jaathi hitham
-
మండల్, మందిర్‌లకు చెల్లుచీటీ!
గత మూడుదశాబ్దాలలో మండల్ ప్రాతిపదికన ఏర్పడుతూ వచ్చిన ఓటు బ్యాంకులను విచ్ఛిన్నపర్చిన క్రమంలోనే నరేంద్రమోదీ పూర్తి మెజారిటీ సాధించిన భారతదేశ ప్రప్రథమ ఓబీసీ ప్రధానిగా చరిత్రకెక్కారు. అటు మండల్, ఇటు మందిర్ రెండింటినుంచి మోదీ రాజదండాన్ని కైవశం చేసుకున్నారు. అడ్వాణీ, ఆయన తరం ఊహించని స్థితికి బీజేపీని మోదీ, షా తీసుకొచ్చారు. ఓబీసీలను, దళితులను చేరుకోవడంలో విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, ములాయం ఓటు బ్యాంకులోకి చొరబడి, వారిని జాతవ, యాదవ కులాలకే పరిమితం చేశారు. ఇప్పటికే ఆ పార్టీకి హిందూ జాతీయ అగ్రకుల ఓటు బ్యాంకు ఉండటంతో, అదనంగా చేరిన కులాల సంఖ్య అనూహ్యమైన శక్తినిచ్చింది. మండల్, మందిర్ శకం ముగిసింది. కొత్త రాజకీయాలను ఎవరు ఎలా నిర్మించాలనేది ఇప్పుడు ప్రశ్న. సరిగ్గా మూడు దశాబ్దాల తర్వాత భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసిపోయింది. నూతన శకం ప్రారంభమైంది కూడా. నెహ్రూ–గాంధీ రాజవంశం పతనమైందని, నరేంద్రమోదీ వికాసదశ మొదలైందని, ఇదే నేటి ఏకైక నూతన శకమని నిర్దిష్టంగా మనం చర్చించబోవడం లేదు. భారత్‌లో విస్పష్టమైన రాజకీయ పరివర్తనను అర్థం చేసుకోవడానికి అలాంటి చర్చ సంకుచిత అర్థాన్నే అందిస్తుంది. మనం ఇప్పుడు మండల్–మందిర్ రాజకీయాలకు ముగింపు పలుకుతూ మోదీ శకాన్ని ఆవిష్కరించబోతున్నాం. రాజీవ్ గాంధీ హయాంలో 1984లో లోక్‌సభలో రెండు స్థానాలకు కుంచించుకుపోయిన బీజేపీ తర్వాత 1989లో తిరిగి పుంజుకునే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. రాజీవ్ విశ్వసనీయుడు, నాటి రక్షణ మంత్రి వీపీ సింగ్ తిరుగుబాటు చేశారు. రాజీవ్ స్థానంలో ఒక సహజనేతను కూర్చోబెట్టడానికి వీపీ సింగ్ ప్రయత్నించారు కానీ బీజేపీ మద్ధతు లేకుండా వీపీసింగ్ దాన్ని సాకారం చేసుకోలేకపోయారు. ఆనాడు బీజేపీ అతి సమర్థనేత అయిన ఎల్కే అడ్వాణీ అధికారాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడలేదు. పైగా బీజేపీ స్వయంగా అధికారంలోకి రావాలన్నదే ఆయన ఆకాంక్ష. దీని కోసం ఆరోజు కీలక సమస్యతో ముడిపడిన అజెండా బీజేపీకి అవసరమైంది. అదేమిటంటే అవినీతిపరుడైన రాజీవ్‌ని ఓడించడం. దాంట్లో భాగంగానే హిందూ పునరుద్ధరణతో కూడిన దూకుడు జాతీయవాదాన్ని మిళితం చేస్తూ అడ్వాణీ అయోధ్య సమస్యను ఎంచుకున్నారు. ఇది అడ్వాణీ మందిర్ సిద్ధాంతమైంది. రాజీవ్ ప్రాభవాన్ని తగ్గించి ప్రతిపక్షం బలపడటంలో అద్వాణీ సహకరించారు. హిందీ ప్రాబల్యప్రాంతంలోనే అధికంగా 143 ఎంపీ స్థానాలను గెలుచుకున్న జనతాదళ్ అధినేత వీపీసింగ్ నూతనంగా ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ కూటమి తరపున ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 272 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌కి జనతాదళ్ సాధించిన సీట్లు చాలా తక్కువే. అందుకే దానికి రెండు అనూహ్య శక్తుల మద్దతు అవసరమైంది. అవి వామపక్షాలు, బీజేపీ. అయితే భావజాలపరంగా పూర్తి విరుధ్దమైన శక్తులు రెండూ ఒకే ఉమ్మడి లక్ష్యం కోసం ఐక్యం కావడం అదే తొలిసారి కాదు. చివరిసారీ కాదు. జనతాదళ్ దాని చిన్న చిన్న కూటమి పార్టీలు సాధించిన స్థానాల్లో అధికభాగం పాత సోషలిస్టులు, కాంగ్రెస్ తిరుగుబాటుదారుల నుంచి వచ్చాయి. సాధారణంగా వీరికి బీజేపీ అంటే ఏహ్యభావం. ప్రత్యేకించి వీపీ సింగ్ మంత్రివర్గంలో హోంమంత్రిగా పనిచేసి కశ్మీర్ రాజకీయ నేత ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబియా సయీద్‌ను కశ్మీర్ వేర్పాటువాదులు అపహరించి డబ్బుకోసం బెదిరించినప్పుడు కేంద్రప్రభుత్వం చేష్టలుడిగిపోయిన నేపథ్యంలో కశ్మీర్లో కొత్త రకం తీవ్రవాదంతో వ్యవహరించే అంశంపై అధికార పక్షంలో పరస్పర విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అదే సమయంలో వీపీ సింగ్, అయన వెన్నంటి నిలిచిన సోషలిస్టు, లోహియా వర్గాలకు చెందిన మేధోవర్గం ఆనాటి రాజకీయ కలయిక నిలకడతో కూడుకున్నది కాదని గ్రహించింది. అందుకే బీజీపీ, కాంగ్రెస్ రెండింటినీ వ్యతిరేకిస్తూ నూతన రాజకీయాలను ఆవిష్కరించే అంశంపై అది కృషి చేసింది. ఈ క్రమంలోనే అప్పటికి పదేళ్ల క్రితమే ఓబీసీలకు రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ మండల్ కమిషన్ సమర్పించిన నివేదికను ముందుకు తీసుకొచ్చి, దాన్ని వక్రరీతిలో అమలు చేశారు. అప్పటికే షెడ్యూల్డ్ కులాలు, తెగలకు ఇస్తున్న 22.5 శాతం రిజర్వేషన్ల పట్ల కుపితులై ఉన్న అగ్రవర్ణాలు వీపీ సింగ్‌పై యుద్ధం ప్రకటిం చాయి. దీంతో దేశవ్యాప్తంగా హింసాత్మక చర్యలు పెచ్చరిల్లాయి. సామాజిక అశాంతి నేపథ్యంలో 159 మంది అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులు ఆత్మహత్యలకు ప్రయత్నించారు. వీరిలో 63 మంది దురదృష్టవశాత్తూ చనిపోయారు. హిందూ జనాభాలో ఒక కుల యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలో వీపీ సింగ్ ఆయన సోషలిస్టు మిత్రులు సరికొత్త ఓబీసీ ఓటు బ్యాంకును నిర్మించుకున్నారు. దేశజనాభాను హిందూ–ముస్లి ప్రాతిపదికన విభజించాలని ప్రయత్నిస్తున్న అడ్వాణీకి ఈ పరిణామం హిందూ ఓటును విభజించే కార్యక్రమంగా భీతి కలిగించింది. ఈ నేపథ్యంలోనే వీపీ సింగ్ మండల్ వ్యూహాన్ని అడ్వానీ మందిర్ రాజకీయాలు ఢీకొన్నాయి. ఆనాటి నుంచి మండల్ వర్సెస్ మందిర్ రాజకీయాలు భారత రాజకీయాలను నిర్వచిస్తూ ఘర్షణలను రేపెట్టాయి. కులాల మధ్య విభజన ద్వారా మత విశ్వాసం ద్వారా దేశాన్ని మీరు ఐక్యం చేయగలరా అనే ప్రశ్న తలెత్తింది. మతవిశ్వాసాల ప్రాతిపదికన ప్రజలను ఐక్యం చేయడం అనేది సాధ్యపడినప్పుడు బీజేపీ తరచుగా కాకున్నా, అధికారంలోకి వచ్చింది. కానీ చాలావారకు హిందీ ప్రాబల్య ప్రాంతంలోని పాతతరం నేతలు తమ సొంత కులాలకు చెందిన ఓటు బ్యాంకులను నిర్మించుకోవడం ద్వారా బలపడుతూ వచ్చారు. ఈ క్రమంలో దళితులను తమవైపునకు తిప్పుకోవడం ద్వారా కాన్షీరామ్, మాయావతి కులరాజకీయాల్లో మిళతమయ్యారు. ఈ కులబృందాల శక్తిని ముస్లిలు హెచ్చించేవారు. ఈ రెండింటి కలయికతో వారు హిందీ ప్రాబల్యప్రాంతంలో బీజేపీని తరచుగా ఓడించేవారు. బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చూసేందుకు వీళ్లు కాంగ్రెస్‌తో అవాంఛిత పొత్తులను కూడా పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ మొత్తం క్రమానికి 2019 సార్వత్రిక ఎన్నికలు ప్రకటించిన తీర్పు మంగళవాక్యం పలికింది. మండల్‌పై మందిర్ విజయం సాధించిందని చెబితే అది అసలు విషయాన్ని పక్కనబెట్టినట్లే అవుతుంది. మోదీ, అమిత్ షాల హయాంలో మండల్ రాజకీయాలు తలొంచేశాయి. గత మూడుదశాబ్దాలలో మండల్ ప్రాతిపదికన ఓటు బ్యాంకులను విచ్ఛిన్నపర్చిన నేపథ్యంలోనే నరేంద్రమోదీ భారతదేశ పూర్తి మెజారిటీ సాధించిన ప్రప్రథమ ఓబీసీ ప్రధానిగా చరిత్రకెక్కారు. అటు మండల్, ఇటు మందిర్ రెండింటినుంచి మోదీ రాజ దండాన్ని కైవశం చేసుకున్నారు. భౌగోళిక రాజకీయాల వ్యూహం ప్రకారం చూస్తే ఇది భూకంపం మాత్రమే కాదు. ఒక భూఖండం పూర్తిగా స్థానం మార్చుకున్న స్థాయికి ఇది సూచిక. ఇదెలా సాధ్యమైంది? దీని పర్యవసానాలేమిటి? ఇది భారత రాజకీయాల్లో కొత్త శకాన్ని ఎలా ఆవిష్కరించనుంది? ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి సాయంత్రం పార్టీ కార్యకర్తల ముందు నరేంద్రమోదీ చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని చూడండి. మోదీ రెండు అంశాలను ప్రస్తావించారు. భారత్‌లో ఇప్పుడు రెండు కులాలే ఉన్నాయని మోదీ చెప్పారు. పేదలు, ఆ పేదలకు సహకరించే వనరులను సృష్టించగలిగిన సమర్థులు ఒక అంశం. రెండు. సెక్యులర్ ముసుగు ధరించిన వారు పరాజయం పాలయ్యారు. అంటే కులం ప్రాతిపదికన హిందువులను విభజిస్తూ, వారిని ముస్లిం ఓటర్లతో మిళితం చేస్తూ అధికారంలోకి వచ్చే నేతల శకం ముగిసిపోయిందన్నదే మోదీ ప్రసంగం ఇస్తున్న రాజకీయ సందేశం. ఈ సరికొత్త పరిణామాన్ని సాధ్యం చేసిన ఏకైక కారణం మోదీనే. ప్రతిపక్షాన్ని అవమానించాల్సిన పనిలేదు. ఒక భావజాలంతో లేక ఒక పార్టీతో మీరు తలపడుతున్నప్పుడు ఎన్నికల ముందస్తు పొత్తులు పనిచేస్తాయి. కానీ ఒక మూర్తిమత్వంతో ప్రత్యేకించి నేటి మోదీ, 1971 నాటి ఇందిరా గాంధీ వంటి ప్రజారంజక నేతలతో తలపడుతున్నప్పుడు ఇలాంటి పొత్తులు ఏమాత్రం పనిచేయవు. అడ్వాణీ, ఆయన తరం ఊహించని స్థితికి బీజేపీని మోదీ, షా తీసుకొచ్చారు. మోదీ, షాలు ఓబీసీలను, దళితులను చేరుకోవడంలో విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, ములాయం ఓటు బ్యాంకులోకి చొరబడి, వారిని జాతవ, యాదవ కులాలకే పరిమితం చేశారు. మిగిలినవారంతా బీజేపీ వైపే ఉన్నారు. ఇప్పటికే ఆ పార్టీకి హిందూ జాతీయ అగ్రకుల ఓటు బ్యాంకు ఉండటంతో, అదనంగా చేరిన కులాల సంఖ్య అనూహ్యమైన శక్తినిచ్చింది. బీజేపీయేతర ఓబీసీ నాయకుడైన నితీష్ కుమార్‌కు బీహార్ అప్పగించారు. శక్తివంతమైన దళిత వర్గానికి చెందిన రామ్ విలాస్ పాశ్వాన్‌కు కూడా చోటు కల్పించారు. రెండు దశాబ్దాలుగా బీజేపీని అధికారానికి దూరంగా ఉంచిన మండల్ వ్యవహారాన్ని 2019లో తుంగలో తొక్కేశారు. ఇప్పుడు మోదీకి తన స్వంత వ్యూహ రచన చేసుకునే అవకాశం దక్కింది. ఎందుకంటే, ఇప్పటికే అగ్రవర్ణ అభిమానం ఆయనకు అయాచితంగా లభించింది. కేంద్రంలో, రాష్ట్రాల్లో అనేకమంది ఓబీసీ, దళిత నాయకుల మద్దతు పొందారు. బీహార్‌లో ఆయన ఇప్పటికే బలమైన యాదవ్ నేతల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంజయ్ పాశ్వాన్ లాంటి వారు యూపీలోనూ ప్రముఖంగా ఉన్నారు. దీంతో దేశంలో రాజకీయాలు అంతరించినట్టు భావించనక్కర్లేదు. మండల్, మందిర్ శకం ముగిసినట్టే అని మాత్రమే దీనర్థం. కొత్త రాజకీయ అంశాలను కనుగొనడమే మోదీ తర్వాత సవాల్. ఏ విశ్వాసమైతే ఐక్యం చేసిందో దాన్ని కులం మరోసారి విడగొడుతుందని కొందరు ఇంకా ఆశపెట్టుకుంటున్నారు. కొన ఊపిరితో ఉన్న ఆ ఆలోచన 2014లోనే చచ్చిపోయింది. ఏమైనా మిగిలివుంటే ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. కొత్త రాజకీయాలను ఎలా నిర్మించాలి? ఎవరు? ఎన్నికల ఫలితాల్లో ఒక స్థాయి కిందకు చూస్తే బీజేపీకి కనిపించే 303 స్థానాల కింద కాంగ్రెస్‌కు ఎదురుగా కనిపించే 52 అనే రెండు సంఖ్యలు ముఖ్యమైనవి. 2014లో 17.1కోట్ల మేరకు ఉన్న బీజేపీ ఓట్లు ఇప్పుడు 22.6కు పెరిగాయి. 10.69 కోట్ల నుంచి 11.86 కోట్లకు కాంగ్రెస్ ఓట్లు పెరిగాయి. పెరుగుతున్న ఓట్లు, ఇతర స్థానిక శక్తులు జాతీయ పార్టీలకు అండగా నిలబడుతున్నాయి. అందుకే మనం కాంగ్రెస్ పార్టీని తీసుకున్నంత తేలికగా, మోదీ, షాలు తీసుకోరు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
గెలుపు గుర్రాలే కీలకం
ఏ రాజకీయ పార్టీకైనా సరే.. ఎన్నికల్లో గెలవడం అనే ఒకే ఒక లక్ష్య ప్రకటన ఉంటుంది. గెలిస్తే అపారమైన రివార్డులు లభిస్తాయి. ఓడిపోతే దారుణంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది కూడా. కానీ, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రాహుల్ కోటరీలో ప్రతిభావంతులు ఉన్నప్పటికీ వీరిలో ఎవరికీ ఎన్నికల్లో పార్టీని గెలిపించే సామర్థ్యం లేదు. మరోవైపున కాంగ్రెస్ గత ప్రభుత్వాల విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుని ముందుకు సాగిపోతున్న మోదీ ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడటంలో రాహుల్ పార్టీ ఏమేరకు విజయం సాధిస్తుందనేదే గడ్డు ప్రశ్న. పైగా సెల్ఫ్ గోల్ వేసుకోవడం నుంచి బయటపడకపోతే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమే. సార్వత్రిక ఎన్నికల తొలి దశ ఓటింగ్ జరగడానికి రెండు వారాల సమయం మాత్రమే ఉన్న స్థితిలో కాంగ్రెస్ సమర సన్నాహం స్థితీ గతి ఏమిటి? దాని సేనాధిపతులూ, సైనికుల్లో ఉత్సాహం ఏ మేరకు ఉంటోంది? మోదీ ప్రభుత్వం అత్యంత అవినీతికరమైనదనీ, అసమర్థమైనదనీ, ప్రజలను విడదీస్తోందని, దేశచరిత్రలోనే అది అత్యంత విధ్వం సకరమైనదని కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ చెబుతుండటం మనకు తెలుసు. కానీ ఈ ఆరోపణలను రుజువు చేయడానికి తాను ఎలా సంసిద్ధమవుతున్నదీ ఆ పార్టీ చెప్పడం లేదు. ఈ వేసవిలో ప్రతి ఓటరుకు ముఖ్యమైన కీలక సమస్యలైన ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ, జాతీయవాదం, సామాజిక ఐకమత్య సాధన వంటి అంశాలపై దాని వైఖరి ఎలా ఉంటోంది? ఈ సందర్భంలో నన్ను మరొక ప్రశ్న సంధించనివ్వండి. కాంగ్రెస్ ఈరోజు ఏ స్థితిలో ఉంటోందని మీరు భావిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీగా అది జీవన్మరణ యుద్ధంవైపు సాగుతోందా? లేక తన పని తాను చేసుకుపోతూ ఆ పని తనకుతానుగా ప్రపంచ వ్యవహారాలను మెరుగుపరుస్తుందని ఆశిస్తూ ఉండే ఎన్జీఓలాగా ఉండబోతోందా? ఇలా ప్రశ్నిస్తే పలువురు కాంగ్రెస్ అభిమానులు ఆగ్రహపడవచ్చు. కానీ వారు తమ ఆగ్రహాన్ని మరోవైపునకు మరల్చాల్సి ఉంది. గత అయిదేళ్లుగా మీ ప్రత్యర్థి మిమ్మల్ని దాదాపుగా చాపచుట్టేశాడు. పైగా చివరి దెబ్బ తీయడానికి గొడ్డలిని వాడిగా సానబెట్టుకుంటున్నాడు. ఇలాంటి స్థితిలో కాంగ్రెస్ మళ్లీ పేలవ ప్రదర్శనే చేసినట్లయితే, ఇప్పటికే నిరాశా నిస్పృహలకు లోనై, నైతిక ధృతిని కోల్పోయి ఉన్న దాని సభ్యులు చాలామంది పార్టీకి దూరమవుతారు. కాంగ్రెస్ కొత్తగా అధికారంలోకి వచ్చిన రెండు ముఖ్యమైన రాష్ట్రాలు కర్ణాటక (సంకీర్ణం), మధ్యప్రదేశ్ చేజారే అవకాశం కూడా ఉంది. రాజస్తాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మనుగడ సాగించాలంటే అదృష్టాన్ని నమ్ముకోవలసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎలా ఉండబోతోంది? ఇది ఎప్పటిలాగే పాత పార్టీ నిర్మాణంతోనే ఉండవచ్చు. లేక ఎన్నికల్లో ఎన్నడూ విజయం సాధించలేని, ఎన్నికల్లో అసలు పోటీ చేయలేని కొత్త తరహా స్వయం ప్రకటిత కౌటిల్యులు, మాకియవెల్లీలు, స్వయం ప్రకటిత మహామేధావులతో అది నిండిపోవచ్చు. లేక తమ బాధ్యతలను కూడా వారు కోల్పోవచ్చు. ఏ రాజకీయ పార్టీకైనా సరే ఒకే ఒక లక్ష్య ప్రకటన ఉంటుంది. అదేమిటంటే ఎన్నికల్లో గెలవడం. దీనికి తీవ్రమైన కృషి, నిబద్ధత అవసరం. గెలిస్తే అపారమైన రివార్డులు లభిస్తాయి. ఓడిపోతే దారుణంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది కూడా. ఈ పరిస్థితిని ఒక్క మాటలో చెవ్పవచ్చు: జవాబుదారీతనం. చివరకు కాంగ్రెస్‌కు లభించబోయేది ఇదే అని మీరు భావిస్తున్నారా? మీ సమాధానం కాదు అయినట్లయితే, ఆ పార్టీ ఎన్జీవో లాగా ఎందుకు కనిపిస్తోందన్నది నేను వివరిస్తాను. ఎన్జీవోలు కూడా తీవ్రంగా శ్రమిస్తాయి. కానీ వారి లక్ష్యాలు, దృష్టికోణం సీజ న్ను బట్టి లేదా వాటి మార్కెట్ అవకాశాలను బట్టి మారిపోతుంటాయి. గడచిన కొన్నేళ్లుగా కాంగ్రెస్ మరింత ఫ్యూడల్ తత్వంతోనూ, తక్కువ ప్రతిభాతత్వంతో తయారైంది. ఆ పార్టీలో చాలా తక్కువమంది మాత్రమే సమరశీలతను, ఎలక్టోరల్ సామర్థ్యతను కలిగి ఉంటున్నారు. గాంధీలతో సహా దాని పాత రాజవంశం మునిగిపోతున్న దాని ప్యూడల్ కోటలను నిలిపి ఉంచలేకపోతోంది. తమ తమ ప్రాబల్య ప్రాంతాల్లో వీరు పార్టీని విస్తరించలేకపోతున్నారు. పైగా కొత్తగా పస్తున్న ప్రతిభకు వీరు చోటు కేటాయించలేకపోతున్నారు. ఈ పార్టీలో ఉన్న యువ, అద్భుత వ్యాఖ్యాతలు, ప్రతినిధులు చాలా గొప్పవారే. కానీ వీరెవరూ ఎన్నికల పోరాటం చేయలేరు. తమ ప్రతిభలను, సంపదలను ఎన్నికల్లో పణంగా పెట్టలేరు. పైగా వేసవి ఎండను ఎదుర్కోలేరు. దేశం మొత్తం మీద దేనికైనా సిద్ధంగా ఉండే 50 మంది కాంగ్రెస్ నేతల జాబితా తయారు చేయండి మరి. అప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలోని అసంబద్ధతను, వైపరీత్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోగలం. తద్భిన్నంగా చెంచాలు, భజనపరులు పార్టీలో అనేక విపత్తులను తట్టుకుని నిలబడుతుంటారు. మోహన్ ప్రకాష్ అనే వ్యక్తి గురించి మీకు గుర్తుండకపోవచ్చు. ఇతను పాత సోషలిస్టు రాహుల్ గాంధీలా వెలిగిపోయాడు. ఒకదాని వెనుక ఒకటిగా కీలక రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను ఈయనకే కట్టబెడుతూ వచ్చారు. వాటిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కూడా ఉన్నాయని గుర్తించాలి. తన బాధ్యతలతో ఈయన చాలా ప్రముఖుడైపోయారు. పార్టీ నాయకత్వానికి ఇష్టుడిగా కూడా మారారు. మొదట్లో ఈయన రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ జయప్రకాష్ నారాయణ్‌గా కూడా వర్ణిస్తూ వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే అతడి గురించి ఒక విషయం మీరు చెప్పవచ్చు. అదేమంటే అతడు నిలకడగా ఉండేవాడు. వైఫల్యాల్లో మాత్రమే అని చేర్చుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తలను అతడి గురించి అడగండి. అమీర్‌ఖాన్‌ని 3 ఇడియట్స్ నుంచి ఒక చరణాన్ని మీకు పాడి వినిపిస్తారు. కహాన్ సే ఆయా థా వో, కహాన్ గయా ఉసే ధూన్ధో.. (అతడు ఎక్కడినుంచి వచ్చాడు, ఇప్పుడు అతడిని మనం ఎక్కడ కనుగొనగలం!) అయితే అతడొక్కడే కాదు. రాహుల్ గాంధీ చిరకాల ఇష్టుడు సీపీ జోషీని చూడండి. తాను ముట్టిందల్లా మట్టి అయిపోయంది. తాజా ఉదంతంగా ఈశాన్య భారత్‌లో అతడి వ్యవహారాల గురించి చెప్పవచ్చు. రాహుల్ గాంధీ ఏ టీమ్‌ని ఎలా పిలవచ్చనే అలోచనను నా సహోద్యోగి, ది ప్రింట్ పొలిటికల్ ఎడిటర్ డి.