Ivanovic
-
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇవానిసెవిచ్
ఫ్లోరిడా: క్రొయేషియా మాజీ టెన్నిస్ ప్లేయర్ ఇవానిసెవిచ్కు గొప్ప గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇవానిసెవిచ్కు చోటు లభించింది. ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న 49 ఏళ్ల ఇవానిసెవిచ్ ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగి 2001లో వింబుల్డన్ టోర్నీ టైటిల్‌ను గెలిచాడు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించా డు. ఇవానిసెవిచ్తోపాటు మాజీ నంబర్‌వన్ హెవిట్ (ఆస్ట్రేలియా), వింబుల్డన్ మాజీ విజేత కొంచిటా మార్టినెజ్ (స్పెయిన్)లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం దక్కింది. -
సెమీస్‌లో ఇవనోవిచ్, సఫరోవా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో టాప్ సీడ్లు అనా ఇవనోవిచ్, లూసీ సఫరోవా దూసుకెళ్తున్నారు. మహిళల సింగిల్స్‌లో ఇవనోవిచ్, సఫరోవా సెమీస్‌లో ప్రవేశించారు. క్వార్టర్స్‌లో ఇవనోవిచ్ 6-3, 6-2 స్కోరుతో ఎలీనా స్విటోలినాపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో సఫరోవా 7-6 (7/3), 6-3 తో గార్బినె ముగురుజను ఓడించింది. -
ఈసారి ఇవనోవిచ్, క్విటోవా...
మూడో రౌండ్లోనే ఓడిన మాజీ విజేత, ఐదో సీడ్ సఫరోవా, కుజ్నెత్సోవా అద్భుత విజయాలు ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఏ ముహూర్తాన ప్రారంభమైందోగాని మహిళల విభాగంలో సీడెడ్ క్రీడాకారిణులకు ఏమాత్రం కలిసిరావడంలేదు. తొలి రోజు మొదలైన అగ్రశ్రేణి క్రీడాకారిణుల పరాజయాల పర్వం శనివారం కూడా కొనసాగింది. ఇప్పటికే టాప్ సీడ్ సెరెనా (అమెరికా), రెండో సీడ్ నా లీ (చైనా), మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) ఇంటిదారి పట్టగా... తాజాగా వీరి సరసన ఐదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), 11వ సీడ్, 2008 చాంపియన్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) చేరారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో 23వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 6-3తో ఇవనోవిచ్‌ను బోల్తా కొట్టించగా... హోరాహోరీ పోరులో 2009 చాంపియన్, 27వ సీడ్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) 6-7 (3/7), 6-1, 9-7తో క్విటోవాపై అద్భుత విజయం సాధించింది. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో సెట్టే 92 నిమిషాలు జరగడం విశేషం. 2009లో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన తర్వాత స్వెత్లానా మరో 17 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడినా ఏ దాంట్లోనూ క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. మ్యాచ్ మొత్తంలో స్వెత్లానా నాలుగు ఏస్‌లు సంధించగా... నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, కేవలం 20 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు 2011 వింబుల్డన్ చాంపియన్ క్విటోవా 11 డబుల్ ఫాల్ట్‌లు, 65 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. సిమోనా, జంకోవిచ్ ముందంజ మహిళల సింగిల్స్ ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) 6-3, 6-0తో మరియా తెరెసా (స్పెయిన్)పై, ఆరో సీడ్ జెలెనా జంకోవిచ్ (సెర్బియా) 6-1, 6-2తో 26వ సీడ్ సొరానా కిర్స్టీ (రుమేనియా)పై, 10వ సీడ్ సారా ఎరాని (ఇటలీ) 6-0, 6-1తో గ్లుష్కో (ఇజ్రాయెల్)పై, 15వ సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6-3, 6-4తో 22వ సీడ్ మకరోవా (రష్యా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. నాదల్, ఫెరర్ జోరు పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఐదో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మూడో రౌండ్లో నాదల్ 6-2, 7-5, 6-2తో మాయర్ (అర్జెంటీనా)పై, ఫెరర్ 6-2, 7-6 (7/2), 6-3తో ఆండ్రియా సెప్పి (ఇటలీ)పై గెలిచారు. 23వ సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 5-7, 6-2, 6-4, 0-6, 6-2తో 14వ సీడ్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ)ను బోల్తా కొట్టించాడు. ప్రిక్వార్టర్స్‌లో సానియా జోడి మహిళల డబుల్స్ విభాగంలో ఐదో సీడ్ సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన రెండో రౌండ్లో సానియా-కారా బ్లాక్ జంట 6-1, 6-2తో డబ్రోవ్స్కీ (కెనడా)-రొసోల్‌స్కా (పోలండ్) ద్వయంపై గెలిచింది. తదుపరి మ్యాచ్‌లో జంకోవిచ్ (సెర్బియా)-క్లెబనోవా (రష్యా) జోడితో సానియా జంట తలపడుతుంది. -
ఇవనోవిచ్ అలవోకగా...
