iOS 9
-
వాట్సప్ యూజర్స్ బీ అలర్ట్
వాట్సాప్ మరో కొత్త నిబంధన తీసుకోని రాబోతుంది. ఈ నిబంధన ప్రకారం కొన్ని పాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో వాట్సప్ నిలిచిపోనున్నట్లు తెలుస్తుంది. కొన్ని ఆపిల్ ఐఫోన్లపై దీని ప్రభావం పడనుంది. ఆపిల్ పాత ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లతో కూడిన ఐఫోన్లలో వాట్సాప్ ఇకమీదట పనిచేయదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఆండ్రాయిడ్ 4.0.3 కన్నా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లతో కూడిన స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు. వాట్సప్ తీసుకున్న తాజా నిర్ణయంతో లైనక్స్ కేఈఐఓఎస్ 2.5.1 ఆపరేటింగ్ సిస్టమ్స్ కన్న పాత ఫోన్లలో ఇది పని చేయదు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడటానికి తప్పనిసరిగా యూజర్లు మీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసుకోవడం ఉత్తమం. ఆపిల్ ఐఫోన్లో సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసుకోవాలి. చదవండి: రూ.1.97లక్షల కోట్ల ఎలాన్ మస్క్ సంపద ఆవిరి ప్రపంచ తొలి 18జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ విడుదల! -
వాట్సాప్ లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఇవే!
ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్. వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది. గ్రూపుల్లో వరుసగా మెసేజ్‌లు వస్తున్నట్లుగా ఫీచర్లు వరుస కడుతున్నాయి. అందుకే ఈ వారంలో వచ్చిన వాట్సాప్‌లో తీసుకురాబోయే కొత్త ఫీచర్లతో పాటు, ఇతర సమాచారం గురించి తెలుసుకుందాం.(చదవండి: కొత్త సాంకేతికతను పరిచయం చేసిన ఒప్పో) ప్రస్తుతం వాట్సాప్ యూజర్లు కేవలం మొబైల్ యాప్ ద్వారా మాత్రమే వాయిస్, వీడియో కాల్స్ చేసుకొనే సదుపాయం ఉంది. ఇప్పుడు ఈ ఫీచర్ ని వాట్సాప్ వెబ్ వెర్షన్ లకు కూడా తీసుకురానున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఇప్పటికే ఈ సదుపాయం బీటా యూజర్లకు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. త్వరలో మిగతా వినియోగదారులకు కూడా తీసుకురానున్నట్లు పేర్కొంది. వాట్సాప్ గత నెలలో భారతదేశంలో వాట్సాప్ పే సేవలను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వారంలో జరిగిన ఫేస్బుక్ యొక్క ఫ్యూయల్ ఫర్ ఇండియా 2020 సమావేశంలో వాట్సాప్ యూజర్లు ఇప్పుడు ఎస్బిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ ఖాతాల ద్వారా కూడా వాట్సాప్ పే సేవలను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చని ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌లో 50 మిలియన్లకు పైగా వినియోగదారులు భాగస్వామ్యం అయ్యారని మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. వీరిలో దాదాపు 15 మిలియన్ల మంది వినియోగదారులు భారతదేశం నుండే ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుండి ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆధారిత ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నట్లు సంస్థ ప్రకరించింది. నిషేదిత ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఫోన్ల జాబితాలో ఆండ్రాయిడ్ 4.3 లేదా అంతకంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్, ఐఓఎస్ 9 లేదా అంతకంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ గల మొబైల్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నట్లు సంస్థ ప్రకటించింది. -
'ఒక్క ట్యాబ్‌లో రెండు స్క్రీన్లు.. చిత్రంలో సిత్రం'
చేతిలో ఒక్కటే ట్యాబ్.. ఒక్కటే ఫోన్.. వాటికి ఉండేది ఒక్కటే స్క్రీన్.. కానీ, వాటిల్లో రెండు స్క్రీన్ లు ఉంటే, ఓ పక్క వీడియో చూస్తూనే దానికి ఎలాంటి భంగం కలగకుండా అదే స్క్రీన్ పై మరో పక్క నెట్ ఆన్ చేసుకునే అవకాశం వస్తే.. మొబైల్, ట్యాబ్ వర్షన్లలో నిత్యం కొత్త ప్రయోగాలు చేస్తూ అగ్రస్థానంలో నిలిచిన ఆపిల్ సంస్థ మరో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ట్యాబ్, మొబైల్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా ఒక యాప్ ద్వారా ఒక అంశాన్ని వెతుకుతూ ఉండి మధ్యలో వేరేది అవసరం ఉంటే తిరిగి వెనకకు వెళ్లి మరో యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే, ఇకపై అలాంటి అవసరమే లేకుండా నేరుగా ఒక ట్యాబ్ స్క్రీన్‌ను రెండు విభాగాలుగా(స్ప్లిట్) చేసుకొని బహుళ(మల్టీటాస్క్) కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఐఓఎస్ 09 ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త మోడల్ ఐఓఎస్ 09 ల ద్వారా ట్యాబ్స్లలో రెండు యాప్‌లను ఒకేసారి రన్ చేసుకోవచ్చు. ఒక ఐపాడ్‌పై ఇలాంటి వెసులు బాటు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. అయితే, ఇది కేవలం ఆపిల్ ఐపాడ్ ఎయిర్ 2, ఐపాడ్ ప్రో, ఐపాడ్ మిని 4 లో మాత్రమే సాధ్యమవుతుంది. ఉదాహరణకు ఒకసారి ట్యాబ్ ఆన్ చేసి ఏదైనా యాప్ ద్వారా ఓ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడూ మధ్యలో మరో అంశం కావాల్సి వస్తే అదే స్క్రీన్ పై కుడిపక్కన ఉండే ఆప్షన్(స్ప్లిట్ వ్యూ) ను క్లిక్ చేయడం ద్వారా మొత్తం స్క్రీన్ లోని మూడో వంతు భాగం దానంతట అదే రెండో యాప్ కోసం ఓపెన్ అవుతుంది. దీంతో మనకు రెండు ప్రోగ్రాంలు ఒకే స్క్రీన్ పై పక్కపక్కనే చూసుకుంటూ తేలికగా వేగంగా పని పూర్తి చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇలా ఫొటోలు, వీడియోలు కూడా పక్కపక్కనే చూసే అవకాశం కలుగుతుంది. దీంతోపాటు ప్రతి అంశాన్ని కూడా అదే తెరపై పెద్దగా చిన్నగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓ పక్క వీడియోలు చూస్తూనే దానికి ఏమాత్రం భంగం కలగకుండా మరోపక్క ఇంటర్నెట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉన్న ఈ ఐఓఎస్ 09 అమితంగా ఆకర్షించనుంది.