Irani
-
స్మతి ఇరానీ.. వివాదాల మహారాణి..!
న్యూఢిల్లీః కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీపై విదేశీ మీడియా విమర్శనాస్త్రాలు గుప్పించింది. ఆమె ఓ పవర్ ఫుల్ మంత్రే కాదు వివాదాల మహరాణి అంటూ ఛలోక్తులు విసిరింది. మీలో ఏ లక్షణాలను గుర్తించి మీకు ప్రధాని నరేంద్రమోదీ మంత్రి పదవిని ఇచ్చారన్న ఓ టెలివిజన్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించిన తీరు.. మరోసారి వివాదాన్ని తెచ్చిపెట్టింది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా స్టూడియోలో ప్రేక్షకుల ముందు ఆమె అదే ప్రశ్నను పునరావృతం చేసి అక్కడివారిని రెచ్చగొట్టిన తీరుపై ఫారెన్ మీడియా మండి పడుతోంది. ఇప్పటికే నకిలీ డిగ్రీ ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి స్మతి ఇరానీపై విదేశీ మీడియా విమర్శలు ఎక్కుపెట్టింది. ఓ టీవీ స్టూడియోలో ఆమె ప్రవర్తించిన తీరును తప్పుపడుతోంది. టీవీ స్టూడియోలో స్మృతిని పాత్రికేయుడు అడిగిన ప్రశ్ననే... ఆమె రిపీట్ చేసి.. అక్కడున్న వారిని రెచ్చగొట్టడంతో వారంతా సదరు జర్నలిస్టుపైకి దూసుకొచ్చి.. దాదాపు కొట్టినంత పనిచేసిన నేపథ్యంలో విదేశీ మీడియా విరుచుకుపడుతోంది. మీలో ఎటువంటి లక్షణాలను గుర్తించి మీకు మంత్రి పదవి ఇచ్చారంటూ సదరు జర్నలిస్టు అడిగిన ప్రశ్న ఆమెలో ఆగ్రహాన్ని తెప్పించిందో.. లేదా ఉద్దేశపూర్వకంగానే ఆమె ఆలా ప్రవర్తించిందో తెలియదు గానీ... అతడు అడిగిన ప్రశ్ననే స్టూడియోలోని ప్రేక్షకులముందు రిపీట్ చేసింది. దీంతో రెచ్చిపోయిన అక్కడి జనం.. కుర్చీలపైనుంచి దూకి.. వేదికపైకి దూసుకొచ్చిన పాత్రికేయుడ్ని కొట్టినంత పని చేశారు. అయితే అంతటి వ్యతిరేకత వస్తుందని ఆమె అనుకుందో లేదో గాని... వారి అభిమానానికి ఓ పక్క ఆనందించినా పరిస్థితులు అదుపు తప్పడంతో స్టేజిపైకి వచ్చిన వారిని వారించి, సదరు జర్నలిస్టును కొట్టకుండా కాపాడింది. ప్రముఖ రాజకీయ నాయకురాలు, నరేంద్రమోదీ ప్రభుత్వంలో మానవవనరుల శాఖామంత్రిగా కొనసాగుతున్న 40 ఏళ్ళ స్మృతి ఇరానీ.. తన విద్యార్హతల విషయంలో ఇప్పటికే పలు వివాదాలు ఎదుర్కొంటున్నారు. ప్రఖ్యాత టీవీ నటిగా ఎన్నో అవార్డులు, రివార్డులూ అందుకున్న ఆమె... రాజకీయాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకొన్నారు. దీనికి తోడు ఎప్పుడూ తన పదునైన ప్రసంగాలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం కూడ ఆమెలోని మరో ప్రత్యేకతగా చెప్పాలి. లోక్ సభ, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కేంద్రమంత్రి... ఎన్నికల కమిషన్ కు సమర్పించిన మూడు అఫిడవిట్లలో తన విద్యార్హతలు ఒక్కోదాంట్లో ఒక్కో విధంగా ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమెను మంత్రి పదవినుంచీ తొలగించాలన్న డిమాండ్లుకూడ వెల్లువెత్తాయి. ఫిబ్రవరి నెలలో జరిగిన సుమారు 42 విశ్వవిద్యాలయాలకు చెందిన అధిపతుల సమావేశంలోనూ స్మృతి ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు ఆమెను ఫోటో తీయాలని చూసిన ఓ ప్రొఫెసర్ ను దురుసుగా తోసేయడంకూడ పెద్ద దుమారమే రేపింది. అయితే ఆమె అజ్ఞానం, అహంకారం కలసి ప్రమాదకరంగా మారుతున్నాయంటూ అప్పట్లో రామచంద్ర గుహ అనే ఓ రాజకీయ చరిత్రకారుడు సైతం విమర్శించడం విశేషం. ఏదై ఏమైనా స్మృతి ఇరానీ ఇప్పుడు విదేశీ మీడియా దృష్టిలో పడి మరోసారి వివాదాలు ఎదుర్కొంటున్నారు. -
స్మృతికి షాకిచ్చిన సర్వే ఫలితాలు!
