తీవ్రంగా నష్టపోయేది తెలుగు ప్రజలే
సిరిపురం : స్వార్థపూరిత రాజకీయాల వల్ల నష్టపోయేది తెలుగు ప్రజలేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. జగదాంబ జంక్షన్‌లో ఆదివారం జరిగిన సమైక్య శంఖారావం సభలో పలువురు నాయకులు ప్రసంగించారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందన్నారు.
ఆయన పాలనలో రాష్ట్రం అన్నింటా అభివృద్ధి సాధించగా, నేడు అభివృద్ధికి దూరమైందన్నారు. నేటి పాలకులు రాజకీయ లబ్ధికోసం తెలుగు జాతిని రెండుగా చేయాలనుకోవడం క్షమించరాని నేరమన్నారు.
పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేమనే ఉద్దేశంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు విభజన కుట్ర పన్నాయని ఆరోపించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే జగన్ మోహన్‌రెడ్డిని జైలులో పెట్టించారన్నారు. ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త జి.వి.రవిరాజు మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీల నేతలు దొంగ దీక్షలు మాని సమైక్యం కోసం సోనియాగాంధీ ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు. దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు మాట్లాడుతూ జైలులో ఉన్నా జగన్ మోహన్‌రెడ్డి సమైక్యానికి మద్దతుగా దీక్ష చేపట్టారన్నారు.
అరుకు సమన్వయకర్త కుంభా రవిబాబు మాట్లాడుతూ కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఈ సభలో వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి సుజయ్‌కృష్ణ రంగారావు, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, దాడి వీరభద్రరావు, జహీర్ అహ్మద్, పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, నగర మహిళా అధ్యక్షురాలు పి.ఉషాకిరణ్, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త ముదునూరి ప్రసాద్‌రాజ్, సమన్వయకర్తలు కోరాడ రాజబాబు, గండి బాబ్జీ, తిప్పల నాగిరెడ్డి, కిడారి సర్వేశ్వరరావు, పూడి మంగపతిరావు, పార్టీ మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విల్లూరి భాస్కరరావు, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, పార్టీ అధికార ప్రతినిధులు పీలా ఉమారాణి, కంపా హనోక్, ప్రచార కార్యదర్శి రవిరెడ్డి, బీసీ సెల్ కన్వీనర్ పక్కి దివాకర్, నాయకులు దాడి రత్నాకర్, సత్తి రామకృష్ణారెడ్డి, దక్షిణ నియోజకవర్గ నేత రాధాకృష్ణ, మైనార్టీ సెల్ కన్వీనర్ నౌషాద్,సేవాదళ్ కన్వీనర్ భూపతిరాజు శ్రీనివాస్, జిల్లా రూరల్ ప్రచార కన్వీనర్ పోతల ప్రసాద్, యువజన విభాగం కన్వీనర్ గుడ్ల పోలిరెడ్డి, ఎస్సీ సెల్ కన్వీనర్ బైపా అరుణ్‌కుమార్, స్టూడెంట్ కన్వీనర్ గొలగాని శ్రీనివాస్ యాదవ్, సాంస్కృతిక విభాగం కన్వీనర్ రాధ, వంకాయల మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.