IT services sector
-
ఎల్టీఐ–మైండ్‌ట్రీ ఆవిర్భావం
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ గ్రూప్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ విలీనమయ్యాయి. ఎల్టీఐ–మైండ్‌ట్రీ పేరుతో కొత్త సంస్థ ఏర్పాటైనట్లు ఎల్అండ్టీ తాజాగా వెల్లడించింది. దీంతో సంయుక్త సంస్థ దేశీ ఐటీ సర్వీసుల రంగంలో 5.25 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఆరో పెద్ద కంపెనీగా ఆవిర్భవించినట్లు తెలియజేసింది. విలీనం వెనువెంటనే అమల్లోకి వచ్చినట్లు ఎల్అండ్టీ గ్రూప్ చైర్మన్ ఏఎం నాయక్ ప్రకటించారు. ఎల్టీఐ మైండ్‌ట్రీలో ట్రేడింగ్ 24 నుంచి ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. రూ. 1.53 లక్షల కోట్ల(సోమవారం ముగింపు) మార్కెట్ విలువతో సాఫ్ట్వేర్ రంగంలో ఐదో ర్యాంకులో నిలుస్తున్నట్లు తెలియజేశారు. విలీన సంస్థలో ఎల్అండ్టీ 68.73 శాతం వాటాను కలిగి ఉంది. విలీనంలో భాగంగా మైండ్‌ట్రీ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ 100 షేర్లకు 73 ఎల్టీఐ షేర్లు జారీ చేయనున్నట్లు నాయక్ తెలియజేశారు. ఇందుకు ఈ నెల 24 రికార్డ్ డేట్‌గా నిర్ణయించారు. ఈ ఏడాది మే నెలలో రెండు కంపెనీల విలీనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. విలీనం నేపథ్యంలో ఎన్ఎస్ఈలో మైండ్‌ట్రీ షేరు 2.7 శాతం ఎగసి రూ. 3,760 వద్ద, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 2 శాతం బలపడి రూ. 5,161 వద్ద ముగిశాయి. -
ప్రపంచ విలువైన కంపెనీల్లో టీసీఎస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల్లో ఉన్న భారత దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు (టీసీఎస్) మరో గుర్తింపు లభించింది. ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్స్‌లో మూడవ స్థానం చేజిక్కించుకుంది. యాక్సెంచర్, ఐబీఎంలు తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయని బ్రాండ్ ఫైనాన్స్–2021 నివేదిక తెలిపింది. ఐటీ రంగంలో అంతర్జాతీయంగా టాప్–10లో భారత్ నుంచి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో చోటు దక్కించుకున్నాయి. టీసీఎస్ బ్రాండ్ విలువ 2020తో పోలిస్తే 2021లో 1.4 బిలియన్ డాలర్లు ఎగసి 14.9 బిలియన్ డాలర్లకు చేరింది. వృద్ధి పరంగా 25 ఐటీ కంపెనీల్లో ఇదే అత్యధికం. కస్టమర్లు తమపై ఉంచిన నమ్మకానికి ఇది నిదర్శనమని టీసీఎస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆర్.రాజశ్రీ ఈ సందర్భంగా తెలిపారు. మెరుగైన ప్రతిభ.. ఐటీ కంపెనీలన్నిటి మొత్తం బ్రాండ్ విలువ 3 శాతం తగ్గితే.. టీసీఎస్ సుమారు 11 శాతం వృద్ధి సాధించడం ఇక్కడ గమనార్హం. 2020 నాల్గవ త్రైమాసికంలో ఈ సంస్థ ఏకంగా 6.8 బిలియన్ డాలర్ల డీల్స్‌ను చేజిక్కించుకోవడంతో బలమైన ఆదాయం నమోదు చేసింది. ఐటీ రంగంలో టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సైతం గరిష్ట స్థాయిని తాకింది. బ్రాండ్ విలువ పరంగా ప్రపంచంలో ఈ రంగంలో రెండవ స్థానానికి చేరువలో టీసీఎస్ ఉందని బ్రాండ్ ఫైనాన్స్ సీఈవో డేవిడ్ హైగ్ తెలిపారు. రికవరీ మొదలుకావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఐటీ రంగంతోపాటు యూఎస్, యూరప్‌లో ఫైనాన్షియల్ సెక్టార్లో పెట్టుబడులు పెరగడం కారణంగా రాబోయే ఏడాదిలో మరింత మెరుగైన ప్రతిభ కనబరుస్తుందని నివేదిక వెల్లడించింది. సంస్థలో ప్రస్తుతం 4,69,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తొలి స్థానంలో యాక్సెంచర్.. ప్రపంచంలో అత్యంత విలువైన, బలమైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్‌గా యాక్సెంచర్ తన స్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ సంస్థ బ్రాండ్ వాల్యూ 26 బిలియన్ డాలర్లుగా ఉంది. రెండవ స్థానాన్ని పదిలపర్చుకున్న ఐబీఎం బ్రాండ్ విలువ 16.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక కాగ్నిజెంట్‌ను దాటి నాల్గవ స్థానానికి ఇన్ఫోసిస్ ఎగబాకింది. ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ 19 శాతం అధికమై 8.4 బిలియన్ డాలర్లుగా ఉంది. వేగంగా వృద్ధి చెందుతున్న టాప్–10 బ్రాండ్లలో స్థానం సంపాదించింది. మహమ్మారికి ముందే డేటా సెక్యూరిటీ, క్లౌడ్ సర్వీసెస్‌పై దృష్టిసారించాలన్న ప్రాముఖ్యతను గుర్తించింది. కన్సల్టింగ్, డేటా మేనేజ్మెంట్, క్లౌడ్ సర్వీసెస్ విభాగాల్లో భారీ ప్రాజెక్టులను దక్కించుకోవడంతో ఇన్ఫోసిస్ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. కాగ్నిజెంట్ బ్రాండ్ విలువ 6 శాతం తగ్గి 8 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. హెచ్‌సీఎల్–7, విప్రో–9, టెక్ మహీంద్రా–15వ స్థానానికి వచ్చి చేరాయి. -
