Israel Prime Minister Benjamin Netanyahu
-
Israel Vs Hamas: ఆరు నెలల మారణహోమం.. వేల మరణాలు..
Israel Vs Hamas War.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ఈరోజుతో ఆరు నెలల కాలం పూర్తైంది. గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఒక్కసారిగా ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చిన ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ దాడికి ఇజ్రాయెల్ ప్రతీ దాడులు చేస్తూ.. హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఈ యుద్ధం కారణంగా గాజాలో దాదాపు 33వేల మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంతో పాలస్తీనీయుల వెతలు.. యావత్ ప్రపంచాన్ని ఆందోళనలకు గురి చేస్తున్నాయి. గాజా ప్రజలు ప్రాణాలు అర చేతిలో పట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో నెతన్యాహుకు వ్యతిరేకంగా వేల సంఖ్యలో ఇజ్రాయెల్ ప్రజలు నిరసనలకు పిలుపునిచ్చారు. నెతన్యాహు తీరును తీవ్రంగా ఖండిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. JUST IN: 🇮🇱 Massive protests breakout in #TelAviv, Israel calling for Prime Minster Benjamin Netanyahu to resign. pic.twitter.com/IBWLtxe5k6 — StarWorld🌟 (@Starworld00707) April 7, 2024 కాగా, ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి నేటితో ఆరు నెలలు పూర్తయింది. ‘ఆపరేషన్ అల్-అక్సా స్ట్రామ్’ పేరిట గతేడాది అక్టోబర్ 7వ తేదీ తెల్లవారుజామున మెరుపుదాడికి పాల్పడిన హమాస్ మిలిటెంట్లు.. దాదాపు 1200 మందిని బలిగొన్నారు. 250 మందికిపైగా బందీలుగా చేసుకుని, గాజాకు తీసుకెళ్లారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడిన ఇజ్రాయెల్.. ప్రతి దాడులను మొదలుపెట్టింది. హమాస్ అంతంతోపాటు బందీల విడుదలే లక్ష్యంగా దాడులను ప్రారంభించింది. ఇజ్రాయెల్ ప్రతి దాడుల కారణంగా ఇప్పటివరకు 109 మంది బందీలు సురక్షితంగా విడుదలయ్యారు. ముగ్గురిని సైన్యం నేరుగా కాపాడింది. 36 మంది వరకు బందీలు చనిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఆ దేశ వైమానిక దాడుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారని హమాస్ చెబుతోంది. తమవారిని విడిపించాల్సిందిగా ప్రధాని నెతన్యాహుపై బాధితుల కుటుంబీకులు, పౌరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు.. దాదాపు 500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హమాస్ సొరంగాల్లో చాలావరకు ధ్వంసం చేశామని, 13 వేల మంది ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్ చెబుతోంది. గాజాలో విపత్కర పరిస్థితులు.. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ దాడుల కారనంగా గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్య పౌరులకు కూడా రక్షణ లేకుండా పోయింది. విపత్కర పరిస్థితుల్లో ఇప్పటివరకు 33 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఆరోగ్య విభాగం వెల్లడించింది. మృతుల్లో 70 శాతం మంది మహిళలు, చిన్నారులేనని పేర్కొంది. ఐరాస వివరాల ప్రకారం.. దాదాపు 17 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. స్థానికంగా 56 శాతానికిపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. యుద్ధం కారణంగా ఆహారం, ఇంధనం, ఔషధాలు, మంచినీరు, నిత్యావసర సామగ్రి కొరతతో పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రతిఒక్కరూ ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారని, ఉత్తర ప్రాంతంలో 2 లక్షల మంది విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. To Palestinian mothers losing their children in the Gaza-Israel conflict, my heart goes out to you. Your bravery in tough times is amazing. Remember, you're not alone; the world supports you with sympathy and unwavering care during this tough time. #iran #Isreal pic.twitter.com/jVpKVApgGf — Iqra Farooq (@uniqueiqra_) April 6, 2024 అమెరికా అసంతృప్తి.. గాజాపై దాడులను ఇజ్రాయెల్ వెంటనే ఆపాలని అనేక దేశాలు కోరుతున్నాయి. గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రత మండలి, మానవహక్కుల మండలిలు తీర్మానం రూపంలో గొంతెత్తాయి. నవంబరులో ఓసారి కాల్పుల విరమణ సాధ్యమైనప్పటికీ.. మరోసారి ఈ అంశం చర్చల దశలోనే నిలిచిపోయింది. మరోవైపు, హమాస్‌ను అంతం చేసేవరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టం చేస్తున్నారు. ద్విదేశ పరిష్కారాన్ని వ్యతిరేకిస్తోన్న ఆయన తీరుపై మిత్రదేశం అమెరికా సైతం పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల కాల్పుల విరమణ విషయంలో జో బైడెన్.. నెతన్యాహును హెచ్చరించారు కూడా. పౌరుల రక్షణ విషయంలో కఠినంగా వ్యవహారిస్తామని వార్నింగ్ ఇచ్చారు. 🇮🇱 Massive protests breakout in Tel Aviv, Israel calling for Prime Minster Benjamin Netanyahu to resign. Free Palestine 🇵🇸#IsraeliButchers #Iran | free palestine | Ecuador | US | pic.twitter.com/0l9YVb82XY — huzaifa khan (@huzaifakhan1997) April 6, 2024 నేడు మరో రౌండ్ చర్చలు.. కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం ఆదివారం జరగనున్న మరో రౌండ్ చర్చలకు హమాస్ బృందం కైరో వెళ్తోంది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు.. దక్షిణ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి 1200 మందిని హత్య చేసి 250 మందిని బందీలుగా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో 109 మంది విడుదలయ్యారు. మిగిలిన వారిని విడిపించేందుకు చర్చలు జరుగుతున్నాయి. హమాస్ చెరలోనే 36 మంది వరకు బందీలు ప్రాణాలు కోల్పోయారు. ఇక, ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ చెందిన కమాండర్లు, కీలక నేతలు కూడా చనిపోయిన విషయం తెలిసిందే. -
Israel-Hamas War: చక్రబంధంలో గాజా సిటీ!
ఖాన్ యూనిస్/జెరూసలేం/న్యూఢిల్లీ: గాజాలో హమాస్ మిలిటెంట్లతో హోరాహోరీ పోరు కొనసాగుతోందని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. తమ పదాతి సేనలు, వైమానిక దళాలు శత్రువులపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయని, ప్రశంసనీయమైన విజయాలు సాధిస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. మిలిటెంట్ల దాడులను తమ జవాన్లు గట్టిగా తిప్పికొడుతున్నారని పేర్కొంది. శుక్రవారం జరిగిన దాడుల్లో చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని, వారి సొరంగాలు నామరూపాల్లేకుండా పోయాయని తెలియజేసింది. గాజా సిటీలో దాడులు ఉధృతం చేయబోతున్నామని ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణలో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. శుక్రవారం నాటికి గాజాలో 9,200 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో మిలిటెంట్ల అదీనంలో ఉన్న 240 మంది బందీల ఆచూకీ కోసం ఇజ్రాయెల్ సైన్యం ముమ్మరంగా ప్రయతి్నస్తోంది. ఇందుకోసం అమెరికా డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్లు గత వారం రోజులుగా గాజా ఉపరితలంపై చక్కర్లు కొడుతున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గాజాని చుట్టుముట్టాం: ఇజ్రాయెల్ గాజాలో ప్రధాన నగరం, హమాస్ మిలిటెంట్ల ముఖ్యమైన అడ్డా అయిన గాజా సిటీని తమ సేనలు చుట్టుముట్టాయని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ ప్రకటించారు. భూతల దాడులు ప్రారంభమైన వారం రోజుల తర్వాత గాజా సిటీ చుట్టూ తమ దళాలు పూర్తిస్థాయిలో మోహ రించినట్లు తెలిపారు. గాజాలో కాల్పుల విరమణ పాటించాలంటూ ప్రపంచ దేశాల నుంచి తమపై ఒత్తిడి వస్తున్నట్లు వెలువడుతున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. నల్ల బ్యాగుల్లో తిరిగి వెళ్తారు: హమాస్ గాజాలో ఇజ్రాయెల్ సైన్యానికి దారుణ పరాజయం ఎదురు కాబోతోందని హమాస్ మిలిటరీ విభాగమైన ఖాసమ్ బ్రిగేడ్స్ స్పష్టం చేసింది. తమ భూభాగంలో అడుగుపెట్టిన ఇజ్రాయెల్ సైనికులు నల్ల బ్యాగుల్లో తిరిగి వెళ్తారని హెచ్చరించింది. తద్వారా వారికి తమ చేతుల్లో చావు తప్పదని పేర్కొంది. కాల్పుల విరమణ లేదు: నెతన్యాహూ హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న బందీలందరినీ విడుదల చేసే దాకా గాజాలో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తేలి్చచెప్పారు. మానవతా సాయం గాజాకు