ISI agent
-
ప్రేమికురాలు కాదా..పాకిస్థాన్ గూఢాచారా..?
-
హనీట్రాప్స్ కోసం ప్రాజెక్ట్ షేర్నీ!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని త్రివిధ దళాలు, రక్షణ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సైంటిస్టులను హనీట్రాప్ చేయడానికి పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ‘ప్రాజెక్టు షేర్నీ’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో పని చేయడానికి 300 మంది ఆకర్షణీయమైన యువతులను ఎంపిక చేసుకుని వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. డీఆర్డీఓలో పని చేస్తున్న ఓ సీనియర్ సైంటిస్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో, కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఇంజినీర్ దుక్కా మల్లికార్జున్ రెడ్డి శుక్రవారం అరెస్టు అయ్యారు. వీరిద్దరూ ప్రాజెక్ట్ షేర్నీలో పని చేస్తున్న యువతుల వల్లో చిక్కి రహస్య సమాచారం చేరవేశారు. షేర్నీ అంటే ‘ఆడసింహం’ అని అర్థం. ఆరు నెలల పాటు వివిధ అంశాల్లో శిక్షణ.. వీరంతా తమ తమ ప్రాంతాల్లోనే ఉండి ఐఎస్ఐ కోసం పని చేస్తున్నారు. వీరికి ఐఎస్ఐ ఏ స్థాయిలో బ్రెయిన్ వాష్ చేసిందంటే... టార్గెట్ చేసిన వ్యక్తిని హనీ ట్రాప్ చేయడానికి వీడియో కాల్లో నగ్నంగా కనిపించడానికీ వెనుకాడరు. ఎంపికైన 300 మందికీ వివిధ అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. భారత్‌లోని జీవనస్థితిగతులు, భాష, మతపరమైన నమ్మకాలతో పాటు డార్క్ వెబ్ వినియోగం, హనీ ట్రాప్ చేయడం తదితర అంశాల్లో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చింది. విదేశాలకు చెందిన ఒక్కో యువతికి దాదాపు 50 వరకు భారతీయుల పేర్లతో ప్రొఫైల్స్ ఏర్పాటు చేసిన ఐఎస్ఐ వీటి ద్వారానే హనీట్రాప్స్ చేయిస్తోంది. వీరి కట్టు, బొట్టు, నడక, నడత ప్రతీ అంశమూ భారతీయ యువతుల మాదిరిగా ఉండేలా వీరిని తయారు చేసింది. హనీట్రాప్‌లో విజయం సాధించి, రహస్య సమాచారం సేకరించిన వారికి ప్రత్యేక నజరానాలూ ఐఎస్ఐ అందిస్తోంది. అబోటాబాద్‌లో సోషల్‌మీడియా యూనిట్... దేశంలోని త్రివిధ దళాలు, రక్షణ సంస్థల్లో పని చేస్తున్న అధికారులు, సైంటిస్టులు, ఇతర ఉద్యోగులకు సంబంధించిన సమాచారం ఐఎస్ఐకి వారి సోషల్‌మీడియా ఖాతాల ద్వారానే తెలుస్తోంది. వీటిని విశ్లేషించడం కోసం ఐఎస్ఐ పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో ప్రత్యేక సోషల్‌మీడియా యూనిట్ ఏర్పాటు చేసింది. ఇందులో సుశిక్షితులైన ఐఎస్ఐ ఉద్యోగులతో పాటు పాక్ ఆర్మీ సిబ్బంది, కొందరు హ్యాకర్లు పని చేస్తున్నారు. వీరి ప్రతినిత్యం భారతీయులకు సంబంధించిన సోషల్‌మీడియా ప్రొఫైల్స్‌ను విశ్లేషిస్తుంటారు. వీటిలో తమకు అవసరమైన వారివి ఎంపిక చేసుకుని అధ్యయనం చేస్తారు. అలా తుదిజాబితా రూపొందించిన తర్వాత దాన్ని ప్రాజెక్ట్ షేర్నీలోని యువతకులకు అందిస్తుంది. వీటి ఆధారంగానే ఈ యువతులు టార్గెట్లకు