న్యూఢిల్లీః ప్రముఖులను, పెద్దలను గౌరవించడం.. ఇరర వ్యక్తులకు మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం ముఖ్యంగా భారతదేశంలో పురాతన కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం. ఇటీవల బిహార్ విద్యామంత్రి అశోక్ చౌదరి.. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీని డియర్ అంటూ సంబోధించడం ట్విట్టర్లో వివాదం రేపింది. దీంతో డియర్ వాడొచ్చా లేదా అన్న విషయంపై ఓ జాతీయ మీడియా సంస్థ సర్వే చేసింది. ఎంతమందిని సర్వే చేశామన్న విషయం వాళ్లు చెప్పలేదు గానీ.. ఎక్కువ శాతం మంది 'డియర్' అనొచ్చనే చెప్పారన్నారు. ఇటీవల బిహార్ లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీపై, ఆ రాష్ట్ర విద్యామంత్రి చౌదరి ట్విట్టర్ లో ''డియర్ స్మృతి ఇరానీ గారూ... మీరు రాజకీయ ప్రసంగాలపై కాకుండా నూతన విద్యావిధానంపై దృష్టిసారిస్తే బాగుంటుంది'' అంటూ రాయడంతో వివాదం తలెత్తింది. చౌదరి కామెంట్ కు స్పందించిన స్మృతి ఇరానీ.. మీరు మహిళలను ఇలా డియర్ అంటూ సంబోధించడం ఎప్పుడు మొదలుపెట్టారంటూ అడిగారు. దీంతో ప్రొఫెషనల్ ఈ మెయిల్స్ పంపేటప్పుడు డియర్ అని రాస్తారు, నేనన్నది తప్పేమీ కాదంటూ చౌదరి సమర్థించుకున్నారు. మహిళలను డియర్ అని పిలవడం సెక్సిస్ట్ రిమార్క్ అవుతుందా అని, కొత్తగా మహిళలకు లేఖ రాయాల్సినపుడు ఎలా సంబోధిస్తే బాగుంటుంది? ఎలా ముగిస్తే బాగుంటుంది? అంటూ మూడు ప్రశ్నలు సర్వేలో భాగంగా జాతీయ మీడియా సంస్థ సంధించింది. అనంతరం మీడియా సంస్థకు వచ్చిన సమాధానాలు ఆసక్తికరంగా మారాయి. సెక్సిస్ట్ రిమార్క్ అవుతుందా అన్న ప్రశ్నకు అవును అన్నసమాధానం 18 శాతం మంది నుంచి వస్తే, 82 శాతం మంది కాదు అనడం విశేషం. అలాగే లేఖ రాసేప్పుడు డియర్ అంటూ సంబోధించడాన్ని 35 శాతం మంది సమర్థించగా, 31 శాతం మంది హాయ్ అంటే బాగుంటుందని, 30 శాతం మంది హల్లో అంటే బాగుంటుందని సమాధానం ఇచ్చారు. ముగింపులో రిగార్డ్స్ అనాలని 69 శాతం మంది, యువర్స్ సిన్సియర్లీ లేదా ఫెయిత్ ఫుల్లీ అనాలని 16శాతం మంది, ఆల్ ది బెస్ట్, ఛీర్స్ అంటే బాగుంటుందని 15 శాతం మంది సూచించారు. -
మావి కాదు.. వారివే గాలిమాటలు!
