రేపు అక్కడి ఫోన్లేవీ పనిచేయవు! | Islamabad mobile services to be suspended on Friday | Sakshi
Sakshi News home page

రేపు అక్కడి ఫోన్లేవీ పనిచేయవు!

Published Thu, Aug 13 2015 4:55 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

రేపు అక్కడి ఫోన్లేవీ పనిచేయవు!

రేపు అక్కడి ఫోన్లేవీ పనిచేయవు!

పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ నగరంలో మొబైల్ ఫోన్ సర్వీసులను నిలిపివేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇస్లామాబాద్లో సెల్ఫోన్లేవీ పనిచేయవని అక్కడి హోం మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని జియో న్యూస్ ప్రకటించింది.

రాజధాని నగరంలో జరిగే స్వాతంత్ర్య దిన సంబరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని.. ముందు జాగ్రత్త చర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గురువారం కూడా రిహార్సల్స్ కారణంగా ఉదయం నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మొబైల్ సర్వీసులను సస్పెండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement