మహిళను బెదిరించిన ఐఎస్‌ఐ ఏజెంట్ అరెస్ట్
సాక్షి,న్యూఢిల్లీః ఓ మహిళా కల్నల్‌ను బెదిరించిన అనుమానిత పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా కల్నల్‌కు సంబంధించిన మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని అతడు బెదిరించినట్టు పోలీసులు తెలిపారు.కీలక రక్షణ రంగ సమాచారాన్ని రాబట్టేందుకు అనుమానిత ఐఎస్‌ఐ ఏజెంట్ మహిళా కల్నల్‌న్ బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పారు.
ఈ కేసులో మరో ముగ్గురు అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్ట్ అయిన అనుమానిత ఐఎస్‌ఐ ఏజెంట్‌ను మహ్మద్ పర్వేజ్‌గా గుర్తించారు. కాగా, బాధిత కల్నల్ తన ఫిర్యాదులో రెండు మొబైల్ ఫోన్ నెంబర్లు, నిందితుల ఫేస్‌బుక్ ఐడీని పొందుపరిచారని పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీస్ ఉగ్ర నిరోధక విభాగం ఈ కేసును పర్యవేక్షిస్తోంది.