చేరవేయడానికి, విదేశీయులను బయటకు పంపించడానికి వీలుగా తాత్కాలికంగా కాల్పు ల విరమణ పాటించాలన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభ్యర్థనపై ఆయన స్పందించారు. నెతన్యాహూ శుక్రవారం అమెరి కా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. పాలస్తీనియన్లను కాపాడండి గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో సామాన్య పాలస్తీనియన్లు మరణిస్తుండడం పట్ల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో ప్రజలను కాపాడడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. లేకపోతే ‘శాంతికి భాగస్వాములు’ ఎవరూ ఉండరని చెప్పారు. గాజాను శ్మశానంగా మార్చొద్దని పరోక్షంగా తేలి్చచెప్పారు. గాజాకు భారీస్థాయిలో మానవతా సాయం అవసరమని, ఆ దిశగా ఇజ్రాయెల్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలని అన్నారు. ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న మానవతా సాయాన్ని గాజాలోకి విస్తృతంగా అనుమతించాలని, ఈ విషయంలో ఆంక్షలు తొలగించాలని చెప్పారు. ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. పవిత్ర యుద్ధం చేస్తున్నాం: హసన్ నస్రల్లా ఇజ్రా యెల్‌పై దా డుల విషయంలో అమెరికా హెచ్చరికలు తమను భయపెట్టలేవని లెబనాన్‌కు చెందిన షియా మిలిటెంట్ సంస్థ ‘హెజ్బొల్లా’ అధినేత హసన్ నస్రల్లా పేర్కొన్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి హెజ్బొల్లా దూరంగా ఉండాలంటూ అమెరికా చేసిన హెచ్చరికలపై ఆయన శుక్రవారం స్పందించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలైన తర్వాత ఆయన మాట్లాడడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్‌పై తొలుత దాడిచేసిన హమాస్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్‌పై పవిత్ర యుద్ధంలో త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. మధ్యధరా సముద్రంలో అమెరికా సైనిక బలగాలను చూసి తాము బెదిరిపోవడం లేదని అన్నారు. తమ దగ్గర బలమైన సైన్యం ఉందని, అన్నింటికీ సిద్ధపడే ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్నట్లు నస్రల్లా పేర్కొన్నారు. నస్రల్లా ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదు. ఆయన ప్రసంగాన్ని టీవీల్లో ప్రసారం చేశారు. ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనా కారి్మకులు వెనక్కి తమ దేశంలో పని చేస్తున్న పాలస్తీనియన్ కారి్మకులను వారి సొంత ప్రాంతమైన గాజాకు పంపించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. శుక్రవారం పదుల సంఖ్యలో కారి్మకులను గాజాకు పంపించింది. భారమైన హృదయంతో వారు వెనక్కి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య అక్టోబర్ 7 నుంచి ఘర్షణ మొదలైంది. అంతకంటే ముందు 18,000 మంది పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ ప్రభుత్వం వర్క్ పరి్మట్లు జారీ చేసింది. వారిలో చాలామంది ఇజ్రాయెల్‌కు చేరుకొని, వేర్వేరు పనుల్లో కుదురుకున్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో పాలస్తీనియన్లు వెనక్కి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. -
న్యాయ వ్యవస్థ సంస్కరణల బిల్లుకు ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం
జెరూసలేం: వివాదాస్పద న్యాయ వ్యవస్థ సంస్కరణల బిల్లును ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం తుది ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌ను ప్రతిపక్షం బహిష్కరించింది. బిల్లుకు అనుకూలంగా 64 ఓట్లు లభించగా, వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. ఈ బిల్లుపై ఏకంగా 30 గంటలపాటు పార్లమెంట్లో చర్చ జరిగింది. ఒకవైపు చర్చ జరుగుతుండగానే, మరోవైపు దేశవ్యాప్తంగా బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. జనం వీధుల్లోకి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థలో మార్పులు తలపెట్టడాన్ని అమెరికాతోపాటు పశి్చమ దేశాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. న్యాయ వ్యవస్థను సంస్కరిస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ చెబుతున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం.. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలను కోర్టులు అడ్డుకోరాదు. అంటే న్యాయ వ్యవస్థపై ప్రభుత్వానిదే పైచేయి అవుతుంది. -
సొమ్మసిల్లి పడిపోయిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఆస్పత్రిలో చేరిక
జెరుసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు(73) శనివారం అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరారు. టెల్‌అవీవ్‌లోని షెబా ఆస్పత్రిలో నెతన్యాహుకు చికిత్స అందిస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిపింది. ఇంతకు మించి వివరాలు వెల్లడించలేదు. ఇంటి దగ్గర ఉండగా సొమ్మసిల్లి పడిపోవడంతో నెతన్యాహును ఆస్పత్రికి తీసుకెళ్లారంటూ ఇజ్రాయెల్ వార్తా వెబ్సైట్ ఒకటి పేర్కొంది. ఆయన బాగానే ఉన్నారని, ఆస్పత్రిలో నడుస్తున్నారని కూడా తెలిపింది. అయితే, ఈ వార్తలు అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. ఇజ్రాయెల్‌లో సుదీర్ఘకాలం దాదాపు 15 ఏళ్లుగా నెతన్యాహు అధికారంలో కొనసాగుతున్నారు. -
ఇజ్రాయెల్ ప్రధానిగా మళ్లీ నెతన్యాహు
జెరుసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా లికుడ్ పార్టీ చీఫ్ బెంజమిన్ నెతన్యాహు(73) ఆరోసారి ప్రమాణం చేశారు. 120 మంది సభ్యులుండే నెస్సెట్(పార్లమెంట్)లో గురువారం జరిగిన బలపరీక్షలో నెతన్యాహుకు అనుకూలంగా 69 మంది, వ్యతిరేకంగా 54 మంది సభ్యులు ఓటేశారు. నెతన్యాహు బలహీనుడంటూ నినాదాలు చేసిన పలువురు ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బహిష్కరించారు. అనంతరం నెతన్యాహు పదవీ ప్రమాణం చేశారు. అదే సమయంలో పార్లమెంట్ వెలుపల పెద్ద సంఖ్యలో జనం గుమికూడి నూతన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కొత్తగా సంకీర్ణంలో లికుడ్ పార్టీతోపాటు ఛాందసవాద షాస్, యునైటెడ్ టోరా జుడాయిజం, ఓట్జ్మా యెహుడిట్, జియోనిస్ట్, నోమ్ పార్టీలున్నాయి. -
మోదీ పర్యటన చరిత్రాత్మకం
ఐరాస సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఐక్యరాజ్యసమితి: భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలో పర్యటించడం చరిత్రాత్మకమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పేర్కొన్నారు. ఆయన బుధవారం ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇజ్రాయెల్, భారత్‌కు అంతులేని అవకాశాలున్నాయని మోదీతో సమావేశమయ్యాక గుర్తించామని తెలిపారు. ‘గతేడాది కూడా నేను ఇదే వేదికపై ప్రసంగిస్తూ ప్రపంచం పట్ల ఇజ్రాయెల్ ధోరణిలో వచ్చిన మార్పును వివరించా. అప్పటి నుంచి చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధ్యక్షులు, ప్రధానులు, విదేశాంగ మంత్రులు, ఇతర నాయకులు చాలా మంది ఇజ్రాయెల్‌లో పర్యటించారు. వారిలో చాలా మందికి అదే తొలి పర్యటన. అందులో రెండు మాత్రం చరిత్రాత్మకం. అవి మోదీ, ట్రంప్‌ల పర్యటనలు. తన తొలి విదేశీ పర్యటనను ఇజ్రాయెల్‌లో చేపట్టిన మొదటి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. వేయి ఏళ్ల నాటి యూదు మతస్తుల ఆలయాలను సందర్శించి ఆయన మా మనసులు గెలుచుకున్నారు’ అని నెతన్యాహూ అన్నారు. జూలైలో మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా నిలిచారని చెప్పారు. మోదీతో సమావేశం వివరాలను నెతన్యాహూ ప్రపంచ దేశాల నేతలతో పంచుకున్నారు. ‘మోదీ, నేను సముద్ర తీరంలో ఉన్న చిత్రాలను మీరు చూసి ఉండొ చ్చు. బూట్లు తొలగించి మధ్యధరా సముద్ర తీరం వెంట నడుచుకుంటూ వెళ్లాం’ అని గుర్తుచేసుకున్నారు. అణ్వస్త్రాల నిషేధానికి ముందడుగు! ఐక్యరాజ్యసమితి: ఉత్తర కొరియా నుంచి అణు దాడుల ముప్పు నెలకొన్న నేపథ్యంలో అణ్వాయుధాలను నిషేధిస్తూ కొత్త ఒప్పందంపై 51 దేశాలు సంతకాలు చేయనున్నాయి. అమెరికా, బ్రిటన్, రష్యా తదితర అణు దేశాలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాయి. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బ్రెజిల్ అధ్యక్షుడు మైకేల్ టెమర్ ఈ ఒప్పందంపై తొలి సంతకం చేశారు. మరో 50 దేశాలు సంతకం చేస్తే ఇది అమల్లోకి వస్తుంది. ‘మనం ఈరోజు కీలక దశకు చేరుకున్నాం. అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాలి’ అని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ వ్యాఖ్యానించారు.