటామని వారు చెబుతున్నారు. అంతేకాదు! పెరిగిన భారాన్ని భర్తీ చేసుకోవడానికి ఫైవ్‌స్టార్ హోటల్‌కు బదులు త్రీస్టార్, బడ్జెట్ హోటల్స్‌లో దిగడం, షాపింగ్‌ను సాధ్యమైనంతవరకు తగ్గించడం వంటి పొదుపు చర్యలు చేపడుతున్నట్లు యాత్రా డాట్ కామ్ పేర్కొంది. ప్రత్యేక చోటా ప్యాకేజీలు... విదేశాలకు వెళ్లే టూరిస్టుల కోసం ఇపుడు రెండు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీలను కూడా ట్రావెల్ సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఎక్స్పీడియా అయితే రెండు రాత్రులు, మూడు రోజుల దుబాయ్ పర్యటనకు రూ. 28,000 నుంచే ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అలాగే మేక్ మై ట్రిప్, యాత్రా డాట్ కామ్ వంటి ట్రావెల్సైట్స్ విమాన టిక్కెట్లతోపాటు, హోటల్ బుకింగ్స్ చేసుకుంటే 30 నుంచి 40 శాతందాకా డిస్కౌంట్‌ను ఇస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా రెండు మూడు నెలలు ముందుగా బుక్ చేసుకునే టికెట్స్‌పై తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రయాణ బీమా అవసరమా? అసలు విదేశాలకు విమాన ప్రయాణాలు చేసేటపుడు ప్రయాణ బీమా అవసరమా? ఇది చాలామందికి కలిగే సందేహం. నిజానికి బీమా మనకు రిస్క్ లేకుండా చేసేది. విదేశీ పర్యటనల్లో రిస్క్ ఎక్కువ కాబట్టి... అక్కడ అనారోగ్యం తలెత్తినా, సామగ్రి పోయినా మనను ఆదుకునేది బీమానే కాబట్టి ఇది తప్పనిసరి. బీమా కంపెనీలిపుడు విదేశీ పర్యటనలకే కాకుండా దేశీయ పర్యటనలకూ బీమా రక్షణ కల్పిస్తున్నాయి. ఈ పాలసీలు చాలా తక్కువ ప్రీమియానికే అనేక ప్రయోజనాలనందిస్తాయి. విమానం ఆలస్యం కావటం నుంచి... మెడికల్, దొంగతనం వంటి అనేక అంశాలకు బీమా ఉంటుంది. ప్రయాణించే రోజులు, దేశాన్ని బట్టి ప్రీమియం మారుతుంది. సాధారణంగా వారం రోజుల పర్యటనకు రూ.500 నుంచి రూ.700 వరకు ప్రీమియం వసూలు చేస్తారు. కవరేజీ దేనికి ఉంటుందంటే... చికిత్స వ్యయం: కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తడం సహజం. లేదా ప్రమాదం సంభవించి ఆసుపత్రిపాలు కావచ్చు. విదేశాల్లో చికిత్స మనం భరించే స్థాయిలో ఉండదు. అదే బీమా ఉంటే ఈ వ్యయాన్ని కంపెనీయే భరిస్తుంది. సామాన్లు పోతే: ప్రయాణంలో అప్పుడప్పుడు సామాన్లు పోగొట్టుకోవడం జరుగుతుంది. లేదా విమానంలో ప్రయాణించేటప్పుడు బ్యాగేజీ మారిపోవడం వంటివి కూడా జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో బ్యాగేజీ సరైన సమయానికి రాక కొత్త డ్రెస్సులు కొనుక్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పాలసీ అక్కరకు వస్తుంది. పర్యటన రద్దయితే...: దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు దానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని రిజర్వేషన్లు, హోటల్ గదులు వంటివి ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటారు. ప్రతికూల వాతావరణం ఉంటే విమాన సర్వీసులు రద్దు, ప్రయాణం నిలిచిపోవడం లేదా కొంత ఆలస్యం కావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ముందుగా చేసుకున్న రిజర్వేషన్లను రద్దు చేసుకోవాల్సి ఉంటుంది.ఈ నష్టాన్ని బీమా కంపెనీయే భరిస్తుంది. ఆలస్యమయితే...: ఇటీవల విమానాలు, రైళ్లు షెడ్యూలు టైమ్ కన్నా ఆలస్యం కావడమనేది సాధారణమైపోయింది. ఇలాంటి సందర్భాల్లో కూడా బీమా కంపెనీలు నష్టపరిహారాన్ని చెల్లిస్తాయి. విమానం అయిదారు గంటలు మించి ఆలస్యమైతే బీమా కంపెనీలు నష్టపరిహారం ఇస్తున్నాయి. వీసాపోతే...: విదేశాల్లో వీసా పోతే తిరిగి ఇండియా రావడానికి ఉండదు. అప్పటికప్పుడు మళ్లీ వీసా తీసుకోవడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. ఇలాం టి సమయాల్లో కూడా ట్రావెల్ బీమా ఉపయోగపడుతుంది. అలాగే ఏమైనా విలువైన వస్తువులు పోగొట్టుకుంటే వాటికి కూడా బీమా రక్షణను పొందవచ్చు. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం