investment plans
-
భారత పర్యటనకు ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌లో తమ కంపెనీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మస్క్ పర్యటన ఏప్రిల్ నాలుగో వారంలో ఉండొచ్చని, ఆయనతో పాటు కంపెనీ అధికారులు కూడా రావొచ్చని పేర్కొన్నాయి. దేశీయంగా తయారీని ప్రోత్సహించే క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని కేంద్రం ఇటీవల సవరించిన నేపథ్యంలో మస్క్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది. దీని ప్రకారం భారత్‌లో కనీసం 500 మిలియన్ డాలర్లతో తయారీ ప్లాంటును పెట్టే విదేశీ కంపెనీలు తక్కువ సుంకాలతో ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో తయారైన కారును (సీబీయూ) దిగుమతి చేసుకుంటే 70 శాతం నుంచి 100 శాతం వరకు కస్టమ్స్ సుంకాలు వర్తిస్తున్నాయి. భారత మార్కెట్లో ప్రవేశించేందుకు టెస్లా వంటి కంపెనీలకు ఇది అవరోధంగా ఉంటోంది. దీంతో సుంకాలను తగ్గించాలంటూ కొన్నాళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నాయి. దానికి అనుగుణంగా దేశీయంగా తయారీతో ముడిపెట్టి పాలసీని ప్రభుత్వం సవరించింది. గతేడాది మోదీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా ఆయనతో మస్క్ సమావేశమయ్యారు. భారత మార్కెట్లో టెస్లా ఎంట్రీకి సంబంధించి 2024లో తాను వచ్చే అవకాశమున్నట్లు అప్పట్లో ఆయన చెప్పారు. -
అయిదేళ్లలో 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆటో విడిభాగాల పరిశ్రమ తదనుగుణంగా సామరŠాధ్యలను పెంచుకోవడంపై, టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్లలో 6.5 –7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆటో విడిభాగాల పరిశ్రమ ఆదాయం 12.6 శాతం పెరిగి రూ. 2.98 లక్షల కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఏడాదీ ఇదే ధోరణి కొనసాగవచ్చని, రెండంకెల స్థాయిలో అమ్మకాలు ఉండగలవని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడి ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘పండుగ సీజన్లో వివిధ సెగ్మెంట్లలో గణనీయంగా అమ్మకాలు నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆటో విడిభాగాల రంగం మరింత మెరుగ్గా రాణించగలదని ఆశాభావంతో ఉన్నాము‘ అని ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ ప్రెసిడెంట్ శ్రద్ధా సూరి మార్వా తెలిపారు. దేశ, విదేశ కస్టమర్ల అవసరాలను తీర్చే విధంగా సామర్ధ్యాలను పెంచుకుంటున్నట్లు ఆమె చెప్పారు. గత అయిదేళ్లలో సుమారు 3.5–4 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్ చేయగా.. రాబోయే అయిదేళ్లలో 6.5–7 బిలియన్ డాలర్లు వెచి్చంచనున్నట్లు వివరించారు. 875 పైచిలుకు సంస్థలకు ఏసీఎంఏలో సభ్యత్వం ఉంది. సంఘటిత ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరులో వీటికి 90 శాతం పైగా వాటా ఉంటుంది. స్థిరంగా ఎగుమతులు.. వాహన విక్రయాలు, ఎగుమతులు స్థిరమైన పనితీరు కనపరుస్తున్నాయని ఏసీఎంఏ డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా తెలిపారు. వాహన పరిశ్రమలోని అన్ని సెగ్మెంట్లకు ఆటో విడిభాగాల సరఫరా నిలకడగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆటో విడిభాగాల ఎగుమతులు 2.7 శాతం పెరిగి 10.4 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 3.6 శాతం పెరిగి 10.6 బిలియన్ డాలర్లకు చేరాయని వివరించారు. దిగుమతుల్లో ఆసియా వాటా 63 శాతంగా ఉండగా, యూరప్ (27 శాతం), ఉత్తర అమెరికా (9 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. దిగుమతులను తగ్గించుకునేందుకు, ప్రభుత్వ తోడ్పాటుతో దేశీయంగా తయారీని పెంచేందుకు పరిశ్రమ గట్టిగా కృషి చేస్తోందని మెహతా వివరించారు. మార్వా, మెహతా చెప్పిన మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో ఎగుమతులకు సంబంధించి చెరి 33 శాతం వాటాతో ఉత్తర అమెరికా, యూరప్ అతి పెద్ద మార్కెట్లుగా కొనసాగాయి. ► ఇదే వ్యవధిలో దేశీయంగా ఉత్పాదనల తయారీ సంస్థలకు (ఓఈఎం) విడిభాగాల అమ్మకాలు 13.9 శాతం పెరిగి రూ. 2.54 లక్షల కోట్లకు చేరాయి. ► భారీ, శక్తిమంతమైన వాహనాలపై ఆసక్తి పెరుగుతుండటం .. ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరు వృద్ధికి దోహదపడుతోంది. ఆఫ్టర్‌మార్కెట్ సెగ్మెంట్ 7.5 శాతం పెరిగి రూ. 45,158 కోట్లకు చేరింది. ► ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్ వృద్ధి కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే ఈసారి ఈవీల విడిభాగాల విక్రయాలకు సంబంధించిన ఆదాయం గణనీయంగా పెరిగింది. -
Adani Group: రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు.. 10 కోట్ల మొక్కలు
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ వచ్చే పదేళ్లలో రూ. 7 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ఇన్ఫ్రా రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. గ్రూప్ సంస్థ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ .. స్టాక్ ఎక్స్చేంజీలకు ఈ మేరకు సమాచారమిచ్చింది. మైనింగ్, విమానాశ్రయాలు, డిఫెన్స్.. ఏరోస్పేస్, సౌర విద్యుదుత్పత్తి, రహదారులు, డేటా సెంటర్లు మొదలైన వ్యాపార విభాగాల్లో అదానీ గ్రూప్ విస్తరించింది. పోర్టుల వ్యాపారంలో పర్యావరణ హిత విధానాలను ప్రవేశపెడుతోంది. అన్ని క్రేన్లను విద్యుదీకరించడం, అంతర్గతంగా డీజిల్ వాహనాలకు బదులు బ్యాటరీ ఆధారిత వాహనాలకు మళ్లడం, అదనంగా 1000 మెగావాట్ల క్యాప్టివ్ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం వంటివి వీటిలో ఉన్నాయి. అటు అదానీ ఎలక్ట్రిసిటీ 2027 నాటికి ముంబైలో 60 శాతం మేర పునరుత్పాక విద్యుత్‌ను సరఫరా చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఇది 38 శాతంగా ఉంది. ఇక గ్రూప్‌లో భాగమైన అంబుజా, ఏసీసీ కంపెనీలు దేశీయంగా సిమెంట్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థలుగా ఉన్నాయి. తమ సిమెంటు ఉత్పత్తిలో 90 శాతం భాగం రీసైకిల్ చేసిన ఫ్లై యాష్ వ్యర్ధాలు, స్లాగ్ ఉంటాయని అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. 2028 నాటికి సిమెంటు ఉత్పత్తి కోసం వినియోగించే పునరుత్పాదక శక్తి వాటాను 60 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2030 నాటికి 10 కోట్ల మొక్కలను నాటాలన్న లక్ష్యం దిశగా పని చేస్తున్నామని ఆయన చెప్పారు. అదానీ గ్రూప్ ఇటీవలే సిమెంటు, టెలికం, మీడియా వ్యాపార విభాగాల్లోకి కూడా ప్రవేశించింది. -
ఐవోసీ భారీ పెట్టుబడులకు రెడీ
న్యూఢిల్లీ: నంబర్ వన్ ఇంధన రిటైల్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. ఈ దశాబ్దంలో రూ. 4 లక్షల కోట్లకుపైగా వెచి్చంచనున్నట్లు ప్రభుత్వ రంగ బ్లూచిప్ కంపెనీ తాజాగా వెల్లడించింది. తద్వారా చమురు శుద్ధి, పెట్రోకెమికల్ బిజినెస్‌ల విస్తరణతోపాటు.. ఇంధన పరివర్తన ప్రాజెక్టులలోనూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. వెరసి 360 డిగ్రీల ఇంధన దిగ్గజంగా ఆవిర్భవించాలని చూస్తున్నట్లు కంపెనీ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలియజేశారు. విభాగాలవారీగా.. తాజా పెట్టుబడుల్లో రూ. లక్ష కోట్లను చమురు శుద్ధి సామర్థ్య విస్తరణకు వెచ్చించనుంది. పూర్తి కర్బనరహిత(నెట్ జీరో) కార్యకలాపాలను సాధించే బాటలో రూ. 2.4 కోట్లను సంబంధిత ప్రాజెక్టులకు కేటాయించనుంది. ఒడిషాలోని పారదీప్‌లో అత్యంత భారీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై మరో రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో దేశీయంగా పెరుగుతున్న ఇంధన అవసరాలను అందుకోవడంతోపాటు.. ఇంధన పరివర్తనను సైతం సాధించే వీలున్నట్లు కంపెనీ సాధారణ వార్షిక సమావేశంలో వాటాదారులకు ఐవోసీ చైర్మన్ వైద్య వివరించారు. దేశీ ఇంధన మార్కెట్లో 40 శాతం వాటాను ఆక్రమిస్తున్న కంపెనీ 2046కల్లా పూర్తి కర్బన రహిత కార్యకలాపాలను సాధించాలని ఆశిస్తోంది. భారీ పెట్టుబడుల కారణంగా రిఫైనింగ్ సామర్థ్యాలను 33 శాతంమేర పెంచుకోనున్నట్లు వైద్య తెలియజేశారు. దీంతో త్వరలోనే 10.7 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యానికి చేరుకోనున్నట్లు వెల్లడించారు. బీఎస్ఈలో ఐవోసీ షేరు వారాంతాన 0.5 శాతం నీరసించి రూ. 92 వద్ద ముగిసింది. -
ఎస్‌డబ్ల్యూపీ అంటే? నెక్ట్స్ మంత్ నుంచే ఆదాయం పొందొచ్చా?
ఎస్‌డబ్ల్యూపీ అంటే ఏంటి? ఓ పథకంలో పెట్టుబడి పెట్టి, తదుపరి నెల నుంచి ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఆదాయం పొందొచ్చా? – కృతిక మార్కెట్ల అస్థిరతలను అధిగమించేందుకు వీలుగా క్రమంగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు సిప్ ఎలా ఉపయోగపడుతుందో..? అదే మాదిరి.. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) అనేది, పెట్టుబడిని క్రమానుగతంగా వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. మార్కెట్లు కనిష్టాల్లో (తక్కువ విలువల వద్ద) ఉన్నప్పుడు పెట్టుబడినంతా వెనక్కి తీసుకోకుండా ఎస్‌డబ్ల్యూపీ సాయపడుతుంది. రిటైర్మెంట్ తీసుకున్న వారికి ఎస్‌డబ్ల్యూపీ అనుకూలంగా ఉంటుంది. కావాల్సినంత స్థిరమైన ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి ఆదాయం రావాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇన్వెస్టర్ ప్రతీ నెలా నిరీ్ణత తేదీన, నిరీ్ణత మొత్తాన్ని ఎస్‌డబ్ల్యూపీ ద్వారా రావాలని నిర్ణయించుకుంటే.. అదే రోజు ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఆ మేరకు పెట్టుబడుల నుంచి యూనిట్లు తగ్గిపోతాయి. సిప్‌కు విరుద్ధంగా పనిచేసేదే ఎస్‌డబ్ల్యూపీ. ఇక్కడ రెండు కీలక అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఎస్‌డబ్ల్యూపీ కోసం చేసే పెట్టుబడుల్లో కనీసం మూడింట ఒక వంతు అయినా ఈక్విటీల్లో ఉంచుకోవాలి. ఉపసంహరించుకునే మొత్తం ఏటా పెట్టుబడుల విలువలో 4-6 శాతం మించి ఉండకూడదు. దీనివల్ల పెట్టుబడికి నష్టం లేకుండా ఉంటుంది. ఉదాహరణకు మీ పెట్టుబడులపై రాబడి వార్షికంగా 8-9 శాతంగా ఉండి, మీరు 5 శాతాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు అయితే.. అప్పుడు మిగిలిన 3-4 శాతం రాబడి పెట్టుబడి వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల మీ పెట్టుబడి విలువ క్షీణించకుండా ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకునే మొత్తంలో కొంత పెట్టుబడి, కొంత లాభం ఉంటుంది. ఈ లాభంపైనే పన్ను పడుతుంది. డెట్‌లో అయితే కాలవ్యవధితో సంబంధం లేకుండా లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఈక్విటీల్లో అయితే ఏడాదిలోపు లాభంపై 15 శాతం చెల్లించాలి. ఏడాదికి మించిన లాభం మొదటి రూ.లక్షపై పన్ను లేదు. తదుపరి లాభంపై 10 శాతం పన్ను పడుతుంది.(ఊరట: వచ్చే నెల నుంచి కూరగాయల రేట్లు తగ్గుముఖం) ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) ఎలా పనిచేస్తాయి? వీటి వల్ల లాభాలేంటి? – రవీంద్రనాథ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్) అంటే సమీకరించిన పెట్టుబడులను తీసుకెళ్లి మరో మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసే పథకం. పెట్టుబడుల విధానానికి అనుగుణంగా డెట్ ఫండ్స్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో ఒకటి లేదా ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సాధారణంగా ఎఫ్‌వోఎఫ్‌లను ఆయా ఫండ్స్ హౌస్‌లు వాటికి సంబంధించిన ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రారంభిస్తుంటాయి. ఎఫ్‌వోఎఫ్‌లు ఇతర మ్యూచువల్ ఫండ్స్ పథకాల మాదిరే పనిచేస్తాయి. వీటిల్లోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. విదేశీ సూచీలు, విదేశీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ఎఫ్‌వోఎఫ్‌లు కూడా ఉన్నాయి. ఇతర పథకాల మాదిరే ఎఫ్వోఎఫ్ల్లోనూ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఎఫ్‌వోఎఫ్‌లు ఇతర పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక రెండింటిలోనూ ఎక్స్పెన్స్ రేషియో భారం ఇన్వెస్టర్పైనే పడుతుంది. ఉదాహరణకు ఎఫ్‌వోఎఫ్‌లో 1 శాతం ఎక్స్పెన్స్ రేషియో ఉందనుకుంటే, అది ఇన్వెస్ట్ చేసే పథకం ఎక్స్పెన్స్ రేషియో 0.50 శాతం ఉంటే మొత్తం 1.5 శాతం ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాల్సి వస్తుంది. ఎఫ్‌వోఎఫ్ ఇన్వెస్ట్ చేసే పథకంలో నేరుగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అవకాశం లేనప్పుడు వీటిని పరిశీలించొచ్చు. ఎఫ్‌వోఎఫ్‌లను నాన్ ఈక్విటీ పథకంగా పరిగణిస్తారు. కనుక డెట్ పథకాలకు మాదిరే మూలధన లాభాలపై పన్ను అమలవుతుంది. ఒకవేళ ఎఫ్‌వోఎఫ్ దేశీయ ఈక్విటీ పథకాల్లోనే 90 శాతానికిపైగా పెట్టుబడి పెడితే ఈక్విటీకి మాదిరే మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఎస్‌డబ్ల్యూపీతో స్థిరమైన ఆదాయం పొందొచ్చా? ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
Delhi: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
పారిశ్రామికవేత్తల ఫీడ్‌బ్యాక్ వల్లే నెంబర్ వన్‌గా ఉన్నాము: సీఎం జగన్
UPDATES.. ► విశాఖ వేదికగా మార్చిలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ఇవాళ ఢిల్లీలో జరిగిన సన్నాహక సమావేశం ముగిసింది. ► ఏపీలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ కృతజ్ఞతలు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మా వంతు సహకారం అందిస్తాము. ప్రపంచవేదికపై ఏపీని నెలబెట్టడానికి మీ సహకారం మాకు అవసరం. ఈ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో గత మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్‌గా ఉంది. పరిశ్రమల స్థాపనకు మేము చేస్తున్న కృషితో పాటు పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోనే మేము నంబర్ వన్‌గా ఉన్నాము. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చేస్తున్న రాష్ట్రం ఏపీ. 11 ఇండస్ట్రియల్ కారిడార్లలో మూడు ఏపీకే రావడం శుభపరిణామం. - సీఎం వైఎస్ జగన్. ► కోవిడ్ సమయంలో ఫ్యాక్టరీ ప్రారంభించాము. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రోత్సాహం అమోఘం. ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసింది. మంచి నైపుణ్యం ఉన్న నిపుణులకు ఏపీలో కొదవలేదు. పరిశ్రమల స్థాపనకు సీఎం జగన్, మంత్రులు, అధికారుల కృషి అద్బుతం. పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. - బి. సంతానం, సీఈవో ఇండియా సెయింట్ గోబైన్ ►స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం మా ప్రాధాన్యత. కంపెనీకి ఆపరేషన్‌పై స్థానిక అధికారుల సహకారం బాగుంది. - ఎవర్టన్ టీ ఇండియా డైరెక్టర్ రోషన్ గుణవర్దన ►15వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాము. ఏపీ కేంద్రంగా అధునాతన ఉత్పత్తుల ఎగుమతి జరుగుతోంది. - అపాచీ అండ్ హిల్‌టాప్ గ్రూప్ డైరెక్టర్ సెర్జియా లీ ►ఏపీలో రూ.వెయ్యి కోట్లతో 2 బిజినెస్ యూనిట్లు ప్రారంభించాము. 2030 నాటికి ఉత్పత్తిని రెండింతలు చేస్తాము. -టోరే ఇండస్ట్రీస్ ఎండీ యమగూచి. ►ఏపీ ప్రభుత్వం మాకు ఎంతో మద్దతు ఇస్తోంది. రూ. 650 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాము. ఎంతో మందికి ఉపాధి కల్పించాము. రాబోయే రోజుల్లో మరిన్ని యూనిట్లు నెలకొల్పుతాము. శ్రీ సిటీ ఫ్యాక్టరీ ఏర్పాటులో ప్రభుత్వ సహకారం మరువలేనిది. మా కంపెనీ ద్వారా 600 ఉద్యోగాలు కల్పించాము. మా కంపెనీలో 50 శాతం మంది మహిళలే. కంపెనీలో ఉద్యోగలంతా స్థానికులే. మొత్తం ఆరు ఆపరేటింగ్ లైన్స్‌తో ప్రొడక్షన్ జరుగుతోంది. అదనంగా మరొక లైన్ ద్వారా ఉత్పత్తి చేయబోతున్నాము. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీనే పెట్టుబడులకు అనుకూలం. - క్యాడ్బరీ ఇండియా ప్రెసిడెంట్ దీపక్ ► ఏపీ బిజినెస్ పాలసీ, మౌలిక వసతులు పరిశ్రమల పెట్టుబడులకు అనుకూలం. పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు బాగున్నాయి. - తాయి జిన్ పార్క్ కియా మోటర్స్ ఎండీ, సీఈవో ► ఏపీలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలు ఉన్నాయి. బల్క్ డ్రగ్స్, స్పైస్ పరిశ్రమల నెలకొల్పేందుకు మంచి అనుకూల వాతావరణం ఉంది. నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. నిరంతర విద్యుత్, ల్యాండ్ బ్యాంక్, సమృద్దిగా ఉంది. -బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి. సాక్షి, ఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యతో పాటు పలువురు అధికారుల బృందం ఉన్నారు. అనంతరం, వివిధ దేశాల దౌత్యవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అల్యూమినియం కంపెనీల డైలమా
అల్యూమినియం రంగ దిగ్గజాలు వేదాంతా, నోవెలిస్ పెట్టుబడి వ్యయాలపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దేశీ దిగ్గజం హిందాల్కో మాత్రం విస్తరణ ప్రణాళికలను అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వివరాలు చూద్దాం.. ముంబై: తయారీ వ్యయాలు పెరిగిపోవడానికితోడు.. అంతర్జాతీయంగా అల్యూమినియం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో దిగ్గజ కంపెనీలు పెట్టుబడి ప్రణాళికలపై వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2022–23) పెట్టుబడి వ్యయాలపై కొంతమేర కోతలు అమలు చేస్తున్నాయి. వెరసి ప్రణాళికలను తిరిగి సమీక్షిస్తున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) కాలానికి ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ వేదాంతా అల్యూమినియం, విద్యుత్ విభాగంపై పెట్టుబడి వ్యయాల్లో 40 శాతం కోతను అమలు చేయనున్నట్లు ఇన్వెస్టర్లకు తెలియజేసింది. దీంతో ఈ ఏడాదికి తొలుత అనుకున్న 100 కోట్ల డాలర్ల(సుమారు రూ. 8,250 కోట్లు) వ్యయాలకుగాను 60 కోట్ల డాలర్లనే వెచ్చించనుంది. ఫలితంగా 2 బిలియన్ డాలర్లస్థానే 1.6 బిలియన్ డాలర్లకే మొత్తం పెట్టుబడులు పరిమితంకానున్నాయి. నోవెలిస్ సైతం ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో విదేశీ అనుబంధ సంస్థ నోవెలిస్ సైతం పెట్టుబడి వ్యయాలను పునఃసమీక్ష చేయనుంది. యూఎస్‌లో ప్యాకేజింగ్, ఆటోమోటివ్, కన్స్ట్రక్షన్ రంగాలకు ప్రొడక్టులను సరఫరా చేస్తున్న కంపెనీ పెట్టుబడి వ్యయాలను 30–37 శాతం స్థాయిలో తగ్గించుకోనుంది. 1.3– 1.6 బిలియన్ డాలర్లకు బదులుగా 0.9–1 బిలియ న్ డాలర్లనే వెచ్చించనుంది. ఇందుకు అధిక ఇంధన ధరలు, గ్లోబల్ స్థాయిలో నీరసించిన అల్యూమినియం ధరలు కారణమని కంపెనీ ప్రస్తావిస్తోంది. 40 శాతం డౌన్ అల్యూమినియం ధరలు ఈ ఏడాది మార్చిలో టన్నుకి 4,000 డాలర్లను తాకగా.. నవంబర్‌కల్లా 40 శాతం పతనమయ్యాయి. ఎల్‌ఎంఈలో టన్ను 2,400 డాలర్లకు చేరింది. మరోపక్క ఊపందుకున్న ఇంధన ధరలు పలు ప్రాథమిక లోహ(బేస్ మెటల్) కంపెనీల జులై–సెప్టెంబర్(క్యూ2) లాభదాయకతను దెబ్బతీశాయి. అయితే పలు మెటల్ రంగ కంపెనీల యాజమాన్యాల తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో మార్జిన్లు బలపడనున్నాయి. లాభాలు పుంజుకోనున్నాయి. తయారీ వ్యయాలు తగ్గడం తదితర అంశాలు ఇందుకు సహకరించనున్నట్లు పరిశ్రమ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. హిందాల్కో సై ఈ ఏడాదికి దేశీ బిజినెస్‌పై హిందాల్కో రూ. 3,000 కోట్ల పెట్టుబడులు వెచ్చిస్తోంది. కంపెనీ వివరాల ప్రకారం కొన్ని ప్రాజెక్టుల పరికరాలకు అనుమతులు ఆలస్యమవుతున్నప్పటికీ ఇప్పటికే రూ. 2,500 కోట్లు వినియోగించింది. దేశీయంగా పటిష్ట డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో పెట్టుబడి వ్యయాలు కొనసాగుతున్నట్లు హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ పేర్కొన్నారు. యూఎస్‌లోనూ ప్రధానంగా అల్యూమినియం పానీయాల క్యాన్లకు డిమాండ్ కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఇక వచ్చే ఏడాది(2023–24) ద్వితీయార్ధానికల్లా 3 మిలియన్ టన్నుల అల్యూమినియం తయారీ సామర్థ్యాన్ని అందుకోనున్నట్లు వేదాంతా సీఈవో సునీల్ దుగ్గల్ వెల్లడించారు. ప్రస్తుత 2.4 ఎంటీపీఏ సామర్థ్యాన్ని ప్రణాళికలకు అనుగుణంగా విస్తరిస్తున్నట్లు తెలియజేశారు. మరోవైపు ఒడిషాలోని ఝార్సిగూడా యూనిట్లో చేపట్టిన 1.8 ఎంటీపీఏ సామర్థ్యం ఇటీవలే పూర్తయిన విషయాన్ని ప్రస్తావించారు. -
మెరుగైన రాబడుల కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
నా వయసు 30 ఏళ్లు. మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ప్రతి నెలా రూ.5,000 చొప్పున పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నాను. సిప్ కోసం ఏ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు అనుకూలం? మీరు తీసుకున్న మంచి నిర్ణయానికి అభినందనలు. పెట్టుబడులను మరీ ఆలస్యం చేయొద్దంటూ తరచుగా మేము చెబుతుంటాం. మీరు పన్ను ఆదా చేయడం కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నట్టు అయితే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) మంచి ఆప్షన్ అవుతుంది. ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడులు పెడితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ఈ ప్రయోజనం కల్పిస్తోంది. ఒకవేళ మీరు కనీసం ఐదేళ్లు, అంతకంటే దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసేట్లు అయితే అందుకు ఈఎల్ఎస్ఎస్ మెరుగైన సాధనమే అవుతుంది. ఇవి పూర్తి ఈక్విటీ పథకాలు. వేర్వేరు మార్కెట్ పరిమాణంతో కూడిన, వివిధ రంగాల్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. దీంతో దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడినిస్తాయి. అయితే, వీటిల్లో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ ఉంటుందని మర్చిపోవద్దు. సిప్ అయితే విడిగా ప్రతి సిప్ పెట్టుబడికి మూడేళ్లు అమలవుతుంది. ఒకవేళ మీరు ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి ఎటువంటి పన్ను ఆదాను కోరుకోనట్టయితే.. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పన్ను ఆదా ప్రయోజనాన్ని వాడుకుని ఉంటే, అప్పుడు మీ ప్రణాళిక వేరే విధంగా ఉండొచ్చు. మీరు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అగ్రెస్సివ్ హైబ్రిడ్ పథకాలు సాధారణంగా 65 నుంచి 80 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ పథకాలకు కేటాయిస్తాయి. డెట్ అన్నది ఈక్విటీలతో సంబంధం లేనిది. డెట్ పెట్టుబడుల రాబడులు ఈక్విటీల మాదిరిగా భారీ అస్థిరతలకు లోను కావు. మొదటి సారి పెట్టుబడులు పెట్టే వారికి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతుంది. కనుక ఈఎల్ఎస్ఎస్ లేదా అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో సిప్ మొదలు పెట్టుకోవచ్చు. రెండు నుంచి మూడేళ్ల పాటు వీటిల్లో ఇన్వెస్ట్ చేసి, ఈక్విటీలు ఎలా పనిచేస్తాయో అవగాహన వచ్చిన తర్వాత.. అప్పుడు అచ్చమైన ఈక్విటీ పథకాలైన.. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌ను దీర్ఘకాల లక్ష్యాల కోసం ఎంపిక చేసుకోవచ్చు. నేను రూ.50,000 మొత్తాన్ని మూడు నుంచి ఆరు నెలల కాలానికి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నా ను. మా పిల్లల విద్య కోసం ఆరు నెలల తర్వాత ఈ మొత్తం కావాల్సి ఉంది. మెరుగైన రాబడుల కోసం ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఇంత స్వల్ప కాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటే, ముందు లక్ష్యం విషయంలో రాజీ పడడానికి అవకాశం ఉండదు. ఎంతో కాలం లేదు కనుక పెట్టుబడికి భద్రత ఎక్కువ ఉండాలి. రాబడుల కంటే పెట్టుబడిని కాపాడుకునే విధంగా వ్యూహం ఉండాలి. కనుక ఈ మొత్తాన్ని మీరు బ్యాంకు ఖాతాలోనే కొనసాగించుకోవచ్చు. లేదంటే ఆరు నెలల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో రాబడులు తక్కువే అయినా గ్యారంటీతో కూడినవి. పైగా పెట్టుబడికి భద్రత ఎక్కువ. ఆరు నెలలే ఉంది కనుక కచ్చితంగా ఆ సమయానికి పెట్టుబడిని రాబడితో పాటు సులభంగా వెనక్కి తీసుకోవచ్చు. బ్యాంకులో చేసే డిపాజిట్ రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ నుంచి బీమా ఉంటుంది. ఇవి కాకుండా లిక్విడ్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, రెపో సర్టిఫికెట్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. గరిష్టంగా 91 రోజుల కాల వ్యవధి కలిగిన సెక్యూరిటీల్లోనే లిక్విడ్ పథకాలు ఇన్వెస్ట్ చేస్తాయి. బ్యాంకు డిపాజిట్ల కంటే లిక్విడ్ ఫండ్స్‌లో కొంచెం అదనపు రాబడి వస్తుంది. కాకపోతే పెట్టుబడి భద్రతకు అవి హామీ ఇవ్వవు. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
నెస్లే ఇండియా భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: గ్లోబల్ ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఎస్ఏ దేశీయంగా భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. రానున్న మూడున్నరేళ్లలోగా అంటే 2025కల్లా రూ. 5,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ సీఈవో మార్క్ ష్నీడర్ వెల్లడించారు. తద్వారా దేశీ బిజినెస్‌కు జోష్‌నివ్వడంతోపాటు కొత్త వృద్ధి అవకాశాలను అందుకోనున్నట్లు తెలియజేశారు. నిధులను పెట్టుబడి వ్యయాలుగా వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త ప్లాంట్ల ఏర్పాటు, ఇతర సంస్థల కొనుగోళ్లు, ప్రొడక్టు పోర్ట్‌ఫోలియో విస్తరణ తదితరాలను చేపట్టనున్నట్లు వివరించారు. కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9 ప్లాంట్లను నిర్వహిస్తోంది. కొత్తగా తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు తగిన ప్రాంతాలను అన్వేషిస్తున్నట్లు నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. పెట్టుబడులకు అధికారిక సంస్థల నుంచి అనుమతులు లభించాల్సి ఉండగా.. మరింత మందికి ఉపాధి లభించే వీలుంది. ప్రస్తుతం 6,000 మంది సిబ్బంది ఉన్నారు. టాప్–10లో ఒకటి... నెస్లేకు ప్రాధాన్యతగల టాప్–10 మార్కెట్లలో ఒకటైన ఇండియాలో 2025కల్లా రూ. 5,000 కోట్లు వెచ్చించనున్నట్లు ష్నీడర్ తెలియజేశారు. కంపెనీ గత ఆరు దశాబ్దాలలో రూ. 8,000 కోట్లను వెచ్చించినట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశీయంగా 110 ఏళ్ల క్రితమే కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ 1960 నుంచీ తయారీకి తెరతీసినట్లు వివరించారు. -
తగ్గేదెలే అంటున్న వేదాంత: వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: మెటల్ ధరలు క్షీణిస్తున్నప్పటికీ ఈ ఏడాది పెట్టుబడి వ్యయాలకు కోత పెట్టబోమంటూ వేదాంతా లిమిటెడ్ స్పష్టం చేసింది. జింక్, ఆయిల్ అండ్ గ్యాస్, అల్యూమినియం వ్యాపారాల్లో భారీ ప్రణాళికల్లో ఉంది. 2022-23లో 2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 16 వేల కోట్లు) వెచ్చించ నున్నట్లు వేదాంత తెలియజేసింది. జింక్, చమురు-గ్యాస్, అల్యూమినియం వ్యాపారంలో నిధులను వినియోగిస్తామని పేర్కొంది. ప్రాజెక్టులకు మధ్యలో ఫుల్స్టాప్ పెట్టబోమని కంపెనీ సీఈవో సునీల్ దుగ్గల్ వెల్లడించారు. వీటితో పటిష్ట రిటర్నులు లభిస్తాయన్నారు. తద్వారా నిర్వహణా సామర్థ్యం మరింత మెరుగుపడటంతోపాటు, ఉత్పాదకత పుంజు కుంటుందన్నారు. దేశీ మినరల్స్ అండ్ మెటల్స్ పరిశ్రమపై ఎన్ఎండీసీ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సు రెండో రోజు దుగ్గల్ విలేకరులకు ఈ విషయాలు వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో సుమారు 3 బిలియన్ల డాలర్లు మూలధనాన్ని వెచ్చించ నున్నట్టు వేదాంత 57వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి కంపెనీ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 18 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.3 లక్షల కోట్లు) నుంచి మరో ఎనిమిదేళ్లలో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8 లక్షల కోట్లు) కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటుకు ప్రపంచంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారులలో ఒకటైన ఫాక్స్‌కాన్‌తో వేదాంత ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా రెండులక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ వేదాంత లిమిటెడ్, దేశం అంతటా చమురు, గ్యాస్, జింక్, సీసం, వెండి, రాగి, ఇనుప ఖనిజం, ఉక్కు,య అల్యూమినియం, పవర్ వ్యాపార నిర్వహణలో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. -
రాబడుల కోసం.. మీ రూట్ ఎటు?
కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో సోషల్ మీడియా పాత్ర మరింత విస్తరించింది. యూట్యూబ్‌లో ఎంతో మంది పెట్టుబడి సలహాదారుల పాత్రను పోషిస్తున్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి పేజీలకు లెక్కేలేదు. ఎక్కడైనా మంచి చెడు కలసి సహవాసం చేస్తాయన్నట్టే.. ఇక్కడ కూడా రెండు రకాలు ఉన్నాయి. ఇలాంటి సోషల్ మీడియా చానళ్లలో లభించే కంటెంట్ ఎంతో ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ, కచ్చితమైనదేనా..? ఆ విచక్షణ పెట్టుబడిదారులదే అవుతుంది. రిస్క్ కూడా పెట్టుబడిదారులదే. చానళ్లలో బోలెడు కంటెంట్‌ను ఊదరగొట్టేవారిది కాదని గుర్తుంచుకోవాలి. సంప్రదాయ టీవీ మాధ్యమంతో పోలిస్తే సోషల్ మీడియా చానళ్లు కొన్ని వినూత్నంగా కంటెంట్ అందించొచ్చు. మరీ ముఖ్యంగా స్థానిక భాషల్లో ఇవి కంటెంట్‌ను అందించడం సానుకూలమే. దీన్ని అధ్యయనానికి ఇన్పుట్గానే చూడాలి. దాన్నే ఆధారంగా చేసుకుని పెట్టుబడి పెడతానంటే..? రిస్క్‌ను ఆహ్వానించినట్టు అవుతుంది. ఇలాంటి సోషల్ మీడియా సలహాలు, సూచనలు, కంటెంట్ విషయంలో పెట్టుబడిదారులు అనుసరించాల్సిన మార్గంపై అవగాహన కల్పించడమే ఈ కథనం ఉద్దేశం. మార్కెటింగ్ చేస్తున్నారా/విజ్ఞానం పంచుతున్నారా..? అనుమతించని సాధనాలు..: గడిచిన ఏడాది కాలాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. క్రిప్టో కరెన్సీలు స్థూల ఆర్థిక రంగానికి ముప్పు అంటూ, ఏ ఒక్కరో నియంత్రించలేని అలాంటి సాధనాలను దేశంలో అనుమతించొద్దని ఆర్బీఐ కేంద్రానికి సూచించింది. క్రిప్టోల్లో పెట్టుబడులతో పూర్తిగా నష్టపోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దంటూ ఇన్వెస్టర్లను ఎన్నో సార్లు హెచ్చరించింది కూడా. కానీ, ఈ సూచలను తలకెక్కించుకున్న ఇన్వెస్టర్లు ఎంత మంది..? పైగా పేరొందిన నిపుణులు, ఆర్థిక సాధనాలపై అవగాహన కలిగిన వారు తమ యూట్యూబ్ చానళ్లలో క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా..? ఏ ప్లాట్‌ఫామ్‌లు అనుకూలం? క్రిప్టోలు, ఎన్‌ఎఫ్‌టీల్లో వేటికి భవిష్యత్తు ఉంటుంది? ఇలాంటి వీడియోలు ఎన్నింటినో వీక్షకులకు వదిలారు. చట్టబద్ధం కాని సాధనాల్లో పెట్టుబడులకు మార్గాలను చెప్పడం దేనికి సంకేతం..?. కాయిన్ డీసీఎక్స్, వాజిర్ఎక్స్ తదితర క్రిప్టో ఎక్సే్ఛంజ్‌ల ద్వారా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో సూచిస్తూ వీడియోలు పెట్టారు. కొందరు ప్రముఖ క్రిప్టోలైన బిట్‌కాయిన్, ఎథీరియం, పాలీగాన్ (మాటిక్) వంటి వాటికే వీడియోలను పరిమితం చేశారు. ఇలాంటి వారి సూచనలను నమ్ముకుని గత ఏడాది కాలంలో క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి ఏంటి..? నిండా నష్టపోయే ఉంటారు. ఏడాది కాలంలో బిట్‌కాయిన్ 60 శాతానికి పైగా పతనం అయింది. 2021 నవంబర్‌లో 67,000 డాలర్లకు పైగా వెళ్లిన బిట్‌కాయిన్ ఇప్పుడు 24,000 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఎథీరియం 60 శాతం, మ్యాటిక్ 80 శాతానికి పైనే వాటి విలువను కోల్పోయాయి. క్రిప్టోల్లో పెట్టుబడులను నిరుత్సాహ పరిచేందుకు, నల్లధనాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ 1 నుంచి క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను విధించింది. అంతేకాదు లాభం నుంచి ఎక్సే్ఛంజ్లే 1 శాతం టీడీఎస్ కింద మినహాయించాల్సి ఉంటుంది. అనుమతి లేని వేదికలు: నియంత్రణలేని, సెబీ లైసెన్స్ లేని ఆర్థిక సలహాదారులే ఎక్కువ. సోషల్ మీడియా వేదికల్లో 99 శాతం ఇలా అనుమతి లేని వారు నిర్వహించేవే. కాకపోతే, ఒక్క డిస్‌క్లెయిమర్ ఇచ్చి తమకు సంబంధం లేదన్నట్టు వీరు వ్యవహరిస్తుంటారు. డిజిటల్ గోల్డ్ తదితర సాధనాలను కూడా ప్రోత్సహించడాన్ని గమనించొచ్చు. ఇవి స్పెక్యులేటివ్ ట్రేడ్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. బ్రైట్‌కామ్ స్టాక్ ఇందుకు ఒక ఉదాహరణ. దీని పూర్వపు పేరు లైకోస్ ఇంటర్నెట్. అంతే కాదు.. వైబ్రంట్ డిజిటల్, లాంకో గ్లోబల్ కూడా దీని పూర్వపు నామాలే. ఇలా అవతారాలు మార్చుకుంటూ వచ్చిన ఈ స్టాక్ గతేడాది సోషల్ మీడియా ఫేవరెట్‌గా మారిపోయింది. 2021 మేలో రూ.10 దగ్గరున్న స్టాక్ ధర అదే ఏడాది డిసెంబర్ నాటికి రూ.123కు పెరిగిపోయింది. యాడ్టెక్నాలజీ కంపెనీ అయిన బ్రైట్‌కామ్ సూపర్ మల్టీబ్యాగర్ అంటూ ఎన్నో సోషల్ మీడియా వేదికలు తెగ ప్రచారం కల్పించాయి. కానీ, ఇక్కడ స్పష్టమైన సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఒక కంపెనీ అన్ని సార్లు పేర్లు ఎందుకు మార్చుకుంది? సీఎఫ్‌వో రాజీనామా వెనుక కారణం ఏంటి? బోనస్ షేర్లు క్రెడిట్ చేయడంతో జాప్యం ఎందుకు? 2019–20లో ఆస్తుల విలువ తరిగిపోవడంపై సెబీ ఫోరెన్సిక్‌కు ఆదేశించడం..? ఇలాంటి సమాధానాల్లేని సందేహాలతో ఈ స్టాక్ ఇప్పుడు అమ్మకాల ఒత్తిడి చూస్తోంది. గరిష్టం నుంచి సగానికి పైగా పతనం అయింది. ప్రమోటర్ల వాటా 18 శాతానికి దిగొచ్చింది. ఇవన్నీ కలసి ఇప్పుడు ఈ స్టాక్ రిటైల్ ఇన్వెస్టర్లకు బోర్ కొట్టేసింది. ఇది కేవలం ఒకే ఉదాహరణ. మైక్రోక్యాప్ విభాగం నుంచి ఎన్నో స్టాక్స్ విషయంలో ఇలాంటి ప్రచారమే నడుస్తుంటుంది. ఒక సోషల్ మీడియా వేదికల ద్వారా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే వ్యవహారాల పట్ల, చానళ్ల పట్ల ఇన్వెస్టర్లు అవగాహన కలిగి, వివేకంగా వ్యవహరించకపోతే వారి కష్టార్జితమే కరిగిపోతుంది. ఎఫ్‌అండ్‌వో ఊరింపు: కరోనా లాక్డౌన్ల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఏర్పాటైంది. ఖాళీ సమయంలో ట్రేడింగ్ చేయడానికి ఆసక్తి అధికమైంది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం ఎఫ్‌అండ్‌వో (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) మార్కెట్లో పెరిగిపోయింది. సెబీ దీన్ని గమనించి మార్జిన్ల విషయంలో నిబంధనలను కఠినం చేసింది. కానీ, 2020 మార్చి పతనం తర్వాత నుంచి ఈక్విటీ మార్కెట్లు ఏకరీతిన పెరిగిపోవడం ఇన్వెస్టర్లకు తెగ ఉత్సాహాన్నిచ్చింది. దీన్ని అనుకూలంగా మలుచుకుని ఎన్నో ట్విట్టర్ హ్యాండిల్స్, యూట్యూబ్ చానళ్లు ఎఫ్‌అండ్‌వో ట్రేడ్స్ సిఫారసులపై ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశాయి. కొందరు 99.9 శాతం కచ్చి తత్వం రేటుతో కాల్స్ ఇస్తామంటూ పెద్ద మొత్తంలో సబ్స్క్రిప్షన్స్ కూడా రాబట్టారు. మీ పెట్టుబడిని రోజులో 12 శాతం వృద్ధి చేస్తామని ఆశ పెట్టిన ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఇలాంటి ఊరించే ప్రకటనలతో తమ చందాదారుల సంఖ్యను పెంచుకునేవి కొన్ని అయితే, చందా వసూలు చేసుకునేవి కొన్ని. రెండు విధాల వారికి లాభమే. చందాదారులు పెరిగే కొద్దీ ఆయా చానళ్లకు ప్రకటనల ఆదాయం వస్తుంది. ఇంక మార్కెట్లో రాబడుల విజయ సూత్రాలు చెబుతామంటూ వెబినార్లు, వర్క్‌షాపులు నిర్వహించిన వారు కూడా ఉన్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.30,000 వరకు వసూలు చేశారు. బుల్ మార్కెట్లో ఇలాంటి ధోరణులే ఎక్కువగా చెలామణి అవుతుంటాయి. వీరిని నమ్ముకుని ఎఫ్‌అండ్‌వోలో ఇన్వెస్ట్ చేసి భారీగా నష్టపోయిన వారే ఎక్కువ. నియంత్రణ పాత్ర సెబీ ‘ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ రెగ్యులేషన్స్ 2013’ పేరుతో కఠిన నిబంధనలను ఎప్పుడో తీసుకొచ్చింది. ఆర్థిక సలహాదారుల (ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్/రిసెర్చ్ అనలిస్ట్) పాత్ర పోషించాలంటే కావాల్సిన అర్హతలు, నెట్‌వర్త్, వారికి ఉండే బాధ్యతలు, రిజిస్ట్రేషన్ నిబంధనలను స్పష్టంగా నిర్వచించింది. ప్రయోజన వివాదాలకు చోటు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఏ రూపంలో అయినా కమీషన్, ప్రోత్సాహకాలు తీసుకోకుండా నిషేధించింది. అయితే, సోషల్ మీడియా వేదికగా నిర్వహిస్తున్న వేదికల్లో 99 శాతం ఈ నిబంధనలను పాటించడం లేదు. కొందరు తమ వీడియోలు, పోస్టుల్లో డిస్‌క్లెయిమర్‌కు చోటిస్తున్నారు. దీన్ని ఎటువంటి రికమండేషన్గా భావించొద్దని, కేవలం సమాచారమేనని చెబుతున్నారు. ‘దీని ఆధారంగా మీరు స్వయంగా అధ్యయనం చేసిన తర్వాతే పెట్టుబడుల నిర్ణయం తీసుకోవాలి’ అని సూచిస్తున్నారు. వాటిల్లో ఉండే రిస్క్‌లు కూడా తెలియజేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇలా డిస్‌క్లెయిమర్ తప్పనిసరి. అడ్వర్టైజ్మెంట్ లేదా పెయిడ్ ప్రమోషన్, స్పాన్సర్డ్, కొలాబరేషన్, పార్ట్నర్షిప్ ఇలా ఏదైనా చెప్పాల్సిందే. అందుకని మీరు అనుసరిస్తున్నది.. సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లేదా అనలిస్ట్ అవునా? కాదా అన్నది ముందు తెలుసుకోవాలి. సెబీ అనుమతి లేని వారి సూచనలను అనుసరిస్తే అది పూర్తిగా మీ అభీష్టమే అవుతుంది. వేటిని అనుసరించాలి..? సోషల్ మీడియాలో మనం చూసే కంటెంట్ ఎంత మాత్రం నిజమైనది? పరిశీలిస్తే, విశ్లేషణ కోణం నుంచి చూస్తే తెలుస్తుంది. కొన్ని వేదికలు మంచి కంటెంట్‌ను అందిస్తున్నాయి. వాటి సాయంతో ఎంతో నేర్చుకునే అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఆర్థిక సాధనాలు, ఈక్విటీలపై పట్టు పెంచుకునేందుకు మంచి వేదికలను అనుసరించడం ప్రయోజనమే. ఫండ్ మేనేజర్లు, సీఈవోలతో ఇంటర్వ్యూలను అందిస్తున్న వేదికలు కూడా ఉన్నాయి. సెబీ అనుమతి లేకపోయినా కానీ.. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా ఉత్పత్తులకు సంబంధించి చక్కటి సమాచారం అందిస్తున్నవీ ఉన్నాయి. కాకపోతే పెయిడ్, స్పాన్సర్డ్ కంటెంట్‌ను ఫిల్టర్ చేసుకోగలిగితే చాలు. అది అధ్యయనం, పరిశీలన మీద వస్తుంది. పేరున్న సోషల్ మీడియా వేదికలకు నకళ్లు ఎన్నో తయారయ్యాయి. ప్రాచుర్యం పొందిన ఆయా వ్యక్తులు, చానళ్ల పేరుతో నకిలీలు తెరిచి మోసం చేయడమే వారి లక్ష్యం. ఇటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి ప్రభావానికి లోను కానంత వరకు సోషల్ మీడియా వేదికలు అధ్యయనానికి అద్భుతమైన వేదికలే. వాటిల్లోని సమాచారాన్ని చూసి వెంటనే పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం చేయరాదు. కొన్ని సందర్భాల్లో సానుకూల ఫలితాలు రావచ్చు. కానీ, బెడిసికొట్టే సందర్భాలు కూడా ఉంటాయి. వీటిని రాబడుల టిప్స్ వేదికలుగా చూడొద్దు. అధ్యయన, అవగాహన మార్గాలుగానే చూడాలి. కచ్చితంగా స్వీయ అధ్యయనం తోడవ్వాలి. అంత అవగాహన లేకపోతే ఫీజు చెల్లించి నేరుగా నిపుణులను సంప్రదించాలి. ఇవేవీ అనుసరించలేకపోతే.. కనీసం రూ.1,000–2,000 పెట్టుబడితో ముందుగా ఒకటి రెండేళ్లపాటు పెట్టుబడుల్లోని సానుకూల, ప్రతికూలతలను అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. దీనివల్ల పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. పెయిడ్ పోస్టుల మాయలో పడొద్దు... లైసెన్స్ కలిగిన ఆర్థిక సలహాలు, నిపుణుల ఆధ్వర్యంలో పెట్టుబడుల నిర్వహణ సేవలకు ఫీజులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇవి ఉచితంగా వచ్చేవి కావు. కానీ, ఉచిత సమాచారంపై ఆధారపడే ఇన్వెస్టర్ల ధోరణి వారిని నష్టాల వైపు నడిపిస్తోందని చెప్పుకోవాలి. ఆర్థిక నిపుణుల్లో ఎంత మంది తమ విలువైన సమయాన్ని వెచ్చించి విలువైన కంటెంట్‌ను రోజువారీగా, వారం వారీ ఇవ్వగలరు? ఏదో ప్యాషన్‌గా పనిచేసుకునే వారు (వందల్లో కూడా ఉండరు) తప్పించి విలువైన కంటెంట్‌ను ఉచితంగా అందించే వారు పెద్దగా ఉండరు. ‘ఒక ఉత్పత్తి కోసం మీరు చెల్లించకపోతే.. మీరే ఉత్పత్తిగా మారతారు’ అన్న ప్రముఖ కొటేషన్ గుర్తు చేసుకోవాలి. సీజనల్ ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులు సోషల్ మీడియాలో కొంత సమయం వెచ్చిస్తుంటారు. వారికున్న పరిజ్ఞానం, అనుభవాన్ని పంచుకోవాలన్న ఉద్దేశంతోనే కొంత సమయం కేటాయిస్తుంటారు. కానీ, దీన్నే వ్యాపకంగా, ఆదాయ మార్గంగా పెట్టుకుని అర్హతలేని వారు నిర్వహించే వేదికలే ఎక్కువ. ఒక పద్ధతి ప్రకారం వీరు చానళ్లను ఏర్పాటు చేసి, కంటెంట్‌తో మిలియన్ల మందిని ఆకర్షించే మార్గంలో వెళుతుంటారు. ఆ కంటెంట్ రూపంలో ఆదాయాన్ని పొందడమే వారు ఎంచుకున్న మార్గం. కొన్ని ప్రముఖ సోషల్ మీడియా చానళ్ల నిర్వాహకులకు ఇలా భారీ ఆదాయమే వస్తోంది. యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో ఆర్థిక సంస్థల ప్రకటలను వారు అనుమతిస్తుంటారు. అఫిలియేట్ మార్కెటింగ్ భాగస్వామ్యాలు కుదుర్చుకుంటూ ఉంటారు. తమ కంటెంట్‌లో ఫలానా బ్రాండ్ పేరుకు చోటు ఇచ్చినందుకు కొంత వసూలు చేస్తుంటారు. ఆయా కంపెనీల ఉత్పత్తులను అనుసంధానించే వెబ్ లింక్‌ను పోస్ట్ చేస్తుంటారు. ఈ లింక్‌లను ఎంత మంది క్లిక్ చేసి విజిట్ చేస్తే వారికి అంత ఆదాయం కమీషన్ రూపంలో సమకూరుతుంది. ఇదంతా స్వేచ్ఛగా జరిగే వ్యవహారమే. ఇందులో గుట్టేమీ లేదు. కానీ, వారు అందిస్తున్న కంటెంట్‌లో ప్రచారం కోసమా..? లేక అవగాహన కోసం పెడుతున్న కంటెంటా? అన్న నిజాన్ని ఎక్కువ మంది తెలుసుకోలేరు. పెయిడ్ ప్రచారం అని చెప్పేవారు బహుశా అతి కొద్ది మందే ఉన్నారు. కొందరు ఒక కంపెనీ లేదా బ్రాండ్‌కు ప్రచారం కల్పిస్తూ తమ యూట్యూబ్ చానల్లో వీడియో పోస్ట్ చేయడానికి లేదా ఫేస్బుక్ పోస్ట్ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం భారీ ఫీజును వసూలు చేస్తుంటారు. సాధారణంగా ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారనే దాన్ని బట్టి వసూలు చేసే మొత్తం ఆధారపడి ఉంటుంది. మిలియన్ల సబ్స్క్రయిబర్లు/ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్ చానల్ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఒక్కో పోస్ట్‌కు రూ.4–15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ప్రాయోజిత ట్వీట్లకు లక్షలు తీసుకునే వారున్నారు. ఒక కంపెనీ రైట్స్ ఇష్యూ సబ్ స్క్రయిబ్ చేసుకోవాలంటూ.. ఒక మైక్రోక్యాప్ స్టాక్‌ను మల్టీబ్యాగర్‌గా ఒకటికి మించి ట్విట్టర్ హ్యాండిల్స్, యూట్యూబ్ చానళ్లు ఊదరగొడుతున్నాయంటే..? అవి పెయిడ్ పోస్ట్‌లుగా సందేహించాల్సిందే. ఆయా కంపెనీలు లేదా స్టాక్ ఆపరేటర్లు వాటి వెనుక ఉండొచ్చు. ‘పంప్ అండ్ డంప్’ ఆపరేటర్లకు ట్విట్టర్, వాట్సాప్, టెలిగ్రామ్ వేదికలుగా నిలుస్తున్నాయి. వీటి ద్వారా ప్రచారం కల్పించి, రిటైల్ ఇన్వెస్టర్లతో కొనిపించేలా చేయడమే వారి వ్యూహం. చౌక ధరకు పోగు చేసిన ఆయా స్టాక్స్‌ను అనైతిక, అసత్య ప్రచారంతో తెలియని, ఆశతో కూడిన ఇన్వెస్టర్లకు అండగట్టి వారు లాభాలతో బయటకు వెళ్లిపోతుంటారు. -
యువత పెట్టుబడులకు సరైన వేదిక ఏది?
యువత పెట్టుబడులకు సరైన వేదిక ఏది? – హిమ బిందు యుక్త వయసులోనే అంటే ఇరవైలలోనే (ఉదాహరణకు 25 సంవత్సరాలు) సొమ్ములుండి పెట్టుబడులను దీర్ఘకాలంపాటు మరిచిపోగలిగితే స్మాల్ క్యాప్ ఫండ్‌తో మదుపును ప్రారంభించవచ్చు. పెట్టుబడిదారులు ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మరీ దీర్ఘకాలానికైతే స్మాల్ క్యాప్ ఫండ్స్ అత్యధిక లాభాలను ఆర్జించిపెట్టే ఆస్తుల విభాగంలోకి వస్తాయి. అయితే విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు విలువ భారీగా వేగంగా పడిపోతుంటుంది. ఇది బాగా ఆందోళనలు కలిగిస్తుంది. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలోనూ, ఆపై పలు ఇతర క్లిష్టకాలాల్లోనూ వీటి విలువలు 50 శాతం పతనమయ్యాయి. అతితక్కువ సమయంలోనే విలువలు భారీగా క్షీణించాయి. అంటే రూ.100 పెట్టుబడి రూ.50కు చేరుతుంది. అత్యధిక శాతం మంది ఇన్వెస్టర్లు దీనిని ఆమోదించబోరు. కనుక గరిష్ట రిస్కుకు సిద్ధపడితేనే వీటివైపు దృష్టి పెట్టవచ్చు. ఇరవైలలోనే మీరు సంపాదిస్తూ, పన్నులు చెల్లిస్తూ ఉంటే లెక్కల పద్ధతిలో పన్ను ఆదా పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు. ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌లో అవసరమైనంత సొమ్మును మదుపు చేయవచ్చు. దేశీ ఇన్వెస్టర్లకు పన్ను పొదుపు ఫండ్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన మొత్తాన్ని ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఇరవైలలోనే సంపాదిస్తూ గరిష్ట రిస్కుకు సిద్ధపడుతుంటే.. స్మాల్ క్యాప్ ఫండ్స్‌నూ పరిశీలించవచ్చు. పన్ను ఆదాకు పీపీఎఫ్ సరైనదేనా? – శంకర్ పీపీఎఫ్ పెట్టుబడిదారులకు నా సలహా ఏమంటే.. ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కొనసాగించవచ్చు. అలాకాకుండా ఇప్పుడే పెట్టుబడుల కోసం ఆలోచిస్తుంటే అదంత లాభదాయకం కాబోదు. ఎందుకంటే.. పీపీఎఫ్ అనేది స్థిర ఆదాయ ఆర్జన కోసం 15ఏళ్ల కాలపు క్రమానుగత పెట్టుబడి పథకం(సిప్). 15ఏళకాలానికి ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే.. పీపీఎఫ్కంటే ఇతర పన్ను ఆదా ఫండ్స్ నుంచి లభించే రిటర్నులే అధికంగా ఉండే వీలుంది. ఇది మొట్టమొదట ఆలోచించవలసిన విషయం. అయితే ఇప్పటికే పీపీఎఫ్‌లో ఉంటే పెట్టుబడులు కొనసాగించవచ్చు. వడ్డీ ఆదాయం పన్నురహితంకావడంతో స్థిర ఆదాయ కేటాయింపులు చేపట్టవచ్చు. సుప్రసిద్ధమైన పథకంకావడంతో ఇప్పటికే పీపీఎఫ్‌లో ఉంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రత్యామ్నాయాల్లో ఇది అత్యుత్తమమైనదిగా భావించవచ్చు. ఏదైనా మ్యూచువల్ ఫండ్ లేదా మార్కెట్ ఆధారిత పెట్టుబడుల ఖాతా లేనప్పటికీ చాలా మంది ప్రజలు పీపీఎఫ్ ఖాతాను కలిగి ఉన్నారు. నిజానికి దేశీయంగా ఈక్విటీ ఇన్వెస్టర్ల సంఖ్యతో పోలిస్తే ఇటీవల పీపీఎఫ్ పెట్టుబడిదారుల సంఖ్య రెట్టింపునకంటే అధికంగా నమోదైంది. ప్రభుత్వ అండతో అత్యంత నమ్మకమైన పెట్టుబడి మార్గంకావడంతో అత్యధికులు పీపీఎఫ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. వడ్డీ ఆదాయం పూర్తిగా పన్నురహితంకావడం ఆకర్షణీయం. వెరసి ఇప్పటికే పీపీఎఫ్‌లో ఉంటే కొనసాగించండి. కొత్తగా ఇన్వెస్ట్ చేయదలిస్తే ఇతర పన్నుఆదా ఫండ్స్‌నూ పరిశీలించవచ్చు. -
అమ్మాయికి ఏ లోటూ లేకుండా...!
కుమార్తె అంటే తండ్రికి మమకారం ఎక్కువ. బాధ్యత ఇంకాస్త ఎక్కువ. ఏ లోటూ రానీయకూడదన్నదే ప్రతి తండ్రి ఆలోచన. ఇవన్నీ ఆచరణ రూపం దాల్చాలంటే... ఆమె భవిష్యత్తు అనుకున్నట్టు సాగిపోవాలంటే ప్రతి తల్లిదండ్రికీ ప్రణాళిక కావాలి. అమ్మాయిల విద్య, వివాహం ఈ రెండూ ప్రధానం. ఖరీదైనవి కూడా. వాటి కోసం ప్రణాళిక వేసుకుని ఆ మేరకు ఇన్వెస్ట్ చేయాలి. కుమార్తె విషయంలో కీలకమైన అంశాలను కవర్ చేసేలా మెరుగైన పెట్టుబడులు ఎలా చేయాలన్నదే ఈ కథనం... యులిప్ ప్లాన్లలో ఏది బెటర్? కుమార్తె అవసరాల కోసం, భవిష్యత్ కోసం కొంత ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ను (యులిప్) పరిశీలించొచ్చు. ఇది బీమా–పెట్టుబడి కలిసిన పథకం. ఈ విభాగంలో పరిశీలించదగ్గ మెరుగైన ప్లాన్ ‘ఎడెల్వీజ్ టోకియో వెల్త్ ప్లస్’. దీన్లో చాలా సానుకూలతలున్నాయి. పాలసీదారులకు బీమా రక్షణతోపాటు, ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో పెట్టుబడులు ద్వారా రాబడులు అందిస్తుంది. ఇందులోనే రైజింగ్ స్టార్ అనే అదనపు ఫీచర్ ఉంది. పాలసీ తీసుకునే సమయంలోనే ఈ ఫీచర్‌ను ఎంచుకోవాలి. రైజింగ్ స్టార్ ఎంచుకుంటే పేరెంట్ పాలసీ హోల్డర్‌గా మారతారు. అంతేకాదు!! కుమార్తెకూ బీమా కవరేజీ అందుతుంది. అంటే పేరెంట్కు, పాపకు ఇద్దరికీ బీమా కవరేజీ లభిస్తుంది. ఒకవేళ పేరెంట్కు ఏదైనా జరిగి మరణిస్తే కుమార్తెకు వెంటనే ఏకమొత్తంలో పరిహారం అందుతుంది. పాలసీదారుడి వయసుపై ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది. పేరెంట్ మరణించాక... ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే పాలసీ కాల వ్యవధి ముగిసేదాకా యథావిధిగా కొనసాగుతుంది. బీమా కంపెనీయే మిగిలి ఉన్న కాలానికి సంబంధించిన అన్ని ప్రీమియంలను పేరెంట్ మరణించిన వెంటనే చిన్నారి ఫండ్ విలువకు జమ చేస్తుంది. దాంతో మిగిలి ఉన్న కాలంలో ఆ మొత్తం మరింతగా వృద్ధి చెందే వీలుంటుంది. ఇదే ఆకర్షణీయాంశం. మిగిలిన చైల్డ్ యులిప్ పాలసీల్లో పేరెంట్ మరణిస్తే మిగిలి ఉన్న కాలానికి ప్రీమియంను వార్షికంగానే బీమా కంపెనీ చెల్లిస్తుంటుంది. ఎడెల్వీజ్ వెల్త్ ప్లస్‌లో కాల వ్యవధి తీరాక ఫండ్ విలువ ఎంతుంటే ఆ మేరకు తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ చిన్నారికి ఏదైనా జరిగితే ఫండ్ విలువ లేదా బీమా మొత్తం ఈ రెండింటిలో ఏది అధిక విలువ ఉంటే దాన్ని పేరెంట్ లేదా నామినీకి చెల్లిస్తారు. మ్యూచువల్ ఫండ్స్ కోసమైతే... హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్! మ్యూచువల్ ఫండ్స్ సైతం చిన్నారుల కోసం ఎంచుకోవచ్చు. ఈ విషయంలో హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ఇది బ్యాలన్స్డ్ మ్యూచువల్ ఫండ్. ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. లక్ష్యానికి దీర్ఘకాలం (10–15 ఏళ్లు) ఉండి మోస్తరు రిస్క్ భరించే వారు పరిశీలించొచ్చు. 10 ఏళ్ల కాలంలో ఈ పథకం పనితీరు బెంచ్‌మార్క్ కంటే, ఇతర పోటీ ఈక్విటీ పథకాల కంటే ఎక్కువే ఉంది. వార్షికంగా చూస్తే రాబడులు 14.9 శాతం చొప్పున ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్‌కేర్ స్టడీ ప్లాన్, ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ప్లాన్ కంటే హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్‌లోనే రాబడులు ఎక్కువ. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు పోటీ పథకాలతో పోలిస్తే సగటున 3–5 శాతం ఎక్కువే ఉన్నాయి. సిప్ విధానంలో పెట్టుబడులపై గడిచిన పదేళ్ల కాలంలో వార్షికంగా 17.6 శాతం రాబడులు ఇచ్చింది. ఈ పథకంలో ఈక్విటీలో పెట్టుబడులు 70–73 శాతంగా ఉంటున్నాయి. పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 50 నుంచి 60 స్టాక్స్ వరకు ఉన్నాయి. రిస్క్ పరిమితం చేసేందుకు గాను మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌కు కేటాయింపులు 20–22 శాతానికి మించడం లేదు. డెట్‌లోనూ అధిక భద్రత కలిగిన ప్రభుత్వ సాధనాలు, ఏఏఏ రేటింగ్ ఉన్న వాటిని ఎంచుకుంటోంది. మార్కెట్లలో అస్థిరతలు పెరిగినప్పుడల్లా నగదు నిల్వలను 5–7 శాతం ఉండేలా చూస్తోంది. లాకిన్ పీరియడ్ మూడేళ్లు లేదా చిన్నారికి 18 ఏళ్లు... ఈ రెండింటిలో ఏది ఆలస్యమైతే అదే లాకిన్ పీరియడ్‌గా ఉంటుంది. లాకిన్ పీరియడ్ లేని ఆప్షన్లో పెట్టుబడి పెడితే... తొలి మూడేళ్లలోపే వాటిని వెనక్కి తీసుకోవచ్చు. కానీ మూడు శాతం వరకు ఎగ్జిట్‌లోడ్ భరించాల్సి ఉంటుంది. -
ఆర్థిక భరోసాకు ఆరు సూత్రాలు
ఇరవై రోజుల్లో కొత్త ఏడాది మొదలు కాబోతోంది. ఏటా కొత్త సంవత్సరం ప్రారంభంలో బోలెడన్ని లక్ష్యాలు నిర్దేశించుకుంటాం. తీర్మానాలు చేసుకుంటాం. బరువు తగ్గాలి, కష్టపడి పనిచేయాలి మొదలుకుని ఇల్లు, కారు కొనుక్కోవడం దాకా అనేకానేకం ఉంటాయి. అయితే కొన్ని లక్ష్యాలు ఆర్థికాంశాలతో ముడిపడి ఉంటాయి. ఆర్థికంగా బలంగా ఉంటేనే ఇవి సాకారమవుతాయి. సంతోషాన్నిస్తాయి. పటిష్టమైన ప్రణాళికంటూ లేకపోతే ఆర్థికంగా బలపడటం అనేది కుదిరే పని కాదు. ఇందుకోసం మనకు మనం తప్పనిసరిగా చేసుకోవాల్సిన తీర్మానాలు, సూత్రాలు కొన్ని ఉన్నాయి. ఇవి చాలా చిన్నవే. కానీ ఆర్థిక పురోగతికి ఇవి బంగారు బాటలు వేస్తాయి. పెద్ద మొత్తం కోసం ప్లానింగ్‌ను వాయిదా వేయ్యెద్దు నిజజీవితంలో ఊహించని విధంగా ఆస్తులో, డబ్బో వచ్చి పడటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. చాలా మందిమి రెగ్యులర్‌గా వచ్చే ఆదాయాలపై ఆధారపడాల్సిన వారమే. కనుక, ఒక్కసారిగా బోలెడంత డబ్బు చేతికొస్తే ప్లానింగ్ చేద్దామని వాయిదా వేస్తూ కూర్చోవద్దు. ఎందుకంటే, అదెప్పటికీ జరగకపోవచ్చు. కాబట్టి, చిన్న మొత్తం అయినా సరే.. ఫిక్సిడ్ డిపాజిట్లు, జీవిత బీమా పాలసీలు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. అలాగే, మార్కెట్లో పరిస్థితులను బట్టి ఇన్వెస్ట్ చేయాలి. పక్కాగా ఆదాయ, వ్యయాల లెక్కలు పాటిస్తాను డబ్బుల విషయంలో ప్రణాళికాబద్ధంగా ఉండాలన్నది మనకు తెలియని విషయం కాదు. కానీ, ఆర్థిక లక్ష్యాలను అర్థం చేసుకోలేకపోవచ్చు. లేదా ఆదాయంలో ఎంత మొత్తాన్ని లక్ష్య సాధనకు కేటాయించాలన్నదానిపై నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. దీనికి సింపుల్ పరిష్కార మార్గం ఒకటుంది. అదేంటంటే.. వ్యక్తిగత ఆదాయ, వ్యయాల ఖాతాను నిర్వహించుకోవడమే. దీని ద్వారా ప్రతి మూడు నెలలకోసారి మీ ఆదాయాలను, అవసరాలను, ఖర్చులను ట్రాక్ చేయండి. తద్వారా ఆదాయంలో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుందో మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. డబ్బు ఊరికే ఖాతాల్లో మగ్గిపోకుండా ప్రతీ ఒక్కరూ కూడా తమ లక్ష్యాలకు అనుగుణమైన సాధనాల్లో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇందుకోసం రికరింగ్ డిపాజిట్లు, జాతీయ పొదుపు పత్రాలు మొదలైన వాటితో ప్రారంభించవచ్చు. క్రమక్రమంగా లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే భవిష్యత్ కోసం భారీ మొత్తం కూడబెట్టుకోవచ్చు. రుణం తీసుకునే ముందే ఆలోచన.. ప్రస్తుతం అంతా ఆర్భాటాలకు ప్రాధాన్యమిస్తున్నారు. క్రెడిట్ కార్డులు, సులభ రుణాలు మొదలైన వాటితో మనం కోరుకునే కార్లు, విదేశీ టూర్లు, విలాసవంతంగా ఫంక్షన్లు మొదలైనవి ఇట్టే సాధ్యపడుతున్నాయి. కానీ, రుణాల మీద ఈ కలల్ని సాకారం చేసుకున్న తర్వాత మళ్లీ ఆ అప్పును తీర్చగ లిగే సత్తా ఉంటోందా అంటే.. చాలా మందికి ఉండటం లేదు. కనుక, సలహా ఏమిటంటే.. రుణాలు, క్రెడిట్ కార్డుల విషవలయంలో చిక్కుకోవద్దు. దానికి బదులుగా మీ అవసరాలు, మీ లక్ష్యాలను మదింపు చేసుకోండి. దానికి తగ్గట్లుగా నెలవారీ, త్రైమాసికాల వారీగా బడ్జెట్లు వేసుకోండి. ఏది పడితే అది కొనేయడం కాకుండా.. అవసరమైనవి, భవిష్యత్‌లోనూ ఉపయోగపడగ లిగేవి లేదా రాబడులు అందించగలిగేవి అనుకుంటేనే లోన్‌పై కొనండి. మీకు, మీ కుటుంబ శ్రేయస్సు కోసం జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలు అవసరం. అలాగే, పిల్లల చదువుల కోసం కొంత మొత్తం, మీ రిటైర్మెంట్కి మరికాస్త నిధి అవసరమవుతుంది. తక్షణ సంతోషం కలిగించే లగ్జరీ కార్లు మొదలైన వాటికన్నా దీర్ఘకాలికమైన ఈ అవసరాలకోసం జాగ్రత్త పడటం ముఖ్యం. రిస్కు సామర్థ్యంపై అంచనాకు రావడం మీరు ఎంత మొత్తం పొదుపు చేయగలరన్న దానిపై అవగాహన వచ్చిన తర్వాత.. మీ లక్ష్యాలకు అనుగుణంగా ఏయే ఆర్థిక సాధనాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చన్నది కూడా ఆలోచించాలి. అన్ని ఆర్థిక లక్ష్యాలకు సరిపోయే ఏకైక సాధనం అంటూ ఏదీ లేదు. మీరు ఏ సాధనాన్ని ఎంచుకోవాలన్నది మీరు ఎంత వరకూ రిస్కును భరించగలరు, లక్ష్య సాధనకు ఎన్నేళ్లు నిర్దేశించుకున్నారు అన్న వాటిపై ఆధారపడి ఉంటుంది. భారీ రిస్కు తీసుకోగలరు, పదేళ్ల లక్ష్యం అయితే ఎక్కువగా స్టాక్ మార్కెట్లకు అనుసంధానమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మరీ ఎక్కువగా రిస్కు ఇష్టపడని వారు డెట్ సాధనాలు ఎంచుకోవచ్చు. బ్యాలెన్స్డ్ ఫండ్స్ వంటివి కూడా అనువైనవే. అయితే, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. దీర్ఘకాలిక అవసరాల కోసం స్వల్పకాలిక సాధనాల్లోనూ.. స్వల్ప కాలిక అవసరాల కోసం దీర్ఘకాలిక సాధనాలను ఎంచుకోకండి. ఆర్థిక భరోసా కోసం పొదుపు ఆర్థిక భద్రత అంటే పొదుపు చేయడం మాత్రమే కాదు. డబ్బనేది ఎరువుల్లాంటివి. సరిగ్గా ఉపయోగిస్తేనే ఫలాలు దక్కుతాయి. మీకు, మీ కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోండి. అలాగే అత్యవసర పరిస్థితుల కోసం కొంత మొత్తం కేటాయించి ఉంచండి. రిటైర్మెంట్ కోసం ప్లానింగ్.. యవ్వనంలో ఉన్నప్పుడు ఏదీ పెద్దగా లెక్క చేయం. మంచి జీతం, ఏ బాదరబందీ లేని జీవితం అంతా బాగానే ఉంది.. రిటైర్మెంట్ గురించి ఇప్పట్నుంచే ఆలోచించడం ఎందుకు అనిపిస్తుంది. కానీ, ఇది అపోహ. రాబోయే రోజుల కోసం ముందునుంచే ప్లానింగ్ చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే రోజు రోజుకీ జీవన వ్యయం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పొదుపును ఎంత వాయిదా వేస్తే ఆ తర్వాత అంత బాధపడాల్సి రావొచ్చు. రిటైర్మెంట్ తర్వాత మరొకరి మీద ఆధారపడి జీవించాల్సి వస్తే బాధగానే ఉంటుంది. ఇలా జరగకూడదంటే సాధ్యమైనంత ముందు నుంచే ప్లానింగ్ చేసుకుంటే రిటైర్మెంట్ తర్వాత కూడా దర్జాగా ఉండొచ్చు. యవ్వనంలో ఉన్నప్పుడు మన బాధ్యతలు తక్కువగా ఉంటాయి. కనుక మరింతగా పొదుపు చేసే అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలి. ‘ఒకవేళ జీవితంలో ఇలా అయితే ఎలా, అలా అయితే ఎలా అనే ఆందోళన ఇటు మనస్సులోనూ, అటు మెదడులోనూ లేకుండా ఉండటమే ఆర్థిక స్వేచ్ఛ’ అన్నారెవరో మేధావి. కనుక, ఇలాంటి తీర్మానాలతో అలాంటి ఆర్థిక స్వేచ్ఛ సాధించే దిశగా అడుగులు వేయండి. ఆల్ ది బెస్ట్. -
ఐసీఐసీఐ ప్రు ఈజీ రిటైర్మెంట్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్తగా ఐసీఐసీఐ ప్రు ఈజీ రిటైర్మెంట్ ప్లాన్‌ను అందిస్తోంది. వినియోగదారుల పెట్టుబడి మార్కెట్ ఆటుపోట్లకు గురికాకుండా క్యాపిటల్ గ్యారంటీ ఫీచర్ ఈ యూనిట్ లింక్డ్ ప్లాన్ ప్రత్యేకత అని సంస్థ తెలిపింది. తాము భరించగలిగే రిస్క్ స్థాయిలను బట్టి షేర్లలో పెట్టుబడి పరిమితులను ఇన్వెస్టర్లు ఎంచుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. రిటైరైన తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం లభిస్తుంది.