ITI student
-
దారుణం: ‘ప్లీజ్ మా చెల్లి వెంటపడొద్దు’
లక్నో: తన చెల్లి వెంట ఒకరు వెంట పడుతున్నాడని తెలిసి సోదరుడు కల్పించుకుని అతడికి సర్ది చెప్పాడు. ఇదే ఆ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. తన చెల్లి వెంటపడొద్దని హితవు పలికిన అతడిని నలుగురు వ్యక్తులు కలిసి స్కార్ఫ్‌తో దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం.. రూ.20 లక్షలు ఇస్తే వదిలేస్తామని ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లా బజ్హేర గ్రామానికి చెందిన సురేంద్ర పాల్ ఐటీఐ చదువుతున్నాడు. ఇటీవల తన చెల్లి వెంట స్థానికుడు శివకుమార్ వెంటపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సురేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన చెల్లి వెంట పడొద్దని హితవు పలికాడు. దూరంగా ఉండాలని.. ఇకపై కనిపించవద్దని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో శివకుమార్ సరే అని చెప్పాడు. అయితే ఆమెకు దూరంగా ఉండడం శివ తట్టుకోలేకపోయాడు. జరిగిన విషయాన్ని శివ తన స్నేహితుడు భూపేంద్రకు చెప్పాడు. శివకు ఓదార్చిన భూపేంద్ర దీనికి ఓ పరిష్కారం చేస్తా అని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో సురేంద్ర పాల్‌ను కిడ్నాప్ చేసి హత్య చేయాలని ప్రణాళిక రచించాడు. సురేంద్ర, భూపేంద్ర దూరపు బంధువులు. ఈ చనువుతో సురేంద్రను మద్యం సేవిద్దామని భూపేంద్ర పిలిపించాడు. నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరూ మద్యం సేవించారు. అయితే సురేంద్రకు పీకల దాక భూపేంద్ర మద్యం తాగించాడు. అనంతరం స్కార్ఫ్‌తో సురేంద్రను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మధురకు సమీపంలోని యమున నదిలో విసిరేశాడు. అనంతరం మృతుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ‘మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం. రూ.20 లక్షలు ఇస్తే వదిలేస్తాం’ అని బెదిరించారు. కంగారు పడిన కుటుంబీకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలో శివకుమార్, రాహుల్ సింగ్, రతన్ సింగ్ పాత్ర కూడా ఉందని తేలింది. దీంతో వారిని అలీఘర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 364 ఏ, 302, 201 సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు. యమున నది తీరంలో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెల్లి ప్రేమ అన్న ప్రాణం మీదకు వచ్చిందని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: ‘ఇటుక’ దొంగతనం చేశాడని హీరోపై ఫిర్యాదు చదవండి: ఆడియో క్లిప్ వైరల్: ‘నందిగ్రామ్‌లో సాయం చేయండి’ -
ముక్కలుగా నరికి బోర్‌బావిలో పడేశారు
లక్నో: గత మూడు రోజుల నుంచి మీరట్ పోలీసులు ఓ యువకుడి మృతదేహం కోసం బోరు బావిని తవ్వుతునే ఉన్నారు. నీళ్లు పడ్డాయి కానీ శరీర భాగాలు మాత్రం లభించలేదు. వివరాలు.. మీరట్‌కు చెందిన ఐటీఐ విద్యార్థి రూపక్(20) గత నెల 25న స్నేహితులను కలవాలంటూ ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాలేదు. దాంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు రూపక్ స్నేహితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. స్నేహితులు, రూపక్ సోదరి గురించి చెడుగా మాట్లాడటంతో వారి మధ్య గొడవ ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో స్నేహితుల్లో ఒకడైన వివేక్ రూపక్ని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం మృతదేహాన్ని పొలంలోని ఓ ఇటుక బట్టీ వద్ద పాతి పెట్టారు. కానీ పోలుసులకు దొరికిపోతామనే ఉద్దేశంతో మృతదేహాన్ని వెలికి తీసి ముక్కలుగా చేశారు. అనంతరం ఊరవతల ఉన్న బోరువెల్‌లో మృతదేహం ముక్కలను పడేసినట్లు వివేక్ బృందం పోలీసులకు తెలిపింది. దాంతో గత మూడు రోజులుగా పోలీసులు రూపక్ శరీర భాగాల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి ఆధారం లభించలేదు. శరీర భాగాలు బావి లోపల చాలా లోతులో అయినా పడి ఉండాలి లేదా నిందితులు తప్పుడు సమాచారం అయినా ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో చాలా జాగ్రత్తగా తవ్వకాలు జరుపుతున్నారు. నీటి పారుదల శాఖ సాయం కూడా తీసుకున్నారు. ఇప్పటికే 50 అడుగులు లోతు తవ్వారు. నీళ్లు పడ్డాయి.. కానీ శరీర భాగాలు మాత్రం లభ్యం కాలేదు. రూపక్ మృతదేహం లభించకపోతే.. నిందితుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేమంటున్నారు పోలీసులు. -
జననేతా.. నీతోనే మా భవిత
-
ట్రాక్టర్ బోల్తాపడి విద్యార్థి మృతి
టేకులపల్లి : పొలం దున్నేందుకు వెళ్ళిన ఐటీఐ విద్యార్ధి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా లో జరిగింది. టేకులపల్లి మండల పరిధిలోని రాజుతండాలో జరిగింది. కొత్తగూడెం మండలం కారుకొండ రామారానికి చెందిన గుండ్ల రంజిత్ కుమార్ (19) ఐటీఐ చదువుతున్నాడు. బుధవారం ఉదయం తన పొలాన్ని దున్నేందుకు ట్రాక్టర్‌పై వెళ్లాడు. మండల పరిధిలోని రాజుతండా సమీపంలో వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ట్రాక్టర్‌తో సహా రంజిత్ లోయలో పడిపోయాడు. తీవ్ర గాయాలైన రంజిత్ అక్కడి కక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని..
ధర్మవరం అర్బన్: తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదేమోనన్న ఆవేదనతో మంగళవారం సాయంత్రం ఐటీఐ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా.. నార్పల మండలానికి చెందిన గణేష్ మండల కేంద్రం చెన్నేకొత్తపల్లిలోని తన పెద్దనాన్న రామాంజనేయులు వద్ద ఉంటూ ఐటీఐ చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో ఉన్న తమ బంధువుల అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అయితే తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనన్న భయంతో ఇంట్లో ఉన్న విష రసాయన పదార్థాన్ని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. చెన్నేకొత్తపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చదువుకోరా అంటే.. ఆత్మహత్య చేసుకున్నాడు..
శ్రీకాకుళం జిల్లా భామిని మండల కేంద్రానికి చెందిన ఓ ఐటీఐ విద్యార్థి తల్లిదండ్రులు మందలించారని... మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రత్నాల మోహన్‌రావు శ్రీకాకుళంలో ఐటీఐ చదువుతున్నాడు. కొన్ని రోజులుగా కళాశాలకు వెళ్లకపోవడంతో చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన మోహన్‌రావు మంగళవారం ఉదయం పురుగుల ముందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. ఆస్పత్రిలో మరణించాడు.