బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం ఆత్మాహుతి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో 13 మంది మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
గత అర్థరాత్రి ఉత్తర బాగ్దాద్లోని అల్ అడాల క్యాంప్ సమీపంలో కారులో ఉన్న వ్యక్తి తనకు తాను పేల్చివేసుకున్నాడు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించగా, 30 మంది గాయపడ్డారు. అలాగే పశ్చిమ బాగ్దాద్లో ఇస్కాన్ ప్రాంతంలో మరో కారు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.