Isolated
-
KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కరోనా
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు కేటీఆర్. లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని తెలిపారాయన. స్వల్ప లక్షణాలతోనే ఆయన కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ దయచేసి పరీక్షలు చేయించుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని ఆయన అభ్యర్థించారు. Thought this was behind us but clearly it isn’t After developing symptoms, got tested for Covid & it’s positive. Will be isolating at home I request all who met with me over the last few days to kindly get tested & take precautions — KTR (@KTRTRS) August 30, 2022 ఇటీవలె కాలిగాయం నుంచి కోలుకున్న కేటీఆర్.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై ట్వీట్లతో విరుచుకుపడుతుండడం చూస్తున్నాం. గతంలోనూ కేటీఆర్ (2021, ఏప్రిల్ చివరివారంలో) కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ట్రాక్టరే కాదు నాకు పొక్లెయినర్ నడపటం కూడా వచ్చు: రేణుకా చౌదరి -
Russia-Ukraine war: రష్యాను ఒంటరిని చేయలేరు
మాస్కో/కీవ్: భారత్, చైనాతోనే గాక లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలోనూ భాగస్వామ్యం నెలకొల్పుకొనే అవకాశం తమకుందని రష్యా అధ్యక్షుడు శుక్రవారం పుతిన్ అన్నారు. రష్యాను ఒంటరిని చేయడం అసాధ్యమని పరోక్షంగా తేల్చిచెప్పారు. ‘‘ఆఫ్రికా నిద్రాణ స్థితిలో ఉన్నా ఎప్పటికైనా మేల్కొంటుంది. అక్కడ 150 కోట్ల మంది ఉన్నారు. రష్యా చుట్టూ బయటి నుంచి కంచె వేయడం అసాధ్యం. మా సార్వభౌమత్వాన్ని, భూభాగాలను తిరిగి తెచ్చుకోవడంతోపాటు బలోపేతం చేసుకొనే కార్యక్రమం చేపట్టాం. ఆ లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈయూలో చేర్చుకోండి: జెలెన్స్కీ తమకు యూరోపియన్ యూనియన్(ఈయూ)లో సభ్యత్వం కల్పించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం వేగంగా చర్యలు చేపట్టాలని కోరారు. మాట నిలబెట్టుకోవాలని సూచించారు.‘గ్రేజోన్’ పేరిట ఉక్రెయిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని, తద్వారా రష్యా దండయాత్రకు ఊతం ఇస్తున్నారని విమర్శించారు. ఫిన్లాండ్ నుంచి మరిన్ని ఆయుధాలు! ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందజేసేందుకు ఫిన్లాండ్ ముందుకొచ్చింది. ఫిన్లాండ్ గతంలోనే రైఫిళ్లు, యాంటీ–ట్యాంకు ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందజేసింది. ► యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లెయేన్ తాజాగా పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. యుద్ధానికి ముగింపు, ఆహార సంక్షోభంపై చర్చించారు. యుద్ధం వల్ల నష్టపోయిన వారికి తాము అండగా ఉంటామని ట్వీట్ చేశారు. ► ఉక్రెయిన్‌లో ముగ్గురు విదేశీయులకు రష్యా అనుకూల వేర్పాటువాదుల కోర్టు మరణ శిక్ష విధించడంపై ఐరాస మానవ హక్కుల సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇది యుద్ధనేరమని వ్యాఖ్యానించింది. ► తూర్పు ఉక్రెయిన్‌లో తమ బలగాలు ప్రత్యర్థి రష్యా సైనికులపై పైచేయి సాధిస్తున్నాయని లుహాన్స్క్ గవర్నర్ సెర్హివ్ హైడై చెప్పారు. సీవిరోడోంటెస్క్‌లో కీలక పారిశ్రామిక ప్రాంతంతోపాటు ఇతర ప్రాంతాలను ఉక్రెయిన్ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయన్నారు. రష్యా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన గాళ్ ఫ్రెండ్ మృతదేహం వద్ద రోదిస్తున్న వ్యక్తి ► తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులకు తూర్పు ఉక్రెయిన్‌లో మరణ శిక్ష విధించడం దారుణమని, ఇందుకు రష్యానే బాధ్యత వహించాలని బ్రిటిష్ మంత్రి రాబన్ వాకర్ డిమాండ్ చేశారు. బ్రిటిష్ పౌరులైన ఐడెన్ అస్లిన్(28), షౌన్ పిన్నర్(48)కు రష్యా అనుకూల కోర్టు మరణ శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మరో మొరాకో పౌరుడు సాదౌన్కు కూడా మరణశిక్ష విధించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ► రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సైన్యంలో నిత్యం 200 మంది దాకా జవాన్లు బలవుతున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖేలో పొడోల్యాక్ తెలిపారు. పశ్చిమ దేశాల నుంచి మరిన్ని ఆధునిక ఆయుధాలు వస్తేనే తమ సైనికుల ప్రాణత్యాగాలకు తెరపడుతుందన్నారు. ► ఉక్రెయిన్‌కు మరిన్ని భారీ ఆయుధాలు అందజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఫ్రాన్స్ అధ్యక్షడు ఇమ్మానుయేల్ మాక్రాన్ చెప్పారు. ఆయన తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడారు. తమ సేనలు ఖర్కీవ్నుంచి రష్యా సైన్యాన్ని తరిమికొడుతున్నాయని జెలెన్స్కీ చెప్పారు. ► డోన్బాస్లోని రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న స్టాఖనోవ్పై ఉక్రెయిన్యం వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 13 మంది మరణించారు. -
కరోనా పాజిటివ్: సేఫ్‌గా హోం ఐసోలేషన్.. 7 రోజులకే నెగిటివ్
కాజీపేటకు చెందిన ఓ ఉద్యోగికి రెండు రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతూ పరీక్ష చేయించుకున్నాడు. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులకు కూడా చేయించగా వారికి కూడా పాజిటివ్ వచ్చింది. అందరికీ స్వల్ప లక్షణాలే. కిట్లు తీసుకుని ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నాడు. ఖిలా వరంగల్‌కు చెందిన కూరగాయల వ్యాపారికి వారం రోజులక్రితం పాజిటివ్ వచ్చింది. జ్వరం, జలుబు లక్షణాలు మాత్రమే ఉన్నాయి. మూడు రోజుల్లో జ్వరం తగ్గింది. జలుబు ఐదు రోజులు ఉంది. 7వ రోజు పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. సాక్షి, కాజీపేట: కరోనా మూడో దశలో కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైరస్‌ను జయిస్తున్నారు. దీనిపై పూర్తి అవగాహన పెరగడం.. స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతూ సురక్షితంగా బయటపడుతున్నారు. వారికి వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తూ ధైర్యం నింపుతున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరిద్దరికి పాజిటివ్ వచ్చినా.. ఇతర సభ్యులందరికీ వచ్చినప్పటికీ ఆందోళన చెందడం లేదు. ఇరుగుపొరుగు వారు కూడా సహకరిస్తుండడంతో ఆస్పత్రుల్లో చేరి లక్షల రూపాయలు పెట్టడం లేదు. ఇలా నగరంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20,650 మందికిపైగా హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు వైద్యాధికారులు తెలుపుతున్నారు. వారి ఇళ్లకు ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు రోజూ వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఇంటింటి జ్వర