వల వేసి ఆకర్షిస్తారు. అందచందాలతో పాటు డబ్బు ఎర వేసి రహస్య సమాచారం సేకరిస్తారు. తమ పని పూర్తయ్యే వరకు ఐఎస్ఐ కోసం పని చేస్తున్నట్లు ఎదుటి వారికి అనుమానం కూడా రానీయరు. హనీట్రాప్స్‌ను కనిపెట్టడానికి నిఘా వర్గాలతో పాటు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) పని చేస్తున్నాయి. పాకిస్థానీయులు లేకుండా బెటాలియన్.. ప్రాజెక్టు షేర్నీ కోసం కొన్నేళ్లుగా వ్యహాత్మకంగా పని చేసింది. ఇందులో పని చేయడానికి యువతుల ఎంపిక, వారికి శిక్షణ తదితర అంశాల్లో పలు జాగ్రత్తలు తీసుకుంది. 300 మందితో ఏర్పడిన ఈ బెటాలియన్‌లో కనీసం ఒక్క పాకిస్థానీ యువతి కూడా లేదు. ఇందులో పని చేస్తున్న వారంతో భారత్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ఆయా దేశాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపుల్లో వీరి ఎంపికను రహస్యంగా పూర్తి చేశారు. అక్కడ ఉన్న తమ ఏజెంట్ల ద్వారా ప్రధానం మధ్య, దిగువ మ«ధ్య తరగతి వర్గాల్లో ఆకర్షణీయమైన యువతులను ఉద్యోగాల పేరుతో వల వేసింది. ఆపై డబ్బు ఆశచూపి వారిని ప్రాజెక్టు షేర్నీలో పని చేసేలా ఐఎస్ఐ ఒప్పించింది. (చదవండి: మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలని ట్వీట్) -
హనీ ట్రాపింగ్.. ఐఎస్ఐ ఏజెంట్ పట్టించిన రా ఏజెంట్ నిధి!
రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) ఆఫీస్. మూడు అంతస్తుల భవనం. ఆ భవనంలోని మూడవ అంతస్తులో ఒక సౌండ్ ప్రూఫ్ గది. ఆ గదిలో ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వారి మొహాలలో తెలియని ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ ముగ్గురిలో ఒకరు ‘రా చీఫ్’ శ్రీకర్ అగర్వాల్ .. మిగిలిన ఇద్దరు రా ఏజెంట్స్.. తుషార్ సింగ్, ఆకాష్ వర్మ. చీఫ్ మిగిలిన ఇద్దరినీ చూస్తూ .. ‘మనదేశానికి సంబంధించిన రహస్యాలను సేకరించిన ఐఎస్ఐ ఏజెంట్ జుబ్బార్ అలీ ఇప్పుడు ఎక్కడున్నాడు?’ ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా ఆకాష్ వర్మ ‘బాస్ ఆ జుబ్బార్ అలీ ఇప్పుడు మారుపేరుతో తిరుగుతున్నట్టు కనిపెట్టాం. ఇంకో నాలుగైదు రోజులలో అతడు ఇస్లామాబాద్ వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడు. అతడితో పాటే మన దేశ రహస్యాలు కూడా వెళ్లిపోతాయి’ ఆందోళనగా వివరించాడు. చీఫ్ శ్రీకర్ అగర్వాల్ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత .. వారిని చూస్తూ ‘జుబ్బార్ అలీ ప్రతి కదలికని జాగ్రత్తగా గమనించండి. అతడు ఇస్లామాబాద్ ఎప్పుడు బయలుదేరుతున్నాడో సమాచారం సేకరించండి’ అని చెప్తూ ఎవరికో ఫోన్ చేశాడు. చీఫ్ ఫోన్లో చెప్తున్న విషయం వింటుండగానే ఆకాష్ వర్మ .. తుషార్ సింగ్ మొహాల్లో ఉన్న ఆందోళన ఒక్కసారిగా మాయమైపోయింది. లేచి నిలబడి తమ చీఫ్‌కు విష్ చేసి వారిద్దరూ బయటకు నడిచారు. ముంబై ... ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ .. ముంబై నుండి పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వెళ్ళవలసిన జెట్ ఎయిర్ వేస్ విమానం సిద్ధంగా ఉంది. విమానం ఎక్కుతున్న ప్రయాణికులందరినీ ఎయిర్ హోస్టెస్ నిధి.. చిరునవ్వుతో లోపలకు ఆహ్వానిస్తోంది. చిన్న సూట్‌కేసు పట్టుకుని అటూ ఇటూ గమనిస్తూ విమానం ఎక్కుతున్న జయంత్‌కు ‘స్వాగతం’ అంటూ నమస్కరించింది నిధి. నిధిని చూడగానే ఆమె అందం జయంత్‌ను ఆకర్షించింది. ఆమెతో పరిచయం పెంచుకోవాలని మనసులో తహతహలాడిపోయాడు. తాను ఇస్లామాబాద్ వెళ్ళడానికి దాదాపు పది గంటల సమయం పడుతుంది. ఈ లోపు ఆమెతో పరిచయం పెంచుకుని తనకున్న ఒకే ఒక్క బలహీనతను ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్నాడు. నిధి కూడా జయంత్‌ని చూసి నవ్వుతూ చనువుగా మాట్లాడటం మొదలుపెట్టింది. కూల్ డ్రింక్స్ అందించింది. ఆమె నవ్వులు చూస్తూ తనను తాను మరచిపోయాడు జయంత్. తానొక బిజినెస్ మాగ్నెట్ని అని అత్యవసర పని మీద ఇస్లామాబాద్ వెళ్ళవలసి ఉందని తనను తాను పరిచయం చేసుకున్నాడు జయంత్. విమానంలో వడ్డించే ఆహార పదార్థాలన్నింటినీ తన వలపువన్నెలతో కలిపి వడ్డించింది. నిధిని చూస్తూ తినబోతున్న జయంత్‌కు అతడు కట్టుకున్న వాచీలో ఏదో మెసేజ్ వచ్చింది. అది చదువుతూ ఉన్న జయంత్ లో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. తినడం ఆపేసి ఆలోచిస్తున్న అతడిని నిధి గమనిస్తోంది. వెంటనే అతడి వద్దకు వచ్చి ‘ఏమైంది?’ అని అడుగుతూ చనువుగా తినిపించడం ప్రారంభించింది. నిధి చనువు అతడిలో ఏవో అలోచనలను రేపుతోంది. నిధిని చూస్తూ అతడు.. ‘నిధీ వచ్చే ఎయిర్ పోర్ట్ దోహా ఎయిర్ పోర్ట్ కదా!’ అని అడిగాడు. ఔనని తలాడిస్తూ ఎందుకన్నట్టు చూసింది నిధి. ‘అక్కడ విమానం ఎంతసేపు ఆగుతుంది?’ అని అడిగాడు మళ్లీ. ‘దాదాపు మూడు గంటలు ఆగుతుంది’ అని చెప్పింది నిధి. ‘అక్కడ నాకు చిన్న సహాయం చేస్తావా?’ అభ్యర్థించాడు జయంత్. ‘ తప్పకుండా! మీరు ఎలాంటి సాయం చేయమన్నా చేస్తాను’ భరోసా ఇచ్చింది నిధి. ఖతార్‌లోని దోహా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ... విమానం నుండి దిగిన జయంత్ , నిధి.. ఇద్దరూ బయటకు వచ్చారు. జయంత్ చూడకుండా తన మణికట్టుకున్న వాచీ లాంటి దాంట్లో ‘స్టార్ట్’ అని మెసెజ్ పంపింది నిధి. ఇద్దరూ కలసి ముందుకు నడుస్తున్నారు. ‘మనం ఎక్కడికి వెళ్తున్నాం?’ ఏమీ తెలియనట్టు అడిగింది నిధి. అందుకు జయంత్ ‘ఇక్కడ ఒక నెట్ సెంటర్లో చిన్న పని ఉంది. అది పూర్తి చేసుకున్న తర్వాత నువ్వు ఎక్కడికి అంటే అక్కడికి వెళ్దాం’ అన్నాడు.. నిధితో గడపబోయే క్షణాలను ఊహించుకుంటూ. ‘ఇంకో రెండుగంటల్లో విమానం తిరిగి బయలుదేరబోతుంది కదా.. మనం ఆ లోపే వెళ్ళాలి కదా!’ అన్నది నిధి అమాయకంగా కళ్ళు ఆర్పుతూ. ‘కేవలం గంటలో తిరిగి వెళ్ళిపోదాం’ అన్నాడు అతడు. ‘సరే’ అంటూనే ‘ఇప్పుడు మనం నెట్ సెంటర్‌కి వెళ్లి తీరాలా? టైం వేస్ట్ కదా! మనం ఇక్కడ నుండి ఇటే హోటల్ రూమ్‌కి వెళ్లి.. తిరిగి ఎయిర్ పోర్ట్‌కి వచ్చేద్దాం’ క్రీగంట అతడిని గమనిస్తూ సూచించింది నిధి. ఆ మాటలు వినగానే గతుక్కుమన్నాడు జయంత్. ‘నెట్ సెంటర్లో చాలా అత్యవసరమైన పని ఉంది’ అని చెప్పాడు. ‘నాకంటే అత్యవసరమైన పనా?’ గోముగా ప్రశ్నించింది నిధి. ఆమె మాటలకు ఉలిక్కిపడి సర్దుకుంటూ ‘అలా కాదు డియర్ .. నా బ్రీఫ్‌కేసులో కొన్ని ముఖ్యమైన పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లలో ఉన్న సమాచారాన్ని మొత్తం ఒక చిప్‌లో కాపీ చేసుకోవాలి. అందుకే’ అంటూ ఆమెను సముదాయించే ప్రయత్నం చేశాడు. ‘సరే అయితే పదండి వెళ్దాం’ అంటున్న నిధితో కలసి చిన్న సందులో.. లోపలికి ఉన్న ఒక నెట్ సెంటర్లోకి అడుగుపెట్టాడు జయంత్. లోపల ఎవరూ లేరు. తనకు బాగా అలవాటు ఉన్నట్టుగా లోపలికి వెళ్ళాడు జయంత్. ఒక సిస్టం ముందు కూర్చుని తన బ్రీఫ్‌కేసు తెరిచాడు. అందులో ఉన్న పేపర్లను బయటకు తీశాడు. అందులో ఉర్దూలో రాసి ఉంది. ఆ పేపర్లను జాగ్రత్తగా పట్టుకుని ఒక చిప్ బయటకు తీశాడు. అదంతా గమనిస్తున్న నిధిని దగ్గరకు తీసుకుంటూ తన పని చేసుకుంటున్నాడు జయంత్. ఇంతలో నిధి లేచి స్పీడ్‌గా బయటకు వెళ్ళింది. నిధి కదలికను నిశితంగా గమనిస్తున్న జయంత్ కంగారుగా పైకి లేచాడు. అక్కడ నుండి బయటకు వెళ్ళేలోపు ... ఒక పక్కగా దాక్కుని ఉన్న తుషార్ సింగ్, ఆకాష్ వర్మ.. జయంత్‌ను చూడగానే తమ చేతిలో ఉన్న తుపాకిని పేల్చారు. వెంటనే కిందపడిపోయాడు జయంత్. అతడి చేతిలోని చిప్‌ను తీసుకుంటూ..‘ఈ రోజుతో నీ ఆట కట్టింది.. మిస్టర్ జయంత్ అలియాస్ జుబ్బార్ అలీ’ అంది నిధి. ఆ మాటలకు జుబ్బార్ అలీ మొహం ఒక్కసారిగా మాడిపోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఆకాష్ వర్మ, తుషార్ సింగ్‌లిద్దరూ జుబ్బార్ అలీని తమ అదుపులోకి తీసుకున్నారు. ఆకాష్ వర్మ తమ చీఫ్‌కు ఫోన్ చేశాడు. ‘బాస్ .. మన యంగ్ అండ్ డైనమిక్ ఏజెంట్ నిధి అలియాస్ సోహానా.. మీరు అప్పగించిన టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం జుబ్బార్ అలీ మా వద్దనే ఉన్నాడు. మనదేశ రహస్యాలు జుబ్బార్ అలీ చేతి నుండి సోహానా చేతిలోకి వచ్చి భద్రంగా ఉన్నాయి. మేము వెంటనే ఇండియా బయల్దేరుతున్నాం’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అంతా వింటున్న ఐఎస్ఐ ఏజెంట్ జుబ్బార్ అలీ మొహం పాలిపోయింది. తనకున్న బలహీనత మాత్రమే ఈ రోజు తాను దొరికిపోవడానికి కారణం అయింది అనుకుంటూ చింతిస్తూ వారి వెంట నడిచాడు. రా ఆఫీస్ ... చీఫ్ శ్రీకర్ అగర్వాల్ ఎదుట ఉన్నారు సోహానా.. తుషార్ సింగ్.. ఆకాష్ వర్మ. సోహానా తనకు అప్పగించిన చిప్‌లో ఏమున్నాయో చూస్తున్నాడు చీఫ్. ‘సోహానా.. వాడిని దోహాలో విమానం దింపి నెట్ సెంటర్‌కి ఎలా తీసుకొచ్చావు?’ అంటూ సోహానాను ప్రశ్నించాడు ఆకాష్ వర్మ. ‘అతడు కట్టుకున్న వాచీకి నేనే మెసేజ్ పంపించాను. నీ మీద నిఘా ఎక్కువగా ఉంది. నువ్వు వెంటనే నీ వద్ద ఉన్న సమాచారాన్ని చిప్ రూపంలో ఉంచడం మంచిది అని. వాడు వెంటనే నన్నే సహాయం చేయమని అడిగాడు’ అని నవ్వుతూ చెప్పింది సోహానా. విమానం ఎక్కగానే జుబ్బార్ అలీ దృష్టిలోపడి అతడిని ఆకర్షించాను. జయంత్‌గా వేషం వేసినా అతడి పోలికలను కనిపెట్టాను. అతడికి అనుకూలంగా మాట్లాడుతూ చనువుగా ఉన్నట్టు నటించాను. ఇస్లామాబాద్ వెళితే మనకి అతడు దొరకడని అర్థమైంది. అందుకే దోహా ఎయిర్ పోర్ట్‌లో దిగేటట్టు చేశాను’ అని చెప్తూ ముగించింది సోహానా. ‘వెరీ గుడ్ డియర్ సోహానా.. మీరందరూ మనదేశ పరువు ప్రతిష్ఠలను కాపాడారు’ అంటూ ఆ ముగ్గురినీ అభినందించాడు రా చీఫ్ శ్రీకర్ అగర్వాల్. రాటుదేలిన సైనికాధికారి అయినా .. కాకలు తీరిన కార్పొరేట్ దిగ్గజమైనా ఆ గూఢచర్య వ్యూహంలో.. ఆ తీయని తంత్రంలో చిక్కుకుని రహస్యాలు కక్కాల్సిందే. వేయి ఫిరంగులు, వంద శతఘ్నులు కలిస్తే... ఒక మహిళా గూఢచారి. చాణక్యవ్యూహం, శకుని తంత్రం కలిస్తే ‘ది... ట్రా... ప్...’ ఈ హనీ ట్రాపింగ్‌లో ఇప్పటివరకు చాలామంది చిక్కుకుని ఎన్నో రహస్యాలను అవలీలగా అవతలివారికి అందచేశారని సమాచారం. -
‘పాక్‌లో మా అమ్మ వద్దకు చేర్చండి’.. వీడియోలో ఉగ్రవాది విజ్ఞప్తి
శ్రీనగర్: తనను పాకిస్తాన్‌లోని అమ్మ వద్దకు చేర్చాలని లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ఏరియా కమాండర్, పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి పాక్ ఉగ్రవాది అలీ బాబా పాత్రా విజ్ఞప్తి చేశాడు. కశ్మీర్‌లోని యూరీ సెక్టార్లో జరిగిన గాలింపులో పాకిస్తాన్ ఉగ్రవాది, యువకుడు పాత్రాను సైన్యం సజీవంగా అదుపులోకి తీసుకోవడం తెల్సిందే. తనను ఇక్కడికి (భారత్) పంపినట్లే మళ్లీ పాక్‌కు తీసుకెళ్లాలని కోరాడు. ఈ మేరకు అతడు మాట్లాడిన ఒక వీడియో సందేశాన్ని భారత సైన్యం బుధవారం విడుదల చేసింది. అందులో.. జమ్మూకశ్మీర్‌లోని పరిస్థితులపై పాక్ సైన్యం, ఐఎస్ఐ, లష్కరే తోయిబా అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని అతను విమర్శించాడు. ఆలీ సియాల్కోట్లోని ఒక వస్త్ర కర్మాగారంలో ఉద్యోగం చేసేవాడని, ఆ సమయంలోనే ఎల్ఇటి కోసం ప్రజలను నియమించే అనాస్‌ని కలిసినట్లు తెలిపాడు. తన ఆర్థిక పరిస్థితి కారణంగా ఉగ్రవాదులతో కలవాల్సి వచ్చిందని చెప్పాడు. అందుకుగాను మొదట రూ .20 వేలు ఇచ్చారని, మిగతా మరో రూ. 30,000 తర్వాత చెల్లించే హామీపై ఐఎస్ఐలో చేరినట్లు తెలిపాడు. పాకిస్తాన్ కశ్మీర్లో ప్రజల నిస్సహాయతను అక్కడి ఉగ్రవాద సంస్థలు వాళ్లకు అనుకూలంగా వాడుకుంటూ మాలాంటి వాళ్లని భారత్‌కి పంపుతున్నట్లు వెల్లడించాడు. One LeT terrorist Ali Babar Patra from Okhara, Punjab in Pakistan surrendered before security forces during an operation in the Uri sector of Jammu and Kashmir: Indian Army pic.twitter.com/M7URcShc9Z— ANI (@ANI) September 28, 2021 చదవండి: లంచం ఇస్తే తీసుకోండి.. బలవంతంగా వసూలు చేయొద్దు -
మహారాష్ట్రలో ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్..!
