Iraqi
-
ఘోరం: వివాహ వేడుకలో అగ్ని వర్షం.. వీడియో వైరల్..
ఇరాక్‌లో దారుణం జరిగింది. ఓ వెడ్డింగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 100 మందికిపైగా మృతి చెందారు. 150 మంది గాయపడ్డారు. దక్షిణ ఇరాక్‌లోని కరాకోష్ గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన వివాహ వేదికలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. Video shows the aftermath of the fire in a wedding hall in Hamdaniyah 110 dead including bride and groom 550 injured #Iraq #Hamdaniyah #Fire pic.twitter.com/2duD5vmoks — North X (@__NorthX) September 27, 2023 వెడ్డింగ్ కార్యక్రమాలు ఘనంగా ఏర్పాటు చేశారు. జనం కూడా భారీ సంఖ్యలోనే హాజరయ్యారు. వధువరులు ఎంతో ఘనంగా ముస్తాబై వేదిక ఎక్కారు. మిరిమిట్లు గొలిపే కాంతి వెలుగుల మధ్య స్టెప్పులు వేశారు. ఇంతలోనే వేదిక పై భాగంలో ఏర్పాటు చేసిన ఫ్లవర్ వంటి డెకరేషన్‌కు మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ కమ్ముకోగా.. ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. #Update Watch till end Fire at a wedding in Iraq kills at least 100, injures 150 #Wedding #celebration #fire #Hamdaniya #Nineveh #Iraq #Viral #ViralVideo pic.twitter.com/m4pmdLHiNv — ANSHULGAUTAM (@ANSHUL__GAUTAM) September 28, 2023 వేదిక పైభాగం నుంచి అగ్ని వర్షం కురిసిన మాదిరిగా మంటలు కిందికి దూసుకొచ్చాయి. ఏర్పాటు చేసిన డెకరేషన్ విభాగాలు మంటల్లో కాలి కిందపడ్డాయి. జనం ఆహాకారాలతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 100 మంది చనిపోగా.. 150 మంది గాయపడ్డారు. నాసిరకమైన డెకరేషన్ వస్తువుల వల్లే ఇదంతా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేదిక నిర్మాణంలో మండే స్వభావం ఉన్న డెకరేషన్ ఐటమ్స్‌ను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. Tragedy at a wedding in Iraq, was caused by "gross negligence" and "security failures", according to the government investigation. Fire resulted in more than 100 deaths.#Irak #Iraq #الحمدانية #نينوى #hamdaniya pic.twitter.com/yYUZe1K0Qa — NewsAlerts Global (@NewsAlertsG) October 2, 2023 ఇదీ చదవండి: Pakistan Earthquake Prediction: పాకిస్తాన్‌కు భారీ భూకంపం ముప్పు? -
కాలినడక: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలో మీటర్లు
లండన్: కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత పవిత్ర హజ్ యాత్ర తిరిగి పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. జీవితంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేపట్టాలని ముస్లిం సోదరులు భావిస్తుంటారు. అయితే.. ఓ వ్యక్తి పలు దేశాలు దాటి వేల కిలోమీటర్లు నడిచి హజ్‌కు చేరుకున్నారు. ఇరాక్‌లోని కుర్దిష్ మూలాలనున్న బ్రిటిషనర్.. అడమ్ మొహమ్మద్(52) ఈ సాహసం చేసి తన కోరికను నెరవేర్చుకున్నారు. ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్న అడమ్ మొహమ్మద్.. ఇంగ్లాండ్‌లోని వొల్వెర్‌హంప్టన్ నుంచి సుమారు 6,500 కిలోమీటర్లు నడిచి మక్కాకు చేరుకున్నారు. 10 నెలలు.. 9 దేశాలు.. హజ్ యాత్రకు బయలుదేరిన అడమ్ మొహమ్మద్.. నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ, లెబనన్, జోర్డన్ దేశాల మీదుగా సౌదీ అరేబియాకు చేరుకున్నారు. 10 నెలల 25 రోజుల్లో మొత్తం 6,500 కిలోమీటర్లు నడిచారు. తన యత్రను గత ఏడాది 2021, ఆగస్టు 1న ప్రారంభించిన అడమ్.. ఈ ఏడాది జూన్‌లో గమ్యాన్ని చేరుకున్నారు. ఆల్ జజీరా న్యూస్ ప్రకారం.. అడమ్ రోజుకు సగటున 17.8 కిలోమీటర్లు నడిచారు. సుమారు 300 కిలోల సామగ్రితో కూడిన తోపుడు బండిని తోసుకుంటూ తన యాత్రను సాగించారు. ఆ బండికి మ్యూజిక్ స్పీకర్లు అమర్చి ఇస్లామిక్ పాటలు వింటూ నడిచినట్లు చెప్పుకొచ్చారు అడమ్. శాంతి, సమానత్వంపై ప్రజలకు సందేశం అందించాలనే తాను ఇలా కాలినడకన యాత్ర చేపట్టానన్నారు. ఆన్‌లైన్‌లోనూ గోఫన్‌మీ పేజ్‌ను ఏర్పాటు చేశారు. 'ఇది నేను డబ్బు, పేరు కోసం చేయటం లేదు. ప్రపంచంలోని మనుషులంతా సమానమనే విషయాన్ని ఎత్తిచూపాలనుకుంటున్నా. ఇస్లాం బోధిస్తున్న శాంతి, సమానత్వ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలనుకుంటున్నా.' అని అందులో రాసుకొచ్చారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత పవిత్ర హజ్ యాత్ర ప్రారంభమైంది. ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది ముస్లింలు హజ్ సందర్శించుకునేందుకు సౌదీ అరేబియా అనుమతించింది. 2020, 2021లో కేవలం సౌదీ అరేబియా పౌరులను మాత్రమే అనుమతించారు. ఈ ఏడాది జులై 7న ఈ హజ్ యాత్ర మొదలైంది. ఇదీ చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
కీలక నిర్ణయం తీసుకున్న ఇరాక్ పార్లమెంట్
-
పెళ్లికి నిరాకరించిందని ఘాతుకం
సాన్ ఆంటోనియో : తాము తీసుకొచ్చిన సంబంధాన్ని కాదన్నందుకు కూతురి ముఖంపై కాగుతున్న నూనె పోసి దాడి చేసిన సంఘటనలో తల్లిదండ్రులను అరెస్టు చేసినట్టు సాన్ ఆంటోనియో పోలీసు అధికారులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం ఇరాక్‌కు చెందిన ఒక కుటుంబం రెండు సంవత్సరాల క్రితం అమెరికాకు వలస వచ్చి సౌత్ టెక్సాస్‌లో నివాసం ఉంటున్నారు. వారు తమ 16 సంవత్సరాల కూతురు వివాహాన్ని ఒక మధ్యవయస్కుడితో నిశ్చయించారు. అందుకు గాను అతడి వద్ద నుంచి 20 వేల అమెరికన్ డాలర్ల సొమ్ము కూడా తీసుకున్నారు. కానీ వారి కుమార్తె ఈ వివాహానికి ఒప్పుకోకపోవడంతో కోపించిన తల్లిదండ్రులు బాలికను కొట్టి, ఆమె మీద వేడి వేడి నూనె పోశారు. తల్లిదండ్రుల చర్యలతో బయపడిన బాలిక ఇంటినుంచి పారిపోయింది. ఈ సంఘటన జనవరి 30న జరిగింది. ఇంటినుంచి పారిపోయిన ఆ బాలికను గుర్తించామని, ఆమెను తన ఐదుగురు తోబుట్టువులతో పాటు పిల్లల సంరక్షణ విభాగంలో ఉంచినట్లు పోలీసు అధికారి బెక్సార్ కౌంటి షేరిఫ్ జేవీయర్ సలజార్ వెల్లడించారు. బాలిక తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ఐసిస్ చీఫ్ పారిపోయాడు..
-
ఐసిస్ చీఫ్ పారిపోయాడు..