న్యూయార్క్: ప్రపంచ మాజీ నంబర్‌వన్ అనా ఇవనోవిచ్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 13వ సీడ్ ఇవనోవిచ్ 6-2, 6-0తో అనా తాతిష్విలి (జార్జియా)పై గెలిచింది. 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా, ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించిన ఇవనోవిచ్ కెరీర్ ఆ తర్వాత తడబడింది. బరిలోకి దిగిన గత 21 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఈ సెర్బియా బ్యూటీ కేవలం ఒక టోర్నీలో (గత ఏడాది యూఎస్ ఓపెన్‌లో) మాత్రమే క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. ఈసారి గత ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఇవనోవిచ్‌కు తొలి రౌండ్లో అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసిన ఈ మాజీ నంబర్‌వన్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-2, 3-6, 6-1తో మిసాకి డోయ్ (జపాన్)పై కష్టపడి గెలుపొందగా... 10వ సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) 6-4, 6-2తో తిమియా బాబోస్ (హంగేరి)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 10వ సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) 6-3, 7-6 (8/6), 6-3తో ఫాబియానో (ఇటలీ)పై విజయం సాధించాడు. నాదల్ శుభారంభం గాయం నుంచి కోలుకున్నాక అద్భుత ఫామ్‌లో ఉన్న 2010 యూఎస్ ఓపెన్ చాంపియన్ రాఫెల్ నాదల్కు తొలి రౌండ్లో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. ‘అమెరికా రైజింగ్ స్టార్’ ర్యాన్ హారిసన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాదల్ 6-4, 6-2, 6-2తో గెలిచి హార్డ్ కోర్టు సీజన్లో వరుసగా 16వ విజయాన్ని నమోదు చేశాడు. మరోవైపు 27వ సీడ్ ఫెర్నాండో వెర్దాస్కో (స్పెయిన్), 30వ సీడ్ ఎర్నెస్ట్ గుల్బిస్ (లాత్వియా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. ఇవాన్ డొడిగ్ (క్రొయేషియా) 6-3, 7-5, 1-6, 4-6, 6-3తో వెర్దాస్కోపై; ఆండ్రియా హైదర్ మారెర్ (ఆస్ట్రియా) 3-6, 6-3, 1-6, 7-6 (7/4), 6-4తో గుల్బిస్పై గెలిచారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 7-5, 6-3, 6-2తో కిర్గియోస్ (ఆస్ట్రేలియా)పై; ఎనిమిదో సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-2తో రసెల్ (అమెరికా)పై; 19వ సీడ్ టామీ రొబ్రెడో (స్పెయిన్) 6-3, 6-7 (6/8), 6-3, 6-2తో మాటోసెవిచ్ (ఆస్ట్రేలియా)పై; 23వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) 6-7 (4/7),6-2, 6-3, 6-3తో సెరా (ఫ్రాన్స్)పై నెగ్గారు. సెరెనా ముందంజ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ తన టైటిల్ వేటను ఘనంగా ప్రారంభించింది. తొలి రౌండ్లో టాప్ సీడ్ సెరెనా 6-0, 6-1తో 2010 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఫ్రాన్సెస్కా షియవోని (ఇటలీ)ని చిత్తు చేసింది. క్యాన్సర్‌ను జయించి... రెండేళ్ల క్రితం ప్రపంచ 20వ ర్యాంకర్‌గా నిలిచి ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడిన రష్యా టెన్నిస్ ప్లేయర్ అలీసా క్లెబనోవా పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. 24 ఏళ్ల క్లెబనోవా తొలి రౌండ్లో 6-4, 3-6, 7-5తో మోనికా పుయెగ్ (ప్యూర్టోరికో)పై గెలిచింది. గతంలో యూఎస్ ఓపెన్‌లో ఆడిన రెండుసార్లూ ఈ రష్యా ప్లేయర్ రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. ‘క్యాన్సర్ నుంచి బయటపడి మళ్లీ రాకెట్ పట్టినందుకు ఆనందంగా ఉంది. మళ్లీ విజయాలబాట పడతాననే విశ్వాసం ఉంది. 2011 మేలో క్యాన్సర్ బారిన పడ్డాను. ఆ తర్వాత ఆరు నెలలపాటు కిమోథెరపీ చేయించుకున్నాను. చాలా రోజుల క్రితమే చికిత్స పూర్తయినా కోలుకోవడానికి సమయం పట్టింది. మొత్తానికి మరోసారి మెగా ఈవెంట్లో ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది’ అని క్లెబనోవా వ్యాఖ్యానించింది. ఈమె 2003లో సానియా మీర్జాతో కలిసి వింబుల్డన్ జూనియర్ బాలికల డబుల్స్ టైటిల్ నెగ్గింది.