jagadamba Junction
-
విశాఖ జగదాంబ జంక్షన్ లో అగ్నిప్రమాదం
-
ఆ కల నెరవేరిందన్న పాగల్ హీరో విశ్వక్ సేన్
సాక్షి,విశాఖపట్నం: తాను నటించిన చిత్రం జగదాంబ థియేటర్లో చూడాలని కలలుకన్నానని, అది నేటికి నెరవేరిందని పాగల్ సినిమా హీరో విశ్వక్ సేన్ ఆనందం వ్యక్తం చేశారు. పాగల్ చిత్రం యూనిట్ గురువారం మధ్యాహ్నం జగదాంబ థియేటర్లో సందడి చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు కుప్పిలి సురేష్, నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ పాగల్ సినిమా విజయవంతంగా నడుస్తోందన్నారు. సినిమా షూటింగ్ చాలా వరకూ విశాఖలోనే జరిగిందన్నారు. కోవిడ్ సమయంలో 50 శాతం సీట్లతో నడుస్తున్న థియేటర్లలో సైతం పాగల్ హౌస్‌ఫుల్స్‌తో నడుస్తోదన్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కూడా సాధించింనదన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. చిత్రం విజయయాత్రను తిరుపతి, విజయవాడ పూర్తి చేసుకుని విశాఖ చేరుకున్నామన్నారు. సమావేశంలో వెంకటేశ్వర ఫిలింస్ ప్రతినిధులు, చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు చిత్ర యూనిట్ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్సేన్తో అభిమానులు సెల్ఫీలు తీసుకున్నారు. చదవండి:వైష్ణవ్ తేజ్-క్రిష్ మూవీ టైటిల్ ఇదే, ఫస్ట్‌లుక్ విడుదల -
రోజూ 18 పేపర్లు చదువుతా..
సాక్షి, విశాఖపట్నం: ‘అప్పట్లో మా కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు.. రాజకీయ నాయకులూ లేరు. వారసత్వం లేకున్నా జవసత్వంతో ఈ స్థాయికి (ఉపరాష్ట్రపతి) ఎదిగా. నా జీవితంలో అన్ని పదవులూ చేశా. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీల్లో విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. కేంద్రంలో కీలక మంత్రి పదవులు చేపట్టాను. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి అధిరోహించాను. ఇప్పుడు దేశంలోనే రెండో అత్యున్నత పదవిలో ఉన్నాను. ఇలా అన్ని పదవులూ నిర్వహించాను.నేను నా ఈ జీవితాన్ని ఊహించలేదు.’ అని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తన మనసులో భావాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) మొదటి బ్యాచ్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘నేను యువకుడిగా ఉన్నప్పుడు వాజ్‌పేయి నెల్లూరు పర్యటనకు వచ్చారు. ఆయన బహిరంగ సభకు జనమంతా తరలి రావాలంటూ జట్కాబండిలో మైకులో ఊరంతా ప్రచారం చేశాను. కానీ వాజ్‌పేయి, అద్వానీల్లాంటి వారి మధ్య కూర్చుని ప్రసంగిస్తానని గాని, దేశంలో రెండో అత్యున్నత పదవి (ఉపరాష్ట్రపతి)కి ఎదుగుతానని నేనూహించలేదు.’ అని వివరించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను రైతుల కష్టాలను ఎరుగుదునన్నారు. ‘నేను తాడిచెట్టు ఎక్కగలను. చెరువుల్లో ఈదగలను. చిన్నతనంలో పశువులను కడిగే వాడిని. నాగలిపట్టి పొలం దున్నేవాడిని. ఇవన్నీ నాకు మా తాత నేర్పారు. చేలో పంటను పక్షులు తినకుండా కొట్టేవాళ్లం. పంట ఇంటికొచ్చాక అవి తినడానికి వీలుగా వరి, జొన్న, సజ్జ కంకులను ఇళ్ల పంచలకు వేలాడదీసేవాళ్లం. ఇవన్నీ విద్యార్థులు తెలుసుకుంటే మన నాగరికత, సంస్కృతి ఎంత గొప్పదో అర్థం అవుతుంది.’ అని వివరించారు. నేను రోజూ 18 దినపత్రికలు చదువుతాను. మీరూ పత్రికలు చదవి వాటి ద్వారా జ్ఞానాన్ని అవగతం చేసుకోండి’ అని పిలుపునిచ్చారు. విశాఖలో తిరగని వీధి లేదు.. ‘విశాఖ వస్తే నాకు కొత్త ఉత్సాహం వస్తుంది. విశాఖలో నేను తిరగని వీధిలేదు. అప్పట్లో ఎన్ఎస్ఎన్ రెడ్డి గెలుపుకోసం ఎన్నికల్లో గట్టిగా పనిచేశా. ఆంధ్ర యూనివర్సిటీలో గోపీ బడ్డీ, ఎండు చేపలు, చావుల మదుం, జగదాంబ జంక్షన్.. ఆర్కే బీచ్.. ఇలా ఒకటేమిటి విశాఖలో ప్రకృతి అందాలన్నీ అన్నీ గుర్తుకొస్తాయి.’ అని విశాఖతో తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని, విలాసాల వైపు వెళ్లొద్దని ఉద్బోధించారు. మావి హ్యాపీ డేస్.. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో అంతా స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం. చదువుకే ఎక్కువ ప్రాధాన్యతిచ్చేవాళ్లం. స్టూడెంట్స్ ఎన్నికలకు గట్టి పోటీ ఉండేది. జై ఆంధ్ర ఉద్యమంలో ఆరు నెలలు డుమ్మా కొట్టాను. మా క్లాస్మేట్స్ 12 మంది జడ్జీలయ్యారు. వారిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఒకరు. యూనివర్సిటీలో మావి హ్యాపీ డేస్!’ అంటూ స్టూడెంట్ జీవితాన్ని వివరించమని అడిగిన ఓ విద్యార్థికి వెంకయ్యనాయుడు సమాధానం ఇచ్చారు. -
తీవ్రంగా నష్టపోయేది తెలుగు ప్రజలే
సిరిపురం : స్వార్థపూరిత రాజకీయాల వల్ల నష్టపోయేది తెలుగు ప్రజలేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. జగదాంబ జంక్షన్లో ఆదివారం జరిగిన సమైక్య శంఖారావం సభలో పలువురు నాయకులు ప్రసంగించారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఆయన పాలనలో రాష్ట్రం అన్నింటా అభివృద్ధి సాధించగా, నేడు అభివృద్ధికి దూరమైందన్నారు. నేటి పాలకులు రాజకీయ లబ్ధికోసం తెలుగు జాతిని రెండుగా చేయాలనుకోవడం క్షమించరాని నేరమన్నారు. పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేమనే ఉద్దేశంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు విభజన కుట్ర పన్నాయని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే జగన్ మోహన్‌రెడ్డిని జైలులో పెట్టించారన్నారు. ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త జి.వి.రవిరాజు మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీల నేతలు దొంగ దీక్షలు మాని సమైక్యం కోసం సోనియాగాంధీ ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు. దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు మాట్లాడుతూ జైలులో ఉన్నా జగన్ మోహన్‌రెడ్డి సమైక్యానికి మద్దతుగా దీక్ష చేపట్టారన్నారు. అరుకు సమన్వయకర్త కుంభా రవిబాబు మాట్లాడుతూ కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఈ సభలో వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి సుజయ్‌కృష్ణ రంగారావు, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, దాడి వీరభద్రరావు, జహీర్ అహ్మద్, పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, నగర మహిళా అధ్యక్షురాలు పి.ఉషాకిరణ్, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త ముదునూరి ప్రసాద్‌రాజ్, సమన్వయకర్తలు కోరాడ రాజబాబు, గండి బాబ్జీ, తిప్పల నాగిరెడ్డి, కిడారి సర్వేశ్వరరావు, పూడి మంగపతిరావు, పార్టీ మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విల్లూరి భాస్కరరావు, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, పార్టీ అధికార ప్రతినిధులు పీలా ఉమారాణి, కంపా హనోక్, ప్రచార కార్యదర్శి రవిరెడ్డి, బీసీ సెల్ కన్వీనర్ పక్కి దివాకర్, నాయకులు దాడి రత్నాకర్, సత్తి రామకృష్ణారెడ్డి, దక్షిణ నియోజకవర్గ నేత రాధాకృష్ణ, మైనార్టీ సెల్ కన్వీనర్ నౌషాద్,సేవాదళ్ కన్వీనర్ భూపతిరాజు శ్రీనివాస్, జిల్లా రూరల్ ప్రచార కన్వీనర్ పోతల ప్రసాద్, యువజన విభాగం కన్వీనర్ గుడ్ల పోలిరెడ్డి, ఎస్సీ సెల్ కన్వీనర్ బైపా అరుణ్‌కుమార్, స్టూడెంట్ కన్వీనర్ గొలగాని శ్రీనివాస్ యాదవ్, సాంస్కృతిక విభాగం కన్వీనర్ రాధ, వంకాయల మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.