బాగ్దాద్: ఇరాక్‌లోని మోసుల్ నగరం నుంచి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ పారిపోయాడని బ్రిటన్ వెల్లడించింది. బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బోరిస్ జాన్సన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఐఎస్ ఉగ్రవాదులను ఉద్దేశిస్తూ బాగ్దాదీ మాట్లాడిన ఆడియోను గురువారం విడుదల చేసినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. మోసుల్ కోసం చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తామనే నమ్మకముందని, ఇరాక్ భద్రత దళాలపై పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా బాగ్దాదీ తన అనుచరులను ఆదేశించాడు. ఇరాక్ దళాలను ఎదుర్కోవడంలో వెనుకంజవేయవద్దని సూచించాడు. దీన్నిబట్టి బాగ్దాదీ మోసుల్ నుంచి మరో సురక్షిత ప్రాంతానికి వెళ్లాడని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపినట్టు బోరిస్ జాన్సన్ వెల్లడించారు. మోసుల్ నగరం 2014 నుంచి ఐఎస్ ఉగ్రవాదుల స్వాధీనంలో ఉంది. ఈ నగరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకోవడం కోసం ఇరాక్ భద్రత బలగాలు పోరాటం చేస్తున్నాయి. దీంతో భద్రత దళాలకు, ఐఎస్ ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఐఎస్ ఉగ్రవాదులు.. పిల్లలు, మహిళలు సహా వేలాదిమందిని బంధించి, ఇరాక్ భద్రత బలగాలతో పోరాటంలో వారిని మానవ కవచాల్లా వాడుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మోసుల్ నగరంలో 3 వేలమంది నుంచి 5 వేలమంది వరకు ఐఎస్ ఉగ్రవాదులు ఉండవచ్చని అమెరికా సంకీర్ణ దళాలు అంచనా వేస్తున్నాయి. -
బాగ్దాద్‌లో ఆత్మాహతి దాడి, 14 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బాగ్దాద్ ఉత్తర ప్రాంతంలోని జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 14 మంది మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పోలీసులు, పదిమంది పౌరులు ఉన్నారు. సెక్యూరిటీ చెక్ పాయింట్‌పై బాంబర్ దాడికి పాల్పడ్డాడు. బాగ్దాద్ పశ్చిమ శివారు ప్రాంతంలో ఓ మార్కెట్లో బాంబు పేలిన ఘటనలో మరో ముగ్గురు పౌరులు మరణించగా, 11 మంది గాయపడ్డారు. కాగా ఈ దాడులు చేసింది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. -
బాంబు పేలుళ్లు : 13 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం ఆత్మాహుతి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో 13 మంది మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. గత అర్థరాత్రి ఉత్తర బాగ్దాద్‌లోని అల్ అడాల క్యాంప్ సమీపంలో కారులో ఉన్న వ్యక్తి తనకు తాను పేల్చివేసుకున్నాడు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించగా, 30 మంది గాయపడ్డారు. అలాగే పశ్చిమ బాగ్దాద్‌లో ఇస్కాన్ ప్రాంతంలో మరో కారు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. -
ఇరాక్ లో మరో ప్రధాన నగరం సున్నీల వశం!
బాగ్గాద్: ఇరాక్ లో సున్నీ మిలిటెంట్ల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఎలాంటి తీవ్ర ప్రతిఘటన లేకుండానే ప్రధాన స్థావరాలన్ని సున్నీల వశమవుతున్నట్టు సమాచారం. తాజాగా అంబర్ ప్రాంతంలోని ప్రధాన పట్టణాన్ని సున్నీలు ఆక్రమించుకున్నారని వాయువ్య బాగ్దాద్ మేయర్ తెలిపారు. స్థానిక సైన్యాన్ని, పోలీస్ బలగాలను ఆధిపత్యం కొనసాగించి.. సున్నీ మిలిటెంట్లు తమ ఆధీనంలోకి తెచ్చకున్నారని మేయర్ తెలిపారు. అంబర్ లోని ప్రభుత్వ కార్యాలయాలను, 275 కిలోమీటర్ల యూఫరేట్స్ నదిని మిలిటెంట్లు ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది.