IT executives
-
నేటితో రూ.500 పాతనోటుకు రాంరాం
-
ఒక్కరోజులో 20 కోట్లు
దేశవ్యాప్తంగా పలుచోట్ల ఐటీ, ఈడీ దాడులు - పుణెలో బ్యాంకు లాకర్లలో రూ.10 కోట్లు - బెంగళూరులో 2.89 కోట్లు - ఢిల్లీలో వెలుగుచూసిన 3.25 కోట్లు న్యూఢిల్లీ/చండీగఢ్/బెంగళూరు: దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో కోట్ల కొద్దీ నల్లధనం వెలుగుచూస్తోంది. బుధవారం వివిధ రాష్ట్రాల్లో జరిగిన దాడుల్లో రూ. 20 కోట్ల నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లలో రూ.10 కోట్లు.. పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా ఐటీ అధికారులు పుణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోని పలు లాకర్లను సోదాలు చేశారు. అందులో ఉన్న రూ.10 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. పార్వతీ ప్రాంతంలోని బ్యాంక్ శాఖలో ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన పలు లాకర్లు ఉన్నాయి. అధికారులు ఇప్పటివరకు ఐదు లాకర్లను తెరిచారు. ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారుల పాత్ర ఉందనే కోణంలోనూ దర్యాప్తుచేస్తున్నారు. సీజ్ చేసిన నగదులో భారీగా కొత్త రూ. 2 వేల నోట్లు కూడా ఉన్నాయి. స్కానింగ్‌లోనూ తెలియకుండా... ఢిల్లీలో ఐటీ అధికారులు ఒక హోటల్‌పై దాడి చేసి రూ. 3.25 కోట్ల నగదు పట్టుకున్నారు. కరోల్‌బాగ్‌లోని త„ŠS ఇన్ హోటల్లో మూడు గదులపై డాడి చేసి, ఐదుగురిని అరెస్ట్ చేశారు. డబ్బును ప్యాక్చేసిన విధానాన్ని చూసి అధికారులు అవాక్కయ్యారు. నిందితులు విమానాశ్రయాల్లో స్కానింగ్ యంత్రాలు గుర్తించకుండా ప్రత్యేక టేపులు, వైర్లను ప్యాకేజీ కోసం వినియోగించినట్లు అధికారులు తెలిపారు. వీరు ఢిల్లీలోని హవాలా వ్యాపారుల వద్ద నల్లధనం సేకరించి దాన్ని తెల్లధనంగా మార్చుతున్నట్లు గుర్తించారు. చండీగఢ్‌లో రూ.2.20 కోట్లు... చండీగఢ్‌లోని వస్త్రవ్యాపారి ఇందర్‌పాల్ మహాజన్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేసిన దాడుల్లో రూ. 2.20 కోట్ల డబ్బు బట్టబయలైంది. హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మహాజన్ ఇల్లు, షాపులపై దాడులు చేశారు. ఇంట్లోని బెడ్ బాక్సులో, ట్రంకులో, బ్యాగులో రూ.2,19,85,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఒక వ్యాపారి ఇంటిపై చేసిన దాడుల్లో రూ.13.93 లక్షల అక్రమ ధనం వెలుగుచూసింది. రాజస్తాన్‌లోని జైపూర్‌లో రూ.5.68 లక్షలను సీజ్ చేశారు. పుణేలో ఓ కారు నుంచి రూ.67 లక్షలను, గురుగ్రామ్‌లో ఒక కారు నుంచి రూ.9.5 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. ఢిల్లీలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇంట్లో ఐటీ అధికారులు రూ.64.84 లక్షల నల్లధనాన్ని పట్టుకున్నారు. రూ. 70 కోట్లు, 170 కేజీల బంగారం సీజ్ ముంబై: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో చేపట్టిన తనిఖీల్లో రూ.70 కోట్ల నగదు, 170 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) చీఫ్ జనరల్ ఓపీ సింగ్ తెలిపారు. అధికారులపైకి శునకాలు.. సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఇక ఇంటిపై దాడులకు వెళ్లిన ఐటీ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. ఆ ఇంట్లో ఉన్న వృద్ధ మహిళ అధికారులను లోనికి రానీయకుండా వారిపై కాపలాగా ఉన్న రెండు జాతి కుక్కలను వదిలింది. దీంతో నివ్వెరపోయిన అధికారులు పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. ‘యశ్వంత్‌పూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నల్లధనం ఉందన్న సమాచారంతో మంగళవారం దాడులకు వెళ్లాం. అందులో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళ మాకు సహకరించలేదు. మమ్మల్ని కుక్కలు భయపెట్టాయి. దీంతో నిన్న సోదాలు చేయలేకపోయాం’ అని అధికారులు చెప్పారు. తర్వాత ఎట్టకేలకు స్థానికులు, పోలీసుల సాయంతో బుధవారం ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఓ గదికి వేసిన తాళం తీసి సోదాలు చేయగా రూ.2.89 కోట్ల అక్రమ ధనం దొరికింది. ఇందులో రూ. 2.25 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ఉన్నాయి. అధికారులు డబ్బును స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున ఒక వ్యక్తి ఆ ఫ్లాట్‌కు వచ్చినట్లు గుర్తించారు. కాగా, గోవాలో నిర్వహించిన సోదాల్లో రూ.67.98 లక్షల విలువైన కొత్త రూ. 2 వేల నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద నోట్లు రద్దయిన నాటి నుంచి ఇప్పటివరకు కర్ణాటక, గోవాల్లో ఐటీ అధికారులు రూ.29.86 కోట్ల నగదు పట్టుకున్నారు. రూ.500 నోటు చెల్లుబాటు నేటి అర్ధరాత్రి వరకే న్యూఢిల్లీ: పాత రూ.500 నోటు నేటి అర్ధరాత్రి వరకే చెల్లుబాటవుతుంది. అదీ ప్రభుత్వ సర్వీసుల చెల్లింపుల్లో, మెడికల్ షాపుల్లోనే. రూ.500 నోట్లతో మొబైల్ రీచార్జి సదుపాయానికి అవకాశం ఉండదు. ఈ నోట్ల వినియోగానికి ఇచ్చిన డిసెంబర్ 15 గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇక ప్రజలు తమ వద్ద ఉన్న పాత రూ.500 నోట్లను బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘పాత రూ.500 నోట్ల వినియోగానికి ఇచ్చిన మినహాయింపులు డిసెంబర్ 15వ తేదీ అర్ధరాత్రితో ముగుస్తాయి’ అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంతదాస్ బుధవారం ట్వీట్ చేశారు. ఆ మేరకు పాత రూ.500 నోట్లను మెడికల్ షాపుల్లోగానీ, విద్యుత్, నీటి బిల్లులు తదితర ప్రభుత్వ సర్వీసుల చెల్లింపుల్లోగానీ ఇకమీదట ఆమోదించరు. కేంద్ర ం ఇప్పటికే రైలు లేదా విమాన టికెట్ల బుకింగ్, పెట్రోలు బంకులు, టోల్‌ప్లాజాల్లో రూ.500 నోట్ల చెల్లింపుపై పలు మినహాయింపులను ఉపసంహరించడం తెలిసిందే. నిజానికి నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన సందర్భంగా ప్రభుత్వం వివిధ సర్వీసులకోసం రూ.500, రూ.1000 నోట్లు చెల్లించేందుకు 72 గంటల వ్యవధి వరకు అనుమతించింది. అయితే ఈ డెడ్‌లైన్ ఎప్పటికప్పుడు పెరుగుతూ డిసెంబర్ 15 వరకు కొనసాగింది. ప్రస్తుతం ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. -
‘యాదాద్రి’పై ఐటీ నజర్!
- దేవస్థానంలో ‘పెద్ద’ నోట్లను మార్పిడి చేస్తున్నారని ఫిర్యాదులు - భక్తుల రూపంలో రహస్య విచారణ చేస్తున్న అధికారులు యాదగిరికొండ: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు దృష్టి పెట్టారు. దేవస్థానం అధికారులు రూ.500, రూ.1,000 నోట్లను పెద్ద ఎత్తున మార్పిడి చేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు.. కొందరు అధికారులు రంగంలోకి దిగినట్టు తెలిసింది. వారు భక్తుల రూపం తిరుగుతూ నగదు మార్పిడికి ఏ విధంగా జరుగుతోంది, సహకరిస్తున్న అధికారులెవరనే విషయాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రసాద విక్రయశాల, టికెట్ కౌంటర్లు సహా పలు సెక్షన్ల వద్ద నిఘా పెట్టి.. రూ.500, రూ.వెయ్యి నోట్లను చిల్ల రగా మార్చుకుని వెళ్తున్న వారిని గమనిస్తున్నారని తెలుస్తోంది. ఇక దేవస్థానంలో పనిచేస్తున్న కొందరు అధికారులు ఇటు ఉద్యోగం చేస్తూ, మరోవైపు వ్యాపారాలు చేస్తూ లక్షలు ఆర్జిస్తున్నారని, పన్నులు ఎగవేస్తున్నారనే సమాచారంపైనా అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. -
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
-
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