సర్వే... వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశ కార్యకర్తలు మూడు రోజులుగా సంయుక్తంగా ఇంటింటికి వెళ్లి ప్రత్యేక జ్వరం సర్వేలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా జ్వర లక్షణాలు ఉన్నట్లుగా నిర్ధారణ జరిగినట్లయితే వెంటనే మందుల కిట్లను అందజేస్తున్నారు. అర్బన్, గ్రామీణ హెల్త్ సెంటర్లపై ఒత్తిడి లేకుండా జ్వరం సర్వే ఉపయోగపడుతోంది. హనుమకొండ జిల్లాలో 22,375 గృహాలను సందర్శించి అందులో 3,356 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించి 3,356 మందికి హోం ఐసోలేషన్ కిట్స్ ఇచ్చారు. వరంగల్ ట్రై సిటీలో దాదాపు 7వేలమంది వరకు హోం ఐసోలేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యాధికారుల సూచనలు... ► ఇంట్లోనే ఉండి వైద్యం పొందుతున్న కరోనా రోగులు వైద్యాధికారులకు ఫోన్ చేసి వారి సూచనలు, సలహాలు పొందుతున్నారు. ► జ్వరం ఎక్కువగా ఉంది..ఇంట్లోనే ఉండొచ్చా.. ఆస్పత్రికి వెళ్లాలా .. ఏ మందులు వాడాలి. ఇలా అర్ధరాత్రి సైతం జిల్లా వైద్యాధికారితో పాటు ఇతర వైద్యులకు ఫోన్లు చేస్తూ తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. ► ఒకప్పుడు కరోనా సోకితే వారితో మాట్లాడేందుకు కూడా భయపడేవారు. ఇప్పుడు మాస్క్‌లు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబంతోనే కలిసి ఉంటున్నారు. ► ప్రత్యేక గదిలో ఉంటూ ఇంటి భోజనం తింటున్నారు. ఇలా చేయడం వలన వారిలో ఒత్తిడి తగ్గుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. -
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కరోనా
సాక్షి, హైదరాబాద్: మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘‘గత రెండు రోజులుగా నీరసంగా ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలని కోరుకుంటున్నాను. నాకు చాలా స్వల్ప లక్షణాలున్నాయి.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అంటూ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. గత రెండురోజులుగా నీరసంగా ఉంటే Covid టెస్టు చేయించుకుని, Positive గా నిర్దారణ అయిన వెంటనే ప్రభుత్వ గాంధీ హాస్పిటల్ కు వచ్చి చికిత్స చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జి అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులూ,Please isolate yourselves. I have mild symptoms. Nothing to worry at all. pic.twitter.com/mqYTfC8fmL — Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) August 10, 2021 ఆదివారం నల్లగొండ ఎన్జీ కాలేజీ మైదానంలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ భారీ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాజ్యాధికార సంకల్ప సభలో బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రామ్‌జీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరిన సంగతి తెలిసిందే. ఈ సభకు భారీ ఎత్తున జనాలు తరలివచ్చారు. -
‘అమ్మ, సోదరుడికి కరోనా.. చాలా భయమేసింది’
‘2020లో ఈ భూమ్మీద ఏదైనా ఒక మంచి పని జరిగిందంటే అది వర్క్ ప్రమ్ హోమ్ కల్చర్ పెరగడం. అవును జీవితంలో ముందుకు వెళ్లడం, ఉద్యోగాలు చేయం అవసరం. కానీ అదే సమయంలో మనం ఇంకా మహమ్మారి మద్యలోనే ఉన్నామని గుర్తించడం ముఖ్యం. ఇప్పటికీ వ్యాక్సిన్ రాలేదు. కరోనా కూడా అంతం కాలేదు. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు వెళ్లే పనులను తగ్గించాలి. ఇది అనివార్యం.’ అంటూ అంటున్నాడు టాలీవుడ్ హీరో రామ్ పోతినేని. లాక్డౌన్ అనంతరం సెలబ్రిటీలు మెల్లగా సినిమా షూటింగ్‌లకు వెళ్లడం ప్రారంభిస్తుంటే రామ్ మాత్రం ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంగ్లీష్ మీడియాతో సంభాషించారు. ఇంటి నుంచే వర్చువల్‌గా స్టోరీ స్క్రీప్ట్స్ వింటూ, ఫోటో షూట్లతో బిజీగా ఉంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తనకు అన్ని (మంచి, చెడు)అనుభవాలను ఇచ్చిందన్నారు. కుటుంబంతో కలిసి ఎక్కవ సమయాన్ని గడిపేందుకు సమయం దొరకగా మరోవైపు ఇంట్లో ఎక్కువ సేపు ఉండటం కొంత నిరశకు గురిచేస్తుందన్నారు. చదవండి: కౌన్ హే అచ్చా... కౌన్ హే లుచ్చా.. అదిరిపోయింది ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఇంట్లోనే ఉన్నప్పటికీ స్ర్కిప్ట్ వింటూ, మీటింగ్స్ కోసం వర్చువల్ కాల్స్‌కు హాజరవుతున్నాను. ఇందుకు మంచి దుస్తులు ధరించాను. దీంతో వర్క్ ఫ్రం హోమ్‌ను ప్రోత్సహించేందుకు ఏదైనా చేయాలనిపించింది. అందుకే ఫోటోషుట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాను. ఎక్కువ సమయం ఇంట్లో ఉండటం తేలికైన విషయం కాదు. నాకు కొంచెం విసుగొచ్చింది. అంతేగాక నా కుటంబం కరోనా బారిన పడింది. అమ్మ, సోదరుడు(కృష్ణ చైతన్య) కరోనా సోకింది. ఈ విషయం తెలిసి చాలా భయం వేసింది. ముఖ్యంగా నా సోదరుడికి తీవ్రమైన లక్షణాలు కనిపించాయి. చివరికి దేవుని దయతో పూర్తిగా కోలుకున్నాడు. చదవండి: ప్రేమ, పెళ్లితో జీవితాన్ని నాశనం: మెగా హీరో లాక్డౌన్లో ఎక్కువడా ఒంటరి జీవితాన్ని గడిపాను. నాకు నా బార్డ్(పెంపుడు కుక్క) తోడుగా నిలిచింది. నేనే స్వయంగా వంట చేయడం, బుక్స్ చదవడం, బార్డ్‌ను వాకింగ్‌కు తీసుకెళ్లడం చేశాను. ఇదంతా చాలా బోరింగ్‌గా అనిపించింది. అయినా ఇలా ఎక్కువ రోజులు ఉండలేం. అదృష్టంకొద్ది తొమ్మిది నెలల తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. 2020 ఏడాది కోసం ఆసక్తిగా ఉన్నాను. నా చిత్రం రెడ్ వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఇది కొత్త ఏడాదిని ప్రారంభించేదుకు సరైన మార్గం. 2020 మనకు మనం ఆత్మపరిశీలన చేసుకోవడాని ఒక అవకాశాన్ని ఇచ్చిందని నేను భావిస్తున్నాను. వచ్చే ఏడాదిని సానుకూలంగా ప్రారంభించాలనుకుంటున్నాను. శక్తి, సానుకూల ధృక్పథంతో వచ్చే ఏడాదిని ప్రారంభిద్దాం’. అని పేర్కొన్నారు. -
గడ్కరీకి కరోనా పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రత దేశంలో రోజురోజుకి పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకు దేశంలో 50 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో రోడ్డురవాణా,రహదారులు,ఎంఎస్ఎంఇ మంత్రి నితిన్ గడ్కరీకి కూడా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం సాయంత్రం ట్విటర్ ద్వారా తెలియ జేశారు. కొద్దిగా అనారోగ్యం అనిపించడంతో వైద్యుడిని సంప్రదించానని, పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని గడ్కరీ ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతం అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలతో ఆరోగ్యంగానే ఉన్నాననీ, ఐసోలేట్ అయ్యానని చెప్పారు. అలాగే తనతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని , ప్రోటోకాల్‌ను అనుసరించాలని అభ్యర్థించారు. సురక్షితంగా ఉండాలని సూచించారు. కాగా పార్లమెంటు సమావేశాలకు ముందు సభ్యులకు నిర్వహించిన తప్పనిసరి కోవిడ-19 పరీక్షల్లో17మంది, లోక్‌సభ సభ్యులు, రాజ్యసభకు చెందిన ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది. ఈ సందర్భంగా గడ్కరీకి కూడా నెగిటివ్ వచ్చింది. దీంతో ఆయన సోమవారం పార్లమెంటుకు హాజరైనట్టు తెలుస్తోంది. పార్లమెంటులో 25మంది సభ్యులు (ఎంపీలు), పార్లమెంటులో పనిచేస్తున్న 40మందికి పాజిటివ్ వచ్చిందని మింట్ తెలిపింది. పార్లమెంటు సభ్యులైన మీనాక్షి లేకి, హనుమాన్ బెనివాల్, సుకాంత మజుందార్ తదితరులకు కరోనా నిర్దారణ అయింది. మరోవైపు గడ్కరీ ప్రస్తుతం నాగ్‌పూర్‌లో ఉన్నారని, స్వల్పంగా జ్వరం ఉందని ఆయన కార్యాలయం తెలిపింది. తాజా పరిణామంతో ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు గడ్కరీ దూరం కానున్నారు. -
గాంధీలో ఇద్దరు కోవిడ్ అనుమానితులు
సాక్షి, గాంధీ ఆస్పత్రి: కోవిడ్ వైరస్ లక్షణాలతో ఇద్దరు అనుమానితులు ఆదివారం గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చేరారు. వారి నుంచి నమూనాలు సేకరించి.. నిర్ధారణ కోసం గాంధీ మెడికల్ కాలేజీ మైక్రోబయోలజీ విభాగంలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించామని గాంధీ ఆస్పత్రి నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన నివేదిక సోమవారం వస్తుందని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఇప్పటివరకు 81 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 79 మందికి కోవిడ్ నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. -
ఫీవర్ ఆస్పత్రిలో 3 కరోనా కేసులు!
నల్లకుంట: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. చైనా నుంచి రాష్ట్రానికి వచ్చే వారిపై నిఘా పెట్టి వారికి ఏమాత్రం వైరస్ లక్షణాలున్నా వైద్య పరీక్షలు చేసి పంపిస్తున్నారు. దీనిలో భాగంగా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలోని 7వ వార్డును(ఐసోలేటెడ్) కరోనా అనుమానిత కేసుల కోసం సిద్ధం చేశారు. అయితే నగరంలో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానించి వారి నుంచి శాంపిళ్లను సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. బ్లిహిల్స్‌కు చెందిన నాగార్జునరెడ్డి కుమారుడు అమర్నాథ్ రెడ్డి(25) ఇటీవల చైనా నుంచి నగరానికి వచ్చాడు. అనంతరం అస్వస్థతకు గురై అతను శనివారం రాత్రి ఫీవర్ ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు అతడిని పరీక్షించి అనుమానిత కరోనా కేసుగా పరిగణించారు. ఐసోలేటెడ్ వార్డులో అతడిని ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మరో 2 అనుమానిత కరోనా కేసులు వచ్చాయి. ఈ ముగ్గురినీ ఐసోలేటెడ్ వార్డు లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారి నుంచి శాంపిల్స్‌ను సేకరించి పుణె ల్యాబ్‌కు పంపామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్ ఆదివారం మీడియాకు తెలిపారు. వీరికంటే ముందు గా పది రోజుల క్రితం చైనా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ విద్యార్థి దగ్గు, జలుబుతో అస్వస్థతకు గురయ్యాడు. కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఆ విద్యార్థి ఫీవర్ ఆస్పత్రికి రాగా వైద్య పరీక్షల్లో సాధారణ ఫ్లూగా తేలింది. అతడికి చికిత్స చేసి ఆస్పత్రి నుంచి ఇటీవలే డిశ్చార్జి చేశారు. -
ఒంటరిగా తింటే..
లండన్ : ఒంటరిగా భోజనం చేసేవారు విచారంగా ఉంటారని, ఇది ఆర్థిక ఇబ్బందులు, శారీరక వైకల్యం కంటే ఎక్కువ బాధించే అంశమని తాజా అథ్యయనం వెల్లడించింది. పెద్దల్లో నాలుగోవంతు మంది పనిఒత్తిడి, ఒంటరితనం వల్ల కుటుంబసభ్యులతో కలిసి తినలేకపోతున్నారని పేర్కొంది. అథ్యయనంలో భాగంగా 8000 మందిని ప్రశ్నించగా అందరితో కలిసి భోంచేసే వారితో పోలిస్తే ఎప్పుడూ ఒంటరిగా ఆహారం తీసుకునేవారు మెరుగైన జీవన సూచీలో తక్కువ పాయింట్లు పొందినట్టు వెల్లడైంది. ప్రతి ఐదుగురిలో ఒకరు తాము తరచూ ఒంటరిగానే భోజనం చేస్తామని చెప్పుకొచ్చారు. వీరిలో అత్యధికులు పనిభారంతో సతమతమయ్యేవారు, అవివాహితులు, విడాకులు తీసుకున్న వారే కావడం గమనార్హం. మరోవైపు పదవీవిరమణ చేసిన వారిలో అతితక్కువ మంది మాత్రమే తాము అరుదుగా ఒంటరిగా భోజనం చేస్తామని చెప్పారు. కుటుంబం, స్నేహితులతో మెరుగైన సంబంధాలు కలిగిఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ఇతరులతో సానుకూల సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు కలిసి భోంచేయడం కీలకమని సామాజిక సంబంధాల కౌన్సెలర్ క్రిస్ షెర్వుడ్ చెప్పుకొచ్చారు. ఒంటరిగా తినడం ప్రజల మెరుగైన ఆరోగ్యానికి అవరోధమని అథ్యయనం చేపట్టిన ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్, సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ పేర్కొంది. ఒంటరితనం, వ్యక్తిగత సంబంధాలు కొరవడటం మూలంగా కొందరికి వైఫల్యాలు ఎదురవుతాయని, మరికొందరు తీవ్ర పనిఒత్తిళ్లతో సామాజిక సంబంధాలను కొనసాగించలేకపోతున్నారని అథ్యయనం పేర్కొంది. ఒంటరిగా భోజనం చేసే వారిలో లైంగిక ఆసక్తి సన్నగిల్లడం, నిద్రలేమి వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపింది. -
ఏకాంత చర్చల ఆంతర్యమేమిటో..?
భువనగిరి : టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎలిమినేటి కృష్ణారెడ్డితో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఏకాంత చర్చలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బుధవారం మధ్యాహ్నం మంత్రి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి కృష్ణారెడ్డి ఇంటికి 1.55 గంటలకు వచ్చారు. టీఆర్ఎస్ విధానాలపై అలకతో ఉన్న కృష్ణారెడ్డి ఇటీవల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని వస్తున్న వార్తల నేప«థ్యంలో మంత్రి రాక ప్రా«ధాన్యం సంతరించుకుంది. 2.10 గంటలకు గదిలోకి వెళ్లిన మంత్రి, కృష్ణారెడ్డిలు తిరిగి 3.25 గంటలకు ఇద్దరు బయటకు వచ్చారు. సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. స్థానికంగా తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని కృష్ణారెడ్డి మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అనంతరం వెళ్లిపోతున్న మంత్రిని చర్చల్లో సంతృప్తి చెందారా అని ప్రశ్నించగా.. అసలు అసంతృప్తి ఎక్కడా లేదని పేర్కొన్నారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ తనను మర్యాదపూర్వకంగా కలవడానికే మంత్రి వచ్చారని స్పష్టం చేశారు. కాగా ఇద్దరు చర్చలు జరుపుతున్నంత సేపు ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి అక్కడే వేచి ఉన్నారు. అనంత రం మంత్రి, ఎమ్మెల్యే బీబీనగర్ Ðð ళ్లారు.