J P Nadda
-
భారత్లో 21.17 లక్షల హెచ్ఐవీ రోగులు
న్యూఢిల్లీ : భారత్లో హెచ్ఐవీ రోగుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ప్రస్తుతం 21.17 లక్షల మంది హెచ్ఐవీ రోగులతో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జె.పి.నడ్డా వెల్లడించారు. శుక్రవారం లోక్సభలో మంత్రి నడ్డా మాట్లాడుతూ... 68 లక్షల మంది హెచ్ఐవీ రోగులతో దక్షిణాఫ్రికా మొదటి స్థానం ఆక్రమించగా... 34 లక్షలతో నైజీరియా రెండో స్థానంలో నిలిచిందన్నారు. అయితే దేశంలో కొత్త హెచ్ఐవీ కేసుల నమోదు సంఖ్య తగ్గిందన్నారు. ఈ కేసుల సంఖ్య తగ్గించడం ఈ ప్రభుత్వానికి ఓ చాలెంజ్ అని జె.పి.నడ్డా అభిప్రాయపడ్డారు. -
'రాష్ట్రానికి కేంద్రం రూ. లక్ష కోట్ల బడ్జెట్ కేటాయింపు'
నల్గొండ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నడ్డా స్పష్టం చేశారు. అందులోభాగంగా తెలంగాణకు మోదీ సర్కార్ రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. బుధవారం నల్గొండలో జె.పి.నడ్డా విలేకర్లతో మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్ రైలు సర్వీసు యాదాద్రి వరకు పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. మూసీ నదీ ప్రక్షాళనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి పరిశోధక బృందాలను పంపించి శుద్ధి చేయిస్తామని వెల్లడించారు. -
కిడ్నీ దానాలకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: అవయవదానాలను ప్రోత్సహించే క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరో అడుగు ముందుకు వేసింది. మూత్రపిండాల(కిడ్నీల) దానం ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ శుక్రవారం నూతన మార్గదర్శకాలను విడుదలచేసింది. ఆ మేరకు నోటో(నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్) అధికారిక వెబ్ సైట్ www.notto.nic.in లో సంపూర్ణ వివరాలను పొందుపర్చింది. కిడ్నీ దానాలకు సంబంధించి సభ్య సమాజం నుంచి మరిన్ని సూచనలు అవసరమని, అట్టి సలహాలను జనవరి 16లోగా వెబ్ సైట్ లో సూచించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. నూతన మార్గదర్శకాల ద్వారా కిడ్నీ గ్రహీతలు, దాతల సంఖ్యలో భారీ తేడాలు, అవయవ మార్పిడిలో రాష్ట్రాల మధ్య సమన్వయలోపం తదితర ఆటంకాలను అధిగమించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల్లో కొన్ని ముఖ్యాంశాలు కిడ్నీల వ్యాధితో బాధపడుతూ, ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరమైన రోగులు ముందుగా www.notto.nic.in ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి. అది కూడా ఒక ఆసుపత్రి ద్వారా ఒకసారి మాత్రమే రిజిస్టర్ చేయించుకోవాలి. గ్రహీత వయసు 65 సంవత్సరాలు మించకూడదు. ఆయా రాష్ట్రాలు, లేదా టెరిటరీల పరిధిలోని కిడ్నీ అడ్వయిజరీ కమిటీల ఆమోదంతో రోగుల పేర్లను ఆన్ లైన్ స్క్రోలింగ్ లో ఉంచుతారు. అలాగే దాతల వివరాలను కూడా ఆన్ లైన్ లో ఉంచుతారు. దాతలు, గ్రహీతల మధ్య సమన్వయం మెరుగుపర్చేలా ఒకే ప్రాంతంలో లేదా ఒకే రాష్ట్రం వారికి ముందుగా మార్పిడి అవకశం కల్పిస్తారు. ఒకవేళ సదరు రోగికి తగిన కిడ్నీ దాత ఆ రాష్ట్రంలో లేనట్లయితే మిగతా రాష్ట్రంలోని దాతలను సంప్రదిస్తారు. ఈ వ్యవహారాన్నంతటినీ రొటో నిర్వహిస్తుంది. -
అద్వానీ, జోషిలకు మోడీ ఝలక్
-
అద్వానీ, జోషిలకు మోడీ ఝలక్
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకులు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు నరేంద్ర మోడీ ఝలక్ ఇచ్చారు. పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి అద్వానీ, జోషీలకు ఉద్వాసనకు పలికారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నుంచి కూడా వృద్ధ నేతలను తప్పించారు. వీరి స్థానంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్, ప్రధాన కార్యదర్శి జేపీ నద్దాలను తీసుకున్నారు. అయితే కొత్తగా మార్గదర్శక మండలి ఏర్పాటు చేయనున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఇందులో అద్వానీ, జోషీలకు స్థానం కల్పించారు. వీరితో పాటు వాజపేయి, రాజ్నాథ్ సింగ్, నరేంద్ర మోడీ కూడా ఉంటారని బీజేపీ వెల్లడించింది. పార్లమెంటరీ బోర్డు పునర్వ్యస్థీకరణతో పార్టీపై నరేంద్ర మోడీ పూర్తి పట్టు సాధించినట్టయింది. ఇంతకుముందే తన సన్నిహితుడు అమిత్ షాకు బీజేపీ అధ్యక్ష పీఠంపై కూర్చుబెట్టిన మోడీ ఇప్పుడు తనతో అంటిముట్టనట్టుగా వ్యవరిస్తున్న కురువృద్ధులను పార్లమెంటరీ బోర్డు నుంచి సాగనంపారు.