బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బాగ్దాద్ ఉత్తర ప్రాంతంలోని జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 14 మంది మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పోలీసులు, పదిమంది పౌరులు ఉన్నారు. సెక్యూరిటీ చెక్ పాయింట్పై బాంబర్ దాడికి పాల్పడ్డాడు.
బాగ్దాద్ పశ్చిమ శివారు ప్రాంతంలో ఓ మార్కెట్లో బాంబు పేలిన ఘటనలో మరో ముగ్గురు పౌరులు మరణించగా, 11 మంది గాయపడ్డారు. కాగా ఈ దాడులు చేసింది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.