కె. సింగ్ కలిగించారు. అదొక పరాజితుల స్వర్గం. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఉనికే లేకుండా పోయినప్పటికీ రాజ్ బబ్బర్ యూపీసీసీ చీఫ్‌గా కొనసాగుతూనే ఉంటారు. అశోక్ తన్వార్ అనే రాహుల్ యువ దళిత్ స్టార్ విషయం చూడండి. హర్యానాలో గత లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపోయినప్పటికీ హర్యానా కాంగ్రెస్ చీఫ్‌గా తన్వార్ కొనసాగుతూనే ఉన్నారు. హర్యానాలో పార్టీ మీడియా చీఫ్ రణదీప్ సింగ్ సుర్జీవాలా ఇటీవలి ఉప ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఇక మధ్యప్రదేశ్‌లో ఒక్కసారి కూడా పోటీ చేయని దీపక్ బబారియా ఆ రాష్ట్ర పార్టీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఇక ఆనంద్ శర్మ, జైరామ్ రమేష్ గురించి చెప్పపని లేదు. ప్రస్తుతం రాహుల్ జట్టులోని కీలకమైన సలహాదారులు అత్యంత చురుకైన, ఉన్నత విద్యావంతులు. విశ్వసనీయ సలహాదారు కనిష్కా సింగ్, సమర్థుడైన ట్వీట్ రచయిత నిఖిల్ అల్వా, మాజీ ఉన్నతోద్యోగి కె. రాజు, దళిత శాస్త్రజ్ఞుడు ప్రవీణ్ చక్రవర్తి, సైద్ధాంతిక వ్యవహారాల శిక్షకుడు సచిన్ రావ్, మాజీ బ్యాంకర్ అలంకార్ సవాయ్, సోషల్ మీడియా హెడ్ దివ్యస్పందన తదితరులను చూడండి. వీరిలో ఉమ్మడి లక్షణం మీరు చూడగలరా? దివ్యస్పందన తప్పితే మిగతా వారెవరూ రాజకీయనేతలు కారు. ఈ నవరత్నాలలో తరచుగా దర్శనమిస్తుండే సందీప్ సింగ్ జేఎన్‌యూకి చెందిన మాజీ కార్యకర్త, అతివాద వామపక్ష విద్యార్థి సంస్థ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకుడు. ఇతడు రాహుల్ ఉపన్యాసాలను రాసి ఇస్తుంటారు. ప్రధాన కార్యదర్శులు, కోర్ గ్రూప్, రాహుల్ కీలక సలహాదారుల విషయానికి వస్తే పిడికెడుమందికే రాజ కీయ అవగాహన ఉంది. వీరిలో కీలకమైన అహ్మద్ పటేల్ పక్కకు తప్పుకున్నారు. అమిత్ షాతో తలపడగలిగే ధైర్యం, ఎత్తులు తెలిసిన ఏకైక కాంగ్రెస్ నేత ఆయన అని మర్చిపోకూడదు. ఎన్నికల సంఘంతో అర్ధరాత్రి వరకూ తలపడి షా స్వంత రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానాన్ని ఆయన చేజిక్కించుకున్నారు. గతంలో మనం చెప్పుకున్న మూడు కీలక అంశాల్లో కాంగ్రెస్ పార్టీ దృక్పథం కనీసం మనకు తెలుసు. ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ, వ్యవ సాయ సంక్షోభంపై అది దాడిని కొనసాగిస్తూనే ఉంటుంది. అయితే, ఈ సమస్యలు ఎలా పరిష్కారమవుతాయో మనం చెప్పలేం. జాతీయత, భద్రత, ఉగ్రవాదంపై పోరు, విదేశాంగ విధానంపై శామ్ పిట్రోడా కలుగజేసుకునే వరకూ కాంగ్రెస్ మొద్దు నిద్దర పోయింది. మిరాజ్‌లు, సుఖోయ్‌లతో సహా వారు పోరాడుతున్న ప్రతి ఆయుధ వ్యవస్థా తమ ప్రభుత్వాల హయాల్లోనే కొనుగోలు చేసిన వాస్తవాలను కాంగ్రెస్ వారు చెప్పలేరు. మరోవైపు, సులువుగా దొరికిపోయే అంశాలను రాహుల్‌తో చెప్పిస్తున్నారు. ఈ మిరాజ్‌లను తయారు చేసినది హాల్ అనడం అటు వంటిదే. హాల్ ఎప్పుడూ మిరాజ్‌ని తయారు చేయలేదు. దస్సాల్ట్ వాటిని రూపొందించింది. ఇప్పుడు మనం వాడుతున్న వాటిని 1982లో రాహుల్ నానమ్మ తెప్పించినవే. బాస్ చేసిన దాన్ని రీట్వీట్ చేయడం కంటే, రాజకీయాలకు చాలా కఠోర పరిశ్రమ అవసరం. మూడో అంశం సామాజిక సంబంధాలకు ఉండాల్సిన సహనశీలతపై బాగానే మాట్లాడు తున్నారు. కానీ, శబరిమల, ట్రిపుల్ తలాక్, రామ మందిరంపై బీజేపీ అభిప్రాయాలనే మీరూ కలిగివుంటే, మీ ప్రత్యేకత ఏముంది? టి.ఎన్.నైనన్ తన వారాంతపు సమీక్షలో యూపీఏ ప్రభుత్వం సాధించిన ముఖ్యమైన విజయాలను పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, వ్యవసాయాభివృద్ధి, మౌలిక వసతులపై ఖర్చు చేయడం, ఆధార్ వంటివి ఇందులో ఉన్నాయని అంటూ కాంగ్రెస్ వీటి గురించి ఎందుకు మాట్లాడదని ప్రశ్నించాడు. వీటన్నిటినీ తానే సొంతం చేసుకోవడంతో పాటు భారత్‌లో కనబడుతున్న ఏ మంచైనా తన ఐదేళ్ల పాలనలోనే వచ్చినట్టు మోదీ చెప్పుకుంటున్నారు. వీటన్నిటినీ కాంగ్రెస్ ఎదుర్కో వలసి ఉంది. ఆ పని చేయకపోతే అది ఒక రాజకీయ పార్టీయా లేక ఎన్జీవోనా అని మీరు అడగవచ్చు. ఎన్జీఓలు కూడా ప్రభుత్వ వ్యతిరేక తతోనే ఉంటాయని భావిస్తుంటారు. దశాబ్దంపాటూ మీరూ ప్రభు త్వంలో ఉన్నారు కదా. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మోదీకి ‘పనికొచ్చే మూర్ఖులు’
ముస్లింను శత్రువుగా చిత్రించే అసలు ఫార్ములా పాతబడింది. అందుకే దేశ ఉనికికి ముప్పు కలిగించే మరో శత్రువును ‘కనిపెట్టాల్సిన’ అవసరం ఏర్పడింది. మావోయిస్టుల్ని అలా చూపించవచ్చు. వారికి ఇస్లామిక్ తీవ్రవాదంతో సంబంధం అంటగడితే మరీ మంచిది. ఉద్యోగాలు అడిగే యువతను ‘అవతల దేశం నాశనం చేయడానికి కుట్ర జరుగుతుంటే ఇలాంటివి అడుగుతారా... మీ దేశభక్తి ఏమైంద’ని ప్రశ్నిస్తే సరి! అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ సాధించింది అంతంత మాత్రమే. నిజంగా ప్రమాదకరమైన శక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కనపడుతూ మళ్లీ గెలిపించమని ప్రజలను కోరడం ఒక్కటే బీజేపీ ముందున్న మార్గం. జనం కూడా శక్తిమంతమైన శత్రువును ‘చూపిస్తే’ పాలకపక్షం వైఫల్యాన్ని మన్నిస్తారు. బోల్షివిక్ విప్లవం సమయంలో తమకు అనుకూలంగా మాట్లాడే కమ్యూనిస్టులు కాని నవ ఉదారవాదులను సోవి యెట్ విప్లవ నేత లెనిన్ ‘పనికొచ్చే మూర్ఖులు’ అని పిలిచేవారని చెబు తారు. ఇండియాలో గత రెండు దశాబ్దాలుగా పట్టణప్రాంతాలకు చెందిన వామపక్ష, ఉదారవాద మేధావులను హిందుత్వ మద్దతుదారులైన బుద్ధిజీవులు ఇలాగే (యూజ్‌ఫుల్ ఇడియట్స్) పిలుస్తున్నారు. వారికి ‘అర్బన్ నక్సల్స్’ అనే కొత్త పేరు పెట్టడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నం పాక్షిక విజయమే సాధించింది. వారు అర్బన్ నక్సల్సా, కాదా అనే విషయం పక్కన పెడితే, ఈ మేధావులను బీజేపీ/ఆరెస్సెస్ పనికొచ్చే మూర్ఖులు అనడం సబబేనని ఇప్పుడందుతున్న సమాచారం చెబుతోంది. అయితే ‘గొప్ప భారత విప్లవానికి’ వారు పనికొచ్చే మూర్ఖులు కాదు. వారిలో అతికొద్ది మంది మాత్రమే ఇంకా రెండు మూడు కేంద్ర విశ్వ విద్యాలయాలకే పరిమితమై కనిపిస్తున్నారు. అలాగే, బస్తర్ వంటి ఆదివాసీలు నివసించే ఒకట్రెండు అటవీ ప్రాంతాల్లో కొద్దిమంది మరింత ప్రమాదకరమైన రీతిలో ఉంటున్నారు. ఇలాంటి చోట్ల వారు బీజేపీకి ఉపయోగపడే మూర్ఖులుగా కనిపిస్తున్నారు. పట్టణ నక్సల్ లేదా గ్రామీణ నక్సల్ అంటూ ఎవరూ ఉండరు. నక్సలైట్ నక్సలైటే గాక మావో యిస్టు కూడా. అలా ఉండటం ఏమీ నేరం కాదు. ఎలాంటి నమ్మకాలున్నా, ఆ విశ్వాసాల గురించి బహిరంగంగా ప్రకటించినా ఏ చట్టంగాని, చట్టవ్యతి రేక కార్యకలాపాల నిరోధక చట్టంగాని ఎవరినీ భారత జైళ్లలో పెట్టలేవు. కశ్మీర్‌ను ఇండియా చట్ట వ్యతిరేకంగా ఆక్రమించుకుందని లేదా మన ప్రజాస్వామ్యం బూటకమని మీరు బాహాటంగా చెప్పవచ్చు. అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ సాధించింది అంతంత మాత్రమే. నిజంగా ప్రమాదకరమైన శక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తు న్నట్టు కనపడుతూ మళ్లీ గెలిపించమని ప్రజలను కోరడం ఒక్కటే బీజేపీ ముందున్న మార్గం. జనం కూడా శక్తిమంతమైన శత్రువును ‘చూపిస్తే’ పాల కపక్షం వైఫల్యాన్ని మన్నిస్తారు. దేశాన్ని కాపాడటానికి ఓటేస్తారు. అందుకే 1984లో సిక్కు ఉగ్రవాదాన్ని దృష్టిలో పెట్టుకుని ‘రాజీవ్గాంధీకా ఎలాన్/నహీ బనేగా’ అనే నినాదం కాంగ్రెస్‌ను గెలి పించింది. ముస్లింను శత్రువుగా చిత్రించే కాషాయపక్షం అసలు ఫార్ములా పాతబడిపోయింది. ముస్లిం అంటే పాకిస్థాన్–అంటే కశ్మీర్ వేర్పాటువాది–అంటే ఉగ్ర వాది–అంటే లష్కరే తోయిబా/అల్‌కాయిదా/ ఐసిస్ అనే సూత్రంతో వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రాగలమన్న విశ్వాసం బీజేపీకి లేదు. అదీగాక, హిందువులం దరూ కులం వంటి అంశాలను విస్మరించి ముస్లిం లంటే భయపడిపోయే పరిస్థితుల్లో లేరు. ముస్లింలపై వ్యతిరేకత కొనసాగేలా చేయ డానికి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉండేలా చూస్తూ, పాక్ సైనికులపై మెరుపు దాడులు చేయడం అంత తేలిక కాదు. పాక్‌పై భారత్ విరుచుకుపడితే దాన్ని ఆదుకోవడానికి చైనా సిద్ధంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆధారపడే పరిస్థితి లేదు. కాబట్టి, భారతదేశ ఉనికికి ముప్పుగా కనిపించే మరో శత్రువును కనిపెట్టాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. మావోయిస్టులను అలా చూపించవచ్చు. ఇస్లామిక్ తీవ్రవాదంతో వారికి సంబంధం అంటగడితే మరీ మంచిది. ఇలా చేశాక ‘దేశాన్ని నాశనం చేయడానికి కుట్ర జరుగుతుంటే మీరు ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడుతున్నారు. మీ దేశభక్తి ఏమైంది’ అంటూ పాలకపక్షం నేతలు ప్రశ్నించే అవకాశం ఉంది. 1980ల ఆఖరులో రాజీవ్‌గాంధీ పలుకు బడి తగ్గిపోయాక ‘కులం వల్ల విడిపోయిన ప్రజ లను కలపడానికి మతాన్ని బీజేపీ ఉపయోగించు కోగలదా?’ అనే ప్రశ్న తలెత్తింది. అయోధ్యతో ఎల్‌కె ఆడ్వాణీ ఆ పనిచేశారు. 2004 ఎన్నికలనాటికి బీజే పీకి జనాదరణ తగ్గిపోయింది. పదేళ్ల తర్వాత నరేంద్రమోదీ బీజేపీని గెలిపించారు. ఆయన వ్యక్తిగత విజయాలు, జనాకర్షణ శక్తి హిందూ ఓటర్లను ఆకట్టుకున్నాయి. బలమైన సర్కారు, వికాసం అందిస్తానన్న వాగ్దానం ఆచరణలో సాధించింది సగమే. అందుకు పాలకపక్షానికి కొత్త శత్రువు అవసరమైంది. ముస్లింలకు మావోయిస్టులను కలపడం ద్వారా 2019 ఎన్నికల్లో విజయం సాధించాలని పాలకపక్షం భావిస్తోంది. ‘దేశం తీవ్ర ప్రమాదంలో ఉంద’నే ప్రచారంతో ఈ ఎన్నికల్లో గెలవాలని ఆశిస్తోంది. మావోయిస్టు అనే ఒక్క మాటతోనే ప్రజలను భయపెట్టి కాషాయపక్షంవైపునకు మళ్లించడం కుదరని పని. కాలేజీల్లో ఏమాత్రం ప్రమాదకరంగా కనిపించని మావోయిస్టులను మనం చూశాం. అయితే, నక్సలైట్లు ఆయుధాలతో తిరుగుతారు కాబట్టి వారిని చూస్తే భయమేస్తుంది. కాని, మనకు వారు కనపడరు. టీవీ స్క్రీన్లు, ట్విటర్లో కూడా కనిపించరు. నక్సల్స్ పేరుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో జనాన్ని బెదరగొట్టలేం. అందుకే అర్బన్ నక్సల్ అనే ప్రాణి పుట్టుకొచ్చింది. రెండున్నరేళ్ల క్రితం ఢిల్లీ జేఎన్‌యూలో జరిగిన ఘటనలు ఇక్కడ ప్రస్తావించాలి. వామపక్ష మేధావులు అభిమానించే ఉర్దూ కవి ఆగా షాహీద్ అలీ స్మారక కార్యక్రమం సందర్భంగా అప్పుడు కశ్మీర్ స్వాతంత్య్రంపై చర్చించి, మద్దతు ఇచ్చే విషయంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ‘భారత్ ముక్కలు ముక్కలవుతుంది, ఇన్షాల్లా– ఇన్షాల్లా’ అని కొందరు యువకులు నినాదాలు చేస్తున్నట్టు చూపే వీడియో హఠాత్తుగా ప్రత్యక్షమైంది. దీంతో ఇద్దరు వామపక్ష విద్యార్థినేతలను (వారిలో ఒకరు ముస్లిం) అరెస్ట్ చేసి, వారిపై రాజద్రోహం వంటి కేసులు బనాయించారు. మరిన్ని వీడియోలు పుట్టుకొచ్చాయి. కశ్మీర్‌కు స్వాతంత్య్రం కావాలని డిమాండ్ చేస్తున్న తన విద్యార్థులను ప్రశంసిస్తూ ఓ మహిళా ప్రొఫెసర్ మాట్లాడుతున్న మరో వీడియో దర్శనమిచ్చింది. ఇండియాను ముక్కలు ముక్కలు చేయడానికి దేశవ్యతిరేక ముస్లింలతో తీవ్రవాద, వామపక్ష మేధావులు చేతులు కలిపారనే కొత్త సిద్ధాంతానికి ఇలా రూపకల్పన జరిగింది. కశ్మీర్, బస్తర్ సంక్షోభాలను న్యూఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పుణె నగరాల్లోని ఈ శక్తులు కుమ్మక్క య్యాయని, ఢిల్లీలోని జేఎన్‌యూ ఈ కార్యకలా పాలకు కేంద్రస్థానమైందనే ప్రచారం చేశారు. దీనికితోడు కశ్మీరీ వేర్పాటువాదం గురించి మాట్లాడటం ద్వారా తీవ్రవాద వామ పక్ష మేధావులు పరోక్షంగా, సర్కారీ అనుకూల టీవీ చానళ్లు ప్రత్యక్షంగా పాలపక్ష కొత్త ప్రచార వ్యూహం విజయవంతమయ్యేలా చేశాయి. నేడు అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఇస్లామిక్ తీవ్రవాదం అంతం చేస్తుందని, పూర్వపు సోవియెట్ యూనియన్ వల్లకాని అనేక పనులు దీనివల్ల పూర్తవుతాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్షాలు నమ్ముతున్నాయి. ఇండియాలో కూడా ఇలాంటి ఆశలున్నవారు లేకపోలేదు. ఆయుధాలు పట్టిన కశ్మీరీలను, బస్తర్ ఆది వాసీలను ప్రభుత్వ సాయుధ బలగాలు చంపేస్తుంటే మాట్లాడేవారు లేరు. భారత సర్కారుతో ఎవరు పోరుకు తలపడినా మనవంటి కొద్దిమంది మేధా వులు మాత్రమే అందుకు ‘మూల కారణాల’ గురించి ఆలోచిస్తారు. కుట్ర పేరుతో ప్రభుత్వం అరెస్టు చేసిన హక్కుల నేతలు కూడా ఈలోగా కోర్టుల జోక్యంతో విడుదలవుతారు. ఫలితంగా మోదీ సర్కారు నైతికంగానే గాక కోర్టుల్లో కూడా ఈసారి ఓడిపోతుంది. అయినా పాలక పక్షం దిగులుపడదు. ఇది ఇప్పటికిప్పుడు పూర్తి చేయాల్సిన ‘ఆపరేషన్ రెడ్ హంట్’ కాదు. అందుకే ప్రభుత్వ ప్రచార వ్యూహంలో తమకు తెలియకుండానే భాగమైన వామపక్ష మేధావులు చివరికి పాలకపక్షానికి లెనిన్ చెప్పినట్టు ‘పనికొచ్చే మూర్ఖులు’గా మారినట్టవుతుంది. - శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
నిప్పుతో చెలగాటం ప్రమాదకరం!
‘వికాస్’ వాగ్దానంతో చేసిన అభివృద్ధి అంతంత మాత్రమే అయినప్పుడు ‘జాతీయవాదం’ పేరుతో ప్రజలను చీల్చి ఓట్లు సంపాదించడమే అత్యంత ఆకర్షణీయంగా బీజేపీకి కనిపించడం సహజమే. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి ఇది చక్కటి మార్గం. 2019 ఎన్నికల వరకూ అస్సాం ‘మంటలు’ ఆరిపోకుండా బీజేపీ చూసు కుంటుంది. ఈ క్రమంలో బీజేపీ లక్షలాది మందిని ‘చొరబాటుదారుల’నే ముద్ర వేస్తుంది. అంటే, దేశంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలందరికీ ఈ మాట వర్తించేలా చూస్తుంది. ‘లౌకిక’ ప్రతిపక్షాలను ఈ బెంగాలీ ముస్లింలను సమర్థించేలా చేయడమే బీజేపీ వ్యూహం. 2019 ఎన్నికల్లో బీజేపీకి అస్సాం సమస్య కీలకమౌతుంది. అయితే, ఇది చివరికి హిందువులకు కూడా హాని చేసే విషపూరిత అంశంగా మారే ప్రమాదం లేకపోలేదు. 35 ఏళ్ల క్రితం అస్సాంలోని నెల్లీ మారణకాండ ఇంకా గుర్తుంది. అస్సాంలో విదేశీయులను గుర్తించడానికి రూపొందించిన జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్నా ర్సీ)పై రేగుతున్న చర్చ సందర్భంగా బ్రహ్మపుత్రా నది ఉత్తర తీరంలోని ఖోయిరాబారీ, గోహ్పూర్, సిపాజార్ వంటి ప్రాంతాల్లో ఏం జరిగిందీ మరవ కూడదు. 1983లో బ్రహ్మపుత్రా లోయలో జరిగిన ఘర్షణల్లో దాదాపు ఏడు వేల మంది మరణించారు. పైన చెప్పిన మూడుచోట్ల దాదాపు హిందువులే ప్రాణాలు పోగొ ట్టుకున్నారు. అదీ సాటి హిందువుల చేతుల్లోనే వారు హతులయ్యారు. అస్సాంలో ‘విదేశీ పౌరుల’ (ముస్లింలని భావించాలి)పైనే జనంలో కోపముంటే హిందువులను హిందువులే ఎందుకు చంపుకుంటున్నారు? ఈశాన్య భారతంలోని అనేక విషయాల మాదిరిగానే ఇది కూడా సంక్లిష్ట సమస్య. ఇక్కడ దాడిచేసే హిందువులు అస్సామీ మాట్లాడే వారైతే మారణకాండల్లో చనిపోయేది బెంగాలీలు. ఇద్దరూ ఒక మతానికి చెందినవారే అయినా రెండు వర్గాల మధ్య భాష, జాతిపరమైన విద్వేషాలు విషపూరితంగా మారాయి. అలాకాకుండా నెల్లి వంటి ప్రదేశాల్లో బెంగాలీ ముస్లింలను అస్సామీ హిందు వులు చంపారు. బీజేపీ, మంచి జరుగుతుందని ఆశించిన సుప్రీంకోర్టు ఈ పాత విద్వేషాలను మళ్లీ రగిలేలా చేస్తున్నాయి. 