విప్రో లాభం 2,235 కోట్లు
క్యూ2లో 7.2 శాతం వృద్ధి * ఆదాయం రూ. 12,567 కోట్లు; 6.3 శాతం అప్ గడిచిన క్వార్టర్(క్యూ2)లో కంపెనీ అన్ని విభాగాల్లో మంచి పురోగతిని కనబరిచింది. ఐటీ సేవల రంగంలో డాలరు రూపేణా(స్థిర కరెన్సీ ప్రాతిపదికన) 3.1 శాతం ఆదాయ వృద్ధిని సాధించాం. రానున్న కాలంలో స్థిరమైన డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాం. ఇక పెద్ద డీల్స్ విషయంలో పోటీ తీవ్రంగా ఉంది. కొత్త కాంట్రాక్టులకు సంబంధించి ప్రైసింగ్ ఒత్తిళ్లు కూడా కొనసాగే అవకాశం ఉంది. - టీకే కురియన్, విప్రో సీఈఓ బెంగళూరు: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో... ఈ ఏడాది రెండో త్రైమాసికం(2015-16, క్యూ2)లో రూ.2,235 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.2,085 కోట్లతో పోలిస్తే లాభం 7.2 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం క్యూ2లో 6.3 శాతం వృద్ధితో రూ.11,816 కోట్ల నుంచి రూ.12,567 కోట్లకు ఎగబాకింది. సీక్వెన్షియల్‌గా... కాగా, ఈ ఏడాది జూన్ క్వార్టర్(క్యూ1-రూ.2,188 కోట్లు)తో పోలిస్తే సీక్వెన్షియల్‌గా కంపెనీ లాభం 2.1 శాతం మాత్రమే పెరిగింది. ఆదాయం కూడా క్యూ1లో రూ.12,371 కోట్లతో పోలిస్త్తే... స్వల్పంగా 1.6 శాతం వృద్ధి నమోదైంది. ఐటీ సేవల విషయానికొస్తే.. కంపెనీ ప్రధాన వ్యాపారమైన ఐటీ సేవల విభాగం ఆదాయం క్యూ2లో రూ.12,043 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.10,923 కోట్లతో పోలిస్తే... 10.2 శాతం ఎగసింది. సీక్వెన్షియల్‌గా చూస్తే(క్యూ1లో రూ. 11,573 కోట్లు) 4 శాతం పెరిగింది. డాలర్ల రూపంలో సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఆదాయం 2.1 శాతం వృద్ధితో 1.83 బిలియన్లుగా నమోదైంది. తమ అంచనా(గెడైన్స్) 1.82-1.85 బిలియన్ డాలర్లకు అనుగుణంగానే ఐటీ సేవల ఆదాయం నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. ఇక ప్రస్తుత మూడో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో ఐటీ సేవల ఆదాయం 1.841-1.878 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చిన కంపెనీ అంచనా వేసింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... * క్యూ2లో 67 కొత్తగా క్లయింట్లను దక్కించుకుంది. * ఐటీ ఉత్పత్తుల విభాగ ఆదాయం రూ.544 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది క్యూ2లో రూ.915 కోట్లతో పోలిస్తే 40.5% దిగజారింది. * ఐటీ సేవల విభాగంలో కంపెనీ గత క్వార్టర్లో 6,607 మందిని నియమించుకుంది. దీంతో సెప్టెంబర్ చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,68,396కు చేరింది. * ఈ ఏడాది డిజిటల్ టెక్నాలజీలకు సంబంధించి దాదాపు 10,000 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఒక ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు విప్రో వెల్లడించింది. * క్రాస్-కరెన్సీ(డాలరుతో ఇతర ప్రధాన కరెన్సీల విలువల్లో హెచ్చుతగ్గులు) ప్రభావం నిర్వహణ మార్జిన్లపై పడినప్పటికీ.. డాలరుతో రూపాయి మారకం విలువ తగ్గుదలతో దీన్ని ఎదుర్కోగలినట్లు కంపెనీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ చెప్పారు. * యూరప్, అమెరికాల్లో సెలవుల సీజన్ కారణంగా డీల్స్ కుదుర్చుకోవడంలో మందగమనం, తక్కువ పనిదినాల కారణంగా క్యూ3 ఆదాయాలపై ప్రభా వం చూపనునందని కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ధర బుధవారం బీఎస్ఈలో 1 శాతం పెరిగి రూ.578 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.