పెళ్లికి కానుకగా చెక్కు!
పెద్దపల్లి: పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెళ్లిళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. వధువరుల తల్లిదండ్రులు పెళ్లి ఖర్చులకు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే....పెళ్లికి విచ్చేసిన అతిథుల ఇబ్బందులు మరో రకంగా ఉన్నాయి. శుభకార్యానికి హాజరైతే తప్పనిసరిగా కానుక ఇస్తుంటాం. ప్రస్తుతం నోట్ల రద్దుకు తోడు నెల ప్రారంభసమయం కావడంతో చిన్నపాటి ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది.
తాజాగా పెద్దపల్లిలోని బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి హాజరైన కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ ఈర్ల సురేందర్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. పెళ్లి కూతురు సుహాసినికి కానుకగా నగదు ఇవ్వడానికి తన దగ్గర లేకపోవడంతో రూ.5వేల చెక్కును అందజేశారు. ఒకటిన జీతం తీసుకునేందుకు పెద్దపల్లి బ్యాంకుకు వెళ్లాడు. క్యూలైన్ పొడవుగా ఉండడంతో, ఆయన వెంటనే చెక్ తెప్పించి కానుక ఇచ్చారు.