-
సైనికాధికారిణిని బెదిరించిన ఐఎస్ఐ ఏజెంట్
న్యూఢిల్లీ: మహిళా సైనికాధికారిని వేధిస్తున్నాడనే ఫిర్యాదుతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తేలటంతో అప్రమత్తమయ్యారు. మహ్మద్ పర్వేజ్(30)అనే వ్యక్తి గత కొంతకాలంగా కల్నల్ స్థాయి అధికారిణికి మార్ఫింగ్ చేసిన అసభ్యకర ఫొటోలను పంపిస్తున్నాడు. బాధిత అధికారిణి సెల్‌ఫోన్ వాట్సాప్‌కు రెండు వేర్వేరు నంబర్లతో పంపిస్తున్నాడు. తనతో మాట్లాడకుంటే వాటిని సోషల్ మీడియాలో ఉంచుతానని బెదిరించాడు. దీంతో ఆమె ఆ రెండు నంబర్లను బ్లాక్‌లో పెట్టింది. అయితే, ఆ వ్యక్తి బాధితురాలి కుమార్తె సెల్‌కు అసభ్యకర మెసేజ్‌లు, మార్ఫింగ్ ఫొటోలు పంపటం మొదలుపెట్టాడు. బెదిరింపులు తీవ్రం కావడంతో బాధితురాలు ఈ నెల 13వ తేదీన ద్వారక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు ఫేస్బుక్ ప్రొఫైల్, రెండు సిమ్ల ఆధారంగా పర్వేజ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా పలుమార్లు పాకిస్తాన్‌కు వెళ్లివచ్చినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక విభాగానికి ఈ కేసును అప్పగించారు. ప్రత్యేక విభాగం అధికారులు అతడిని విచారించగా.. పలు దఫాలుగా పాకిస్తాన్ వెళ్లివచ్చానని, కొన్ని సిమ్ కార్డులను పాకిస్తానీయులకు కూడా ఇచ్చానని అంగీకరించాడు. దీంతో అతడికి గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయని భావిస్తున్నారు. సైనిక సంబంధ సమాచారం రాబట్టడానికే మహిళా సైనికాధికారిణిని బెదిరింపులకు గురి చేశాడని అనుమానిస్తున్నారు. దీనిపై మరింత పక్కాగా దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళను బెదిరించిన ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్
సాక్షి,న్యూఢిల్లీః ఓ మహిళా కల్నల్‌ను బెదిరించిన అనుమానిత పాక్ ఐఎస్ఐ ఏజెంట్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా కల్నల్‌కు సంబంధించిన మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని అతడు బెదిరించినట్టు పోలీసులు తెలిపారు.కీలక రక్షణ రంగ సమాచారాన్ని రాబట్టేందుకు అనుమానిత ఐఎస్ఐ ఏజెంట్ మహిళా కల్నల్న్ బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పారు. ఈ కేసులో మరో ముగ్గురు అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్ట్ అయిన అనుమానిత ఐఎస్ఐ ఏజెంట్‌ను మహ్మద్ పర్వేజ్‌గా గుర్తించారు. కాగా, బాధిత కల్నల్ తన ఫిర్యాదులో రెండు మొబైల్ ఫోన్ నెంబర్లు, నిందితుల ఫేస్బుక్ ఐడీని పొందుపరిచారని పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీస్ ఉగ్ర నిరోధక విభాగం ఈ కేసును పర్యవేక్షిస్తోంది. -
‘నేను ఐఎస్ఐ ఏజెంట్‌ను’
న్యూఢిల్లీ: ‘హలో.. నేను ఐఎస్ఐ ఏజెంట్‌ను. ఇకపై ఆ సంస్థలో పనిచేయదలుచుకోలేదు. ఇప్పటినుంచి భారత్‌లోనే నివసించాలను కుంటున్నాను’ అంటూ మాట్లాడి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు అందరిని హడలెత్తించాడు. ముహమ్మద్ అహ్మద్ షేక్ ముహమ్మద్ రఫీక్ పేరుతో పాకిస్తాన్ పాస్‌పోర్టు కలిగిన ఒక వ్యక్తి దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి వచ్చాడు. ఆ తర్వాత కఠ్మాండుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ ఏమనుకున్నాడో ఏమో కానీ తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. విమానాశ్రయంలోని సహాయ కేంద్రం వద్దకు వచ్చి, అక్కడ పనిచేస్తున్న ఒక మహిళతో తాను పాకిస్తాన్ గూఢచర్య సంస్థలో పనిచేస్తున్నట్లు, ఆ సంస్థకు సంబంధించిన సమాచారం తెలపాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. వెంటనే సదరు ఉద్యోగి భద్రతా అధికారులకు సమాచారం తెలిపింది. వారు రఫీక్ వివరాలను కేంద్ర నిఘా సంస్థలSకు తెలియజేశారు. అతడిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
బస్సీ ఐఎస్ఐ ఏజెంట్.....
న్యూఢిల్లీ: మరో వారం రోజుల్లో పదవీ విరమణ చేయనున్న ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ మంచికో, చెడుకో పది కాలాల పాటు తన పేరు ప్రజల్లో మారుమోగిపోవాలని కోరుకుంటున్నట్లున్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను దేశద్రోహం కేసు కింద అరెస్టు చేయించి వార్తల్లో వ్యక్తిగా మారిన బస్సీ.. పటియాల కోర్టు ఆవరణలో జర్నలిస్టులను, విద్యార్థులను, అధ్యాపకులను చితక్కొట్టిన సంఘటనలకు కారుకుడై మరింత పేరు సంపాదించుకున్నారు. బీజేపీతో అంటగాకే బస్సీ, దేశద్రోహం అభియోగాలపై అరెస్టైన అయిదుగురు విద్యార్థులు నిర్దోషులైతే అందుకు వారు సరైన సాక్ష్యాధారాలను చూపి నిరూపించుకోవాలని వ్యాఖ్యానించడం ద్వారా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాన్ని సంపాదించుకున్నారు. ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియా దుమ్మెత్తి పోసింది. వ్యంగ్యోక్తులు విసిరింది. ‘బస్సీ, నీవు ఐఎస్ఐ ఏజెంట్‌వని నేను అంటున్నా, నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో!... దోషిగా తేలేవరకు ప్రతివ్యక్తి అమాయకుడని చట్టం చెబుతుందని నేను భావిస్తున్నా. నా నిర్దోషిత్వానికి నా వద్ద సాక్ష్యాలు లేవు. బస్సీ నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు నీ వద్ద సాక్ష్యాధారాలున్నాయా?.....సీపీ పదవి పోవడంతో మరో పదవి కోసం అవాకులు, చెవాకులు పేలుతున్నారు.... విద్యార్థులు చేసిన నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత నీది. అలా చేయలేకపోతే క్షమాపణలు చెప్పుకో!.....మరో జోక్ పేల్చినందుకు థాంక్స్ బస్సీ...మరో లూజ్ రిమార్క్. కొంతమందికి నిజంగా పీఆర్లో శిక్షణ అవసరం... కొంత మంది మినహా దేశంలోని పౌరులంతా నేరస్థులన్నది బస్సీ అభిప్రాయం కాబోలు. అంతమందిని విచారించడం కష్టం గనుక నిర్దోషులను సాక్ష్యాధారాలు చూపమని అడుగుతున్నారు...’ ఇలా ట్విట్టర్ యూజర్లు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. -
పాక్ గూఢచర్య రాకెట్ బట్టబయలు
జమ్మూలో బీఎస్ఎఫ్ జవాను, ఐఎస్ఐ ఏజెంటు అరెస్టు న్యూఢిల్లీ: భారత్‌లో గూఢచర్యానికి ఐఎస్ఐ చేస్తున్న ప్రయత్నాన్ని రెండు వేరువేరు చోట్ల ఢిల్లీ, కోల్‌కతా పోలీసులు భగ్నం చేశారు. భారత సైనిక రహస్యాలను పాక్‌కు చేరవేసే రాకెట్లో ఇద్దరిని ఢిల్లీ పోలీసులు జమ్మూ రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. కొంతకాలంగా కశ్మీర్ పోలీసులు, బీఎస్ఎఫ్లో కొందరు సైనిక రహస్యాలను పాక్‌కు చేరవేస్తున్నారని భారత నిఘా హెచ్చరిస్తున్నాయి. దీంతో కొందరు అనుమానితుల వివరాలు సేకరించిన ఢిల్లీ పోలీసులు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. బీఎస్ఎఫ్ నిఘా విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అబ్దుల్ రషీద్.. సైనిక రహస్యాలను కఫియతుల్లా ఖాన్ అలియాస్ మాస్టర్ రాజా(44) అనే ఐఎస్ఐ ఏజెంటుకు అందిస్తుండగా జమ్మూ రైల్వే స్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. వీరినుంచి ఆర్మీకి సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, కోల్‌కతాలోనూ ముగ్గురు ఐఎస్ఐ ఏజెంట్లను స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కతా శివారు ప్రాంతమైన ఇక్బాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇర్షాద్ అన్సారీ (51), ఆయన కుమారుడు అసఫ్ అన్సారీ (23)తోపాటు వీరి బంధువు జహంగీర్‌ను కూడా ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇర్షాద్, జహంగీర్ కొంతకాలంగా కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్‌లో నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరినుంచి ఐదు లక్షల నకిలీ కరెన్సీతోపాటు సుభాష్ చంద్రబోస్ డాక్‌యార్డ్ చిత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్లో ఉన్న బంధువులను తరచూ కలిసేందుకు వెళ్తున్న తరుణంలో అక్కడ ఐఎస్ఐతో పరిచయమైందని.. అక్కడ శిక్షణ పొందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
ఆర్మీ కీలక పత్రాలతో పట్టుబడ్డ పాక్ గూఢచారి!
లక్నో: ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కీలక పత్రాలతో పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి చెందిన ఓ ఎజెంట్ పట్టుబడ్డాడు. పాకిస్థాన్ జాతీయుడైన మహమ్మద్ ఈజాజ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కాంట్ ప్రాంతంలో ఆ రాష్ట్ర స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) అరెస్టు చేసింది. ఇస్లామాబాద్‌లోని ఇర్ఫాన్‌బాద్ తారామడి చౌక్‌కు చెందిన అతను మీరట్‌కాంట్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నామని ఎస్టీఎఫ్ ఐజీ సుజీత్ పాండే శనివారం విలేకరులకు తెలిపారు. భారత ఆర్మీకి సంబంధించిన పత్రాలు, పాకిస్థాన్ గుర్తింపు కార్డు, పశ్చిమబెంగాల్‌కు సంబంధించిన నకిలీ ఓటర్ కార్డు, బరెల్లీకి చెందిన నకిలీ ఆధార్ కార్డు, మెట్రో ఐడీ కార్డు, లాప్టాప్, పెన్‌డ్రైవ్‌లు అతని నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. భారత సైన్యం కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి ఓ పాకిస్థానీ పశ్చిమ యూపీకి వచ్చినట్టు నిఘా వర్గాలు సమాచారమిచ్చాయని, ఆ సమాచారం ఆధారంగా ఈజాజ్‌ను అరెస్టు చేశామని తెలిపారు. భారత ఆర్మీ సమాచారాన్ని సేకరించి పంపేందుకు ఐఎస్ఐ సూచన మేరకు 2012లో భారత్‌కు వచ్చానని అతను తమ విచారణలో వెల్లడించడాని ఐజీ పాండే తెలిపారు.