పటాన్ చెరు: మెదక్ జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంట్లో గురువారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. ఎమ్మెల్యే ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లోనూ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసానికి ఐటీ అధికారులు చేరుకున్నారు. ఆదాయ పన్ను శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్, సంగారెడ్డి ఆదాయ పన్ను శాఖ అధికారి సాయిప్రతాప్ నేతృత్వంలో 20 మందికి పైగా అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్థిరాస్తులను పరిశీలించి వాటి వివరాలు సేకరించారు. జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నివాసంతోపాటు వారి బంధువుల వద్ద తనిఖీలు నిర్వహించారు. అధికారులు సోదాలు ప్రారంభించిన సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేరు. విషయం తెలుసుకుని సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో ఆయన తన నివాసానికి చేరుకున్నారు. అధికారులు అడిగిన వివరాలను వెల్లడించినట్టు తెలిసింది. ఎమ్మెల్యే ఆదాయ వ్యవహారాలు చూసే ఆడిటర్లు సైతం అధికారుల ముందు హాజరయ్యారు. వారి నుంచి కూడా వివరాలు సేకరించారు. ఎమ్మెల్యే నివాసంలో నగదు నిల్వలు ఉండవచ్చన్న అనుమానంతో అధికారులు దాడులు చేశారనే వదంతులు విన్పిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన నివాసంలో రూ.5లక్షల నగదు, 30 తులాల బంగారం ఉన్నట్టు తెలిసింది. ఇదిలావుండగా గతంలో ఓ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బెదిరించారనే కేసులో ఎమ్మెల్యేకు రెండున్నరేళ్లు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ కేసు హైకోర్టులో కొనసాగుతుంది. ఈ కేసు తీర్పు ప్రకారం ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పన్ను చెల్లింపులో జాప్యం జరిగింది: ఎమ్మెల్యే ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడంలో జాప్యం జరిగినందున అధికారులు సోదాలు చేస్తున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తానని చెప్పారు. అధికారులు కోరిన విధంగా అన్ని పత్రాలు చూపించినట్టు తెలిపారు. అనువంశికంగా వచ్చిన ఆస్తులను డెవలప్మెంటుకు ఇచ్చామని, ప్రతి పైసాకు తమ వద్ద లెక్కలు ఉన్నాయని వివరించారు. -
ఖరీదైన కారు కొంటే...ఐటీ కంట్లో పడినట్లే
న్యూఢిల్లీ: పన్ను పరిధిని పెంచడంతో పాటు అప్రకటిత ఆదాయానికి చెక్ పెట్టేందుకు ఆదాయ పన్ను (ఐటీ) విభాగం కొత్త వ్యూహాన్ని రూపొందించింది. ఆర్థికంగా వృద్ధిచెందుతున్న కొన్ని నగరాల్లో లగ్జరీ కార్ల కొనుగోలు, పెట్టుబడులపై వడ్డీ, వ్యక్తిగత వ్యయం, ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే మూలధన రాబడి (క్యాపిటల్ గెయిన్స్) తదితర లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణే, కొచ్చి, లక్నో, భోపాల్, గువాహటిల్లో ఈ మేరకు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాల్సిందిగా నిఘా, నేర పరిశోధన కార్యాలయం(డీఐసీఐ)ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదేశించింది. గువాహటిలో షాపింగ్ మాల్స్, ఇతర మార్కెట్లలో భారీగా చేసే వ్యక్తిగత ఖర్చులను, విద్యాసంస్థలకు చేసే చెల్లింపులను, భవనాల కొనుగోళ్లను అధికారులు విశ్లేషించనున్నారు. బెంగళూరులో కార్పొరేట్ బాండ్లు, సహకార రుణ సంఘాలు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో పెట్టుబడులపై వ్యక్తులకు వచ్చే వడ్డీని అక్కడి ఐటీ అధికారులు పరిశీలించనున్నారు. తమిళనాడులో ఇసుక తవ్వకం, కలప దిగుమతుల్లోకి వచ్చే పెట్టుబడులపై చెన్నైలోని ఐటీ ఉద్యోగులు ఆరా తీయనున్నారు. ఇటీవల న్యూఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన సీబీడీటీ, ఐటీ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐటీ ఈమెయిల్ ఐడీని భద్రంగా ఉంచుకోండి.. ఐటీ రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్ కోసం ట్యాక్స్‌పేయర్ల ఈమెయిల్ ఐడీలు, మొబైల్ ఫోన్ నంబర్లను ఇప్పటికే కోరిన ఐటీ విభాగం తాజాగా తమ ఈమెయిల్ ఐడీని సేఫ్ లిస్ట్‌లో భద్రపర్చుకోవాలని సూచించింది. పన్ను చెల్లింపుదారులు తమ ఇన్‌బాక్స్‌లోని వైట్/సేఫ్ లిస్ట్‌లో donotreply @incometax indiaefiling.gov.in అనే ఐడీని ఉంచాలనీ, తద్వారా స్పామ్, జంక్ ఫోల్డర్లోకి వెళ్లకుండా చూసుకోవాలనీ కోరింది. దీనివల్ల తాము పంపే మెయిళ్లు స్పామ్, జంక్ ఫోల్డర్లోకి వెళ్లకుండా ఉంటాయని తెలిపింది.