న్యూఢిల్లీ: సీడబ్ల్యూసీ భేటీలో ప్రధానిమోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శలు గుప్పించడంపై బీజేపీ స్పందించింది. సోనియా రాజకీయంగా తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. భూ ఆర్డినెన్స్‌పై ప్రభుత్వం వెనక్కు తగ్గడం వెనుక రాహుల్ పోరాటం ఉందంటూ సోనియా ప్రశంసించడంపై.. ఇటీవలి అమేథీ భూ వివాదాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ ‘అమేథీలో రైతుల భూమిని దురాక్రమించుకున్న కొడుకును భుజం తట్టి ప్రోత్సహించినట్లుగా’ ఉందన్నారు. మోదీవి కావని, రైతుల పాలిట దేవుడిగా తనను తాను అభివర్ణించుకున్న రాహుల్ గాంధీవే అసలైన గాలి మాటలని విమర్శించారు. విశ్రాంత సైనికుల ఒకే హోదా.. ఒకే పెన్షన్ డిమాండ్‌పై 40 ఏళ్లు గాలిమాటలు చెప్పింది కాంగ్రెసేనన్నారు. యూపీఏ స్కామ్‌లను ప్రస్తావిస్తూ.. ‘ఖజానాను ఖాళీ చేసినవారు, దేశాన్ని తిరిగి అభివృద్ధి బాటన నిలిపిన మోదీని విమర్శించడం హాస్యాస్పదమ’న్నారు. రాహుల్ గాంధీని బీజేపీ పట్టించుకోబోదని చెబుతూ.. తాను అమేథీలో కేవలం 20 రోజులు ప్రచారం చేసి ఆయన మెజారిటీని చాలావరకు తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. -
కేంద్ర మంత్రి లెటర్ హెడ్లో అక్షర దోషాలు
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తన పేరుతో ఇచ్చిన లెటర్ హెడ్లో దొర్లిన తప్పులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సంబంధిత అధికారలను వివరణ కోరారు. స్మృతి ఇరానీ జూలై 11న తన పేరు మీద ఇచ్చిన లెటర్ హెడ్లో ఇంగ్లీష్, హిందీ భాషల్లో మంత్రి పదంలో అక్షర దోషాలు దొర్లాయి. దీంతో తప్పులను గుర్తించి ఉన్న ఆ లెటర్ హెడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కొందరు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సమాధానంగా 'నా పేరును నేను తప్పుగా హిందీలో రాయనని దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరుతాను' అని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. అయితే తప్పు మీ పేరులో కాదు మినిస్టర్ అన్న పదంలో అని తిరిగి ట్విట్లు చేశారు. @rai_saurabh100 no it's not Saurabh. Would not misspell my own name in Hindi. Have asked concerned organisation to give an explanation. — Smriti Z Irani (@smritiirani) August 21, 2015 -
ఫ్యాబ్ ఇండియా షోరూమ్ ఎండీ, సీఈవోకు సమన్లు జారీ
గోవా: గోవాలోని ఫ్యాబ్ ఇండియా షోరూమ్ లో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ఎదురైన చేదు అనుభవం ఘటనకు సంబంధించి ఆ షోరూమ్ ఎండీ, సీఈవోలకు సమన్లు జారీ చేశారు. ఈ ఘటనపై స్మృతీ ఇరానీ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తాజాగా ఆ షోరూమ్ కు సమన్లు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా మరో ఏడుగురి ఉద్యోగులపై కూడా సమన్లు అందాయి. త్వరలో వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు. అంతకుముందు ఈ కేసులో అరెస్టయిన నలుగురికి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
‘కెమెరా’ వివాదం ఎందుకు చల్లారింది?
స్మృతి వ్యవహారంలో బీజేపీ కావాలనే అంటీముట్టనట్టు వ్యవహరించిందా పణజి: గుడ్‌ఫ్రైడే రోజు దేశం దృష్టిని ఆకర్షించిన ఆ వివాదం ‘ఈస్టర్ సండే’కల్లా ఎందుకు చప్పున చల్లారింది? గోవాలోని ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణం ట్రయల్ రూంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రహస్య కెమెరాను గుర్తించడంతో రోజంతా దానిపైనే తీవ్ర చర్చ జరిగింది. ప్రసార సాధనాలు దీనికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చాయి. కానీ సొంత ఎంపీ, కేంద్రమంత్రికి ఈ చేదు అనుభవం ఎదురవడంపై బీజేపీ నాయకత్వం పెద్దగా స్పందించలేదు. ఈ వ్యవహారంలో అంటీముట్టనట్టుగానే వ్యవహరించింది. అదే రోజు (శుక్రవారం) బెంగళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవడం ఇందుకు కారణమని మీడియాలో కథనాలు వచ్చాయి. సమావేశాలకు మీడియాలో దక్కాల్సిన ప్రాధాన్యాన్ని ఈ ‘కెమెరా’ వివాదం లాగేసుకుంటుందని భావించిన బీజేపీ.. కావాలనే దీనిపై అంతగా స్పందించలేదన్నది ఆ కథనాల సారాంశం. వాస్తవానికి శుక్రవారం స్మృతి ఇరానీ కండోలిమ్‌లోని ఫ్యాబ్ ఇండియాలో కెమెరాను గుర్తించగానే పోలీసులొచ్చి నలుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు. షాపును సీజ్ చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామంటూ గోవా సీఎం పార్సేకర్ దర్యాప్తునకు ఆదేశించారు. తెల్లారేసరికి సీన్ మారింది! కెమెరాల ఉదంతం వెలుగులోకి వచ్చిన తెల్లారే సీన్ మారింది. బీజేపీ సమావేశాలకు మీడియాలో ప్రాధాన్యం తగ్గిపోతుందని బీజేపీ నేతలు ఈ విషయానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడమే మంచిదని భావించారు. సీఎం పార్సేకర్ గొంతు సవరించుకున్నారు. ‘‘ రూంలోకి స్మృతి కంటే ముందు కొందరు మహిళలు వెళ్లారు. కావాలని కెమెరాలు పెట్టినట్టు లేదు. అనుకోకుండా అలా జరిగి ఉండొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. గోవా పేరును చెడగొట్టవద్దంటూ మీడియాకు ఉచిత సలహా ఇచ్చారు. ఆ తర్వాత సీన్లోకి బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి వచ్చారు. ఈ ఘటనలో బీజేపీ వైఖరిని ఆమె పరోక్షంగా బయటపెట్టారు. ‘‘పనికిరాని అంశాలను ముందుకు తీసుకువచ్చి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా..’’ అని ఆమె ట్వీటర్లో పేర్కొన్నారు. గోవాలోనూ గప్‌చుప్.. అదే రోజు గోవాలో కూడా ఈ ఘటన ప్రాధాన్యాన్ని తగ్గించి వేసే పరిణామాలు చకచకా చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు ఫ్యాబ్ ఇండియా ఉద్యోగులకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5వేల పూచీకత్తుతో వారికి బెయిలిచ్చింది. స్మృతి ఇరానీకి ఫ్యాబ్ ఇండియా క్షమాపణలు తెలిపింది. గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు దుకాణంపై సానుకూలంగా స్పందించారు. షాపు ప్రతినిధులు తమకు సహకరిస్తున్నారని, తమ ముందు హాజరయ్యేందుకు కొంత సమయం అడిగారని ప్రకటించారు. అలా వివాదం శనివారం కల్లా కోమాలోకి వెళ్లిపోయింది! -
నన్నూ ఇంటర్వ్యూ చేశారు!
న్యూఢిల్లీ: స్కూల్లో పిల్లల్ని చేర్పించాలంటే.. సవాలక్ష రూల్స్.. అమ్మానాన్నలకు ఇంటర్వ్యూలు.. ఈ ఇంటర్వ్యూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి కూడా తప్పలేదు. తన ఇద్దరు పిల్లల్ని ఢిల్లీలోని ఓ స్కూల్లో చేర్పించే సమయంలో టీచర్లు తనను ఇంటర్వ్యూ చేశారని, అందులో పాసయ్యాకే అడ్మిషన్ దొరికిందని ఆమె చెప్పారు. ఓ మంత్రిలా కాకుండా అందరి తల్లుల్లాగే ప్రశ్నలకు బదులిచ్చానన్నారు. -
నేను పట్టభద్రురాలినే!
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టీకరణ న్యూఢిల్లీ: తీవ్ర వివాదానికి దారితీసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హత వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నట్టు ఆమె తెలిపారు. శనివారమిక్కడ ‘ఇండియాటుడే మహిళా సదస్సు-2014’లో ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా.. ‘నేను పట్టభద్రురాలినే. ప్రతిష్టాత్మక యేల్ వర్సిటీ డిగ్రీ చదివాను’ అని చెప్పారు. అయితే, డిగ్రీలో ఏ సబ్జెక్టు చదివారో మాత్రం చెప్పలేదు. గత ఏడాది జూన్ 19న యేల్ వర్సిటీ క్యాంపస్‌లో ఆరు రోజుల పాటు జరిగిన లీడర్షిప్ కార్యక్రమంలో ఇరానీ సహా 11 మంది ఎంపీలు పాల్గొన్నారు. వీరిలో టీడీపీకి చెందిన ఎంపీ సి. రమేష్ ఉన్నారు. కాగా, ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్ వివాదంపై అడిగిన ప్రశ్నపై మంత్రి ఇరానీ మండిపడ్డారు. ‘2004, 2014నాటి అఫిడవిట్లలో ఏది నిజమైందో తెలుసుకోవాలంటే కోర్టులో నాపై పిటిషన్ వెయ్యి. సమాధానం కోర్టులోనే చెబుతా’ అని ఇండియాటుడే కార్యక్రమ నిర్వాహకుడితో అన్నారు.