islamabad city
-
రేపు అక్కడి ఫోన్లేవీ పనిచేయవు!
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ నగరంలో మొబైల్ ఫోన్ సర్వీసులను నిలిపివేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇస్లామాబాద్‌లో సెల్ఫోన్లేవీ పనిచేయవని అక్కడి హోం మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని జియో న్యూస్ ప్రకటించింది. రాజధాని నగరంలో జరిగే స్వాతంత్ర్య దిన సంబరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని.. ముందు జాగ్రత్త చర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గురువారం కూడా రిహార్సల్స్ కారణంగా ఉదయం నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మొబైల్ సర్వీసులను సస్పెండ్ చేశారు. -
ఇస్లామాబాద్‌లో పరిస్థితి ఉద్రిక్తం
కరాచీ: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఆ దేశంలో రోజురోజూకు తీవ్రమవుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఇస్లామాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఆందోళనలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రధాని నవాజ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లతో ఇస్లామాబాద్ మారుమోగుపోతుంది. దాంతో ఇస్లామాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇస్లామాబాద్‌లో అత్యవసర పరిస్థితిని ప్రభుత్వం ప్రకటించింది.