40 లక్షల మందికి దొరకని చోటు! ఎన్నార్సీ తుది ముసాయిదాలో 40 లక్షల మంది ప్రజల పేర్లు లేవు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇది తాత్కాలిక తొలి జాబితా అన్నారు. పేర్లు లేని లక్షలాది మంది ప్రజలను ‘చొరబాటుదారులు’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పార్లమెంటులో అభి వర్ణించారు. ఈ 40 లక్షల మందిలో మూడో వంతు హిందువులేనని అస్సాం ఆర్థిక మంత్రి (వాస్తవానికి ఈయనే నిజమైన ముఖ్యమంత్రి) హిమంతా బిశ్వ శర్మ వెల్లడించారు. ఈ సమస్యకు పరిష్కారంగా బీజేపీ కొత్త పౌరసత్వ బిల్లు రూపొందించింది. దీని ప్రకారం పొరుగు దేశాలకు చెందిన హిందువులు, సిక్కులు వంటి భారత మతాలకు చెందినవారికి భారత పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పించారు. ఒకవేళ ఈ బిల్లు చట్టమైనా ‘భూమిపుత్రులైన’ అస్సా మీలు దీనిపై ఎలా స్పందిస్తారు? ఈ స్థానిక అస్సా మీలకు తమ ప్రాంతంలో హిందువులైనా, ముస్లిం లైనా బెంగాలీలతో కలిసి జీవించడం అసలేమాత్రం ఇష్టం లేదు. 1983లో రెండు వర్గాల బెంగాలీలను వారు ఊచకోతకోశారు. కొత్త పౌరసత్వ బిల్లును ఇప్పటికే మాజీ సీఎం, ప్రస్తుత బీజేపీ సంకీర్ణ సర్కారు భాగస్వామి ఏజీపీ నేత ప్రఫుల్లకుమార్ మహంతా వ్యతిరేకిస్తున్నారు. చివరకు పౌరుల జాబి తాలో చోటు దక్కనివారు ఈ 40 లక్షల మందిలో ఐదు లక్షల మందికి మించకపోవచ్చని అంచనా. పౌరసత్వానికి సాక్ష్యంగా చూపించడానికి గ్రామ పంచాయతీలు జారీచేసే పత్రాలు చెల్లవని గువా హటీ హైకోర్టు నిర్ణయించింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లగా హైకోర్టు ఉత్తర్వును తిరస్కరించింది. అంతే గాక, ఈ పంచాయతీలు ఇచ్చే ధ్రువీకరణపత్రాలు చెల్లుబాటు కావడానికి వాటిని ఏ పద్ధతిలో జారీ చేయాలో కూడా నిర్ణయించాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు బాధ్యత అప్పగించింది. ఈ గందరగోళం మధ్య ఎన్నార్సీ ముసాయిదా జాబితా రూపొందిం చారు. మారిన పద్ధతిలో పంచాయతీలు జారీచేసే ధ్రువీకరణ పత్రా లన్నీ చెల్లుబాటయితే ‘విదేశీయు లు’గా తేలే జనం దాదాపు ఉండరనే చెప్పవచ్చు. ఇలా జరగడం బీజేపీకి ఇష్టం లేదు. అస్సాం ఒప్పందమే ఆధారం! విదేశీయులను తేల్చే ప్రక్రియ విషయంలో 1985 నాటి రాజీవ్‌గాంధీ, ఆసు/ఆల్ అస్సాం గణ సంగ్రామ పరిషత్ శాంతి ఒప్పందం స్ఫూర్తితో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అస్సాం పౌరు లెవరో తేల్చడానికి రాష్ట్రంలో 1971 మార్చి 25 నాటికి ఉన్నవారిని పరిగణనలోకి తీసుకుని ఎన్నార్సీ రూపొందించాలని కోరింది. అంటే, ఈ తేదీకి ముందు ఇండియాలోకి వచ్చినవారెవరైనా చట్టబద్ధ మైన పౌరుల కిందే లెక్క. 1971 మార్చి 26న అవ తరించిన బంగ్లాదేశ్ తొలి ప్రధాని షేక్ ముజిబుర్ రహ్మాన్, ప్రధాని ఇందిరాగాంధీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అప్పటికి ఇండియాలోకి ప్రవేశిం చిన కోటికి మందికి పైగా బంగ్లా శరణార్థులను వెనక్కి తీసుకోవడానికి బంగ్లాదేశ్ అంగీకరించింది. ఈ ఒప్పందం ఆధారంగా 1971 మార్చి 25 అనే తేదీని పౌరసత్వానికి గీటురాయిగా నిర్ణయించారు. ఈ శరణార్థుల్లో దాదాపు 80 శాతం మంది హిందు వులే. కాని, హిందువులైనా, ముస్లింలైనా ఈ బంగ్లా శరణార్థులందరూ వెనక్కి పోవాలనే ఇందిరాగాంధీ కోరుకున్నారు. 33 ఏళ్ల తర్వాత విదేశీయుల సమ స్యకు పరిష్కారంగా అస్సాం ఉద్యమకారులతో ఆమె కొడుకు రాజీవ్‌గాంధీ 1985లో ఒప్పందం చేసుకుని, ఈ ప్రాతిపదికన ఎన్నార్సీ రూపొందిస్తామని వాగ్దా నం చేశారు. అనేక కారణాల వల్ల ఎన్నార్సీ ఇంత వరకు తయారు కాలేదు. రెండు తరాల జనం పుట్టి పెద్దయ్యాక ఇప్పుడు విదేశీయులంటూ వారిని ఎలా బయటకు పంపాలి లేదా వారి ఓటు హక్కు రద్దు చేయాలి? ఇది జరగని పనని బీజేపీకి కూడా తెలుసు. అమిత్‌షా ప్రసంగం ఏమి సూచిస్తోంది? ఇందులో రాజకీయమేమీ లేదని బీజేపీ నేతలెవరైనా అంటే, అమిత్‌షా ప్రసంగం వినలేదా? అని వారిని నిలదీయవచ్చు. 2019 ఎన్నికల ప్రచారానికి పునాది వేసినందుకు ఆయనకు పూర్తి మార్కులు ఇవ్వవచ్చు. ఆయన ప్రసంగం అంత సూటిగా, పారదర్శకంగా ఉంది. ‘వికాస్’ వాగ్దానంతో చేసిన అభివృద్ధి అంతంత మాత్రమే అయినప్పుడు ‘జాతీయవాదం’ పేరుతో ప్రజలను చీల్చి ఓట్లు సంపాదించడమే అత్యంత ఆకర్షణీయంగా బీజేపీకి కనిపించడం సహ జమే. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడా నికి ఇది చక్కటి మార్గం. ఎన్నిక వరకూ అస్సాం ‘మంటలు’ ఆరిపోకుండా బీజేపీ చూసుకుంటుంది. ఈ క్రమంలో బీజేపీ లక్షలాది మందిని ‘చొరబాటు దారుల’నే ముద్ర వేస్తుంది. అంటే, దేశంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలందరికీ ఈ మాట వర్తించేలా చూస్తుంది. ‘లౌకిక’ ప్రతిపక్షాలను ఈ బెంగాలీ ముస్లింలను సమర్థించేలా చేయటమే బీజేపీ వ్యూహం. ఈ ప్రతిపక్షాలు ముస్లిం అనుకూలమేగాక, జాతివ్యతిరేక మనే భావం ప్రజల్లో కలుగుతుందనేది బీజేపీ అంచనా. ముస్లింలకు అనుకూలమా లేదా వ్యతిరేకమా అనేది 2019 పార్ల మెంటు ఎన్నికల్లో ప్రధానాంశం అయితే బీజేపీకే విజయం సొంతమౌ తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ‘జాతీయవాదుల’ను బీజేపీకి అనుకూలంగా మలచుకోవడానికి అస్సాం ‘విదేశీయుల’ సమస్య అమిత్‌షా చేతిలో పదునైన ఆయుధంలా మారింది. దేశంలో ఎన్నికల రాజకీ యాలు అమిత్‌షాకు, బీజేపీకి తెలిసినంతగా మరెవ రికీ తెలియవు. అయితే, బీజేపీకి అస్సాం గురించి తెలుసా? ఏళ్లు వెనక్కిపోయి, నేను గువాహటీ నగ రంలోని నందన్ హోటల్లో బసచేసిన ఓ చిన్న గది గురించి చెప్పాలి. ఈ రూమ్‌కు వచ్చిన నలుగురు అతిథులు శక్తిమంతులే కాదు మర్యాదస్తులు కూడా. అక్కడ పరిస్థితులు వారిని ఆందోళనకు గురిచేశాయి. వారి నాయకుడు కేఎస్ సుద ర్శన్. అప్పుడాయన ఆరెస్సెస్ బౌద్ధిక్ ప్రముఖ్ (మేధో విభాగం అధిపతి). తర్వాత ఆయన ఆరెస్సెస్ సర్ సంఘ్‌చాలక్ (అధి పతి) అయ్యారు. 35 ఏళ్ల క్రితం ఫిబ్రవరి నెలలో అస్సాంలో అంతమంది బెంగాలీ హిందువులు ఎలా మారణకాండ బారినపడ్డారు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే వీరు అప్పట్లో నన్ను కలిశారు. ముస్లిం చొరబాటుదారులకు, హిందూ శరణార్థులకు మధ్య ఉన్న తేడాను ఈ అస్సామీయులు ఎందుకు గుర్తించలేకపోయారు? ఖొయిరాబారిలో వారు ఇంతమంది హిందువులను ఎలా చంపగలిగారు అని సుదర్శన్ నన్ను ప్రశ్నిం చారు. అస్సాంలోని జాతి, భాషాపరమైన సంక్లిష్టతలే ఈ మారణకాండను ఇంత పాశవికంగా కొనసాగించారని నేను ఆయనకు వివరించాను. కానీ హిందువులకు రక్షణ లేకపోయింది కదా అని సుదర్శన్ వాపోయారు. ఆ తర్వాత ఆరెస్సెస్ అస్సామీ ఆందోళనకారులను పున చైతన్యపరిచేందుకు సహనంతో కూడిన ప్రచారాన్ని చేపట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేను రాసిన ‘రైటింగ్స్ ఆన్ ది వాల్‘ రచన వారి విజయానికి అద్దం పట్టింది. ఇప్పుడు అస్సాంలో బీజేపీ అంటే మాజీ ఏఏఎస్యు, ఏజీపీ సంస్థల నుంచి పరివర్తన చెందిన కార్యకర్తలు, నేతలు మాత్రమే. చివరకు ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన సహ మంత్రులు కూడా వీరిలో భాగమే కావడం గమనార్హం. కానీ 1983లో వారి యవ్వనప్రాయంలో చేసినట్లుగానే, ఎన్ఆర్సీపై ఆర్ఎస్ఎస్/బీజేపీ పెట్టే షరతులను పాటించేందుకు వీరు తలొగ్గుతారా? ఆ షరతులేమిటి అంటే బెంగాలీ ముస్లింలను లక్ష్యంగా చేసుకోండి, హిందువులను కౌగలించుకోండి. 2019 సార్వత్రిక ఎన్నికలలో అస్సాంను తన కీలకాంశంగా ఉపయోగించుకోవాలని బీజేపీ దాదాపుగా నిర్ణయిం చుకుంది. రాజకీయ లబ్ధికోసం ఆర్ధిక నష్టాన్ని పణంగా పెట్టడం అనేది ఒక అంశం కాగా, సంక్షుభిత అస్సాలో పాత జ్వాలలను మళ్లీ రగుల్కొల్పడం అనేది మరొక అంశం. పరిస్థితులు ప్రశాంతంగా ఉంటే ఇది సంభవమే కానీ అశాంతి చెలరేగిందంటే మాత్రం ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు, బెంగాలీలకు వ్యతిరేకంగా అస్సామీయులు, హిందూ లేక ముస్లింలు, హిందువుకు వ్యతిరేకంగా హిందువు, ముస్లింకు వ్యతిరేకంగా ముస్లిం ఇలా పెను విద్వేషం రకరకాల రూపాలుగా తయారయ్యే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఈ సందేశాల పరమార్థం ఏమిటి?
కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏలో శివసేన చేరుతుందని నమ్మే అమాయకులెవరూ లేరు. రాహుల్‌కు ఆ అవసరం కూడా లేదు. కానీ శివసేన ఎన్డీఏ నుంచి బయట పడితే చాలు రాహుల్ లక్ష్యం నెరవేరుతుంది. లోపాయికారి ఎన్నికల సర్దుబాట్లు కాంగ్రెస్, పవార్‌కు కొట్టిన పిండి. ‘హ్యాపీ బర్త్‌డే, ఉద్ధవ్జీ’ అని రాహుల్ ఇచ్చిన సందేశా నికి కారణమిదే. ప్రాంతీయపక్షాలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇలా మోదీ కేసీఆర్‌కు, రాహుల్ ఉద్ధవ్‌కు దగ్గరవడానికి ప్రయత్నిస్తూ మాట్లాడటాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలుస్తారనేది ముందే చెప్పడం కుదరదు. ఈ విషయాన్ని అన్ని పక్షాలూ అంగీకరిస్తున్నాయి. భారత రాజకీయాలు నిరంతరం మారుతూనే ఉంటాయి. ఇక్కడ శాశ్వత మిత్రులుగాని, శాశ్వత శత్రువులుగాని ఉండరు. కేవలం మారే స్వార్థ ప్రయోజనాలే కనిపి స్తుంటాయి. ఈ రాజకీయ పొత్తులు, అవి ముగిసి పోవడం–ఇవన్నీ కొన్ని లెక్కల ప్రకారం సాగుతుం టాయి. ఉత్తరాదిన వీటినే హిందీలో ‘జోడ్–తోడ్ రాజినీతి’ (కలయికలు–చీలికల రాజకీయం) అని పిలుస్తారు. అయితే, ఈ తరహా రాజకీయాలు ప్రస్తుతం మారిపోతున్నాయి. నేను రాజకీయ విలే కరిగా ఉన్న రోజుల్లో భారత రాజకీయాల్లో గొప్ప గురువులుగా పేరొందిన ముగ్గురు నేతలు ప్రణబ్ ముఖర్జీ, ఎల్.కె.ఆడ్వాణీ, దివంగత సీతారాం కేసరీ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకునే అదృష్టం నాకు దక్కింది. ఇండియాలో రాజకీయాధికారం ఎలా నడు స్తుందనే విషయంలో విభిన్న అంశాలకు సంబం ధించి ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరూ ‘స్పెషలిస్ట్ ప్రొఫెసరే’. దేశంలో మొత్తం రాజకీయ శాస్త్రంలో అత్యంత నిష్ణాతుడైన అధ్యాపకుడు∙ప్రణబ్‌దా అని నేనంటే ఆయనకు ఎలాంటి అభ్యంతరం ఉండదని భావిస్తాను. 1980ల చివరి నుంచీ ఆడ్వాణీ తన పార్టీ బీజేపీని బలోపేతం చేసే పని ప్రారంభించారు. 1984లో రెండు సీట్లు గెలిచిన ఈ పార్టీని 1989లో 85 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకునే స్థాయికి, 1998లో అధికారంలోకి వచ్చే స్థితికి ఆయన తీసు కెళ్లారు. అనేక పార్టీలతో పొత్తుల ద్వారా సంకీర్ణ కూటమి నిర్మాణంతో విజయం సాధించవచ్చని ఆయన చెబుతారు. ‘‘మేం జాతి వ్యతిరేకమని భావించే పార్టీలు ఐదు ఉన్నాయి. వీటిని మిన హాయిస్తే మరెవరితోనైనా పొత్తుకు మేం సిద్ధమే’’ అని ఆయన అంటారు. ఆడ్వాణీ దృష్టిలో ఈ ఐదు ‘అంటరాని’ పార్టీలు–కాంగ్రెస్, వామపక్షాలు, ములాయం నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), లాలూ నడిపే రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), ముస్లింలీగ్(ఇలాంటి తరహా పార్టీలైన ఒవైసీల ఎంఐఎం, అస్సాం అజ్మల్ పార్టీ ఏఐయూడీఎఫ్ సహా). బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మినహా వేరే దారి లేని శివసేన, శిరోమణి అకాలీదళ్, ఒక దశలో టీడీపీ ఆ పార్టీ పంచన చేరాయి. వీటిలో మొదటి రెండు పార్టీలూ తమ రాజకీయాలకు, అధికారం సాధించడానికి మతమే కీలకం కావడం వల్ల కాషా యపక్షంతో జతకట్టాయి. కాంగ్రెసే తన ఏకైక ప్రత్యర్థి కావడంతో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఆడ్వాణీ రూపుదిద్దిన సంకీర్ణ ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో ఉన్న మొదటి మిశ్రమ సర్కారు. అప్పటి వరకూ సీనియర్ నేత జార్జి ఫెర్నాండెజ్ ‘అత్తగారి దేశంలో (ఇటలీ–సోనియా మాతృదేశం) సంకీర్ణ ప్రభుత్వాలు లక్షణంగా నడుస్తున్నప్పుడు ఇండి యాలో ఇవి ఎందుకు పనిచేయవు?’ అని గతంలో అన్నప్పుడల్లా జనం భయపడేవారు. తర్వాత ఆ ‘కూతురు’ (సోనియా) నిర్మించిన రెండు సంకీర్ణాలు పూర్తి కాలం పదేళ్లు అధికారంలో కొనసాగాయి. ‘సంకీర్ణ పరిస్థితులు’ పెద్దగా మారనే లేదు! ప్రధాన జాతీయపక్షాలు ఎప్పటికీ పొత్తు పెట్టుకోని పార్టీలు ఉన్నాయి. అలాగే, వేరే దారి లేక ప్రధాన పక్షాలతో చేతులు కలిపే పార్టీలూ ఉన్నాయి. రెండో తరహా పార్టీల్లో శరద్ పవార్ నేతృత్వంలోని నేషన లిస్ట్ కాంగ్రెస్‌పార్టీ(ఎన్సీపీ) మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రతి ఎన్నికల్లోనూ అధికారం కోసం సిద్ధాంతాలు వదులుకునే రాజకీయపక్షాలకు 75 నుంచి 150 లోక్‌సభ సీట్లు వస్తుంటాయి. అందుకే, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సాధారణ మెజా రిటీకి అవసరమైన 272 సీట్లు ఎలా గెలవాలనే విష యానికి బదులు 160 వరకూ సీట్లు దక్కించుకునే ఇలాంటి పార్టీలపై చర్చ ఎక్కువవుతోంది. 2014 పార్లమెంటు ఎన్నికల ముందునాటి స్థితికి మళ్లీ దేశం చేరుకుంటోందని పరిస్థితులు సూచిస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవ కాశం లేదు. ఏ పార్టీకీ 272 సీట్లు రాని 1989 తర్వాత పరిస్థితికి చేరుకుంటున్నాం. శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేకు ట్విటర్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ‘‘శ్రీ ఉద్ధవ్ ఠాక్రేజీ, జన్మ దిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో ఆనం దంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను,’’ అని సందేశం పంపడంలో పరమార్థం ఏమిటి? మనసులో ఓ మాట, పైకో మాట రాజకీయ నేతలకు సహజమే. రాజకీయ ప్రత్యర్థికి పుట్టినరోజు లేదా పండగ శుభా కాంక్షలు చెప్పడం సర్వసాధారణం. అలాగే, తన బద్ధ రాజకీయ ప్రత్యర్థి దగ్గరకు వెళ్లి ఓ బడా నేత కావ లించుకోవడం చూసి మనం ఆశ్చర్యపడాల్సినది కూడా ఏమీ లేదు. కాని, ఉద్ధవ్‌కు రాహుల్ సందేశం విషయంలో మనం కొంత ఆలోచించక తప్పదు. కాంగ్రెస్ అధ్యక్షుడెవరూ బహిరంగంగా ఎవరికీ శుభా కాంక్షలు తెలిపిన సందర్భాలు లేవు. సైద్ధాంతికంగా పూర్తిగా అసహ్యించుకోవాల్సిన విలువలు పాటించే పార్టీ నేతకు దేశ ప్రజలందరూ చూసేలా ట్విటర్లో ఇలా గ్రీటింగ్స్ చెప్పడం వింతే మరి. కాంగ్రెస్‌కు బీజేపీ కన్నా శివసేన మరింత అంటరాని పార్టీగా ఉండాలని రెండు పార్టీల నేపథ్యం చెబుతోంది. అదీ గాక, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూట మిలో ముఖ్య భాగస్వామ్య పక్షం శివసేన. శివసేన అధినేతకు దగ్గరవడానికి రాహుల్ ఇప్పుడిలా బహిరంగ ‘ప్రేమలేఖ’తో ప్రయత్నిం చడం మూడు విషయాలను సూచిస్తోంది. ఒకటి, బీజేపీ– శివసేన మధ్య సంబందాలు దెబ్బతినడం ఆయన గమనించారు. రెండోది, 2019 ఎన్నికల్లో తన వ్యూహంపై మరింత స్పష్టత ఇచ్చారు. నేను కాకున్నా ఫరవాలేదు గాని, మోదీకి బదులు ఎవరు ప్రధానిగా అయినా అభ్యంతరం లేదనే విషయం మరోసారి తేల్చి చెప్పారు. ఇక మూడోది, 2019లో దేశంలో సంకీర్ణయుగం మళ్లీ ఆరంభమైతే, రాజకీయ పక్షాల మధ్య పొత్తులు ఆడ్వాణీ చెప్పిన రీతిలో ఉండవనేది రాహుల్ అభిప్రాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ వ్యూహంపై స్పష్టతనిచ్చిన రాహుల్ శత్రువు శత్రువు మిత్రుడనేది పాత మాట. నీ శత్రువు సన్నిహిత మిత్రునికి దగ్గరవడానికి నీవు సిద్ధంగా ఉన్నావంటే దేశ రాజకీయాల్లో ఇది కొత్త పంథాకు సంకేతంగా కనిపిస్తోంది. బాగా బలహీనమైన స్థితిలో కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో దాన్ని కాపాడుకోవాలంటే సిద్ధాంతాలు పక్కనపెట్టి, కొత్త పోకడలకు తెరతీయవచ్చనే తెలివి రాహుల్‌కు వచ్చి నట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశాలు తగ్గిపోతున్న కారణంగా ఎవరు దేశాన్ని పరిపాలిస్తారనే విషయం మళ్లీ చర్చకు వస్తోంది. లోక్‌సభ ఎన్నికలను నేను తరచు తొమ్మిది సెట్ల టెన్నిస్ మ్యాచ్‌తో పోల్చేవాడిని. ఎవరు ఐదు సెట్లు గెలుస్తారో వారే విజేత. భారత పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. వచ్చే ఎన్ని కల్లో ‘తొమ్మిది సెట్లు’గా చెప్పే రాష్ట్రాలు ఏవంటే– ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ సహా ఏపీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్, కర్ణా టక, కేరళ. ఇవి పెద్దవి కావడంతో 9 రాష్ట్రాల జాబి తాలో చేర్చాను. అంతేకాదు, ఈ రాష్ట్రాల్లో మార్పు అనేది సాధ్యమౌతుంది. అందుకే, ఒడిశా, పశ్చిమ బెంగాల్, గుజరాత్‌ను చేర్చలేదు. ఈ 9 రాష్ట్రాల్లోని మొత్తం లోక్‌సభ సీట్లు 342. వీటిలోని ఐదు రాష్ట్రాల్లో గెలిచే సంకీర్ణ కూటమికి దగ్గరదగ్గర 200 వరకూ సీట్లు దక్కే అవకాశముంది. లేకున్నా 160కి పైగానే స్థానాలు తప్పక లభిస్తాయి. అందుకే 2014 వరకూ 272 సీట్ల గెలుపుకున్న ప్రాధాన్యం ఇక 160 సీట్ల కైవసం చేసుకోవడానికి లభిస్తుందని అనుకోవచ్చు. యూపీలో బీజేపీకి సగంపైగా సీట్లు గల్లంతే! మోదీ–అమిత్‌షా నాయకత్వంలోని బీజేపీని కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాకుండా చూడ టమే అత్యంత ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న రాహుల్ ఆలోచనలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఉత్తరప్ర దేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తే బీజేపీకి ఘన విజయం దక్కదు. 2014లో గెలిచిన 73 సీట్లలో సగం కూడా గెలవడం కష్టం. అప్నాదళ్ వంటి చిన్న మిత్రపక్షాలు సైతం బీజేపీతో కలిసి ఉంటాయా? అంటే చెప్పడం కష్టం. అలాగే, కిందటి పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు దక్కిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణాలో బీజేపీ బలం బాగా తగ్గుతుంది. ఈ నష్టాలను తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలవడం ద్వారా భర్తీ చేసు కోవాలని బీజేపీ అనుకుంటోంది. కాబట్టి, యూపీ తర్వాత అత్యధిక ఎంపీలను పంపే అంటే 48 లోక్‌సభ సీట్లున్న మహారాష్ట్రలో బలం నిలబెట్టుకోవడమే బీజేపీ అతి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. మహా రాష్ట్రలో శివసేన సాయం లేకుండా ఒంటరి పోరుతో విజయం సాధించడం గురించి అమిత్ షా తన పార్టీ శ్రేణులను సమీకరించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే, శివసేన లేకుండా బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోలేదనే విషయం ఆయనకు తెలుసు. రాహుల్కీ ఈ వాస్తవం తెలుసు. 2019 లోక్ సభ ఎన్నికలు నేను పైన చెప్పినట్టు 9 సెట్ల టెన్నిస్ మ్యాచ్‌లా మారితే, మహారాష్ట్రలో బీజేపీ (ఎన్డీఏ) గెల వకుండా రాహుల్ సాధ్యమైనంత కృషిచే యాలి. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏలో శివ సేన చేరుతుందని నమ్మే అమాయకులెవరూ లేరు. రాహుల్‌కు ఆ అవసరం కూడా లేదు. శివసేన ఎన్డీఏ నుంచి బయటపడితే చాలు రాహుల్ లక్ష్యం నెరవేరుతుంది. లోపాయికారి ఎన్నికల సర్దుబాట్లు కాంగ్రెస్, పవార్‌కు కొట్టిన పిండి. ‘హ్యాపీ బర్త్‌డే, ఉద్ధవ్జీ’ అని రాహుల్ ఇచ్చిన సందేశానికి కారణమిదే. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా మోదీ ప్రసం గిస్తూ, ఇదే తరహాలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ‘వికాస్ పురుష్’ అంటూ ఆయనపై ప్రశం సలు కురిపించారు. ప్రాంతీయపక్షాలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇలా మోదీ కేసీఆర్‌కు, రాహుల్ ఉద్ధవ్‌కు దగ్గరవడానికి ప్రయత్నిçస్తూ మాట్లాడటాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలుస్తారనేది ముందే చెప్పడం కుదరదు. ఈ విషయాన్ని అన్ని పక్షాలూ అంగీకరిస్తున్నాయి. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఓడిన యోధుని తెంపరి పోరు
బీసీసీఐ భారత క్రికెట్‌కి, ప్రపంచ క్రికెట్‌కి ఎంతో మేలు చేసిన మాట నిజమే. కానీ అది అంతర్జాతీయంగా తమ కంటే బాగా అప్రతిష్టపాలైన ‘ఫీఫా’లాగా పలు మాఫియా నిబంధనలను పాటిస్తోంది. బీసీసీఐ దానికదే ఒక కలియుగ చక్రవ్యూహం. అందులోకి చొచ్చుకుపోవడం చాలా కష్టం. ఇక సురక్షితంగా బయటపడటం అంటారా? అసాధ్యం. బీసీసీఐలో రాజకీయవేత్తలెప్పుడూ కలసికట్టుగానే ఉంటారు, వారే గెలుస్తారు. లలిత్ ఈ వాస్తవాన్ని అంగీకరించక తిరస్కరిస్తున్నారు. లలిత్ మోదీ చేసింది తప్పా లేక ఒప్పా, అతడు పారిపోయిన వంచకుడా లేక దేన్నీ లెక్కచేయని తెంపరితనంగల ప్రజాప్రయోజనాల పరిరక్షకుడా, మానవ బాంబా లేక కమికాజే (ఆత్మాహుతి వైమానిక దళం) యుద్ధ వీరుడా? ఇప్పటికే రెండు వారాలుగా చర్చించినా సమాధానాలు దొరకని ఈ ప్రశ్నలను మళ్లీ చర్చించడం అర్థ రహితం. కానీ పైన పేర్కొన్నవన్నీ ఆయనలో అంతో ఇంతో ఉన్నాయి. కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న దాడులు, వాదనలు, ఆరోపణలు, వెల్లడిచేస్తున్న విషయాలు, ‘ఇండియా టుడే’ గ్రూపునకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలు అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అంతకంటే ఆసక్తికరమైన ప్రశ్న మరొకటుంది. లలిత్ ఇతరులను శత్రువు లుగా చూస్తే మంచిదా? మిత్రులుగా చూస్తే మంచిదా? లేదా ఇంకా మరీ కచ్చితంగా చెప్పాలంటే ఏది అధ్వానం? మోదీ అంటే ప్రధాని మోదీ అను కుంటారేమోనని లలిత్ అంటూ నేనాయన మొదటి పేరునే వాడుతున్నా. అంతేగానీ ఆయనా, నేనూ సన్నిహిత మిత్రులమేం కాదు, కావాలంటే బీజేపీలోని ఆయన మిత్రులైన సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలను అడగండి. వారిద్దరూ ఆ పార్టీలో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్న నేతలని, భవిష్యత్తులో అత్యున్నత పదవికి పోటీదారులు కాగలవారని చాలా మందే భావిస్తున్నారు. ఇప్పుడు వారు రాజకీయంగా మనగలుగుతారా లేదా అనే దానితో నిమిత్తం లేకుండానే లలిత్‌తో ఉన్న సంబంధాలు వారికి శాశ్వ తమైన చెరుపును చేశాయి. ఒకసారి ఆయన శత్రువులను చూడండి. క్రికెట్ రంగంలో అరుణ్ జైట్లీ, రాజీవ్ శుక్లా, ఎన్. శ్రీనివాసన్. రాజకీయ రంగంలో నైతే ప్రణబ్ ముఖర్జీ, ఆయనకు అత్యంత విశ్వసనీయ సహాయకురాలైన అమితా పాల్ (ఇటీవలి కాలంలో సోనియా గాంధీ కుటుంబం కూడా). ఇక మీడియాలో చాలా మందే ఉన్నా చెప్పుకోదగినవారు ‘టైమ్స్’ గ్రూపునకు చెందిన వినీత్ జైన్, టీవీ ప్రైమ్ టైమ్ తీర్పరి, శిక్ష అమలు చేసేవాడూ కూడా అయిన ఆర్ణబ్ గోస్వామి. వీరిలో ప్రతి ఒక్కరూ లలిత్ భూదగ్ధ యుద్ధ తంత్రంలోంచి (ఇప్పటికింకా అది ఎలక్ట్రానిక్ మీడియా రూపంలోనే సాగు తోంది) కాలిన గాయాలతో బయటపడ్డవారే. రాజే, స్వరాజ్ సహా ప్రతి ఒక్కరూ ఆయనను ఇప్పుడు శాపనార్థాలు పెడుతుంటారని మీరు నిశ్చ యంగా చెప్పొచ్చు. అతనితో స్నేహం వల్ల కలిగిన పాపానికి, అతని శత్రు త్వం విధించిన శాపానికి ఫలితమది. ఐపీఎల్ అనే అద్భుతంతో క్రికెటర్లను అంతటి పెద్ద ధనవంతులను చేసిన లలిత్‌లో... తాను వారికంటే ఎక్కువ ప్రముఖ వ్యక్తి కావాలనే కాంక్ష రహస్యంగా దాగి ఉన్నదని నా అనుమానం. ఈ 15 రోజుల ఖ్యాతితో ఆయన ఆ ఆశను తీర్చుకున్నారు. చివరకాయన ఇప్పుడు మిత్రులకు, శత్రువులకు కూడా హాని కలుగజే స్తుండటం ఆత్మావినాశకరం కావచ్చేమోగానీ, అందుకు కారణం ఆయన మూర్ఖుడు కావడం మాత్రం కాదు. దానికి మూడు ఇతర కారణాలున్నాయి. ఒకటి, ఆయనకు భారత రాజకీయాలు అర్థం కాలేదు. ఆ విషయాన్ని ఆయన లెక్క చేయడమూ లేదు. రెండు, ఆయన అహం తరచుగా ఆయన వివేచన లోని ఉత్తమమైనదాన్ని హరించేస్తుంటుంది. ఇక మూడోది, అత్యంత ముఖ్యమైనది, ఆ విషయంలో ఆయన చేయగలిగినదేమీ లేనిది. అది, భారత క్రికెట్ హోల్డింగ్ కంపెనీ(ఇతర కంపెనీలలో వాటాలను కలిగివుండే సంస్థ) లాంటి బీసీసీఐ అనే అతి సన్నిహితుల క్లబ్బు స్వభావానికి సంబంధించినది. నేను పాత కాలం వాడినిగాక, ఆధునిక వ్యాఖ్యాతనై ఉంటే ఆ హోల్డింగ్ కంపెనీ కంటే మాఫియానే మెరుగని భావించే వాడిని. ఈ విషయాన్ని కాస్త వివరించనివ్వండి. నేనలా అనడానికి కారణం, బీసీసీఐ దారి దోపిడీదారుల, బలవంతపు వసూళ్ల రాయుళ్ల క్లబ్బు కావడం కాదు. భారత క్రికెట్టుకి, ప్రపంచ క్రికెట్టుకి అది ఎంతో మేలు చేసిన మాట నిజం. కానీ అది కూడా చాలావరకు అంతర్జాతీయంగా తమ సంస్థ కంటే బాగా అప్రతిష్టపాలైన ఫీఫా (అంతర్జా తీయ పుట్‌బాల్ అసోసియేషన్)లాగే మాఫియా నిబంధనలలో చాలా వాటిని పాటిస్తోందనేదే అందుకు కారణం. బీసీసీఐ కూడా పాటించే ఆ మాఫియా నిబంధనల్లో చెప్పుకోదగినవి ఓమైర్టా (తమ నేరపూరిత చర్యల రహస్యాలపై ఎటువంటి పరిస్థితుల్లోనూ నోరు విప్పరాదనే నిశ్శబ్ద నిబంధనావళి), ద్రోహి గా భావించేవారినెవరినైనా అత్యంత సుస్పష్టంగా అందరికీ కనిపించేలా క్రూరంగా నాశనం చే సేయడం. బీసీసీఐ దానికదే ఒక కలియుగ చక్రవ్యూహం. అందులోకి చొచ్చుకుపోవడం చాలా కష్టం. ఇక అందులోంచి సురక్షితంగా బయటపడటం అంటారా? అసాధ్యం...లలిత్ తానందుకు మినహాయిం పునని రుజువు చేసుకుంటే తప్ప. బీసీసీఐ రాజకీయాలు కూడా... బహుముఖ పక్షపాత రాజకీయాలు మాత్రమే చెల్లుబాటయ్యే అసలు సిసలు భారత రాజకీయాలే. ఆ వాస్తవం వల్లనే మీరు వాటిని ఎలా చూస్తారనే దాన్ని బట్టి, అవి మరింత ఎక్కువ సంక్లిష్టమైనవిగానో లేదా సరళమైనవిగానో తయారయ్యాయి. శరద్ పవార్, నరేంద్ర మోదీ, జ్యోతిరాదిత్య సింథియా, అనురాగ్ ఠాకూర్ (ధూమల్), సీపీ జోషీ, అమిత్ షా, అరుణ్ జైట్లీ, ఫారుఖ్ అబ్దుల్లా, లాలూ యాదవ్, రాజీవ్ శుక్లా, ప్రాంతీయ స్థాయిలో ప్రస్తుత బోర్డు ఉపాధ్యక్షుడు అనిరుధ్ చౌధరీ (దివంగత బన్సీలాల్ మనుమడు) మొదలుకొని రాజకీయ రాజవంశాల మూడో తరం వారసులు సహా అంతా స్థూలంగా రాజకీయ రంగంలో బద్ధ శత్రువులే. అయితే బీసీసీఐ గుడారంలో ఒక్కసారి వారంతా కలిశారంటే చాలు.. అంతా అత్యంత నమ్మకస్తులైన మిత్రులై పోతారు. ‘ఎకనమిస్ట్’ పత్రిక ఒకప్పటి భారత బ్యూరో అధిపతి జేమ్స్ ఆస్టిల్ ‘ది గ్రేట్ తమాషా: క్రికెట్, కరప్షన్ అండ్ ది టర్బులెంట్ రైజ్ ఆఫ్ మోడర్న్ ఇండియా’ అనే అద్భుతమైన పుస్తకాన్ని రచించారు. ఢిల్లీలోని బ్రిటిష్ కౌన్సిల్లో ఆ పుస్తకావిష్కరణ జరిగింది. ఆ సందర్భంగా ఆమె నన్ను అరుణ్ జైట్లీ, రాజీవ్ శుక్లాల మధ్య సంభాషణ సాగేలా చూడమని కోరారు. నా శ్రోతలకు కొంత ఆసక్తి కలిగించే ఆంశం ఏమిటా అని తెగ ఆలోచించి, చివరికి నేను రాజకీయాలను ఆశ్రయిం చాను. అప్పటికింకా కొద్ది నెలల్లోనే 2014 ఎన్నికలు జరగనున్నాయి. నేనా ఎన్నికల ఫలితాన్ని అంచనా వేసి చెప్పగలిగేటంతటి అవివేకిని కానన్నాను. అయితే, ఎన్డీఏ గె లిస్తే రాజీవ్ శుక్లా, యూపీఏ గెలిస్తే అరుణ్ జైట్లీ ఐపీఎల్‌కు అధిపతి అవుతారని మాత్రం కచ్చితంగా చెప్పగలనన్నాను. శుక్లా, జైట్లీ సహా అంతా నవ్వారే తప్ప ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. రాజకీయవేత్తలతోపాటే కలసివచ్చే రాజకీయాధికారం క్రికెట్‌కు చాలా ఉపయోగకరం. ఐపీఎల్‌కు ముందే వారు పోగు చేయడం ప్రారంభించిన డబ్బు బోర్డువద్ద సరిపడేంత ఉంది. మిగతా క్రీడల్లాగా వీసాలు, అనుమ తులు, స్టేడియంల కేటాయింపు, పోలీసు బందోబస్తు ఏర్పాట్ల విషయంలో సర్కారీ సవాళ్లను ఎప్పుడోగానీ ఎదుర్కోవాల్సిన అవసరం రాని అరుదైన క్రీడ ఇది. 2009లో సార్వత్రిక ఎన్నికలు, ఐపీఎల్ చాంపియన్‌షిప్ ఒకేసారి రావడంతో ఆనాటి హోంమంత్రిగా చిదంబరం దాన్ని దక్షిణాఫ్రికాకు ప్రవా సం పంపేయడమే ఇందుకు మినహాయింపు. అంతేకాదు, క్రికెట్ ప్రసారకర్తల సాధన సంపత్తిని చేరవేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి చార్టర్డ్ విమానాలను లేదా దేశీయ విమానాలను అదనంగా వారు ఏర్పాటు చేసే వారు లేదా విమాన సర్వీసుల షెడ్యూలునే మార్చేవారు. క్రికెట్ సామ్రాట్టులు తమ పేర్లతోనే, అదీ తమ జీవిత కాలంలోనే కొత్త స్టేడియంలను నిర్మింప జేసుకోగలిగిన క్రీడగా కూడా భారత క్రికెట్ మారింది సాధారణంగా ఉపయో గించే నెహ్రూ- గాంధీల పేర్లుగాక వాంఖేడే, డీవై పాటిల్, ఎమ్ఏ చిదంబరం, సహారా, శరద్ పవార్ పేర్లను పెట్టారు. క్రికెట్ తమకు సైతం ఆసక్తికరమైనదేనని రాజకీయ వర్గం గుర్తించడానికి ముందు, క్రీడాభిమానులైన సంపన్న రాజవంశీకులే ఆ క్రీడకు నిర్వాహకు లుగా ఉండేవారు. సింథియాలు రాజకీయవేత్తలు గానే తప్ప రాజవంశీకు లుగా లెక్కలోకి రారు. కాబట్టి రాజ్‌సింగ్ దుంగార్పూర్ వారిలో ఆఖరి వాడు. ఆ తర్వాత వచ్చినది చార్టర్డ్ అకౌంటెంట్ల శకం. బీసీసీఐని ఏలిన అలాంటి వారిలో చివరివారు జగ్మోహన్ దాల్మియా, మనోహర్ శశాంక్. ఇద్దరూ ఇంకా బరిలో నిలవగలిగారు. దాల్మియా అయితే ఒకప్పుడు తనను నాశనం చేయడమే కాదు, అక్రమంగా డబ్బు పోగేసుకున్నట్టు క్రిమినల్ కేసులను సైతం పెట్టిన అదే అధికార కూటమితోనే శాంతిని నెలకొల్పుకుని, పునరుత్థా నం చెందారు కూడా. కొందరు ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగారు గానీ, వారిని వెళ్లగొట్టేశారు. పంజాబ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి, మాజీ రాష్ట్రపతి జైల్‌సింగ్‌కు ఒకప్పటి సహాయకుడు అయిన ఐఎస్ బింద్రా వారిలో ఒకడు. అయితే ఈ మారుతున్న సమ్మేళనంలోకి మరో ఆసక్తికరమైన గ్రూపు ప్రవేశించింది. వారు క్రీడపై ప్రేమతోనూ, అందులోని గ్లామర్ కోసమూ రం గంలోకి దిగిన మధ్యస్థాయివారే అయినా చెప్పుకోదగినంత ధనవంతులైన కార్పొరేటు కుబేరులు. వీరిలో అత్యంత ప్రముఖులు ఎన్. శ్రీనివాసన్, లలిత్ మోదీలే. ఇద్దరూ వంశపారంపర్యంగానే సుసంపన్నులు, చాలా నియమ నిబంధనలతో కూడిన, పాత నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు చెందిన సిమెంటు, సిగరెట్ల వ్యాపారంలో ఉన్నవారు. మహా గమ్మత్తయిన విషయమేమంటే తొలుత చార్టర్డ్ అకౌంటెంట్లు (మనోహర్, దాల్మియా) ఘర్షణపడితే, ఆ తర్వా త మహాసంపన్న వ్యాపారవేత్తలు (లలిత్, శ్రీనివాసన్) ఘర్షణకు దిగారు. అయితే బీసీసీఐ రాజకీయ సారం మాత్రం టైటానియంలా చెక్కుచెదర కుండా దృఢంగా మిగిలింది. అది ఏ పక్షానికి మద్దతు పలికితే అదే ప్రతిసారీ నెగ్గింది. బీసీసీఐలో రాజకీయవేత్తలెప్పుడూ కలసికట్టుగానే ఉంటారు, వారే గెలుస్తారు. లలిత్ ఈ వాస్తవాన్ని అంగీకరించక తిరస్కరిస్తున్నారు. లలిత్ నాకు ఎంత బాగా తెలుసు? ఫిరోజ్ షా కోట్లా మైదానంలో నేనొక సారి ఆయన్ను ఇంటర్వ్యూ చేశాను. అంతకు మించి పెద్దగా తెలియదు. ఆ సమయంలో ఆయన ఐపీఎల్ మొదటి ఏడాది విజయంతో ఉబ్బితబ్బిబ్బవు తున్నారు. నేనాయనను భారతదేశపు జెర్రీ మెగోయర్గా పరిచయం చేశాను. జెర్రీ మెగోయర్, ఆ పేరుతోనే తీసిన సినిమాలోని, ఏదీ అసాధ్యం కాదనిపిం చేలా చేసే అమెరికన్ స్పోర్ట్స్ ఏజెంట్ పాత్ర. టామ్ క్రూయిజ్ ఆ క థానాయక పాత్రను పోషించారు. ఆయనను నేనలా పరిచయం చేసినందుకు లలిత్ ఉప్పొంగిపోయారు. ల్యాప్‌ట్యాప్ ముందు తాను ఎలా గంటల తరబడి అంతులేకుండా కృషి చేసి ఐపీఎల్‌ను రూపొందించారో, క్రీడాపరమైన తన ఈ అద్భుతాన్ని వేలెత్తి చూపలేనంత లోపరహితంగా ఆయన ఎలా ఆవిష్కరించారో చెప్పుకొచ్చారు. అది బాగానే ఉందిగానీ, లండన్‌లో నేనాయనను కలుసుకున్నానా? లండన్‌లో భారతీయులు యథాలాపంగా తోటి భారతీయులకు తటస్థపడుతుండే తాజ్ గ్రూపునకు చెందిన సెయింట్ జేమ్స్ కోర్టులో నాకాయన తటస్థపడ్డారు. అప్పుడాయన ఓ మూల టేబుల్ వద్ద బింద్రాతో కలసి భోజనం చేస్తున్నారు. నేనలా అంతరాయం కలిగించినందుకు ఇద్దరిలో ఎవరికీ సంతోషం అనిపించలేదని నాకు అనిపించింది. ఐపీఎల్ విజయవంతం కావడం, బీసీసీఐ అధికారం పెరుగుతుండటం అనే రెండూ ఎప్పుడోగానీ ఆయనకు బాగా తలకెక్కాయి. తన పరిధిని దాటి మరీ ఆయన ముందుకు పోయారు. ఆయన మొట్టమొదట్లోనే అంతర్జాతీయ క్రికెట్ అధికారాన్ని రుచి చూశారు. మొదటి ఐపీఎల్లో ఆస్ట్రేలియన్ క్రీడాకా రులు పాల్గొనడానికి షరతులను చర్చించడం కోసం బీసీసీఐ ఆయనను ఆ దేశానికి పంపింది. అప్పుడాయన తన పలుకుబడిని ప్రయోగించి, డబ్బును వాగ్దా నం చేసి అసీస్ క్రీడాకారులను, బోర్డును (క్రీడాకారుల ఫీజులో వాటా) ఊరిం పజేసి ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియాలో హర్భజన్-సైమండ్స్ మధ్య రేగిన ‘‘మంకీగేట్’’ వివాదం సందర్భంగా అది బాగా తోడ్పడింది. లలిత్ తలబిరు సుతనాన్ని, బీసీసీఐకి ఉన్న అధికారాన్ని మొరటుగా ప్రయోగించి ఆ వివా దాన్ని భారత్ వైపు మొగ్గేట్టు చేశారు. భజ్జీని చాలా తేలిగ్గా వదిలేసి, అంపైర్ స్టీవ్ బక్నర్‌పై వేటు వేశారు. అయితే ఇది భారత క్రికెట్‌ను ప్రపంచ మీడి యాలో అప్రతిష్టపాలు చేసింది. ఆయనకు దురుసు మనిషిగా పేరు తెచ్చింది. దాన్ని ఆయన ఇష్టపడటమూ ప్రారంభించారు. 2009 నాటికి, ఐపీఎల్‌ను ఆయన దక్షిణాఫ్రికాకు తీసుకుపోయేటప్పటికి ఇది ఉన్మాదం స్థాయికి చేరింది. యూపీఏ ప్రభుత్వ వ్యవహారాల్లోకి తలదూర్చి దాన్ని తూల నాడారు. అప్పటికే దానితో ఘర్షిస్తున్న శరద్‌పవార్, రాజీవ్ శుక్లాలతో కుమ్మ క్కయ్యారు. మీకు గుర్తుండే ఉండాలి, లేకపోతే యూట్యూబ్‌లో ఇప్పుడు చూడండి - లలితే అప్పుడు ఐపీఎల్ స్టార్. దక్షిణాఫ్రికా స్టేడియంలలో ఆయన ఆటో గ్రాఫుల కోసం గుంపులుగా ఎగబడ్డారు, కెమెరాలు ఆయన్ను అనుస రించాయి. అప్పటికల్లా ఐపీఎల్ మీడియా కవరేజీపై ఆయన పూర్తి నియంత్రణను సాధించారు. అది ఎంత వరకు సాగిందంటే మొహాలీలో భజ్జీ, శ్రీశాంత్‌ను చెంపపెట్టు పెట్టిన వీడియో ఫుటేజీ ఎవరికంటా పడకుండా శాశ్వతంగా సమాధై పోయింది. లలిత్‌కు వచ్చిపడ్డ ఈ కొత్త కీర్తిని నేను క్రికెట్‌కు అత్యంత సుదూరమైనదైన దావోస్‌లో సైతం చూడగలిగాను. 2009లో ఆయన దక్షిణాఫ్రికాను జయించిన తర్వాత ఎంతో కాలం కాకముం దే జరిగిన దావోస్ సమావేశాల ముగింపు వేడుకల్లో అది జరిగింది. దక్షిణా ఫ్రికా విషయంగా (థీమ్‌తో) సాగుతున్న ఆ సాయంత్రం నాకంటే కొన్ని అం గుళాలు ఎత్తున్న మిస్ దక్షిణాఫ్రికా ఒంగి నా బ్యాడ్జీపై పేరును చూసి... ‘ఓ, మీరు భారత్ నుంచి వచ్చినవారా, లలిత్ మీకు తెలుసా?’ అని అడిగింది. ఆ తదుపరి కొంత కాలానికే ఆయన పతనమూ మొదలైంది. అది మరో సంపన్న వ్యాపారి శ్రీనివాసన్ ఎదుగుదలతో పాటూ సాగింది. ప్రదర్శనాస క్తుడైన లలిత్ శైలితో పోల్చి శ్రీనివాసన్‌ను త క్కువగా అంచనా వేసినా, రాజకీ యవేత్తలతో వ్యవహరించడంలో ఆయనకంటే చతురతను ప్రదర్శించగల వారు మరెవరూ లేరు. ఆయన రాష్ట్రానికే చెందిన జే జయలలిత మాత్రమే అందుకు మినహాయింపు. దేన్నీ లెక్కచేయని లలిత్ సముద్రపు దొంగల శైలి శ్రీనివాసన్‌కు తోడ్పడింది. కానీ అది మితవాదులకు ఆమోదయోగ్యం కాలేదు, తోటివారిలో అసూయను రేకెత్తించింది. శరద్ పవార్ సైతం అత నితో స్నేహంగా ఉండలేకపోయారు, సహాయం చేయలేకపోయారు. లలిత్ మోదీకి వ్యతిరేకంగా ఉన్న ఈడీ కేసుల్లో ఏమున్నాగానీ, ఆయన ఎదుర్కొంటున్నది మాత్రం ఒక్కటిగా ఏకమైన అధికారాన్ని. ఆయన ఇప్పుడు ప్రధాని మోదీని పొగిడినా, రాజే, సుష్మాలకు ధన్యవాదాలు తెలిపినా వారు మాత్రం ఆయనకు దూరంగానే నిలుస్తారు. పదేపదే ఆయన్ను పారిపోయిన వాడనీ (ఆయన పారిపోకున్నా), ఆయన ‘‘తప్పించుకు పోవడానికి’’ కారణం యూపీఏనని నరేంద్ర మోదీ ప్రభుత్వం తప్పుపడుతోంది. కాబట్టి అది ఆయన వెంట పడుతోంది, బహుశా నేరపూరితమైన అక్రమ ఆర్జనకు సంబం ధించిన చట్టాలను ప్రయోగించి... ఆయన్ను అప్పగించాలని అది బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. లలిత్ దురదృష్టం కొద్దీ, రాజకీయ వర్గమంతా ఆయనకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచింది. పాతకాలపు విజ్ఞత చెప్పేట్టు భార తీయులను ఐక్యం చేసేవి క్రికెట్టు, యుద్ధమూ మాత్రమే. అలాగే క్రికెట్ క్రీడను శాసించే అధికారానికి వ్యతిరేకమైన యుద్ధం మాత్రమే భారత రాజకీయ వేత్తలను ఐక్యం చేస్తుంది. టజ్ఛిజుజ్చిటజఠఞ్ట్చ653ఃజఝ్చజీ.ఛిౌఝ (వ్యాసకర్త శేఖర్ గుప్తా)