పాత రూ.500 నోటు నేటి అర్ధరాత్రి వరకే చెల్లుబాటవుతుంది. అదీ ప్రభుత్వ సర్వీసుల చెల్లింపుల్లో, మెడికల్ షాపుల్లోనే. రూ.500 నోట్లతో మొబైల్ రీచార్జి సదుపాయానికి అవకాశం ఉండదు. ఈ నోట్ల వినియోగానికి ఇచ్చిన డిసెంబర్ 15 గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.